బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సీతమ్మ వాకిట్లో… etc..etc…


    ఆంధ్రదేశంలోనే దిక్కు లేదు “మిథునం” సినిమా చూడ్డానికి. బయటి దేశాల్లో ఏమైనా డబ్బులొస్తాయని అక్కడకి కూడా పంపించారట. అంతేకానీ, మన దేశంలోనే పరాయి రాష్ట్రాల్లో కూడా, ఓ మంచి తెలుగు సినిమా చూస్తారేమో పోనీలే అని మాత్రం అనుకోలేదు. అవునులెండి ఎవరి commercial interests వారివీ.ఆ కారణాలవల్ల మాకు పూణే లో ఏదైనా “మంచి” సినిమా చూడడానికి నోచుకోలేదు. దానితో ఇంక next best option కి సెటిలయిపోతూంటాము. సినిమా పేరేదో చాలాకాలం తరువాత శుభ్రంగా ఉందీ అనుకుని ఈవేళ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సిణేమాకి వెళ్ళాము. మరీ మనరాష్ట్రంలోలా కాకుండా, మొదటి రోజు మొదటాటాకి టిక్కెట్లు దొరుకుతాయిలెండి,పైగా వర్కింగు డే ఒకటీ.కానీ ఈసారి చూసిందేమిటంటే, ఇదివరకటిలా కాకుండా, హాల్ నిండింది పన్నెండు గంటలాటక్కూడా ! పేద్ద కారణాలు లేవు, మహేష్ బాబున్నాడు కాబట్టి,టినేజర్స్ కూడా కనిపించారు.కానీ పాపం వాళ్ళు disappoint అయుంటారు. ఎందుకంటే అతని చేత ఒక్కసారీ చెయ్యెత్తించలేదు ! పైగా టైటిల్స్ లో “ఫైట్స్” ఫలానా అని కూడా వ్రాశారు. పాపం అవన్నీ ఏమైపోయాయో? చాలాకాలం తరువాత పెద్దపెద్ద స్టార్ల సినిమాలో “బ్రహ్మానందం” లేకపోవడం. That was the biggest surprise ! అతనుకూడా ఆ సినిమాలో ఉన్నాడని చదివినట్టు జ్ఞాపకం.ఇక్కడ చదివితే మీకే తెలుస్తుంది.

    ఇంక మిగిలినా విషయాలంటారా, అస్సలు ఆ సినిమా టైటిల్ అలా ఎందుకుపెట్టారో అర్ధం అవలేదు.కానీ చాలాకాలం తరువాత అచ్చతెలుగు పేరు మాత్రం చాలా బావుంది. దిక్కుమాలిన పేర్లతో విసిగెత్తిపోయాము.సినిమా మొత్తానికి సిరిమల్లె చెట్టు ఓ రెండు క్షణాలు చూపించారు. ఇంక “వాకిటి” అంటారా ఏదో ప్రకాష్ రాజ్ బయటనుండి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చే సందర్భంలో ఓసారి !

    సినిమా అంతా చూసేటప్పటికి తేలిందేమిటంటే, ఏ ఏ సీన్లుంచాలో, ఏవేవి తీసేయాలో తెలియక confusion లో అంట కత్తెర చేసేశారు. Highly amateurish job ! ఓ సీన్ కీ, ఇంకో సీన్ కీ సంబంధమే లేదు. ద్వారకా తిరుమలలో చూపిస్తూంటారు, సడెన్ గా రెండో సీన్ వీళ్ళింట్లో.ఓ అర్ధం పర్ధమూ లేకుండా. మీడియాలో వచ్చిన “వార్త” ల ప్రకారం ఆ సినిమా కథ ఇది ట. అవన్నీ ఎక్కడకు పోయాయో ఆ పరమాత్ముడికే ఎరుక !

    చెప్పానుగా ఏం చేయాలో తెలియక ఓ “అతుకుల బొంత” లా తయారుచేసి జనం మీదకి వదిలారు. వెంకటేష్, మహేష్ లు ఉన్నారుకదా, వాళ్ళ ఫ్యాన్లు చూడకేం చేస్తారూ, మన డబ్బులు వసూలైపోతాయీ అనే కానీ, ఏదో సినిమాకి ఓ మంచి టైటిలు పెట్టామూ, ఆ టైటిలుకైనా న్యాయం చేస్తే బావుంటుందేమో అనే ఆలోచనమాత్రం లేదు. మరి ఆ సినిమా నిర్మాతలమీద ఐటి దాడులు జరిగాయంటే జరగవూ మరీ? ఏ బ్రహ్మానందమో పంపించుంటాడు.

    ఇంక నటన అంటారా, ప్రకాష్ రాజ్, జయసుధ ” కొత్త బంగారు లోకం” లో నటనకి photocopy. రోహిణీ హత్తంగడీ, ఏదో
“సీతారామయ్యగారి మనవరాలు” టైపులో ఉంటుందేమో అనే అపోహతో ఒప్పుకున్నట్టుంది.మిగిలినవారిలో ఆ రావుగోపాలరావు గారి కొడుకు రోల్ బాగానే చేశాడు. కానీ వాళ్ళ నాన్నగారిలా చేయాలనుకోడం కొద్దిగా అత్యోత్సాహమే. కోట శ్రీనివాసరావుకి ముచ్చటగా మూడంటే మూడు సీన్లు. కొత్త హీరోయిన్ అంజలిట ( సీత పాత్రలో), ఆ అమ్మాయిది రాజోలు( కోనసీమ) అన్నారు, కానీ ఉచ్చారణలో ఎక్కడా గోదావరి టచ్ లేదు.ఇంక ఫొటోగ్రఫీ అంటారా, గోదావరీపరివాహక ప్రదేశాల్లో, ఓ కెమేరా పట్టుకుని, వెళ్తే ఎక్కడ చూసినా అందమైన దృశ్యాలే,ఇంతకంటే మంచిమంచి దృశ్యాలు ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తాయి.

    మహేష్ బాబుకి ఓ పదిమందిని చితక్కోడితేకానీ, చెయ్యూరుకోదు అలాటివాడి చేతులు కట్టేసి కూర్చోమంటే ఎలా కుదురుతుందీ? అప్పటికీ ప్రయత్నించాడు, అందుకే కాబోలు టైటిల్స్ లో “ఫైట్స్” అని పెట్టుంటారు. వెంకటేష్ పెద్దాడిగా ఏదో ఫరవాలేదు!

    రెండో హీరోయిన్- ఏదో రెండో హీరోకి ఎవరో ఒకరుండాలని పెట్టారు కానీ, ఉపయోగం తెలియలేదు. అలాగే పెద్దాడి పెళ్ళి చూడకలిగాము కానీ, రెండో వాడిదయ్యిందో లేదో పాపం ! ఇంక సంగీతం- ఈమధ్యన వస్తూన్న సినిమాల పాటల “మూస” లోనే ఉన్నాయి. పెద్దగా చెప్పుకోవలిసినంత గొప్పగా లేవు. కానీ for a change పాటలలోని సాహిత్యం మాత్రం అర్ధం అయింది.మరీ అరుపులూ, కేకలూ కాకుండా.

    ఆంధ్రదేశ వాతావరణం మాత్రం సంపూర్ణంగా ఆస్వాదించాము, audience ధర్మమా అని, మహేష్, వెంకటేష్ ల entry అవగానే వీళ్ళు వేసే ఈలలూ, అరుపులూ ధర్మమా అని !
అదండీ విషయం.

18 Responses

 1. అబ్బా,

  ఈ రీ-టైర్డ్ సీనియర్ బ్లాగర్లు చిత్రం చూసి ఊరు కోరండీ మరీ!

  ఇట్లా వెతికి వెతికి మా మహేష్ బాబు మీద బాణాలు విసురుతారుస్మీ, మిధునం మీద దాడి చేస్తారు సుమీ

  చీర్స్
  జిలేబి.

  Like

 2. రామా కృష్ణా అనుకునే వయసులో అంజలీ సమంతా అని సినిమాకి వెళితే అలాగే ఉంటుంది మరి……..దహా.

  Like

  • 🙂 రామా కృష్ణా అనుకోకుండా.. వెంకటేశా! మహేశా! అనుకున్నట్టున్నారు. 🙂

   మీ రివ్యూ నాకు బాగా నచ్చింది 🙂

   Like

 3. జిలేబీ,

  మహేష్ బాబు మీద బాణాలు ఎక్కడ విసిరానండీ? ఇంక మిథునం మీద దాడా? అంత మంచి సినిమా చూడ్డానికి నోచుకోలేదే అని బాధ పడ్డాము…

  సుబ్రహ్మణ్యం గారూ,

  అచ్చా ! ఆ రెండో అమ్మాయి పేరు సమంతా నా, చూశారా మీకే ఎక్కువ తెలుసును. ఇప్పుడు తెలిసిందా biodata లు ఎవరికి ఎక్కువ తెలుసునో? ఛాన్సు దొరికింది కదా అని కోప్పడేయడమే?

  Like

 4. ఇంతకీ మమ్మల్ని సినిమా చూడమంటారా? వద్దా? చెప్పండి ముందు.

  Like

 5. మురళీ మోహన్ గారూ,

  ప్రస్తుతం తెలుగులో వస్తూన్న చాలా సినిమాలకంటె ( మిథునం మేము చూడలేదు), బాగానే ఉంది. సరదాగా ఏదైనా సినిమా చూడాలీ, కుటుంబ సభ్యులతో అని అనుకుంటే, చూడదగ్గ సినిమాయే. కానీ ఆశించినంత….మాత్రం లేదు…

  Like

 6. ఏ బ్రహ్మానందమో పంపించుంటాడు.
  Nijamgaa naa? 🙂

  Achcha telugu blog!

  Chandu

  Like

 7. కృష్ణప్రియా,,

  ధన్యవాదాలు… అదీ అలా అడగండి బులుసు వారిని. …

  చందూ,

  ఏదో అలా అనిపించింది…

  Like

 8. ఓహో అలాగా, అంజలీ అంజలీ అనే పాడుకుంటూ వెళ్ళారా ? మీరు ఏక వీరులు అనుకోలేదు. నా లాగా బహు చిత్తు లేమో అనుకున్నాను.
  మిమ్మల్ని కోప్పడడమా ఎంత మాట. మీ చేత తిట్టించుకోవడం సరదా నాకు….దహా.

  @కృష్ణప్రియ గారు.
  కింద పడినా పై చేయి మాదే…………దహా.

  Like

 9. నాకు సినిమా ఏ మో బాగా నచ్చింది.
  ముచ్చటగా కుటుంబ సమేతంగా చూడ తగ్గ
  స్వచ్చమైన తెలుగు చలనచిత్రం అనిపించింది
  చూడని వారు తప్పక నేడే చూడండి.

  Like

 10. ఇంతకీ రేలంగి తు గో జి నా / ప గో జి నా ?

  Like

 11. స్వచ్చమైన తెలుగు చలనచిత్రం అనిపించింది

  Like

 12. సుబ్రహ్మణ్యంగారూ,

  “మిమ్మల్ని కోప్పడడమా ఎంత మాట. మీ చేత తిట్టించుకోవడం సరదా నాకు..” పైగా ఇదోటా? తిడుతున్నది ఎవరమ్మా?

  డాక్టరుగారూ,

  ఏడాదంతా చెత్త సినిమాలు చూసిన తరువాత, for a change ఇలాటి సినిమా చూస్తే refreshing గానే ఉంటుంది. ఇంక “రేలంగి” అంటారా, పగోజి లో ఉంది.

  సోమశేఖర్ గారూ,

  ఎందుకనిపించదూ మరి? పేరులో స్వఛ్ఛత ఉంది. సంభాషణల్లో స్వఛ్ఛత ఉంది.సినీమాలో ఎక్కడా foreign locales లేకపోవడంతో స్వఛ్ఛత కనిపించింది. పాటల్లో చాలాకాలం తరువాత వాటిలోని సాహిత్యం అర్ధమయేటప్పటికి ఇంకా స్వఛ్ఛంగా అనిపించింది.

  Like

 13. ప గో జి సినిమా, తూ గో జీ వాళ్ళకు నచ్చినా
  నచ్చినట్లు ఒప్పుకుంటే బాగోదు మరీ !!

  Like

 14. అయ్యో…నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది..అ… అంటే అమలాపురం లాంటి పాటలూ లేవు…కదూ…ప్చ్…చాలా నిరాశ పడ్డారు…నిర్మాతలు బుద్ది తెచ్చుకుని…ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో లాంటి…. డైలాగులతో సినిమా తీయాలని ఆశిద్దాం…ఇలాంటి చెత్త జనం మీదకి వదలకుండా…

  Like

 15. మాధవీ,

  థాంక్స్..

  డాక్టరుగారూ,

  మళ్ళీ ఈ “మెలిక” ఏమిటీ? నన్నేదో ఆడిపోసుకుంటారు కానీ, ఏదో ఆ తారల అభిమానులు తప్పించి, మిగిలిన బ్లాగర్లు ఏమి వ్రాశారో చూశారా? ముక్తకంఠంతో మొత్తుకుంటున్నారు బ్లాగుల్లోనూ, ప్లస్సు లోనూ, ఫేస్ బుక్ లోనూ ఈ సినిమా గురించి, నేనేమో మొదటిరోజు మొదటాట చూసీచూడగానే చెప్పాను…

  సన్నాసిరావుగారూ,

  మీకు నచ్చినట్టా లేదా?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: