బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైం పాస్…


    కొత్త ఇంట్లో మెల్లిమెల్లిగా సెటిల్ అవుతున్నట్టే అనిపిస్తోంది.ఇదివరకటిదైతే ఒకటే చిన్న హాలూ, ఓ బెడ్రూమ్మూ కాబట్టి, ఉన్న మేమిద్దరమూ ఎక్కడుంటున్నామో తెలిసేది. కానీ ఇప్పుడున్నది, దానితో పోలిస్తే మరి పెద్దదే ! 2BHK పెద్దదాంట్లోకే వస్తుందిగా. ఓ ఫోను చేస్తే కొంపకి పట్టుకొచ్చేసే కిరాణా/కూరలు వాడొకడు దొరికాడు. పాలవాడు సరేసరి. ఇదివరకైతే బట్టల ఇస్త్రీకి నేనే పట్టుకెళ్ళేవాడిని, ఇప్పుడేమో కొంపకి వచ్చి తీసికెళ్ళేవాడొకడు దొరికాడు. ఎంతైనా మరి స్టేటస్ పెరిగిందికదా!!పేపరు వాడినడిగితే తెలుగుపేపరు ప్రొద్దుటే రాదన్నాడు. ఈ వంకెట్టైనా బయటకి పారిపోవచ్చు !

   ఇదివరకటిలా కాకుండా, మా అగస్థ్యా, నవ్యా వచ్చినప్పుడు మరీ ఇరుకిరుగ్గా కాకుండా, విశాలంగా ఉంది.మొన్న శనివారం వాళ్ళతోనే కాలక్షేపం.అబ్బాయీ, కోడలూ సాయంత్రందాకా ఉండి, రాత్రి భోజనం చేసి వెళ్ళారు. ఇంక అమ్మాయైతే, వారంలో రెండురోజులు తప్పకుండా వస్తూనే ఉంటుంది.ఇవ్విధంబుగా కాలక్షేపానికేమీ లోటు లేదు.ఒకటిరెండు రోజుల్లో ఆ BSNL వారి broadband కూడా వచ్చేస్తుంది. నాకైతే రిలయన్స్ నెట్ కనెక్టుంది, కానీ దానికి వైఫై లేకపోవడంతో, మా ఇంటావిడ తన సెల్లులోనూ, టాబ్ లోనూ చేసే విన్యాసాలు కుదరడంలేదు పాపం ! అందుకే ప్రతీరోజూ నన్ను అడుగుతూంటుంది వైఫై ఎప్పుడొస్తుందీ అని. నిజం చెప్పాలంటే ఆ రెండిటీ నెట్ వర్క్ తో వాటిల్లో బ్రౌజ్ చేసికోవచ్చు. కానీ ఓ gentleman’s agreement ఒకటి చేసుకున్నాముకదా, దాని ప్రకారం వైఫైలో మాత్రమే తను బ్రౌజ్ చేసికోవాలి.లేకపోతే బిల్లు తడిపిమోపెడౌతుంది.

    నేను 2011 నవంబరు లో ఒక టపా పెట్టాను. ఏం లేదూ, మా పెన్షనర్ల గోల-ఏదో పెన్షను పెరుగుతుందీ అనుకుంటే, ప్రభుత్వం వారేమో హైకోర్టుకి వెళ్ళారు. కోర్టుల్లో కేసులు మన జీవితకాలంలో సెటిలయ్యేవి కావు. ఏమొచ్చిందో ఏమో మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు అకస్మాత్తుగా నిన్నటి రోజున (28/12/2013) ఓ ఆర్డరు పాస్ చేసేశారు . ఏమైనా “పాపభీతి” లాటిది కలిగిందేమో. ఎందుకొచ్చిందీ, ఈ పెన్షనర్ల ఉసురు పోసుకోవడం ఎందుకూ అనేమో. ఆ ఆర్డరు వివరాలు ఇక్కడ ఇక్కడా చదివి మీ ఇంట్లోకూడా నాలాటి పెద్దవారెవరైనా ఉన్నారేమో, చదివి సంతోషిస్తారు.మాకెందుకండీ ఈ గొడవా అంటారా మీఇష్టం. చెప్పడంవరకూ నావంతూ.

    శ్రీ బాపూ గారు అస్వస్థతగా ఉండి బంజారా హిల్స్ లో హాస్పిటల్ లో చేరారని నిన్నటి సాక్షి లోచదివాను. ఇప్పుడు కులాసాగానే ఉండిఉంటారని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.Bapu

    జానకమ్మ గారు, పద్మభూషణ్ వద్దన్నారు, అంతవరకూ బాగానే ఉంది. కానీ తనకి “భారతరత్న” ఇవ్వాలనడం కొద్దిగా too muచ్చేమో కదూ ! ఇలాటి ప్రకటనలు ఇవ్వడంతో, వారిమీద ఇప్పటిదాకా ఉన్న గౌరవమూ, అభిమానమూ కొద్దిగా dilute అవుతాయేమో అని నా అభిప్రాయం. ప్రపంచంలో ప్రతీవారికీ ఉంటుంది తనకి ఫలానాది రావాలీ అని, కానీ ఆ ఇచ్చేవాళ్ళక్కూడా అనిపించాలికదా …

11 Responses

 1. Thank u for the news. The order may not directly give an impact on me but he same can be referred for getting 50% of the last pay drawn as pension for the retired before 2006. Once again thank u

  Like

 2. జానకి గారిని మీడియా కొద్దిగా misquote చేసినట్లు అనిపించింది. ఆవిడ నాకు భారత రత్న కావాలి అననట్లుంది.

  కనీసం ఈ ముఖాముఖి లో..

  http://www.thehindu.com/arts/cinema/i-deserve-much-more/article4353527.ece

  Like

 3. శర్మగారూ,

  ఏదో తెలిసిందికదా అని అందరితోనూ పంచుకున్నాను. పోన్లెండి, ఎవరో ఒకరికి ఉపయోగించినా సంతోషమే.

  కృష్ణప్రియా,

  ఏ తెలుగు చానెలో గుర్తులేదు కానీ, నేను మాత్రం ఆవిడ నోటినుండి విన్న తరువాతే వ్రాశాను. ఇంకో విషయం- మీరు పెట్టిన లింకులోనే, క్రింద కొంతమంది వ్యాఖ్యలు పెట్టారు చూశారా, వారుకూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాకుండా, 27 వ తారీకున మన చానెళ్ళవాళ్లు చాలా కార్యక్రమాలు చేసారు ఇదే విషయం మీద. మరీ అంతమందీ అపార్ధం చేసికున్నారంటారా? Anyway it was in poor taste…

  Like

 4. జానకమ్మ గారు, పద్మభూషణ్ వద్దన్నారు, అంతవరకూ బాగానే ఉంది. కానీ తనకి “భారతరత్న” ఇవ్వాలనడం కొద్దిగా too muచ్చేమో కదూ ! ఇలాటి ప్రకటనలు ఇవ్వడంతో, వారిమీద ఇప్పటిదాకా ఉన్న గౌరవమూ, అభిమానమూ కొద్దిగా dilute అవుతాయేమో అని నా అభిప్రాయం. ప్రపంచంలో ప్రతీవారికీ ఉంటుంది తనకి ఫలానాది రావాలీ అని, కానీ ఆ ఇచ్చేవాళ్ళక్కూడా అనిపించాలికదా …

  Felt exactly the same…it sure would dilute the adoration ….at least to some like me….

  Like

 5. అవునా? నేను చూసింది ఈ పేపర్ లో మాత్రమే.. అవడం వల్ల ఆవిడని మీడియా మిస్ కోట్ చేశారేమో అనిపించింది.

  అసలు భారత ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని(ఎంత చిన్నదైనా) తిరస్కరించడమే నాకు నచ్చలేదు.
  నాకు భారత రత్న కావాలీ ఈ ఈ అనడం ఆవిడ స్థాయి కి తగని విషయం. Definitely it is in poorest of the tastes.

  Like

 6. బోఫోర్స్ గాంధికి ఏకంగా భారతరత్న(బ్రతికుండగా పద్మశ్రీ కూడా రాలేదు)ఇవ్వంగా లేనిది, జానకి గారు ఆశిస్తే, టేస్టులు, రుచులు నచ్చలేదా! భారత ప్రభుత్వమే కాదు 2 రూపాయలబిళ్ళ రోడ్డుమీద పడివున్నా మనం వదలం, అలాంటిది పద్మభూషణ తిరస్కరించడం ద్వారా ఈ అవార్డుల్లో జరుగుతున్న అవినీతి, ఆశ్రితపక్షపాతాన్ని, రాజకీయాన్ని ఆమె నిరసించారు, ఆమె ధైర్యం మెచ్చుకోదగ్గది. రామానాయుడికి, దాసరికి, ఆఖరుకు మోహన్‌బాబుకు కూడా వితరణ అయిన పద్మ అవార్డుల విలువేమిటో, రైల్లో కన్సేషన్ టికెట్ వుంటుందేమో. ఆవిడే కాదు, కేరళ నటుడు కూడా అవార్డు తీసుకుంటూ అసంతృప్తిని వెళ్ళగక్కాడు.

  ఫణి బాబుగారికి కూడా ఇవ్వాలని నేను ఆశిస్తాను, అందులో తప్పేమిటో నాకు అంతుపట్టడం లేదు. 🙂

  Like

 7. ఎనానిమస్సు గారూ,

  “ఫణి బాబుగారికి కూడా ఇవ్వాలని నేను ఆశిస్తాను, అందులో తప్పేమిటో నాకు అంతుపట్టడం లేదు. ”

  వామ్మోయ్..వామ్మోయ్.. ఏదో నాదారిన నన్నుండనీయండి.. మీపేరేదో తెలిపితే personal గా కూడా ధన్యవాదాలు తెలిపేవాడిని కదా !! అసలు అంత ” మంచి” ఆలోచనెక్కణ్ణించొచ్చిందీ…
  ఇంక జానకమ్మగారి విషయంలో, ఆవిడ అలా అనుకోడం రైటే.. కానీ ఊళ్ళోవాళ్ళందరికీ చెప్పుకోడం ఉందే అదే బాగోలేదన్నాను.

  కృష్ణప్రియా,

  అదే నా అభిప్రాయమూనూ..

  నిరుపమా,

  జానకమ్మ గారిని అభిమానించే ప్రతీవారికీ అలాగే అనిపిస్తుంది.

  Like

  • ఊళ్ళొవాళ్ళందరికీ చెప్పక ఇంకెవరికి చెప్పాలి? తనే లోలోన చెప్పుకుని కుళ్ళిపోవాలా? పదిమందికి చెబితేనే కదా అవార్డులు అర్హులకు ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చేది. ఆమె చెప్పుకోబట్టే కదా అందరికీ తెలిసింది. నాకు నచ్చిన రెండో పాయింటే అది. ఆ తెగువ అందరికీ రాదు, ఏ నూటికో ఒక్కరికి. తక్కినోళ్ళ మనకెందుకులే అనుకుని ముసుగుతన్నే వారే.

   Like

 8. ఎనానిమస్,

  ఏమో మరి.. నా అభిప్రాయమైతే, ఆవిడ అలా అనవలసుండకూడదని, ఎవరి అభిప్రాయాలు వారివి కదా. అలాగే ఆవిడకూడా, మీలాగే అనుకునుంటారేమో..
  అయినా మనిద్దరమూ వాదించుకోడంవల్ల ఆవిడకేమీ ఒరిగేదిలేదు.. so let us close it… అలా కాదూ, ఊళ్ళోవాళ్ళందరూ వాదించుకుంటేనేకదా ఎవార్డులొస్తాయీ అనుకుంటారా, ఇంక మీఇష్టం…

  Like

 9. Gentleman’s agreement or gentleman’s domination?
  Is vi-fi facility available by now?
  Wish you a very happy stay in your NEW home.

  Like

 10. డాక్టరుగారూ,

  మీరు మరీ between the lines చదివేసి లేనిపోని గొడవలు పెట్టేయకండి…

  ఇవాళో రేపో ఇస్తానన్నారు, తెలుసుగా BSNL వాళ్ళు నాలుగైదుసార్లు తిప్పించుకుంటేనేకానీ పని చేయరు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: