బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఆయనెవరో కురియన్ ట, రాజ్యసభకి ఉపాద్యక్షుడిగా ఉంటున్నారు. కొద్ది సంవత్సరాలక్రితం కేరళలో ఒకామ్మాయిమీద అత్యాచారం జరిగిన సందర్భంలో, ఈయన పేరుకూడా వచ్చింది.అప్పుడేదో manage చేసేసి, తప్పించేసికున్నారు. కానీ, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత తెరమీదకొచ్చింది ఈ సంఘటన.

   ఈఊళ్ళో VIBGYOR SCHOOL అని ఓ పేద్ద పేరున్న స్కూలోటుంది, స్కూలన్నతరువాత ఓ ప్రిన్సిపాలొకరుకూడా ఉంటారుకదా. ఆవిడేమో, ఓ పదిపదిహేను రోజులనుండి స్కూలుకి రావడం లేకపోతే, పేపర్లవాళ్ళు విచారించడం మొదలెడితే తేలిందేమిటో చదవండిVIBGYOR School. ఈవిషయం మిగిలినపేపర్లవాళ్ళెవరూ ఎత్తలేదు ! This is all our so called “free press” !! దీన్నిబట్టితేలిందేమిటంటే, మన భాగ్యనగరంలో, మిగతా రాష్ట్రాలనుండి వచ్చికూడా, స్కామ్ములు మహారాజులా చేసికోవచ్చన్నమాట !

    ఆమధ్యన హర్యాణా మాజీ ముఖ్యమంత్రి గారిని అదేదో స్కాంలో అరెస్టు చేయగానే,నేను పెద్దవాడినయిపోయానూ, శిక్ష తగ్గించండీ అంటాడేకానీ, తిన్నదాన్ని గురించిమాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడడు.ఇంక ఆంధ్రదేశంలో అయితే, అరెస్టయినవాళ్ళ సంఖ్య లెఖ్ఖేలేదు.ప్రతీవాడూ చెప్పేదొక్కటే, వయస్సయిపోయిందీ, ఏదో తక్కువ శిక్ష వేయండీ అనే కానీ, వయస్సులో ఉన్నప్పుడు తిన్నదేదో కక్కుతామనిమాత్రం చెప్పరు !

    ఈమధ్యన ఆన్ లైన్ లో తెలుగుసాహిత్యం గురించి వెదుకుతూంటే ఓ రెండు అద్భుతమైన లింకులు దొరికాయి. ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే వదిలేయండి, తెలియనివారు ఓసారి ఇక్కడ ఇక్కడా చూడండి. తెలుగు పుస్తకాలు వేలల్లో ఉన్నాయి.

4 Responses

 1. Good links shared Thank u

  Like

 2. చాలా మంచి లింకులు ఇచ్చారు ఫణిబాబు గారు. ధన్యవాదాలు.

  Like

 3. మొదటి లింకు బాగుంది. చాలా పుస్తకాలున్నాయక్కడ.
  రెండవలింకు పని చేయలేదు – అసలు కనెక్టు కావటం లేదు.

  Like

 4. శర్మగారూ,

  మీకునచ్చినందుకు ఆనందంగా ఉందండి..

  కిషోర్,
  ధన్యవాదాలు…

  శ్యామలరావుగారూ,

  బాగానే ఓపెన్ అవుతున్నాయండి రెండులింకులూ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: