బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “కలల అలలపై తేలెను….”


    ముత్యాలముగ్గు సినిమాలో ముళ్ళపూడి వారి డయలాగ్గు రావుగొపాలరావు గళంద్వారా వినిపించిన ” దేనికైనా కొంత కలాపోసన..” అనేదుండాలి , అన్నట్టుగా, నాకైతే కలాపోసన అబ్బలేదనుకోండి. కానీ ఎవరైనా ఆ దృష్టి తో ఏవ్యాసమైనా వ్రాస్తే మటుకు, నిజమే కదూ అనుకుంటాను. ఆ కోవలోకి చెందిందే ఈ క్రింద ఇచ్చిన వ్యాసం. మా స్నేహితులు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, ఆయన ఆ దృష్టి తో చూసి, దానికి అక్షరరూపం కల్పించి, ఆయన ఆస్వాదించడమే కాక, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతీవారూ, దానిని ఆస్వాదించాలని ఆయన ప్రగాఢ కోరిక.

   ఈ introduction అంతా దేనికంటారా– “గులేబకావళి కథ” చిత్రంలో అందరికీ “నన్నుదోచుకుందువటే..” అనే పాటైతే నచ్చేస్తుంది. కానీ, చెప్పానుగా కళాదృష్టి తో చూసేవారికి ఇంకో పాట–“కలల అలలపై..”-అన్నది ఎంత మధురంగా ఉందో తెలియడానికి ఆయన చెప్పినట్టుగానే ముందుగా ఇక్కడ ఆ దృశ్యం చూసి, ఆ పాటమీద శ్రీ కృష్ణమోహన్ గారి అభిప్రాయం
ఇక్కడకలల అలలపై.. చదివి, మీ అభిప్రాయం కూడా చెప్పండి.

5 Responses

  1. అద్భుతమయిన పాటకి అంతకన్నా చక్కని విశ్లేషణతో మా మనసుల్ని మైమరపించారు కృష్ణమోహన్ గారూ,పంచుకున్నందుకు ధన్యవాదాలు ఫణి బాబు గారూ

    Like

  2. నిజంగా… ఇటువంటి పాటలు… పాటల రచయతలకు పెద్దబాల శిక్ష కావాలి….చాలా బాగుంది మీకు నా హృదయ పూర్వక అభినందనలు..-సత్య సాయి విస్సా

    Like

  3. శ్రీనివాసరావు గారూ,

    నేను చేసిందల్లా శ్రీ కృష్ణమోహన్ గారు పంపినది నా టపాలో జోడించడం మాత్రమే… అలాటి స్నేహితులతో నా పరిచయం నేను చేసికున్న అదృష్టం…

    సత్యసాయి గారూ,

    మరి విశ్లేషించిన శ్రీ కృష్ణమోహన్ గారికి ఏమి కావాలంటారూ? ధన్యవాదాలు..

    Like

  4. Both are nice and show different stages in courtship, I think. Possibly the line ‘nannu docukunduvate vannela dorasani’ clinched it in the favorite stakes, but on the whole, the other song is better in my opinion. Thanks.

    Like

  5. ఆనందస్వరూప్ గారూ,

    అందుకేనేమో శ్రీ మోహన్ గారు ఆ పాటకి అంత అందమైన విశ్లేషణ చేశారు.. ధన్యవాదాలు…

    Like

Leave a comment