బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అత్తగారు కొట్టిందనా లేక తోడికోడలు నవ్విందనా…


    నిన్నంతా మహాశివరాత్రి హడావిడితో సరిపోయింది. అలాగని ఉపవాసాలూ అవీ చేసేటంత ఓపిక లేదనుకోండి. మా ఇంటావిడకి moral support మాత్రం extend చేసి రాత్రి ఒంటిగంటన్నరదాకా భక్తీ టీవీ, SVBC లో ప్రత్యక్షప్రసారాలు చూస్తూ ఓ half జాగరణ మాత్రం చేశాను.

    ప్రొద్దుణ్ణించీ టీవీ లో ఒకటే గొడవ- వాడెవడో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసికున్నాడని. ఆమధ్య జరిగిన అమానుష కాండలో దోషిగా పట్టుబడ్డవారిలో ఇతను ముఖ్యుడు. అప్పుడు పట్టుకున్నప్పుడుమాత్రం దేశం దేశమంతా ఘోషించింది దోషుల్ని ఉరి తీయండీ అని.మరి వారు చేసిన పని కూడా అలాటిదే కదా.కొందరన్నారు ఉరితీయకూడదూ, ఇంకోటేదో కఠిన శిక్ష వేయండీ అంటూ ఎన్నెన్నో సలహాలొచ్చాయి. అదేదో fast track court ట , దాంట్లో విచారణా మొదలెట్టారు.మొదట్లో లాయర్లెవరూ అసలు ఈ కేసే వాదించకూడదన్నారు. అదన్నారు ఇదన్నారు. మొత్తానికి ఆయనెవరో లాయరుగారు కేసులో దోషులతరపున వాదించడానికి వకాల్తా పుచ్చుకున్నారు. ఆ విచారణేమో in camera లో చేయాలన్నారు.ప్రజానీకానికి కానీ, మీడియాకి కానీ అసలేమవుతోందో తెలియని పరిస్థితి. ఇదివరకు చాలా కేసుల్లో విచారణ సమయంలోనే అందరినీ అనుమతించిన కోర్టులకి ఈ విషయంలో మరి అంత జాగ్రత్తలు ఎందుకో వారికే తెలియాలి.

    ఈ గొడవంతా జరుగుతూంటే ఆ ముఖ్యదోషి ఈవేళ ప్రొద్దుటే ఉరేసికుని చనిపోయాడుట. అదీ న్యూస్.అంతే మన మీడియావాళ్ళందరూ పేట్రేగిపోయారు. అలా ఎలా కుదురుతుందీ, శిక్షనుంచి తప్పించుకుంటే ఎలా? అని కొందరూ,ప్రొద్దుణ్ణించి చానెళ్ళలో ఘోష పెట్టేస్తున్నారు. అతని లాయరుగారైతే ఇంకో అడుగు ముందుకేశారు- కేసు చాలా బాగా నడుస్తోందీ,దోషిమీద కేసే ఉండకపోవచ్చూ,ఇలాటి పరిస్థితుల్లో తను ఆత్మహత్య చేసికుంటాడని అనుకోనూ, ఇదంతా ఓ కుట్రా, నా కొడుకు ఆత్మహత్య చేసికునేటంత పిరికివాడు కాదూ అని అతని తండ్రీ, జైళ్ళలో సంస్కరణలు జరగాలీ అని ఇంకోరూ, ఏమిటేమిటో చెప్తున్నారు. ఓ రెండు రోజులు హడావిడిగా ఉంటుంది.

    సంస్కరణలూ వల్లకాడూ అంటూ కబుర్లు చెప్పేస్తున్నారే ఈ నాయకులూ,న్యాయవాదులూ మరి ఉత్తర్ ప్రదెశ్ లో ఈమధ్యన అదేదో కేసులో ఇరుక్కున్న ఆ మంత్రెవడో, అప్పటికే ఓ డజను కేసులదాకా ఆరోపింపబడ్డవాడిని ఆ రాష్ట్ర జైళ్ళ శాఖామంత్రిగా చేసినప్పుడు
నిద్రపోతున్నారంటారా?
ఈ టపాకి పెట్టిన శీర్షిక లో అన్నట్టుగా ఆ దోషికి శిక్షపడలేదనా లేక తనే శిక్షించుకున్నాడనా ఇప్పుడు గొడవ?

   నిన్న ఏదో తెలుగుపుస్తకంలో చదువుతూంటే ఒక లింకు దొరికింది. భారతీయతా, హిందుత్వం మీదా ఆసక్తి ఉన్నవారు ఒకసారి చూడండి. మన ధర్మాలమీద మనం నోటికొచ్చినట్టు మాట్టాడతాము. కానీ ఒక అమెరికన్ ఎంతో పరిశోధనలు చేసి, హిందూమతం, దేముళ్ళ విశిష్టతా ఎంత బాగా చెప్పారో. కొన్ని విడియోలు కూడా ఉన్నాయి.

5 Responses

 1. గత శతాబ్దం పైగా సనాతన ధర్మం మీద దండయాత్ర సాగుతోంది. ఇది అందరం నోటితో చెబుతున్నాం. ఆచరించం. నేటి మన దేశ మేధావులందరికి పడమటి దేశాలవారు చెప్పిందే వేదం, ఇప్పుడు వారే వేదం గురించి చెబితే ఓహో మాదే అని చంకలెగరేసుకుని వారి దగ్గర శిష్యరికం చేద్దాం.

  Like

 2. శర్మగారూ,

  “నేటి మన దేశ మేధావులందరికి పడమటి దేశాలవారు చెప్పిందే వేదం, ఇప్పుడు వారే వేదం గురించి చెబితే ఓహో మాదే అని చంకలెగరేసుకుని వారి దగ్గర శిష్యరికం చేద్దాం.”–” నేను ఇచ్చిన లింకులో మీకు అభ్యంతరం ఏమి కనిపించిందో అర్ధం అవలేదు. మనదేశంలో మన ధర్మాన్ని గురించి అవాకులూ, చవాకులూ పేలుతున్న ఈ రోజుల్లో, ఒక విదేశీయుడు, మన ధర్మ విశిష్టత గురించి వ్రాశాడూ అని మాత్రమే చెప్పాను. వారిదగ్గర శిష్యరికం చేయమని ఏమీ చెప్పలేదే. ఇందులో మీరు అంత కోపగించేసికోవలసిన అవసరంకూడా నాకైతే అర్ధం అవలేదు.నా అలవాటు కొద్దీ, ఎక్కడైనా ఆసక్తికరమైనవేమైనా చదివినప్పుడు వాటి లింకులు ఇస్తూంటాను. అదికూడా ఒక్కొక్కప్పుడు కొందరికి అభ్యంతరకరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అయినా ఇలాటి అనుభవాలు జరిగినప్పుడే కదా నేర్చుకునేదీ… ధన్యవాదాలు…

  Like

  • మిత్రులు ఫణిబాబు గారు,
   నా మాటలో మీకు కోపం కనపడిందా, దురదృష్టవంతుడ్ని,సరిగా చెప్పలేకపోయాను. నాది వేదన సార్! కోపంకాదు.

   Like

 3. “వినదగు ఎవ్వరు చెప్పిన
  వినినంతనె వేగ పడక
  చంకలు గుద్దుకొనంగ రాదు
  భువిలో సుమతీ” అన్నారు. పాశ్చాత్యుడు చెప్పినా, అప్రాచ్యుడు చెప్పినా వేదం వేదమే. అది వాడి గొప్పదనం కాదు, వేదం గొప్పతనమవుతుంది, వినాల్సిందే.

  ఇంతకీ రాంసింగ్ ఎందుకు వురి తీసుకున్నాడంటారు? తాపం తోనా? పశ్చాత్తాపంతోనా? రోజు ఇరగదీస్తుంటే దీనికన్నా ఓ సారి చచ్చి శిక్ష తప్పించుకుందామనుకున్నాడా? ఫాస్ట్ ట్రాక్ జడ్జీలు ఇంకా మొదలే పెట్టలేదు, వాళ్ళకన్నా ఫాస్ట్ తనే అని చెప్పడానికా? నిరపరాది అని నిరూపించే క్రెడిట్, ఫీజు దండుకునే అవకాశం ఆ చెట్టుకింది ప్లీడర్లకు ఇవ్వక పోవడం అన్యాయమనే అంటాను, ఏమంటారు, ఫణిబాబు గారు?
  అహో అజ్ఞాత

  Like

 4. అహో అజ్ఞాత గారూ,

  మీరు చెప్పింది అక్షరసత్యం. రాంసింగు వ్యవహారమంటారా ఏమిటో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు తెలియకే టపాకి శీర్షిక అలా పెట్టాను…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: