బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుణ్యం.. పురుషార్ధం..


   ఈమధ్యన కొద్దిగా “రాముడు మంచిబాలుడు” లా తయారవుదామనే సదుద్దేశ్యంతో, మా స్నేహితులు ప్రముఖ తెలుగు రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారు ఢిల్లీ వస్తారేమిటీ, సరదాగా చుట్టుపక్కల ఒకసారి తిరుగుదాం అని అడగడమేమిటి, సరే అనేశాను. పుణ్యం పురుషార్ధం ఉంటాయని ఒక ఆధ్యాత్మిక యాత్రా,ఇంకో సరదాగాఉండే ప్రదేశమూ చూపించమని అడగడమేమిటి, ఆయన ఓకే అనడమేమిటి, నేనూ, మా ఇంటావిడా ఛల్ మోహనరంగా అంటూ పాడుకుంటూ,పుణె-నిజాముద్దీన్ దురంతోలో ( అదేమిటో అసలు ఆపేరెందుకు పెట్టారో అర్ధం అవదు) ఎవడైనా అల్లరి చేస్తే “వాడికేం దురంతం..” అని పెద్దలు అనగా విన్నట్టు గుర్తూ. దీంట్లో ఏం అల్లరవుతుందో అనుకుంటూనే బయలుదేరాము.

    ఇంకో సంగతండోయ్.. మొన్న 28 వ తారీకున, మా “మిథునం” 41 సంవత్సరాలు పూర్తయిన శుభసందర్భంలో, ఇంటావిణ్ణి సరదాగా ఉత్తరభారతప్రాంతానికి వెళ్తే బావుంటుందేమో అనే ఉద్దేశ్యం కూడానూ. ఉద్యోగంలో ఉన్నంతకాలం, ఎల్.టి.సీ మీద ప్రతీసారీ తిరుపతి, ఆవిడ పుట్టిల్లూ తప్పించి ఎక్కడకూ తీసికెళ్ళినపాపానికి పొలేదు.ఏదో, పిల్లల ధర్మమా అని నా షష్ఠిపూర్తికి తిరుపతీలో కల్యాణం, తరువాత తమిళనాడు టూరిజం వారితో ఎనిమిది రోజుల ట్రిప్పూ.ఎప్పుడూ కలిసివెళ్లని మాలాటి ప్రాణులు ఇల్లు కదిలేసరికి, మేము వెళ్ళివచ్చిన ప్రాంతాలన్నీ సునామీ లో కొట్టుకుపోయాయి.

   వారం రోజుల ట్రిప్పు గురించి ఎలా వ్రాసి మిమ్మల్నందరినీ “బోరు” కొట్టాలా అని ఆలోచిస్తూంటే అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి.నా మామూలు “గోల” ఒకటుందిగా, మిస్టరీ షాపింగు ఒకటి చేశాను ఈవేళే. మళ్ళీ రేపొకటి. ఇలా ప్రతీరోజూ టైముండడంలేదని, నా టపా పోస్టు చేయకపోతే, మీరందరూ సుఖపడిపోరూ మరి? హాయిగా నా గొడవలేకుండా హాయిగా ఉన్నారు కదూ ఈ వారంరోజులూ? మా adventures ఎవరో ఒకరితో చెప్పుకోపోతే ఎలాగా? నూటికి తొంభై మంది ఇప్పటికే ఈ ప్రదేశాలన్నీ చూసేఉంటారు. కానీ, జన్మానికో శివరాత్రి అన్నట్టు, మాలాటివారు ఎప్పుడు వెళ్ళాలని రాసిపెట్టుంటే అప్పుడే వెళ్తారు. ఏం చేస్తాం కొంతమంది తలవ్రాతలు అలాగే ఉంటాయి…

    “దురంతం”Express లో హజ్రత్ నిజాముద్దీన్ స్టేషను లో దిగీదిగగానే, మా ఫ్రెండున్నారుకబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడకు వెళ్ళాలో తెలిసేదికాదు.ఆయనుండే ద్వారకా ఏరియాకి వెళ్ళి, భోజనం తరువాత, “అక్షరధాం” కి తీసికెళ్ళారు. మిగిలినవన్నీ ఇదివరకే అంటే అల్లుడూ, అమ్మాయీ అక్కడ ఉండే రోజుల్లో చూసేశాము.

    రాత్రికి “కాల్కా మెయిల్” లో, బయలుదేరి, మర్నాటి ప్రొద్దుటికి కాల్కా చేరాము.అక్కణ్ణించి అదేదో Toy Train ట దాంట్లో ఎక్కి సిమ్లా చేరాము. మా ఇంటావిడా, మా ఫ్రెండూ మొదట్లోనే చెప్పారు లెండి, మనం మేఘాల్లో వెళ్తామూ అని.ఆయనేమో ఇదివరకు చాలా సార్లు వెళ్ళడం వల్లా, మా ఇంటావిడ నెట్ లో చూడడంవల్లా, నాకంటే కొంచం ఎక్కువే తెలిసున్నట్టు కబుర్లు చెప్పేసారు, ఎవడో ఒక “బక్రా” దొరికాడుకదా మరి. సరే నేనుమాత్రం తక్కువ తిన్నానా అనుకుని, అక్కడెక్కడో దూరంగా, అవేవో తెల్లగా కనిపించేసరికి ఆహా మేఘాలంటే ఇలా ఉంటాయా అని అనుకున్నంతసేపు పట్టలేదు, అవి మూఘాలు కావుట, వాళ్ళెవరో పెట్టిన మంట తాలూకు “పొగ” ట అది ! ఇలా ఉన్నాయి నా తెలివితేటలు ! ఇంక నోరుమూసుక్కూర్చుంటేనే ఇంటికీ వంటికీ మంచిదని ఆ పనే చేసేశాను. మళ్ళీ నోరెత్తితే ఒట్టు !

    నోరంటే మూసుక్కూర్చున్నా కానీ, చేతులూరుకోవుగా, కెమేరా పట్టుకుని ఎడాపెడా ఫొటోలు తీస్తూ కూరున్నాను.ఓహో మేఘమాలా..మేఘాల్లో..

    సిమ్లా లో అడుగెట్టేసరికే వళ్ళంతా కొయ్యబారిపోయింది. అంతకుముందురోజు హిమపాతం ఎక్కువగానే ఉందట. అసలు అదేదో చూద్దామనే కదా ఈ ప్రయాణం ! ఇంక మా ఇంటావిడైతే నన్ను “గంగిరెద్దు” లా అలంకరించేసింది.తీసికెళ్ళిన బట్టలన్నీ నామీద వేసేసి ! నాకంటే నేను వేసికున్న బట్టలే బరువుగా ఉన్నాయి. పైగా ఏదైనా “అవసరం” వస్తే ఆ బట్టలన్నీ తీయడం ఓ గొడవాయిరి ! ఓ టాక్సీ వాడిని మాట్టాడుకుని, అవేవో snow ఉన్న ప్రాంతాలకి తీసికెళ్ళమన్నాము. దారిపొడుగునా మంచే మంచు. అదేదో రోడ్డుపక్కన మన ఊళ్ళల్లో చెత్త తుడిచేసి పక్కకు తోసేసినట్టు, ఎక్కడ చూసినా “మంచు” కుప్పలే !!స్నో2
పై ఫొటోల్లో ఎక్కడా ఈయనా, వాళ్ళావిడా కనిపించనేలేదూ అంటారేమో అని photographic evidence ఈ కింద ఇస్తున్నాను.నేనూ, మా ఇంటావిడామంచే.. మంచు

    అక్కడికి వెళ్ళేటప్పటికి ఫొటోలు తీసేవాళ్ళు వెనక్కాలపడ్డారు.అవేవో వేషాలు వేసి తీసికోమన్నారు.ఈ చలిలో మళ్ళీ బట్టలన్నీ తీయమంటారేమో అని భయపడ్డాను. అలా కాకుండగా మళ్ళీ అవేవో సూదిపిన్నీసులు వళ్ళంతా గుచ్చేసి బట్ట కప్పేశాడు. మరీ బావుండదేమో వద్దండీ అంటుంది మా ఇంటావిడ. పోనిద్దూ, మళ్ళీమళ్ళీ వస్తామా ఏమిటీ, ఎలాగూ ఇంకో రెండు రోజుల్లో 41 ఏళ్ళు పూర్తిచేస్తామూ, పెళ్ళయిన తరువాత హనీమూన్లూ సింగినాదాలూ ఎలాగూ వెళ్ళలేదూ, ఒకళ్ళుండి ఇంకోరు పోతే ఈ ఫొటోలేనా చూసి సంతోషించొచ్చూ, అయినా ఎవరో నవ్వుతారని మన సరదాలు మానెస్తామా ఏమిటీ అని సద్దిచెప్పేసి ఆ ఫొటోలకి దిగిపోయామండీ…హనీమూన్..

    అదండీ విషయం రెండురోజులు ముందుగా అరవైతొమ్మిదో ఏట నలభైఒకటో వార్షికోత్సవం మొత్తానికి ఓ వెరైటీ గా జరుపుకున్నాము. నెత్తిమీదికి ఇన్నేళ్లొచ్చి ఈ సరదాలేమిటీ అనిమాత్రం అనుకోకండి. మిగిలిన విశేషాలు తరువాతి టపాలో…

Advertisements

15 Responses

 1. ఫోటో లో ‘భంపట్’ గా ఉన్నారండోయ్ !

  శుభాకాంక్షలు ఆ నలభై ఒక్క ‘మిథునార’ విందా లకు !

  చీర్స్
  జిలేబి.

  Like

 2. అస్సలు అనుకోము.
  ఇంకా చెప్పాలంటే భలే ఆనంద పడతాం.
  బాగున్నాయి మీ ఫోటోలు.
  మరిన్ని విశేషాల కోసం ఎదురు చూస్తూ…

  Like

 3. Bhale cute ga vunnaru andi

  Like

 4. కాల్కా నుండి సిమ్లా – ట్రాయ్ ట్రైన్ లో ప్రయాణం చాలా బావుంటుంది… ఆ మధ్య మేము కూడా వెళ్ళి ఇలాంటి ఫుటోలే తీయించుకున్నాం.. అవి మనకు మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి.. పన్లో పనిగా మీ బ్లాగు పై నే రాసిన మార్కులు చూస్తారని కోరుతూ..

  Like

 5. 41 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  పురుషార్థం ఫోటోలు బాగున్నాయి.
  మరి పుణ్యం ఫోటోల మాటేంటి?
  త్వరలో అక్షరధాం ఫోటోలు కూడా పెట్టండి.

  Like

 6. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు, మేడం గారికి. ఈ పోస్టు చాలా ఆహ్లాదకరంగా ఉంది (మధ్యలో ఉండటాలూ, పోవటాలూ వంటి అపసవ్యపు మాటలు మినహా). మీరు ఆ కొండజాతి డ్రస్సులో అచ్చు ఎల్ కె అద్వానీ లాగా వున్నారని నాకు అనిపించింది. శివ పార్వతుల పర్యటన శుభప్రదంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాం.
  నమస్తే
  రాము
  మీడియా కబుర్లు

  Like

  • బాబుగారూ! అక్కయ్యా!

   ఈ వ్యాఖ్యతో నేనూ యేకీభవిస్తున్నాను. మీరు మరిన్ని “వార్షికోత్సవాలని” జరుపుకోవాలని మా ఆకాంక్ష.

   త్వరలో మన సీమకి వస్తారనీ, మిమ్మల్ని కలవాలనీ చిన్న కోరిక!

   బస్!

   Like

 7. Congratulations and Many more happy years together.

  Like

 8. 🙂

  Like

 9. congratulations Sir !

  Like

 10. పుణ్యం పురుషార్థం బాగానే కలిసివచ్చాయి. 41 వ వివాహ వార్షికోత్సవ శుభకామనలు. మరిన్ని వేడుకలు చేసుకోవాలని ఆకాంక్ష.మానసాదేవిని దర్శించారనమాట. ఎప్పుడో పాతికేళ్ళ కితం దర్శనం చేశా, అంతే! గంగ హారతి గొప్ప అనుభూతి. చెల్లాయి బ్లాగులో కామెంటు ఆంక్షలకి భయమేసి ఇక్కడ చెప్పేసేనని చెప్పండి చెల్లాయికి.శుభం భూయాత్

  Like

 11. జిలేబీ,

  బైదవే “భంఫట్” అంటే ఏమిటో కూడా శ;లవిస్తారా? ధన్యవాదాలు…

  వెంకట్,

  ముందుగా ధన్యవాదాలు… మిగిలిన విశేషాలంటారా.. “పుణ్యం” టపా, మా ఇంటావిడ వ్రాసేసింది. నన్ను “పురుషార్దాలతో సరిపెట్టుకోమంది…

  వినీల,

  థాంక్స్… పళ్ళు లేవుకదమ్మా అందుకే క్యూట్ గా కనిపిస్తూంటాను…

  శంకర్ వోలేటి గారూ,

  ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలాటి ఫొటోలు తీయించుకుంటే బావుంటుంది కదూ.. చిన్నప్పుడు స్టూడియోల్లో బైకెక్కి, చందమామ మీదా పోజులు పెట్టి తీయించుకునే ఫొటోలు గుర్తొచ్చాయి…

  డాక్టరుగారూ,

  ముందుగా ధన్యవాదాలు. “పుణ్యం” ఫొటోలూ, టపా మా ఇంటావిడ పెట్టింది. ఏమిటో నన్ను మొహమ్మాటపెట్టేస్తున్నారు కానీ, అక్షరధాం లో ఫొటోలెక్కడండి సారూ. లోపలకి వెళ్ళేటప్పుడే మనదగ్గరున్న సెల్ ఫోనులూ, కెమేరాలూ మూట కట్టి జాగ్రత్త పెట్టేశారు..వాళ్ళు అమ్మే brochures మాత్రమే దిక్కు. భాషాభిమానం తో తెలుగు brochure తీసికున్నాము..

  రామూ,

  ముందుగా ధన్యవాదాలు. ఏమిటీ చిరకాలదర్శనం? అప్పుడెప్పుడో మీ సెల్ నెంబరిస్తానని చెప్పినట్టు గుర్తు. ఎందుకులే ఈయనతో సోదీ అనుకుని ఇవ్వడం మానేశారా?14/15 లలో మీ భాగ్యనగరం వస్తున్నాము ( ఒక్క రోజుకి). ఫోనునెంబరంటూ ఇస్తే ఒకసారి ఫోన్నైనా చేద్దామని…

  ప్రకాశ్,

  ధన్యవాదాలు..

  రెహమానూ,

  స్మైలీ పెట్టారు.. మా ఫొటో నవ్వులాటగా ఉందా బాబూ…అవునులే ఈ వయస్సులో ఇలాటి ఫొటోలు తీయించుకుంటే అలాగే ఉంటుంది మరి..

  సమీరా,

  Thank you very much…

  శర్మ గారూ,

  ఆ భగవంతుని దయా, మీలాటి పెద్దల ఆశీర్వచనాలూ ఉంటే, ఎన్నైనా వేడుకలు చేసికుంటామండీ. మీ చెల్లాయి బ్లాగులో ఆంక్షలంటూ ఏమీ లేవే. అందరూ వ్యాఖ్యలు పెడుతూంటారు. వచ్చిన గొడవేమిటంటే, వెంటనే ప్రచురింపబడదు, తనకి ఓ మెయిల్ వస్తుంది వ్యాఖ్య పెట్టగానే, అనుమతించిన వెంటనే ప్రచురితమవుతూంటుంది. దానికేముందిలెండి, మీకు నచ్చిందీ తన టపా…

  Like

 12. మొదటగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ పాంట్స్, షర్టు అండ్ పంజాబీ డ్రెస్ వేసుకున్న పార్వతీపరమేస్వరుల్లగా ఉన్నారు.

  నేను, మా వారు సంసార సాగరం ఈదటం లో తల మునకలు గా ఉన్నాము. భవిష్యత్ పుణ్యక్షేత్ర దర్సన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్నాము.

  బ్లాగ్ ని కొద్ది నెలలుగా చదువుతున్నాను. మీరు ఇలాగే మరెన్నో సంవత్సరాలు రాయాలని నా ఆకాంక్ష.

  Like

 13. శకుంతల గారూ,

  వామ్మోయ్..వామ్మోయ్.. పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నామంటారా, అదీ ” కలియుగ” ప్రభావం పాంటూ, పంజాబీ డ్రెస్స్ లో..మాపై మీ అభిమానం ఒక్కమాటలో చెప్పేశారు.. ధన్యవాదాలు.

  “సంసార సాగరం ఈదటం లో తల మునకలు గా “– నా పాత టపాలు ఒకసారి చదవండి.. ఈదడం ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది….

  Like

 14. శాస్త్రి గారూ,

  ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలవడానికి ప్రయత్నిస్తాను. మీ అభిమానం, భగవంతుని ఆశీర్వాదం సదా మాయందుండాలని ప్రార్ధన….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: