బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- స్థాన చలనం… ఊళ్ళోనేలెండి…


    ఈమధ్యన కొద్దిగా స్థానచలనం కావడం మూలాన, టపాలు వ్రాయడానికి తీరికలేకపోయింది.ఏదో ఆవిడెవరో వాళ్ళ ఎపార్టుమెంటులో మాకు కావలిసినన్ని రోజులుండవచ్చూ అన్న కారణం చే హాయిగా కాలక్షేపం చేసేస్తున్నాము ఇన్నాళ్ళూ. అబ్బాయికి, అమ్మాయికి ఎప్పుడు అవసరం వస్తూన్నా వెళ్ళి వాళ్ళ పిల్లలతో కాలక్షేపం చేసేస్తున్నాము. ఏదో గుట్టుగా వెళ్ళిపోతోంది.అలాటిది పదిహేను రోజులక్రితం ఓ “బాంబు” పేలేసింది ఆవిడ, వాళ్ళ ఆడబడుచెవరో వస్తున్నారుట, ఓ రెండు మూడు నెలలలో ఖాళీ చేయాలేమో అని కొద్దిగా “ఇషారా” చేసేశారు.ఆవిడెప్పుడో చెప్పేదాకా ఊరుకోడం ఎందుకూ అనుకుని, పిల్లల చెవిలో ఓ మాటేశాము. అబ్బాయి ఇలాటి ఛాన్సుకోసమే ఎదురుచూస్తూన్నట్టు, తనూ, కోడలూ ఓ “యుగళగీతం” పాడేశారు– ” దానికేముందీ, ఇక్కడ పెట్టిన సామాన్లన్నీ అమ్మేసేయడమూ, మనింటికి వచ్చేయడమూ ..” అనేశారు. ఏదో అమ్మేయడమే అయితే, రాజమండ్రీనుంచి వచ్చే టైములోనే ఆ పని చేసేవాళ్ళం కదా, ఏదో కొత్తగా కొనుక్కున్నామూ, మా ఇంట్లో అంతకుముందునుండీ ఉన్నవన్నీ, ఎప్పుడో పదేళ్ళ క్రితం కొన్నవీ, అంచేత ఈ కొత్త వస్తువులు కొద్దికాలమైనా enjoy చేయడానికి, విడిగా ఉంటామూ అనుకున్నాము కదా, ఇలాగే కానీయ్,ఏదో కాలూ చెయ్యీ సాగుతున్నంతకాలమూ ఇలాగే వెళ్ళిపోనీయ్, అని మా స్వంత ఇంటికి వెళ్ళే కార్యక్రమం, వద్దనుకున్నాము. అబ్బాయీ, కోడలూ ఈ proposal పెట్టడమూ, మేము తరువాతెప్పుడో చూద్దాములే అని చెప్పిన అరగంటకల్లా, అమ్మాయీ, అల్లుడూ వచ్చేశారు.

    ఈమధ్యన వాళ్ళు, ఓ 4BHK లోకి మారారు. ఇదివరకటి ఇల్లేమో, అద్దెకు ఇవ్వడం ఇష్టం లేదూ, అలాగని తాళం పెట్టుంచడమూ బావుండదూ, పాడైపోతుందని.మొదటినుండీ పాపం వాళ్ళకి ఓ ఆలోచనుండేది, వాళ్ళు కొత్తింటికి మారిపోవడమూ, వాళ్ళుంటున్న ఇంట్లోకేమో మమ్మల్ని మారమనడమూ, ఈమధ్యనే ఆ ఇంటికి paints అవీ కూడా చేయించుంచారు.మమ్మల్ని disturb చేయడం ఎందుకూ అనుకుని, మాతో అనలేదు. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఓ అవకాశం దొరికింది. మమ్మల్ని వచ్చి అక్కడ ఉండమని, చెప్పలేక చెప్పలేక చివరకి చెప్పేశారు.ఇంకేముందీ, మా ఇంటావిడకి “తంతే బూర్ల బుట్టలోకి” వెళ్ళినట్టయింది! రాజమండ్రీలో మూడు రూమ్ములూ, హాలూ లో ఉన్న సామానంతా, ఇక్కడ పూణె లో ఒకరూమ్మూ, హాల్లో సద్దేసింది. ఇప్పుడేమో, రెండు రూమ్ములూ హాలూనూ.

    మొత్తానికి నిన్న సాయంత్రానికి సామానంతా మార్చేసి, కొత్తింటికి వచ్చేశాము.ఇల్లు మారడం అంటే మాటలా? ఇదివరకు రాజమండ్రీనుంచి వచ్చేటప్పుడైతే తను, ఓ నెల ముందరే రావడంతో, నా దారిన నేను ప్యాకింగూ అవీ, ఏ గొడవా లేకుండా చేయించేశాను. ఇప్పుడలా ఎలా కుదురుతుందీ?అసలే మా ఇంటావిడ ఓ cleanliness freaక్కాయే వెళ్ళేదేమో అమ్మాయింటికాయె, తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి, మాటరాకూడదు.ఇల్లేమో చకా చెక్ లా ఉండాలి. ఇవన్నీ నా ప్రాణం మీదకొచ్చాయి.ఓ మేక్కొట్టకూడదంటుంది, tiles మాయకూడదంటుంది,రెండు బెడ్రూమ్ములోనూ AC లు, ఇంక ఇదివరకే మేము కొన్న AC ఎక్కడ పెట్టుకోనూ, నెత్తిమీద పెట్టుకోమంది. అలాగే, మరీ నా నెత్తి కాకుండా, cupboard మీద పెట్టేశాము!మొదటిరోజు నెట్ లేదూ, టీవీ లేదూ. మొత్తానికి ఈవేళ్టికి రెండూ వచ్చేశాయి, మీముందర హాజరీ వేయించేసికున్నానోఛ్ !

    ఈ స్థానచలనం ముఖ్యమైన మార్పేమిటంటే, ఈ నలభై ఏళ్ళ కాపరంలోనూ, బీరువాలో నాకంటూ ఒక ” అర” మాత్రమే ఉన్నదల్లా, ఈ ఇంటికి వచ్చేసరికి, ఓ separate wardrobe వచ్చేసింది! ఈ ముచ్చటెన్నాళ్ళో చూడాలి, ఎప్పుడో encroach చేసేస్తుందిలెండి మ ఇంటావిడ. ఇన్నాళ్ళూ, తలుపు వెనక్కాల కొక్కేనికి వేల్లాడతీసికునే నా బట్టలకి ఇన్నేళ్ళకి ఓ “ఉన్నత స్థానం” ఏర్పడింది! ” ఆకాశమంతా” సినిమాలో, ఆ రవి అంటాడు గుర్తుందా, ఇన్నాళ్ళూ హోటల్ బయటే ఉండేవాడినీ, ఇన్నాళ్ళకి “అమ్మ” దయవలన హొటల్ లోపలికి మొదటిసారిగా రాగలిగానూ, అలాగన్నమాట !

    ఇన్నాళ్ళూ మేముండే ఏరియా, ఏదో సంసారపక్షంగా ఉండే మాలాటివాళ్ళు. ఇప్పుడేమో అంతా posh. ఎక్కడ చూసినా ఎపార్టుమెంట్లూ అవీనూ, అంతా ఐటీ మయం. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోడమే ” పాపం” అనుకుంటారు. పక్కవాడెవడో తెలియదు, పోనిద్దురూ వాళ్ళింట్లోవాళ్ళైనా తెలుసు.కొంతవరకూ నయమే ! అక్కడ పదిరూపాయలుండే వస్తువు ముఫ్ఫై రూపాయలు. పని మనుష్యులు వాళ్ళని అదేదో maids అనాలిట, వాళ్ళకి వేలల్లో జీతాలూ, వాటికి సాయం weekly off లోటీ ! ఆడాళ్ళూ, మగాళ్ళూ తెల్లారేటప్పటికి ఓ కుక్కేసికుని వాకింగూ, ఏమిటో అంతా హడావిడి జీవితాలూ, మొత్తం సొసైటీకి, నేనూ, మా ఇంటావిడే ఏ పనీ లేకుండా ఉండేవాళ్ళము.

   ఈవేళ ఓ మిత్రులు ఈ క్రింది కార్టూన్ పంపారు. మీరూ ఆబొమ్మ మీద double click చేసి ఓ సారి ఆనందించండి.

Height of Technology

Advertisements

10 Responses

 1. మళ్ళీ ఇంటివారయారా!బాగుంది!! చెల్లాయిని అడిగేనని చెప్పండి.

  Like

 2. బాగున్నారా… ముందుగా మీకు, పిన్నిగారికి నమస్కారములు…. అంతా కుశలమే కదా…..

  ఇన్ని రోజులూ కనీసం కనుచూపుమేరలో అయినా కనబదలేదేంటా అనుకుంటున్నారా……

  కొన్ని విషయాల వల్ల కాస్త busy అయ్యాను……

  అలాగని మీ టపాలు చదవదం మానలేదు…….

  కుదిరినప్పుడల్లా ఈమెయిలు ఒపెన్ చెసి మీ టపాలు చదువుతూనే ఉన్నాను…..

  ఇంకా బోలెడు టపాలు unread emailsలో ఉన్నాయనుకోండి…….

  మొత్తానికి ఇల్లు మారారు అన్నమాట సంతోషం….

  Like

 3. విశ్రాంత జీవితం లో బదిలీలు !
  ఇప్పుడు మీ సొంత ఇంటికి వచ్చారన్న మాట
  మీ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నారా?

  Like

 4. శుభాకాంక్షలు

  Like

 5. శర్మగారూ,

  ఇల్లు మారాము.. అంతేకానీ మళ్ళీ ఇంటివాడిని కాదు….

  రెహమానూ,

  ఏమిటీ కినిగే స్టాల్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నావు.

  మాధవీ,

  చిరకాల దర్శనం… welcome back.

  డాక్టరుగారూ,

  సొంత ఇంటికి కాదండీ. అమ్మాయీ, అల్లుడూ ఇంకో ఇంటికి మారారు. మమ్మల్ని వాళ్ళింటికి మారమన్నారు.. అమ్మాయికీ, అబ్బాయికీ మధ్యలో సెటిలయ్యాము. Thanks..

  Like

  • చాలా కాలంగా తెలుగు సీమకి దూరంగా ఉన్నారు కదా! ఇందులో శ్లేష గమనించరులే అనుకున్నా! పట్టేసేరు. గురువుగారికి క్షమాపణలు.జిలేబీ గారన్నట్లు కామెంటు దారులంతా పాతవారేనా, కొత్తవారు లేరా, లేరా, లేరా 🙂

   Like

 6. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, కొత్త స్నేహితులు, కొత్త సంగతులు, కొత్త టపాలు అన్ని కొత్తవే నన్నమాట కొన్ని రోజులు…….దహా.

  Like

 7. అబ్బా,

  అన్నీ కొత్తవే అయినా ఇంకా ఈ ‘పాత’ కామెంటుదారులేనా? బులుసు,జిలేబి,కష్టే ఫలే! వదలరే మరి వీళ్ళు! అబ్బబ్బా …

  ఇంతకీ భమిడిపాటి ‘కొత్త ఇంటావిడ’ గారు ఈ కొత్త ప్రహసనం గురించి ఎప్పుడు టపా రాస్తారు చెప్మా?

  మూడు, ‘పోష్’ వాళ్ళంతా ‘సంసారపక్షులు’ కాదంటా రేమిటీ ఈ అయ్యవారు? ఇది నమ్మబులే అంటారా?

  చీర్స్
  జిలేబి.

  Like

 8. శర్మగారూ,

  మరీ అంతలా under estimate చేసేస్తే ఎలాగండి మాస్టారూ.. ఎంతైనా కోనసీమ వాడిని కదా !! ( ఇది నా మాటకాదు, మీ చెల్లెలుది !)…

  సుబ్రహ్మణ్యంగారూ,

  కొత్త స్నేహితులు తప్పించి, మిగిలినవన్నీ కొత్తవే. నేను టపాలో వ్రాసినట్టు, కొత్తవారితో మాట్టాడడమే “పాపం” అనుకుంటారు ఇక్కడ ! అయినా ఫరవాలేదులెండి, మా కాలక్షేపం మాకుంది…

  జిలేబీ,

  ఇంకా కొత్తింట్లో సద్దుకోడాలు పూర్తవలేదు, ఎప్పుడో మొదలెట్టేస్తుంది. “మూడు” గురించి, కొద్దిరోజుల్లో వాటిగురించీ ఓ టపా పెడతాను. అప్పుడే ఒప్పుకుంటారు మీరు “పోష్” వాళ్ళంతా “సంసారపక్షులో” కాదో !! ఇంక “పాత” కామెంటుదారుల గురించి Old is always Gold… ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: