బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–PGWodehouse ని ఔపోసన పట్టేసిన ఒక వీరాభిమాని కథ..


    మామూలుగా కొంతమంది ప్రఖ్యాత తెలుగు రచయితలు, (పేర్లెందుకులెండి) ఇంగ్లీషులోని best sellers చదివేసి,వాటిని తెలుగులోకి తర్జుమాలాటిది చేసేసి, ఆ నవలని తమ “స్వంతం” చేసేసికోడం, ఎప్పటినుండో చూస్తున్నాము. ఇంగ్లీషు నవల్లు చదివే తెలుగుపాఠకులెంతమంది లెద్దూ, ఎవడికి తెలుస్తుందీ అనే అపోహలో ఉంటారు. మరీ ఎవడో అడిగినా, మక్కికి మక్కీ తర్జుమా చేశానని మాత్రం ఛస్తే ఒప్పుకోడు.పైగా inspire అయ్యామని ఓ తలాతోకాలేని సంఝాయిషీ ఇస్తూంటారు. శ్రీముళ్ళపూడి వారన్నట్టు copy right అంటే కాపీచేయడానికి రైట్టూ అనికూడా కొన్ని సందర్భాల్లో చెప్పేవారినికూడా చూశాము.

    అలాటి పరిస్థితులున్న ఈ రోజుల్లో, మన తెలుగువారైన ఒక PGWodehouse వీరాభిమాని, ఆయనమీదుండే అభిమానంతో, తనకు వీలైనన్ని PGW కథలు, తెలుగువారుకూడా ఆస్వాదించాలనే సదుద్దేశ్యంతో నడుంకట్టారు.అలాగని, పైన చెప్పినట్టుగా హడప్ చేయడంకాదు, Wodehouse Estate వారిని సంప్రదించి, కాపీరైట్ హక్కులకోసం కట్టవలసిన ఫీజు కట్టి మరీ అనుమతి తీసికున్నారు. మీకెలా తెలుసండీ అంటే, భాగ్యనగరం లో మొన్న వారింటికి వెళ్ళినప్పుడు, ఆ agreement పత్రాలు చూడడం తటస్థించింది. ఫీజు మరీ వందల్లో కాదు, వేలల్లో…( ఒక్కొక్క కథకీ). మరీ అంత అవసరమా మాస్టారూ అని అర్ధం పర్ధం లేని ప్రశ్న వేస్తే ఆయనిచ్చిన సమాధానం– This is my humble tribute to the great PGW for all the pleasure and enjoyment I derived by reading his stories... అన్నారు.అదీ వీరాభిమానం అంటే..

    ఆయనెవరో కాదు, భాగ్యనగరంలో ఉంటున్న శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు. నాకూ, ఆయనకీ పరిచయంhyd 033 ఎలాగా అంటారా, ఆయనకూడా ఉద్యోగార్ధం మొదట్లో పూనా లోనే జేరారు. ఒకానొక సందర్భంలో ఆయన పూనా జ్ఞాపకాల గురించి ఒక వ్యాసం వ్రాశారు.ఆయన వివరాలు సంపాదించి, ఆయనతో “దోస్తీ” చేశాను, నెలలో కనీసం రెండు మూడుసార్లైనా ఫోనుల్లోనే మాట్టాడుకోడం. ఆ సందర్భంలోనే తెలిసింది ఆయనకి PGW అంటే ఎంత అభిమానమో. కౌముది లో కూడా ఒక నవల తెలుగీకరించి, సీరియల్లు గా ప్రచురిస్తున్నారు. నేనైతే అదేమిటో, ఒక్కటి కూడా PGW కథలు చదవలేదు. ఆ విషయం నిస్సిగ్గుగా ఆయనకి చెప్పాను.ఫరవాలేదూ, ఇప్పటికైనా మొదలెట్టండీ అన్నారు. చిత్రం ఏమిటంటే, మా అబ్బాయి హరీష్ ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే Complete Works of PGW కొని ఇంట్లో పెట్టాడు.

    మొన్నటి భాగ్యనగర ట్రిప్పులో, రెండో రోజు ఉదయం పదిన్నరకి మేముండే హొటల్ కి వచ్చి, సోమాజిగూడా లో ఉండే తమ ఇంటికి తీసికెళ్ళారు.వారు ప్రస్తుతం వ్రాస్తున్నవీ,వ్రాయబోయేవీ, శ్రీ బాపూ గారితోనూ, శ్రీ ముళ్ళపూడివెంకట రమణగారితోనూ ఉన్న పరిచయ విశేషాలూ వగైరా వగైరాలు మాతో పంచుకున్నారు.వామ్మోయ్ నాకు పరిచయం అయిన ఇంకో celebrity నా లిస్టులోకి చేరిపోయారోచ్ అనుకున్నాను.మన పరిజ్ఞానం ఎలా ఉంటే ఎవడిక్కావాలీ, ఫలానా..ఫలానా వారు మాకు తెలుసునూ అనేసికుంటూ బతికేస్తాం..అవునంటారా కాదా? Namedropping లో ఉండే సదుపాయం మరి ఇదే…
శ్రీ కృష్ణమోహన్ గారు ఇప్పటిదాకా ప్రచురించిన మూడు పుస్తకాలు, ఇచ్చి మమ్మల్ని సత్కరించారు.
PGW1PGW3PGW2

    మొదటి రెండు పుస్తకాలకీ ముఖచిత్రం వేసినదెవరో తెలిసికోడం ఏమీ కష్టంకాదనుకుంటాను. ఇంక పుస్తకాలలోని content అంటారా, ఏదో శ్రీ కృష్ణమోహన్ గారు చెప్పారు కాబట్టి తెలిసింది కానీ, లేకపోతే PGW వ్రాసిందీ అని తెలిసేదేకాదు.అంత అమోఘంగా ఉన్నాయి.మూలాన్ని దృష్టిలో పెట్టుకుని, పాఠకులకి అర్ధం అయేటట్టు, మన భాషలో,మన యాసలో, మన వాతావరణం, పేర్లూ వ్రాస్తూ, ఎక్కడా మూలం లోని కథాగమనాన్ని చెక్కుచెదరకుండా వ్రాయడమంటే అంత తేలికా మరి? నాలాటి పామఱులకి కూడా PGW అంటే అభిమానం పుట్టేటంత అద్బుతంగా వ్రాశారు.ఇలాటి ప్రక్రియని అనుసృజన అంటారుట. అదికూడా, ఆ మూడో పుస్తకానికి శ్రీ జగన్నాధ శర్మగారు వ్రాసిన “ముందుమాట” లో చదివి తెలిసికున్నాను.ఈ ఒక్కమాట మాత్రమే ఆ పుస్తకంలోంచి రచయిత అనుమతి లేకుండా వాడుకున్నాను.క్షమించాలి శ్రీ కృష్ణమోహన్ గారూ…

5 Responses

 1. శ్రీ కృష్ణమోహన్ గారి గురించి చక్కటి పరిచయం మీదైన శైలిలో చేశారు. వారిగురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది.

  Like

 2. nice……………

  Like

 3. జంటల్ మాన్ ఆఫ్ లెషర్ !

  రైటో బాతాఖానీ ! థాంక్ యు ఫణి గారు !

  డాక్టర్ జిలేబి!
  (The inimtable zilebi!)

  Like

 4. గబ్బిట క్రిష్ణ మొహన్ గారి కి అభినందనలు ! మొదటి పుస్తకం అయన గురించి తెలియకుండానే కొన్నాను. ఇప్పుడు అయన పరిచయం బ్లాగ్ ముఖత చాలా అనందంగా వుంది. కాపిరైట్ Rights తీసుకొని అనువాదం చెయేడం రచయితకు సరైన గౌరవం ఇవ్వడమే !

  Like

 5. కిషోర్ వర్మా,

  నాదంటూ ప్రత్యేక శైలిలాటిదేమీ లేదు. ఏదో తెలిసినదేదో నాలుగు మాటల్లో అందరితోనూ పంచుకోడం తప్ప..

  నరేష్,

  థాంక్స్…

  డాక్టర్ జిలేబీ,

  ఇదేదో బావున్నట్టుందే…

  సమీరా,

  రచయిత గురించి తెలియకుండా పుస్తకం కొన్నారంటేనే తెలుస్తోంది మీరు ఎంత PGW ఎడిక్టో…( పోనీ fan అందామా?)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: