బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Indian Institute of Advanced Studies.

    మొదటి రోజు సిమ్లా లో మాల్ రోడ్దు ఎక్కేటప్పటికే తలప్రాణం తోకకి వచ్చేసింది.అన్నీ ఎత్తులూ, పల్లాలూనూ, ఎక్కడా ఓ రిక్షాలాటిదికూడా కనిపించలేదు.ఒకసారి తిప్పలు పడివెళ్ళిన తరువాత ఎలాగోలాగ తిరిగి రావద్దూ మరి? మొత్తానికి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి హొటల్ కి చేరాము. మర్నాడు మొదటిరోజు టాక్సీ వాడినే కుదుర్చుకుని వాడికిష్టమైన ప్రదేశానికి తీసికెళ్ళమంటే పదకొండు గంటల కల్లా ఈ శీర్షిక కి పెట్టిన పేరుందే IIASIIAS 1IIAS2IIAS3 కి తీసికొచ్చాడు.

    ఆ భవనమే ఒక అద్భుతం. ఎప్పుడో 150 ఏళ్ళ క్రితం కట్టారుట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఆ భవనంలోనే బ్రిటిష్ వైస్ రాయి ఉండి దేశ పరిపాలన సాగించేవారుట. 1945-46 లలో దేశవిభజనకి సంప్రదింపులు ముందుగా అక్కడే జరిగాయిట.వారు అప్పుడు దేశవిభజన కోసం తయారుచేసిన MAP ఏ టేబిల్ పై పెట్టి,Table సంప్రదింపులు జరిపారో ఆ టేబుల్ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.బ్రిటిష్ వైస్ రాయ్ కూర్చుండే రీగల్ ఛైర్ కూడా భద్రంగాVice Regal Chair ఉంచారు.

    ఓ 40 నిముషాలపాటు, సామాన్య ప్రజానీకాన్ని అనుమతించే ప్రదేశాలన్నీ ఓ గైడ్ చెప్తూంటే చూడగలిగాము. ఒక్క గదిలోనూ, ఇప్పటికీ భద్రంగా ఉంచిన ఆనాటి ఫొటోలూ, ఆ భవనం మొత్తం ఉపయోగించిన చెక్క, వాటిమీద ఆనాటి నగిషీలూ చూస్తూంటే కడుపునిండిపోయింది.1965 నుండీ, భారతప్రభుత్వం వారిచే నడపబడుతున్న IIAS వారి అజమాయిషీలో ఉంది.

    సిమ్లాలో ఇళ్ళన్నీ ఏవో అగ్గిపెట్టెల్లా ఉన్నాయి దూరంనుంచి.shi 1168
సూర్యాస్థమయమంటారా మీరే చూడండిSunset at Shimla

    ఈ ట్రిప్పు మీద నా అభిప్రాయమంటారా– అసలు జీవితంలో ఇలాటివి చూడడమే ఒక గొప్ప అనుభవం.చిన్నప్పుడు వెళ్తే ఇలాటివి అర్ధమవవు. మధ్యవయస్సులో వెళ్ళడానికి సమయాభావమాయె, రిటైరయిన తరువాత ఓపికుండదు. మరి ఎలాగ చూడడం? బ్రిటిష్ వారు మనని చాలాకాలం పరిపాలించారు, కానీ అదేసమయంలో వారి సదుపాయంకోసమైతేనేం, సిమ్లా-కాల్కా రైలుమార్గం వేశారాలేదా? ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. పైన వివరించిన 150 సంవత్సరాల భవనం చూస్తేనే తెలుస్తుంది, ఆ కాలంలో క్వాలిటీకి పెద్ద పీట ఎలా వేసేవారో.అలాగని నేను ఏదో బ్రిటిష్ వారిని సపోర్టుచేస్తున్నాననుకోకండి- ఉన్న మంచివిషయాలు గుర్తుచేసికోవాలికదా.

    అదేరోజు బయలుదేరి మర్నాడు ఢిల్లీ చేరాము. అదే రోజు సాయంత్రం బయలుదేరి మర్నాటి ప్రొద్దుటకల్లా హరిద్వార్ చేరి, ఆటోలో ఋషికేష్ లో ఉత్తరాంచల్ ప్రభుత్వంవారి గెస్ట్ హౌస్ లో ఓ గది తీసికున్నాము.ఆరోజు విశేషాలు అంటే హరిద్వార్ గంగా హారతి, రామ్, లక్ష్మణ్ ఝూలాలూ, మానసాదేవి దర్శనం, చండీమా దర్శనం వివరాలు కొన్నిటిని మా ఇంటావిడ తను వ్రాసిన టపాలో వివరించింది.

%d bloggers like this: