బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఇంగ్లీషు చానెళ్ళనిండా రోజంతా, ఆ RSS ఆయనా, ఇంకో మధ్యప్రదేశ్ మంత్రి ఎవరోట ఆయనా ఢిల్లీ సంఘటనమీద వ్యక్తపరచిన అభిప్రాయాలమీద హోరెత్తించేశారు.మొన్నెప్పుడో తరూరుడు, అదో ముచ్చటా అతనికి, Twitter లో ఏవేవో పోస్టుచేస్తూంటాడు, చివాట్లు తిన్నాడు అధిష్టానం చేత.అంతకుముందు ప్రెశిడెంటు గారి కొడుకు కూడా నోరుజారాడు.ఎందుకొచ్చిన గొడవ చెప్పండి, అందరూ చెప్పేదే ఒప్పేసికుంటే హాయిగా ఉంటుంది కదా.

    ఏమి చెప్పినా ప్రతీవారికీ కోపమే. హాత్తెరీ మేము ఎలా డ్రెస్ వేసికోవాలో చెప్పడానికి నువ్వెవరూ అంటారు కొందరు.మాకు నీతులు చెప్పేబదులు, మొగాళ్ళకి చెప్పొచ్చుగా అంటారు.ఈలోపులో పేపర్లనిండా ఎక్కడ చూసినా అత్యాచార కేసులే. బిజినెస్ కీ, క్రీడలకీ విడిగా పేజీలున్నట్టు, ఆ సంఘటన జరిగినప్పటినుంచీ పేపర్ల వాళ్లు కొత్తగా ఇదోటి మొదలెట్టారు ఈ మధ్యన. ఆ పేజీ తెరిచామంటే ఇవే వార్తలు.

    సినిమాలవాళ్ళనంటే వాళ్ళకి కోపం.వారపత్రికలవాళ్ళనంటే వాళ్ళకి కోపం. ప్రతీదానికీ educate చేస్తున్నామని ఓ వంకోటి.ఉదాహరణకి “స్వాతి” వారపత్రికలో “సెక్స్ & సైకాలజీ” అనే శీర్షిక అసలు అవసరమంటారా? అంతర్జాలంలో అన్ని వివరాలూ తెలిసే ఈ రొజుల్లో so called కుటుంబ పత్రికల్లో ప్రత్యేకంగా రెండు పేజీలు తగలేయడంలో ఆ సంపాదుకుల విజ్ఞత ఏమిటో ఆయనకే తెలియాలి.అలా ఏమైనా వ్రాస్తే మళ్ళీ అదో తప్పూ. ఇంక మన ఇంగ్లీషు వారపత్రికలైతే(Week, Onlooker,India Today) ఏడాది లోనూ అవేవో “సర్వే” ల పేరెట్టి కావలిసినంత ” మసాళా” పెడుతూంటారు. ముందుగా ఈ పత్రికలవాళ్లు బాగుపడితే, సమాజాన్ని ఉధ్ధరించినంత పుణ్యం.

    ఓవైపున ఇంత గొడవ జరుగుతూంటే ఆ వొవైసీయో ఎవడో, నోటికొచ్చినట్టు పేలాడు.ఇన్నాళ్ళూ కాంగ్రెసువాళ్ళూ, వీడూ “భాయీ భాయీ” అనుకున్నట్టున్నారు, ఆ చార్ మీనార్ గొడవ జరిగినప్పటినుంచీ, పేట్రేగిపోయాడు.ఒక్కడంటే ఒక్కడు ప్రభుత్వం తరపునుంచి ఈ ప్రసంగాలు condemn చేసినవాడు కనిపించలేదు. మళ్ళీ రేపెప్పుడో 2014 లో ఏ అవసరం వస్తుందో ఏమిటో? ఎందుకొచ్చిన గొడవా? ప్రభుత్వం అనే ఏమిటీ, ఏ రాజకీయపార్టీవాడూ ( బిజేపీ తప్ప) అసలు స్పందించేలేదు.కారణాలకోసం ఎక్కడా వెదుక్కోనఖ్ఖర్లేదు.అందరికీ తెలిసినవే.

    ఉండబట్టలేక “భక్తి” టీవీ చౌదరి గారు ఈవేళ ఓ కార్య్క్రమం పెట్టి, తను చేయగలిగినదేదో చేశారు.ఓ పాతికమందిని ఆహ్వానించి ఓవైసీ మీద ఎలాటి చర్యలు తీసికోవాలో అవీ, ఎవరికి తోచినవి వారు వ్యక్తపరిచారు. అసలు ఆ గుజరాత్ ముఖ్యమంత్రి గారిని అడిగితే, చడీచప్పుడూ కాకుండా ఓవైసీ సంగతి ఏంచేయాలో చెప్పేసేవారు.ఇదివరకటి రోజుల్లో శివసేన ఠాక్రేని ఇలాటివేవో మాట్టాడినందుకే ఆరేళ్ళు defranchise చేశారు కదా, మరి ఇప్పుడేం వచ్చిందిట? మధ్యలో పాకిస్టాన్ క్రికెట్ మియాన్దాద్ గొడవోటీ. అతను ఆదివారంనాడు జరిగే ODI చూద్దామనుకున్నాడుట, ఊరికే అనుకుంటే కాదు కదా, అవేవో వీసాలూ సింగినాదాలూ కావాలిట కదా, ఆ వీసా ఏదో మన మ.రా.శ్రీ. భారత ప్రభుత్వం వారు ఇచ్చేశారాయె. ఇంతలో అందరికీ గుర్తొచ్చేసింది, ఈ మియాన్దాదూ, దావూద్ ఇబ్రహీమ్మూ వియ్యంకుళ్ళని. ఈ మియాన్దాద్ ఇండియా వచ్చాడంటే, వియ్యంకుడి యోగక్షేమాలూ, ఎక్కడున్నాడో అవన్నీ అడుగుతారేమో, ఎందుకొచ్చిన గొడవా అనేసికుని, ప్రయాణం కాస్తా cancel చేసేసికున్నాడు.

    ఏదో చేసేసికున్నాడు కదా వదిలేయొచ్చుగా, అబ్బే మన మీడియావాళ్ళా వదిలేసేదీ,పొద్దుణ్ణించీ అదే గొడవ.ఎందుకు రానన్నాడూ, అసలు వీసా ఎందుకిచ్చారూ, తనే రావొద్దనుకున్నాడా ఎవరివైనా చెప్పుడు మాటలు విన్నాడా, అసలు వస్తే ప్రభుత్వంవారు ఏం చేద్దామనుకున్నారూ అన్నీ సందేహాలే. అడక్క అడక్క మన కేంద్ర హోం శాఖామంత్రి గారిని అడిగారు, ఆయనేమో, అర్రే అలాగా నాకసలు తెలియనే తెలియదూ, అడిగి చెప్తానూ అంటాడాయనా.మీకు తెలియకుండా అసలు వీసా ఎలా ఇస్తారూ అని నిలబెట్టి అడిగేసరికి, అవన్నీ చూసుకునేవి నేను కాదూ, అని as usual ఇంకోరిమీద పెట్టేశాడు !

    పాకిస్తాన్ ని ఏమంటే ఏం గొడవో అనుకుంటారు, మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు. అదే పంథాలో వెళ్తారు మన ధోనీ గారు- నెగ్గితే ఏమనుకుంటారో ఏమో, ఓడిపోతే ఏ గొడవా ఉండదూ,అయినా నెగ్గడమంటే కొత్తకానీ, ఓడిపోవడం ” బాయే హాత్ కా ఖేల్” just like that.
అదండీ విషయం వెళ్ళిపోతున్నాయి రోజులూ…

    అర్రే మర్చేపోయాను- బ్రహ్మశ్రీ చాగంటి వారు, ప్రవచనాలు చెప్పడం లోనే దిట్ట అనుకునేవాడిని ఇన్నాళ్ళూ, చెప్పిందేదో ఆచరించడంలోనూ అదే ఏకాగ్రత, భక్తీ, శ్రధ్ధా అని ఈవేళ కాకినాడనుండి జరిగిన ప్రత్యక్షప్రసారం లో ఆయన నిర్వహించిన శ్రీవెంకటేశ్వరుని అభిషేకం చూసి తెలిసింది.

Advertisements

6 Responses

 1. Guruagaaru meeru pette videolu chala bavunnayi.

  Like

 2. ఇంత కీ అక్బరుద్దీన్ ఏమన్నారో ఎవరికీ తెలియదు.
  కాబట్టి మనం పూర్తిగా మన కు కావలిసినట్లుగా ఊ హించుకొన వచ్చు.
  మతకలహాలు పెంచుకొన వచ్చు.
  దృశ్య పత్రికల వాళ్ళు ఇలాంటివి మాటిమాటికి ప్రసారించి
  వారి వంతు సమాజ సేవ చేస్తారు.

  Like

 3. అక్బరుద్దీన్ ఏమన్నాడో యూట్యూబ్ లో గంట వీడియో ఉంది. విని తరించవచ్చు. మనం సొంతంగా ఊహించుకోనక్కర్లేకుండా… అక్బర్ చెప్పిన మాటల్ని ఫాలో ఐపోవచ్చు. సమాజాన్ని ఆ రకంగా ఉద్ధరించవచ్చు.

  Like

 4. రాముడు గారూ,

  ధన్యవాదాలు. ఏదో నాదగ్గర ఉన్న digital camera తో నాకు నచ్చినవి, భద్రపరుస్తూంటాను. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది…

  డాక్టరుగారూ,

  మీరు పెట్టిన వ్యాఖ్య తో ఏకీభవించలేకపోతున్నాను. మీడియా లో ఏదో చూపించేస్తున్నారనే కాదు, youtube లో ఓ నొక్కు నొక్కితే కావలిసినన్ని కనిపిస్తాయి.

  ఫణీన్ద్ర గారూ,

  మీరు చెప్పినదానితో , I totally agree…

  Like

 5. పై విషయాలన్నీ ఏమో కానీండీ…. చాగంటి గారి అభిషేకం వీడియో మటుకు బాగుంది…

  Like

 6. మాధవీ,

  మీకు నచ్చినందుకు సంతోషము.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: