బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు


    క్రిందటి వారం అంతా నా మిస్టరి షాపింగులతో బిజీ బిజీ గా ఉన్నాను. ఆమధ్యన ఓ కొత్త ఏజన్సీ బెంగుళూరు లో ఉంది, దానిలో రిజిస్టరు చేసికున్నాను. వాళ్ళు ప్రస్తుతం దేశంలోని ఎలక్ట్రానిక్ ఔట్ లెట్స్ ( శామ్సంగ్, ఎల్.జీ) ల మిస్టరీ షాపింగులు నిర్వహిస్తున్నారు. ఏదో కొత్తగా ఉంది కదా అని దాంట్లోకి అడుగెట్టాను.ఇచ్చేది తక్కువే అయినా, నాలుగైదు షాపులు ఒకేసారి అడగొచ్చు. డబ్బులు కిట్టుబాటవుతాయి. పైగా ఏమో కొనఖ్ఖర్ల్లేదు, చేతి డబ్బులు ఏమీ అవవు. సరే చూద్దామని ఓ నాలుగు షాపులు అడిగితే, వాళ్ళేమో అన్నీ ఇచ్చేశారు. వాటికి POV ( Proof of Visit), అదేదో వాయిస్ రికార్డింగు చేయమన్నారు, నేను ముందుగానే చెప్పాను, నాకలాటివేమీ తెలియదనీ, కావల్సొస్తే ఓ ఫొటో (exterior of the outlet) తీసి పంపిస్తాననీ, సరే అన్నారు కదా అని ఒప్పుకున్నాను. పేద్ద పనేమీ లేదూ, మా ఇంటిదగ్గరలోనే ఉండే LG వాళ్ళ కొట్లకి వెళ్ళి, AC, LED/LCD TV ల ఖరీదెంతో తెలిసికోడం, మిగిలినవి ambience వగైరాలమీద ఓ రిపోర్టు వ్రాయడం. అన్నీ పూర్తయి బయటకొచ్చి ఓ ఫొటో తీయడం. ఇవన్నీ పూర్తిచేసి రిపోర్టు పంపేశాను.

    మర్నాటికల్లా వాళ్ళ దగ్గరనుంచి ఫోనూ, వాళ్ళ విజిటింగ్ కార్డు తీసికోలేదూ, నీ రిపోర్ట్ ఒప్పుకోడంలేదూ అని.వాళ్ళదగ్గర విజిటింగ్ కార్డులు లేకపోతే నేనేం చేసేదీ, మిగిలిన వివరాలు ఇచ్చాను కదా వాళ్ళపేరూ, గోత్రం అవీనూ, ఇంకా ఏమేమి కావాలీ, కావల్సొస్తే వెళ్ళి CC TV Coverage చూసుకోండీ, అంతేకానీ, నేను వెళ్ళలేదూ అంటే మాత్రం ఒప్పుకోనూ అని ఛడామడా కోప్పడేశాను.అంతకుముందు, ఇదే ఏజన్సీ వారి SAMSUNG కి చేస్తే, ఇదే గొడవ పెట్టారు. మళ్ళీ మొదలూ. ఇలాకాదని, నేనూ కొద్దిగా పాఠాలు నేర్పాను వాళ్ళకి- చూడండీ, మీకు ఇదేమొదటిసారేమో కానీ, నేను గత అయిదారేళ్ళుగా వందలకొద్దీ ఇలాటివి చేశాను, డబ్బులిస్తే ఇవ్వండీ, లేకపోతే టు హెల్ విత్ యు.. అనేసి ఫోను పెట్టేశాను.

    మరి నేనిచ్చిన డోసు వల్లో, లేకపోతే ఎందుకొచ్చిన గొడవా అనుకున్నారో ఏమో, మొత్తానికి నా రిపోర్ట్ అంగీకరించారు. వీళ్ళతో వచ్చిన గొడవే ఇది, మెత్తగా ఉండేవాళ్ళని చూస్తే మొత్త బుధ్ధేస్తుందిట.వాళ్ళు చెప్పిన దానిని వినేసి, సారీ.. అలాగా.. అనేసి, మనమేదో తప్పుచేశామని ఒప్పేసికుంటే, వాళ్ళే ఓ ఘనకార్యం చేశామనుకుంటారు. ముందుగానే వాళ్ళతో చెప్పాను, విజిటింగ్ కార్డు లేకపోతే ఓ ఫొటో తీయొచ్చూ అని వాళ్ళే చెప్పారు, వాళ్ళడిగినట్టుగానే చేసినా ఏదో ఒక గొడవ.

    అప్పుడప్పుడు మనం చేసింది రైటే అయినప్పుడు అవతలివాడితో వాదించడం తప్పేమీ కాదని నా అభిప్రాయం. మా పాత ఏజన్సీ వాళ్ళు ఫోను చేసి, అర్జెంటుగా ఓ ఆడిట్టుందీ ప్లీజ్ చేయండీ అని అడిగారు.అదికూడా కొనడాలేమీ లేవు. అదేదో రియల్ ఎస్టేట్ వాడి షో రూమ్ముకి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్టులో ఇళ్ళు ఎలా ఉన్నాయీ,వాటి సదుపాయాలేమిటీ, వగైరా వగైరా..కొశ్చనైర్ చూస్తే, అదేదో శాంపిల్ ఫ్లాట్ గురించి కూడా ప్రశ్నలున్నాయి. మళ్ళీ అక్కడెక్కడికో కూడా వెళ్ళమంటారేమో అని భయపడ్డాను. తీరా చూస్తే, అదే షో రూమ్ములోనే, చెక్కలతో ఓ శాంపిల్ ఫ్లాట్ కట్టేసుంచారు. వాటి వివరాలే అడిగారన్నమాట ! మొత్తానికి కిందటి వారమంతా వీటితో సరిపోయింది.

    ఇంక వచ్చేవారంలోనే అసలు బిజీ అంతానూ. మా ఫ్రెండొకాయన ఢిల్లీ రమ్మన్నారు, ఓ వారంరోజులికి, ఓ ఆధ్యాత్మికమూ, ఓ మామూలు తిరుగుడు కార్యక్రమమూ ప్లాను చేశారుట ( మా కోరికమీదే అనుకోండి). శుక్రవారం బయలుదేరి, తిరిగి శనివారం వచ్చేయడం. చూడాలి ఎలా ఉంటుందో మరి.. నా మాటెలా ఉన్నా, మా ఇంటావిడైతే చాలా..చాలా.. ఉత్సాహంగా ఉంది.తిరిగొచ్చిన తరువాత మిమ్మల్నందరినీ బోరు కొట్టడానికి కావలిసినన్ని విశేషాలు…

8 Responses

 1. Wish you both happy time and happy memories

  Like

 2. Wish you happy journey and memories

  Like

 3. dear phanibabu garu,

  can you kindly provide me the mystery shopping websites, please.

  thanks & regards,

  Like

 4. great.
  hope you will have a nice time in Delhi.

  Like

 5. Happy journey sir.

  Like

 6. మీ రాజధాని యాత్ర శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను.
  మంచి సమయం చూసి వెళ్తున్నారు. వాతావరణం బాగా ఉంటుంది.
  నేను జనవరి మొదటి వారంలో వెళ్ళ వలసి వచ్చింది.
  రాజధాని లో ఎనిమిది శీతా కాలాలు చూసిన నాకే చలి విపరీతంగా అనిపించింది.
  ఎలా వెళ్తున్నారు కదా అక్కడ కూడా మీ మిస్టరీ షాపింగ్ కూడా కానించేయండి.
  రాజకీయ కక్షి దారులను అడిట్టు చేయగలిగితే ఎంత బాగుంటుంది !

  Like

 7. రామం,

  థాంక్స్..

  శర్మగారూ,

  ధన్యవాదాలు.

  గీతాపద్మజా,

  ఇదివరకు రెండు టపాలు వ్రాశాను. అయినా ఇంకోసారి ఆ లింకులు ఇస్తున్నాను…

  1. http://www.bareinternational.com/

  2.http://www.onioninsights.info

  3.http://www.hsbrands.com/mystery-shopping-in-india

  రిజిస్టరు చేసికోండి. ఏదైనా సందేహాలుంటే అడగండి..

  వెంకట్,

  అలా అనే ఆశించి బయలుదేరుతున్నాము…

  శ్రీరాం,

  థాంక్స్…

  డాక్టరుగారూ,

  నా మిస్టరీ షాపింగులు అక్కడకూడా ఎందుకులెండి. వాళ్ళకి తెలియపరచాలే కానీ… తప్పకుండా చేయమంటారు. వాళ్ళ ఆస్థాన ఎవాల్యుఏటర్ ని కదా…

  Like

 8. ఢిల్లీలో అక్షరధాం మాత్రం తప్పకుండా చూడండి.
  అలాగే ఎ పి భవన్ లో తెలుగు భోజనం కూడ రుచి చూడండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: