బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– affordability…


    ఈ టపాకి పెట్టిన శీర్షిక ఒక్కొకరికి ఒక్కో విధంగా ఉంటుంది. నా ఉద్దేశ్యమేమిటంటే ఒకరికి affordable గా ఉండేది, ఇంకోరికి చాలా సుళువుగా ఉండొచ్చు. వీటికి కారణం సంపాదిస్తున్న డబ్బు మీద ఆధారపడుతుందేమో అని నా అభిప్రాయం. ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు, దాని ఖరీదు కొద్దిగా ఎక్కువేమో అని నాలాటివాడు అన్నప్పుడు, కొందరికి అది వింతగా అనిపించొచ్చు.ఓస్ ఈమాత్రందానికేనా ఇంత హడావిడీ అనికూడా అనుకోవచ్చు.అది మన మనస్థత్వాన్నిబట్టీ, సంపాదనబట్టీ ఉంటుంది.

ఉదాహరణకి ప్రస్థుతం మేముంటున్న ప్రాంతంలో, చాలా వస్తువులు పూణె లోని ఇతరప్రాంతాలకంటె కొంచం ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తోంది. ఇదివరకంటే, జీవితంలో ఇంకా ఎన్నెన్నో బాధ్యతలు అంటే పిల్లలకి చదువులూ, పెళ్ళిళ్ళూ , ఓ కొంప ఏర్పాటుచేసికోడమూ లాటివి ఉన్నచేత, ప్రతీదీ మనం afford చేయలేమేమో అనే అనిపించేది.కానీ, వాటన్నిటినీ ఏదో నా శక్తిమేరకు,భగవంతుని దయతో, దాటేయడం మూలానా, ఇంకేమీ పేద్ద బాధ్యతలన్నవి లేకపోవడం మూలానైతేనేమిటిలెండి బావున్నట్టే అనిపిస్తోంది. అంటే ఒకలా చూస్తే, గట్టెక్కేసినట్టే అనుకోండి. ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను.

అందుకోసమే, అసలు ఈప్రాంతంలో ఇంతంత ఖరీదులెందుకెక్కువా అనే ఆలోచనలాటిదోటొచ్చింది.ముఖ్యకారణం( నా ఉద్దేశ్యంప్రకారం), ఇక్కడెవరికీ బేరం ఆడే అలవాటు లేదు.ఆ కొట్టువాడేం చెప్తే అంతిచ్చేయడం. కారణం చేతినిండా డబ్బులు, వాటినెలా ఖర్చుపెట్టాలో తెలియదూ. అది ఓ కూర్లనండి, పనిమనిషనండి, లాండ్రీవాడనండి,ఒకటేమిటి ప్రతీదీనూ.కూరలూ, గ్రోసరీలూ, దగ్గరలోనే ఉండే రిలయెన్సు మార్టూ, డీమార్టూ లలో ఫరవాలేదు,మరీ అంత ఖరీదెక్కువకాదు, పైగా తూకంకూడా బాగానే ఉంటుంది.కానీ వచ్చినగొడవల్లా బిల్లింగు దగ్గరే. ఏ వీకెండులోనే వెళ్తే గంటలతరబడి వేచిఉండాలి.పైగా కొన్నవన్నీ కొంపదాకా మోసుకుపోడమోటి. కానీ మామూలు కిరాణా దుకాణం వాడు కొన్నసరుకులు కొంపకి చేర్చే సౌలభ్యమోటిచ్చాడు.దీనివలన ఏమౌతోందంటే, కావలిసిన సరుకులు ఆ కిరాణా కొట్టువాడిదగ్గరే తెప్పించేసికుని, window shopping కి మాత్రమే మాల్స్ కి వెళ్ళడం.అయినా లింగూలిటుకూమంటూ ఉండే ఇద్దరికి ఏం కావాలీ?

ఇంక పనిమనుష్యులవిషయానికొస్తే, ఈ ప్రాంతంలో ఉండే చాలా ఇళ్ళల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులు కావడం చేత, పనిమనుష్యులు part and parcel వాళ్ళకి. పాపం ప్రొద్దుటే పిల్లలని స్కూళ్ళకీ, భర్తలని ఆఫీసులకీ పంపడంకోసం, ముందుగా ఓ వంటమనిషి ముఖ్యం. ఏ సాయంత్రమో ఆఫీసులనుండి కొంపకి తిరిగొచ్చే సమయానికి, ఆ రెండో పనిమనిషిని రమ్మంటారు.చెప్పేదేమిటంటే, వారి సౌకర్యంప్రకారం ఆ పనిమనుష్యుల పనివేళలు మనం నిర్ణయించేసరికి, వాళ్ళేమో నెత్తికెక్కేస్తారు. అవసరం మనదిగా, వాళ్ళేంచెప్తే దానికే చచ్చినట్టు ఒప్పుకోవాలి.వాళ్ళకి మూడ్డుంటే వస్తారు, లేకపోతే ఓ దండం పెట్టుకోవడం. ఇక్కడనే ఏమిటిలెండి, ఈ మహానగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్తూన్న ప్రతీ ఇంట్లోనూ ఇదే భాగవతం.ఏదో నూటికీ కోటికీ ఇంట్లోంచే పనిచేసేసదుపాయం ఉన్నవారికి తప్పించి, మిగిలినవారందరి అవస్థా ఇదే.

ఇలా పనిమనుష్యుల tantrums మాట్టాడకుండా భరిస్తున్నారంటే మరి affordability యే కారణం కదా! దీనితో ఏమయ్యిందీ అంటే మామూలు జీతాలకి పనిమనుష్యులు దొరకడం అంటే చాలా కష్టం.మధ్యతరగతి ప్రాణులు ఎవడైనా వచ్చి ఇలాటి ప్రాంతాల్లో ఉండాలంటే ప్రాణం మీదకొచ్చిందంటే రాదు మరీ ?

ఇంక కూరలూ, పళ్ళూ వ్యవహారంలోకి వస్తే, వాటినమ్మే కొట్టువాడిని రేటెంత బాబూ అంటే ఏదో వింతమృగాన్ని చూసినట్టు చూస్తాడు, కారణం- ఇప్పటిదాకా ఎవడూ రేటడిగిన పాపానికి పోలేదు, ఏదో కారు కొట్టుపక్కనే ఆపడం, ఓ కూర చూపించడం, ఫలానాది అరకిలో, ఇంకోటేదో పావుకిలో అంటూ చెప్పడం, వాడడిగినదేదో ఇచ్చేయడం.అలాటిది ఓ అర్భకప్రాణి వచ్చి రేటెంతా అని అడిగాడంటే ఆశ్ఛర్యపడ్డంలో వింతేముందీ? కానీ I could get a break in the price! ఈమధ్యన ఓ కూర్లకొట్టుదగ్గరకి వెళ్ళి ఫలానాది ఎంతా, అన్నాను , ఏదో చెప్పాడు, కాదూ ఇంతకైతే ఇస్తావా అన్నాను, ముందుగా కాదూ అన్నవాడే తీరా నేనడిగిన రేటుకే ఇచ్చేశాడు. కారణం- మిగిలినవారిదగ్గరనుంచి ఎలాగూ చాలా లాభం సంపాదించుకున్నానుకదా, అలాటిది రొజులో ఏ ఒకరిద్దరికో, వాళ్ళడిగిన రేటుకిస్తే ఏం పోయిందీ. ఇక్కడుండే ఐటి వారి ధర్మమా అని, ఆ కొట్టువాడుకూడా CRM లో దిట్ట అయిపోయాడేమో..ఏదైతేనేం, తేలిందేమిటయ్యా అంటే, బేరాలు ఆడొచ్చు అని.కానీ బేరం ఆడడానికి నామోషీఆయే.

బయట రోడ్లపక్కనుండే చాయ్ దుకాణాల్లో చాయ్ తాగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. కారణం, ఎవరైనా చూస్తారేమో అని! అదే ఎవడో, ఓ మెర్సిడీజ్ బెంజ్ కారు ఆపి, ఆ కొట్టులో చాయ్ తాగాడనుకోండి, ఇంక ప్రతీవాడూ అక్కడే తాగడం మొదలెడతాడు. పైగా అదో స్టేటస్ సింబలనుకుంటారు. అదేచాయి, ఏ కెఫే కాఫీలోనో, బరిస్టాలోనో తాగాలంటే తాడితెగుతుంది! అలాగని పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్తే పాపమనికాదు.Affordability అనేది ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో అని చెప్పడానికి.

ఇంక ఇక్కడి ఎపార్టుమెంట్ల గొడవ. ఎప్పుడో ఆరేడేళ్ళక్రితం, ఇంకా ఇంత expansion లేని రోజుల్లో కొనుక్కున్న ఏ అపార్టుమెంటో అమ్ముకుందామని చూశారో, ఇంక చూడండి, ఆ సొసైటీ సెక్రెటరీయో ఎవడో ఉంటాడు, వాడికేమో చవకలో కొట్టేద్దామని ఆశ, అమ్మేవాడేమో ఏదో రేట్లు పెరిగాయికదా, ఆ పెరిగిన రేటుకి అమ్ముదామని వీడి ఆలోచనా.చివరకి బేరం కుదరక తాళం పెట్టుకుంటాడు. ఇదో టైపు mean..
దాదాగిరీ. ఏమిటో అంతా గందరగోళం. అయినా పనేమీ లేదుగా, ఇలాటివే చూస్తూంటాను, నా టపాలకి టాపిక్కులు దొరుకుతాయి కదా అని.

ఈవేళ పేపరులో ఒక వార్త చదివాను. చాలా బాధేసింది. మీరూ చూడండి…Choked while breast feeding

Advertisements

5 Responses

 1. ఏమో.. మా ఇంటి దగ్గర బేరం ఆడటానికి ఓసారి ప్రయత్నిస్తే..చిన్నపిల్ల ఆరో, ఏడో చదువుతుందేమో మహా అంటే! ‘చేయి తీయి..జామకాయల మీద నుంచి..’అని అరిచింది.’హెంత ఛీప్? అన్నట్టు కార్ల వాళ్లందరూ పైన్నుంచి క్రింద దాకా చూశారు..’
  నేను.. ఆ అమ్మాయికి మర్యాదగా ఎలా మాట్లాడవచ్చో కాస్త లెక్చర్ ఇచ్చి. ఆ అమ్మాయి ముందు చెప్పిన ధర కే కొని వచ్చాను.

  Like

 2. బేరమా బలేవారే. రేటడిగితేనే ఎగా దిగా చూస్తున్నారు, కొన్నావు లేవయ్యా అన్నట్లు, మా పల్లెలలోనే, మరి మీకయితే చెప్పక్కరలేదు. బాగా యాంత్రికమయిన జీవనం లో పడిపోయినట్లున్నారు, లింగూ లిటుకూ కదా, జాగ్రత్త ఎక్కువ అవసరం,ఒంటరిగా ఉండద్దు, చొరవ తీసుకున్నందుకు మన్నించండి.

  Like

 3. ఏదో, కూసింత affordability ఉండ బట్టి మీ టపాలు చదివే భాగ్యం మాకు
  కలిగిందండీ !

  జిలేబి

  Like

 4. “బయట రోడ్లపక్కనుండే చాయ్ దుకాణాల్లో చాయ్ తాగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. కారణం, ఎవరైనా చూస్తారేమో అని! అదే ఎవడో, ఓ మెర్సిడీజ్ బెంజ్ కారు ఆపి, ఆ కొట్టులో చాయ్ తాగాడనుకోండి, ఇంక ప్రతీవాడూ అక్కడే తాగడం మొదలెడతాడు. పైగా అదో స్టేటస్ సింబలనుకుంటారు.”

  well said

  Like

 5. కృష్ణప్రియా,,

  “అన్నట్టు కార్ల వాళ్లందరూ పైన్నుంచి క్రింద దాకా చూశారు..’” Thats the bottomline..

  ఏదో పాత “మధ్యతరగతి” అలవాట్లు వదులుకోలేక, బేరం ఆడడానికి ప్రయత్నిస్తే ఇదిగో ఇలాటి అనుభవాలే ఎదురౌతూంటాయి.

  శర్మగారూ,

  “లింగూ లిటుకూ కదా, జాగ్రత్త ఎక్కువ అవసరం,ఒంటరిగా ఉండద్దు, చొరవ తీసుకున్నందుకు మన్నించండి.”– దానికేముందండీ, ఈరోజుల్లో అలాటి జాగ్రత్తలు చెప్పేవారెంతమందండీ? మా శ్రేయస్సు కోరేకదా చెప్పారు.

  జిలేబీ,

  థాంక్స్.. ఏదో ఒకటీ.. చదువుతున్నారూ ప్రోత్సహిస్తున్నారూ..

  రామచంద్రుడూ,

  Thanks…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: