బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు ఈ విషయం ఎత్తకూడదనుకున్నాను.. కానీ..


   మన కేంద్రప్రభుత్వం వారు ప్రతీ ఏటా గణతంత్రదిన సందర్భంలో అవేవో “ఎవార్డులు” పంచుతూంటారు. పంచడం అని deliberate గానే అన్నాను.ఏదో ప్రతీ ఏడాదికీ ఓ “కోటా” పెట్టుకుంటారు.వివిధ రాష్ట్రప్రభుత్వాలూ పంపిన ఓ జాబితాలోంచి పేర్లు ఎంచుకుని వారికి ఏ పద్మశ్రీయో, భూషణో, విభూషణో ప్రదానం చేసేస్తూంటారు. భారతరత్నకి సంబంధించినంతవరకూ, ప్రతీ ఏడాదీ ఇవ్వాలనేమీ లేదు.నాకు తెలిసున్నంతవరకూ ఇదీ వాటి చరిత్ర. ఇంకా వివరాలు తెలిసికోవాలంటే ఇక్కడ చదవండి.

    ఈ ఎవార్డుల విషయంలో నాకు ఒక సంగతి అర్ధం అవదు. ఉదాహరణకి ఎవరో ఒకాయనకి ఏదో శ్రీ యో, భూషణో ఒకసారి ఇచ్చారనుకోండి, మళ్ళీ ఆ మహాశయులకి, శ్రీ ఇచ్చినవారికి భూషణమూ, భూషణం వచ్చినవాళ్ళకి విభూషణమూ, అదేదో ప్రభుత్వోద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా లేదూ? పైగా నియమావళిలో ఖచ్చితంగా వ్రాసుంది, ఇలాటి బహుమతి వచ్చినవాళ్ళెవ్వరూ, వాళ్ళ పేర్లముందర ఈ titles పెట్టుకోకూడదనిన్నూ, అలా పెట్టుకుంటే దాన్ని వెనక్కి తీసేసికుంటారనిన్నూ. మరి మన సినిమావాళ్ళకి ఈ విషయం తెలియదా? పద్మ ఎవార్డొచ్చిన ప్రతీవాడూ పేరుకిముందర పద్మ తగిలించుకుంటారూ? పోన్లెద్దురూ ఎవరి సంతోషం వాళ్ళదీ.

   ఈ టపా అసలు ఎందుకో అర్ధం అయిఉంటుందనుకుంటాను. శ్రీ బాపూ గారికి వీళ్ళిచ్చేదేమిటండీ, అదీ పద్మ శ్రీ యా? అలా ఇవ్వడానికైనా సిగ్గుండొద్దూ? ఇన్నేళ్ళదాకా ఆయనకి ఎవార్డు ఇవ్వాలనే ఇంగితజ్ఞానం లేనందుకు ఇన్నాళ్ళూ ప్రభుత్వాన్ని తిట్టిపోశాము. చివరకి తట్టేటప్పటికి ఓ పద్మశ్రీతో సరిపెట్టేశారు.ఆ “విభూషణాల” తో పోలిస్తే అసలు ఆయన ఏ విషయంలో వారికి తక్కువా?

   ఇంకొకళ్ళైతే ఈ ఎవార్డు అసలు నాకఖ్ఖర్లేదనేవారు. కానీ మన బాపూ గారు Too simple a human being.. అలాటి లేనిపోని controversies లోకి వెళ్ళరు. అది ఆయన గొప్పతనం. అయినా అనుకుంటాము కానీ సూర్యుడికి ఎదురుగా “దీపం” ఎందుకండీ? ఆ దీపం ఏమూలకీ? పోనీ ప్రభుత్వం వారికి ఈ ఆలోచన ఓ రెండేళ్ళు ముందరైనా వచ్చుంటే, జంట లో రెండోవారైన శ్రీ వెంకటరమణ గారిక్కూడా ఇచ్చేవారుకదా? ఈవిషయం మీద క్రిందటేడాది ఓ టపా పెట్టాను.

    అందరి అభిమానపాత్రుడూ అయిన శ్రీ బాపూ గారికి ఈ ఎవార్డ్ వచ్చిందని సంతోషించాలో లేక ఇంతేనా అని సిగ్గుపడాలో తెలియడంలేదు. ఎంతచెప్పినా ఎవార్డు ఎవార్డే so సంతోషించేద్దాము.

    LONG LIVE Sri BAPU garu…..

Advertisements

8 Responses

 1. ఇవ్వలేదే అంటారు,

  ఇస్తే, ఇంతేనా అంటారు ఇవ్వకుంటే ఇవ్వలేదే అంటారు.

  అక్కడ చిరంజీవ గారు డిల్లీ లో ఉన్నారు. వారేమైనా చెబ్తారేమో చూద్దాం.

  పోదురూ, జగమెరిగిన బాపూకి ఈ ‘పేద’ శ్రీ లు ఏల?

  వారే ఒక సిరి. వేరే ‘సిరి’ కావాలా ?

  జిలేబి.

  Like

 2. ఏం చెప్పేదండీ? మన simplicityని ఢిల్లీ పెద్దలు చేతకాని తనంగానే తీసుకుంటున్నారు!
  చూడండి ఈ నాటి ప్రజలో నా ప్రశ్న http://praja.palleprapancham.in/2013/01/blog-post_26.html బాపుకు పద్మశ్రీయేనా?
  కడుపు మండదా మరి?

  Like

 3. ముందుగా మన అభిప్రాయాలెలా ఉన్నా ,’పద్మ ‘ జాతీయ అవార్డులు వచ్చిన వాళ్ళందరినీ అభినందిద్దాము. ఆనందిద్దాము.ఇవి ఎప్పుడూ వివాదాస్పదమైనవే.నా అభిప్రాయం చెప్తాను.1,పద్మ అవార్డులు titles, degrees లాగ వాటిని తమపేర్లముందు రాసుకోకూడదు. 2.బాలమురళీ కృష్ణ గారికి భారతరత్న,బాపుగారికి,జానకి ,సుశీలగార్లకి,పద్మవిభూషణ్,విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ఇవ్వాలి.వాటికి వారు పూర్తిగా అర్హులైనవారు.

  Like

 4. అసలు బాపు గారికి పద్మ అవార్డు ఇవ్వడమే ఆలస్యం. అందునా… రామానాయుడికి భూషణమూ, ఈయనకి శ్రీకారమూనూ. రామానాయుడును నేను తప్పు పట్టను కానీ ఆయన సృజనాత్మకంగా చేసినదేముంది… పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడమే తప్ప. ఓ విజయవంతమైన ప్రొడ్యూసర్… దేశభాషలన్నిటిలోనూ సినిమాలు నిర్మించిన ఘనత సొంతం చేసుకున్నాడనవచ్చేమో. హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమలను వదిలేస్తే మరే ఇతర భారతీయ చిత్ర పరిశ్రమ అయినా… ఆర్థికంగానూ, వాణిజ్యపరంగానూ చిన్నవే కదా. జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే నష్టం లేకుండా… కొండొకచో కనీస లాభాలతో ఐనా గట్టెక్కేయవచ్చు. దానికి సృజనాత్మక ప్రతిభ కంటె డబ్బులను సరిగ్గా మేనేజ్ చేయడం వస్తే చాలు. సినిమాకి కళా గౌరవం దక్కింది బాపు లాంటి దర్శకుల వల్ల మాత్రమే. కథాకథన వైవిధ్యం, వాటితో పాటు ఆర్థికంగానూ ఫలించాల్సిన వ్యాపార సూత్రం… రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చిత్రాలను రూపొందించిన బాపుగారిని… రామానాయడు తరవాతి వరుసలో నించోబెట్టడం… అదీ… తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుతో… హు(. తెలుగువాళ్లందరికీ సిగ్గుచేటు. బాపుగారు నోరెత్తకపోవచ్చు కానీ… జానకమ్మలాగే స్పందిస్తే బావుండేదేమో అన్నంత కోపం కలిగింది నాకు ఓ దశలో.

  Like

 5. బాపు గారికి పద్మభూషణ్ ఇస్తాం మాకు ఓట్లు పడతాయా? 🙂 ప్రజ్ఞ కి చోటు లేదని ఎప్పుడో తెలిసింది, ఇంకా ఎందుకీ బాధ.ప్రజలిచ్చారు కితాబులు, పై ప్రపంచం గుర్తించింది మేధావులని…..వీరు గుర్తిస్తే ఎంత…….తమినాడు కోటాలో ఇచ్చారట…గిరీశం బాగనే చెప్పేడు…మనవాళ్ళుట్టి….

  Like

 6. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని , మన నాయకులు పాపం ఈ పద్మాల గురించి ఏం ఆలోచిస్తారు?

  Like

 7. శ్యామలరావుగారూ,

  మనప్రభుత్వ పెద్దలది simplicity అంటే మాత్రం నేనొప్పుకోనండి. శ్రీబాపూగారిదన్నారా ఓకే…

  రమణరావుగారూ,

  పద్మ ఎవార్డులు వచ్చిన వారందరినీ తప్పకుండా అభినందించాల్సిందే. కానీ కేంద్రప్రభుత్వం వారి వైఖరి మాత్రం బాగోలేదు…

  ఫణీంద్రా,

  బాపూగారికి ఇన్నాళ్ళూ ఎవార్డు ఇవ్వకపోవడం అనేది, ప్రభుత్వానికి సిగ్గుచేటు…

  శర్మగారూ,

  మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను…

  బోనగిరీ,

  ఈసమస్యలు గత రెండేళ్ళనుండీ వచ్చినవి. అంతకుపూర్వం ఏం రోగంట?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: