బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Maintain records అంటే తప్పుట…


    ఎన్నెన్నో సంవత్సరాలనుండి, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో అది ఓ ఆఫీసు కావొచ్చు, factory కావొచ్చు, ఓ ఆసుపత్రి కావొచ్చు ఒకటేమిటి ఏదైనా కావొచ్చు, అక్కడ చేసే పని ఓ పధ్ధతిలోనే చేసేవాళ్ళం. అయినా ఎవడికి అనిపించదు చేసే పని ఓ పధ్ధతిలో చేయాలనీ? కానీ ఈ పధ్ధతులకి ఓ రాతా కోతా ఉండేది కాదు.అలాగని ఏమైనా అస్థవ్యస్థంగా ఉండేదా అంటే అదీ కాదు, వాటికి ఓ record ఉండేది కాదు.అంటే అక్కడ ఎవడైనా సంవత్సరాలకొద్దీ పనిచెసేడంటే వాడు indispensable అయిపోయేవాడు. ఖర్మకాలి వాడు ఏ శలవైనా పెడితే పని ఆగిపోయేది.తిరిగి వాడు పనిలోకి వచ్చేదాకా పని జరిగేది కాదు. కారణం వాడు చేసే పనిని documentation చేయకపోవడం.దానితో ఒకే మనిషిమీద ఆధారపడ వలసొచ్చేది.ఒక్కోచోట వాళ్ళూ నెత్తికెక్కేసేవారు.

    మేము వరంగాం లో పనిచేసేటప్పుడు, ఒకాయనుండేవారు.అవి కంప్యూటర్లు కొత్తగా వచ్చిన రోజులు. కంప్యూటర్లతో కొత్తగా మొదలెట్టిన రోజులనమాట.మా ఫాక్టరీలో సర్వీసు రికార్డులూ, ఆ వివరాలూ, పిఎఫ్ వివరాలూ అన్నిటినీ computerise చేయడానికి ఒకాయనకి ట్రైనింగూ అవీ ఇచ్చి, ఆ సెక్షన్ లోకి వేశారు. ఏదో ఓ మూడునాలుగేళ్ళపాటు బాగానే జరిగింది. ఆయన కూడా ఓహో..ఆహా.. మనకి ఎంత importance వచ్చిందీ, ఆఖరికి GM కి ఏదైనా అవసరం వచ్చినా నన్నే పిలవాలీ అనే భావన ఆయనలో కొద్దిగా ఎక్కువైపోవడం ప్రారంభమయింది.ఆ విషయం అధికారులూ పసిగట్టి, ఇంక ఈ పెద్దమనిషిని ఇంకో సెక్షన్ కి బదిలీచేసే సమయం వచ్చిందీ అనుకుని, బదిలీ చేసేశారు. ఇంక ఆయనేమో కొండెక్కేశారు. మా ఫాక్టరీ PF వివరాలన్నిటినీ దేంట్లోనే పెట్టేసి, password గుర్తులేదూ ఓపెన్ చేయలేనూ అనేశారు ! మావాళ్ళేమో మొత్తానికి నానా తిప్పలూ పడి ఎలాగో గట్టెక్కారనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, చేసేపనులు documentation చేసేస్తే ఈ గొడవుండేదికాదుగా. కాలక్రమేణా ప్రభుత్వం వారికి ఆ ఆలోచనా వచ్చేసింది.

   వాళ్ళెవరో జపాన్ లోనో అమెరికాలోనో చెప్పారుట దానితో ISO ఓ ఫాషనైపోయింది.ఇది వచ్చిన మొదట్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఎందుకొచ్చిన గొడవా, ఇన్నాళ్ళూ చేస్తున్నాముగా, మళ్ళీ వీటన్నిటికీ రికార్డులూ సింగినాదాలూ ఏమిటీ దిక్కుమాలిన గోలా అంటూ చాలామందికి ఈ కొత్త సిస్టం నచ్చలేదు. కానీ ప్రభుత్వంవారు ఈ ISO ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన కంపెనీలన్నీ, ప్రభుత్వంతో వ్యాపారం చేయడానికి వీల్లేదూ అనేయడంతో అందరూ దారిలోకి వచ్చారు. ఎక్కడచూసినా ఈ సర్టిఫికేషన్ ఏజన్సీలే.మళ్ళీ అదేమిటో తెలిసికోడానికి consultancy వాళ్ళొకళ్ళూ. ఎడాపెడా డబ్బుచేసేసికున్నారు.ఇదంతా ఎలా తెలుసునూ అంటే మా ఫాక్టరీకి ISO వచ్చినప్పుడు, వీటన్నిటికీ నా ఆధ్వర్యంలోనే జరిగిందిలెండి. ఇదంతా స్వంతడబ్బా చెప్పుకోడానికి కాదు,ఈ విషయంగురించి నాకూ అవగాహన ఉందీ అని చెప్పడానికి.

   తీరా ఆ ISO లో జరిగేదేమిటీ, Do what you write and write what you do.అంటే ఇన్నాళ్ళూ చేయడంలేదా అనికాదు, చేసేదానికి ఓ రికార్డుండేది కాదు.కొత్తగా ఎవరైనా ఆ పోస్టులోకి వచ్చినా, చేసేదంతా వ్రాసేస్తే ఓ గొడవొదిలిపోతుంది. ఇంకోళ్ళని అడగఖ్ఖర్లేకుండా పనైపోయేది.
అయినా చేసేదేదో రాయడానికి ఏం రోగం? ప్రస్తుతానికి వస్తే, మహారాష్ట్రలో దేశంలో ఇంకెక్కడా కనిపించని ఓ పన్ను ఉంది. దానిపేరు octroi అంటారుట.నగర పొలిమేరల్లోకి ఏ వస్తువైనా తెస్తే, ఆ నగర మునిసిపాలిటీ వాళ్ళు ఆ ట్రక్కు ఆపేసి, ఏదో కొంత పన్ను వసూలు చేసేవారు. ఎక్కడైనా ఈ పన్నులతోబాటే scaమ్ములూ ఉంటాయిగా. ఈ octroi కి ఓ లెఖ్ఖా పత్రం ఉండేవికావు. అక్కడుండే గుమాస్తా ఎంతచెబితే అంత. బయటనుండి వచ్చేవాళ్ళదగ్గరనుండి, నానా హడావిడీ చేసేసి, డబ్బు వసూలుచేయడం, దానికి తగ్గ ఓ రసీదివ్వడం. తీసికున్నదానికీ ఇచ్చే రసీదుకీ పోలికుండేది కాదు.అందులోపనిచేసే చాలామంది లక్షాధికార్లయారంటే ఆశ్చర్యంఏముందీ? మొత్తానికి ప్రతీవాడూ ఇలా డబ్బుచేసేసికుంటున్నాడని, ఆ మధ్య రాష్ట్రప్రభుత్వం వారు ఆ octroi ఎత్తేసి అదేదో LBT ( Local Body Tax) అని ఒకటి ప్రారంభించారు ఏప్రిల్ ఒకటో తారీకునుండి. అది నచ్చలేదు ఈ ఊళ్ళోఉండే వ్యాపార్లకి. కారణం ఊళ్ళోఉండే traders అందరినీ దీనిలో రిజిస్టరు చేసేశారు. ఒక్కోవస్తువుకీ ఫలానా అంత పన్నూ అన్నారు. దీనివలన ఆ కొట్టువాడికేమీ నష్టంలేదు, ఎలాగూ ఆ పన్నులన్నీ(inclusive of all taxes) కలిపే అమ్ముతాడు. వచ్చిన గొడవల్లా ఎక్కడొచ్చిందంటే వీటన్నిటికీ ఓ రికార్డోటి తయారుచేయాలిగా అక్కడా ! ఠాఠ్ మాకు కుదరదూ, అనేసి ఒకటో తారీకునుండీ పూణే లో దుకాణాలన్నీ బంధ్ !ఈవేళ్టికి నాలుగోరోజు. ఈ యాభై సంవత్సరాలలోనూ ఇలాటిది మొదటిసారి! ఒక్క కొట్టూ తెరవడంలేదు. పాలు లేవు, కూరల్లేవు, కిరాణా సరుకులు లెవు.

   అసలెందుకు చేస్తున్నార్రా అని అడిగితే ” మీకోసమే చేస్తున్నామూ, ఈ కొత్త పన్నుతో ఖరీదులు ఇంకా ఎక్కువైపోతున్నాయీ సామాన్యప్రజానీకానికి ఇంకా కష్టం..” అంటారే కానీ, అసలు సంగతిమాత్రం ఒప్పుకోరు. చివరికి వాడెవడో చెప్పనే చెప్పాడు- ఈ రికార్డులు maintain చేస్తూ కూర్చుంటే, ఇంక సరుకులెవడమ్మగలడూ అని! అంటే ఇక్కడ bottomline రికార్డన్నమాట.

   ఎక్కడచూసినా ప్రొటెస్టులే.. ఆధార్ తీసికోమంటే ధర్నా.SET TOP BOX తీసికోమంటే ధర్నా. LBT పెడదామంటే ధర్నా..
పోనీ ఈ protest అందరూ చేస్తున్నారా అంటే అదీ లేదూ, మాల్స్ వాళ్ళు హాయిగా వెనకవైపున తెరిచి వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అలాగని అందరూ మాల్స్ కే వెళ్ళరుగా, అందరూ వెళ్ళేటప్పటికి అక్కడా సరుకైపోతుంది.హాయిగా ఉందనుకున్నంత సేపు పట్టలేదు, ఈ ధర్నా, బంధ్ culture ఇక్కడకూడా వచ్చేసింది !

7 Responses

 1. మనకు తెలియని కొన్ని విషయాలు చర్చించుకుందాం.
  పన్ను వెయ్యడం వలన ఎవరు లాభ పడతారు?
  రసీదు పుస్తకాలు ప్రచురించే వారు
  ఆ పుస్తకాలు అమ్మే వారు
  ఆ పుస్తకాలు రవాణా చేసే వాళ్ళు
  ఆ పుస్తకాలలో పేజీలు  తయారు చేసే వాళ్ళు
  వాటి మీద ముద్రణకు ఉపయోగించే Stamp తయారీ దారులు.

  ఇక అలా ఎందుకు electronic అంటారా, అప్పుడు ఆ computer ధర మన మీదే వాడికి పెరిగిన విద్యుత్తు ధర మనమీదే చాలా ఉన్నాయి.

  ఇక ఆధార్ పత్రాల మోసాలు మీరు చదివినట్లు లేరు
  ౧. ౬ కోట్ల మంది దగ్గర సేకరణలు చేస్తే ౮ కోట్ల పత్రాలు పుట్టాయి
  ౨. కొన్ని జిల్లాలలో Hard disk లు చెడిపోయాయి
  ౩. రైతులు రుణ మాఫీ కు వెళితే సంఖ్య ముఖం నీవే కానీ వేలిముద్రలు కనుబొమ్మలు సరితూగాట్లేదు అన్నారంట!

  Like

 2. ఇక STB ల దగ్గరకు వస్తే పై నుంచీ క్రిందవరకూ నష్టాలే
  మొదటి నష్టం, Single propritery ship.
  రెండవ నష్టం, పాత Box కొత్త డబ్బా అంటే ఇవి Italy లాంటి ప్రదేశాలలో ఉపయోగించేసారు, కొన్ని పనికి వచ్చేవి తీసుకుని పైన కొత్త డబ్బా అంటించి అమ్ముతున్నారు
  మూడవ నష్టం, అటు పక్క TV కు అయ్యే విద్యుత్తు ఖర్చు మారదు కానీ ఇటు పక్క STB కు విద్యుత్తు ఖర్చు కూడా చేరుతుంది.
  నాల్గవ నష్టం, స్వయం ప్రతిపత్తి కలిగిన cable operators నష్ట పోతారు ఎందుకంటే ఇప్పటి వరకూ Satelite నుంచీ దిగుమతి చేసుకుని Analog కు మార్చి మనకు పంపిస్తున్నారు, ఇప్పుడు Satelite(DVB-s) నుంచీ దిగుమతి చేసుకుని వాటిని STB(DVB-C) అర్ధం చేసుకునే భాషలోకి మార్చి మళ్ళీ వాటికి Analog Transmitters అర్ధం చేసుకునే మార్పించే కొత్త యంత్రాలు కొనాలి, పైగా పాతవి ఏమి చెయ్యాలి?

  Like

 3. ధర్నా , బంద్ సంస్కృతి కొలకత్తా లో జబర్దస్తి గా ఉండేది .
  రోడ్డ్లన్ని నిర్మానుష్యంగా , పిన్నలు ,పెద్దలు ఫుట్బాల్ ఆడే వాళ్ళు .

  Like

 4. ఫణీంద్ర గారూ,

  నా టపా చదివి మీరు మరీ work up అయిపోయినట్టున్నారు. అసలు నేను వ్రాద్దామనుకున్నది పుణె లోని LBT సందర్భంగా జరుగుతున్న సమ్మె గురించి. నా యోగం బాగోక అనవసరమైన విషయాల్లొకి వేలెట్టి, మీ ఆగ్రహానికి గురైపోయాను. మీరు వివరించిన ఏ విషయం మీదా, నాకంత అవగాహనలేదని ఒప్పేసుకుంటున్నాను. ..ఎందుకంటారా, ఇలాటి విషయాల్లో ఎవరి అభిప్రాయం వారిది. అలాగని చర్చించడానికి భయపడుతున్నానని కాదూ, చివరకు మిగిలేదేమిటంటే మనిద్దరం చర్చించుకుంటాము, మిగిలినవారు enjoy చేస్తారు…

  డాక్టరుగారూ,

  పూణె లో రోడ్లేవీ నిర్మానుష్యంగా లేవు. దుకాణాలే బంధ్. అయినా IPL Circus పిచ్చిలో ఉన్న జనాలకి Football గురించి ఏమి తెలుసునంటారు?

  Like

 5. ఈ ” పన్నుల ” భాగోతం ప్రపంచమంతా ఉంది !
  పన్నులు బాగా వడ్డిస్తే, అవి సరిగా కడుతూ ఉంటే , ఖజానా నిండి , ఆ డబ్బు ప్రజోగకరం గా వాడ వచ్చు అని ప్రభుత్వ వాదన ! కానీ, ఆ పన్నులు కట్ట కుండా ఎగ నామం పెడుతూ ఉండే వారు మన దేశం లో కోకొల్లలు ! ఇటీవల గ్రీసు దేశం లో అధిక శాతం ప్రజలు పన్నులు కట్టని వారు ఉండడం వల్ల , ఆ దేశం మొత్తమే దివాలా తీసి మిగతా యూరప్ దేశాలను దేహీ అని అర్ధించాల్సి వచ్చింది !
  రికార్డులు ఉంచితే , ఆ రికార్డుల ఆధారం గా పన్నులు కట్టాలి ! మరి వ్యాపారస్తులకు అది సహించదు కదా ! అందుకే ఈ సమ్మెలు ! వారికి పన్నులు ఎక్కువ కట్టకుండా
  అటు ప్రభుత్వాన్నీ , ఎక్కువ ధరలతో ఇటు ప్రజలనూ వీలైనంత మోసం చేస్తే నే ” వారి వ్యాపారం ” బాగా సాగిస్తున్నట్టు లెక్ఖ ! మధ్యలో నలిగి చచ్చేది , అతి బీద వారూ కాదూ , అతి ధనవంతులూ కాదు , మధ్య తరగతి లో ఉన్న సామాన్య ప్రజానీకం !

  Like

 6. సుధాకర్ గారూ,

  ” రికార్డులు ఉంచితే , ఆ రికార్డుల ఆధారం గా పన్నులు కట్టాలి ! మరి వ్యాపారస్తులకు అది సహించదు కదా ! అందుకే ఈ సమ్మెలు !” అదీ అసలు సంగతంతా. అందుకే నా టపాకి శీర్షిక అలా పెట్టాను. ధన్యవాదాలు…

  Like

 7. టెక్నాలజీ, మనుషులూ, సమాజమూ, స్నేహితులూ, బంధువులూ…. ఎన్ని లింకుల మధ్య ఇరికించుకున్న జీవితేచ్ఛో…. ఇదంతా స్వయంకల్పితమని గుర్తొచ్చినప్పుడల్లా… సమాజం పట్ల నేను ప్రదర్శించే ఆవేశానికీ, మానవ సంబంధాల గురించి రాసే మాటలూ, తాజా టెక్నాలజీ విషయాలూ… అన్నీ ఎంత బాధ్యతగా.. నాటకాన్ని రక్తికట్టించగలుగుతున్నానో అర్థమై… వద్దనుకున్న క్షణం మాయమయ్యే ఈ మాయాప్రపంచం పెదాలపై ఓ చిరునవ్వుని మెరిపిస్తోంది….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: