బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సంవత్సరానికి మొదటి రోజు…


   ఈమధ్యన జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా నిర్వహింపబడ్డాయని మీడియా ద్వారా తెలిసికొని సంతోషించాను. నాకు ఒక విషయం అర్ధం కాలేదు- తెలుగు ప్రచారానికి మన మీడియా కూడా తమవంతు ప్రచారం చేయాలికదా.అంటే తెలుగులో ప్రచురిస్తున్న వార్తా పత్రికలూ, వారపత్రికలూ, మాసపత్రికలూ అందరూ చదివే (కొనుక్కుని) వీలు కల్పించడం ముఖ్యం. అప్పుడెప్పుడో వ్రాసినట్టు “ఆంధ్రుల అభిమాన” వారపత్రిక స్వాతి అప్పటిదాకా 10 రూపాయలున్నది కాస్తా 15 రూపాయలు చేసేశాడు. “గుడ్డిలో మెల్ల” లాగ ఈ వారం ఓ తెలుగు క్యాలెండరు ఒకటిచ్చాడు.పోన్లెద్దూ “పైసా వసూల్” అనుకున్నాను. స్వాతి మాసపత్రిక 10 రూపాయలున్నది కాస్తా 20 చేసేయడం మాత్రం మరీ అన్యాయం.ఆ కూతురూ, అల్లుడితోనూ గొడవపడి, ఆ నష్టాన్నంతా మనమీద రుద్దేయడం మాత్రం బాగోలేదు. ఓ క్యాలెండరోటి so called “ఉచితంగా” ఇచ్చారు !

    ఇంక ప్రతీ సంవత్సరమూ జనవరి ఒకటో తారీకున దినపత్రికతో “ఉచితం” గా ఇస్తూన్న తెలుగు క్యాలెండరు విషయానికొస్తే, ” సాక్షి’వాళ్ళు బెయిలు రాలేదనే “విచారంతో” కాబోసు,అసలు ఆ మాటే ఎత్తలేదు. లేదా ఆ “సంతకాల సేకరణ” కోసం, కాగితాలు ఏమైనా తక్కువయి వాటన్నిటినీ అటువైపు divert చేసుండొచ్చు. ఇంక రామోజీ గారి “ఈనాడు”, ప్రతీ ఏడాదీ ఉచితంగా ఇస్తున్న క్యాలెండరుతో సహా ఈవేళ్టి పేపరు ఖరీదు అక్షరాలా 10 రూపాయలుట.ఈయనక్కూడా కోర్టు ఖర్చులు ఎక్కువై, ఇలా వసూలు చేస్తున్నాడేమో? ఏదో ఉచితంగా ఇస్తున్నారని కానీ, ఈమాత్రం క్యాలెండర్లే దొరకవా? పైగా ఇన్నిన్ని క్యాలెండర్లుంటే ఇంకో గొడవ, ఒక్కోదానిలో తిథి నక్షత్రాలు వ్రాయడంలో తేడాలోటి. ఈమధ్యన చూడలేదూ, వైకుంఠ ఏకాదశి ఫలానా రోజని ఒకళ్ళూ, కాదూ అని ఇంకొకళ్ళూ కొట్టుకున్నారు.చెప్పొచ్చేదేమిటంటే మన తెలుగు న్యూసుపేపర్ల దరిద్రం ఇలా ఉంది.

    ఈవేళ కొత్తసంవత్సరపు మొదటి రోజుకదా, బయటికెళ్ళేటప్పుడు ఏదో ఫలానాది జరిగితే రోజంతా ( వీలైతే సంవత్సరమంతా) చాలా ఉత్సాహంగా ఉంటుందీ అని.నేను ఈవేళ బయలుదేరేసరికే పదిన్నర అయింది.తెలుగు పేపరు దొరకదేమో, దొరికితే బావుండునూ అని బయలుదేరాను. తీరా నేను ప్రతీ రోజూ పేపరు తీసికునే వాడు, రెండు పేపర్లూ అయిపోయాయన్నాడు. అయ్యో అని మాత్రం అనుకున్నాను. ఏదో అనుకున్నాను కదా, పేపర్లు రెండూ లేవనేసరికి మాత్రం చాలా disappoint అయ్యాను. ఈవేళ సాయంత్రానికి మా అబ్బాయీ,కోడలూ, నవ్య, అగస్థ్య సింగపూర్ నుంచి తిరిగొస్తున్నారు. వాళ్ళొచ్చేసరికి పాలూ, కూరలూ పెట్టుంచుదామూ, దానితోపాటే మంచినీళ్ళు కూడా పట్టేసుంచుదామూ అనుకుని మా ఇంటికెళ్ళాను. ఈ వారంరోజులకీ మా అబ్బాయి ఇంకో పని కూడా అప్పచెప్పాడులెండి. వాళ్ళు పెంచుతున్న పువ్వుల మొక్కలకి నీళ్ళు పోయడం. ఈ వారంరోజులూ చేస్తూన్న పని అదోటి. ఈవేళ నీళ్ళు పోద్దామని బాల్కనీ లోకి వెళ్ళేసరికి కనిపించిన 112013 004 ఈ దృశ్యం తో మూడ్ అంతా బాగైపోయింది.

    అప్పుడెప్పుడో మన క్రికెట్ టీము టెస్టుల్లో “మొదటి ” స్థానం సంపాదించిందిట. దాని ఘనత అంతా ఆ ధోనీకి ఇచ్చారు, నిజానికి అంతకుముందునుంచీ నాయకత్వం వహించినవాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. ఆహా ధోనీ.. ఓహో ధోనీ.. అంటూ ఆకాశానికెత్తేశారు.అలాగ ఆ గులాబి మొక్క నాటింది అబ్బాయీ కోడలూనూ, ప్రతీరోజూ నీళ్లు పోస్తున్నది నవ్యా, అగస్థ్యానూ, తీరా పువ్వు పూసింది నేను వారంరోజులు క్రమం తప్పకుండా నీళ్ళు పోసినందుకే అంటే ఎవరైనా నమ్మేమాటేనా? ఏమిటో ఇలాగే ఉంటాయి . అబ్బాయికి మెయిల్ పెట్టేశాను (ఫొటోతో సహా). ఇలాగే ఉంటాయి- నోరున్నవాడిదే రాజ్యం.

    ఈ పన్లన్నీ పూర్తిచేసికుని, మేముండే ఇంటికి వెళ్దామని, దారిలో బజారువైపు వెళ్తే అక్కడ, సాక్షి పేపరూ ఉంది, ఈనాడు పేపరూ ఉంది. అయినా సరే రెండో పేరాలో చెప్పిన సదరు కారణాలవలన కొనలేదు. అదేదో నేనొక్కణ్ణీ కొనకపోతే ఆ పత్రిక యాజమాన్యాలు నష్టపోతారని కాదు, as a token protest,అదేదో మీఅందరితోనూ చెప్పుకుంటే కడుపుబ్బరం తగ్గుతుందని!ఎక్కడైనా ఏదైనా జరక్కూడనది జరుగుతే అవేవో “నల్ల బ్యాడ్జీలు ” పెట్టుకోరూ, వీళ్ళు పెట్టుకుంటే ఎవడికిట, అలాగే ఇదీనూ..

    అవసరం వచ్చినప్పుడు మన మీడియావాళ్ళు కూడా ఎంత క్రమశిక్షణతో ప్రవర్తించగలరో నిరూపించుకున్నారు. ఆ మధ్యన ఢిల్లీ లో అత్యాచారం చేయబడి మరణించిన అమ్మాయి గురించి ” వివరాలు” దేంట్లోనూ వివరించకుండా ఓపిక పట్టారు. అవేవో రెండు దిక్కుమాలిన న్యూసు పేపర్లవాళ్ళు ప్రచురించగా, వాళ్ళమీద కేసు పెట్టారు ప్రభుత్వం వారు. ప్రతీ చోటా rotten apples ఉంటూనే ఉంటాయనుకోండి. చెప్పేదేమిటంటే, మామూలుగా ఏ చిన్న సంఘటన జరిగినా, చిలవలూ పలవలూ చేసేసి ప్రజలని ఉద్రిక్త పరిచే మీడియా వారి ఈ restraint మాత్రం చాలా note worthy..

    అన్ని పనులూ చూసుకుని ఇంటికొచ్చేసరికి శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్ లో బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారితో నిర్వహించిన ఓ కార్యక్రమం చూశాను. ఫొటోగ్రఫీ అద్భుతం. కొద్దిగా పెట్టాను ఇక్కడ చూడండి.

    తణికెళ్ళ భరణి గారి మిథునం చూసే అదృష్టం ఇంకా మాకు కలగలేదు. మా ఊళ్ళో “దిక్కుమాలిన” సినిమాలకే పెద్దపీటాయే, ఏం చేస్తాము? ఏదో బ్లాగుల్లో రివ్యూలు చదివి ఆనందిస్తున్నాము. ఈ సందర్భం లో మా మిత్రులు ఒకరు, “మిథునం” గురించి తన అభిప్రాయం తెలియచేస్తూ ఇలా “శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారికి నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు
కిందటి వారం మిధునం సినిమా చూశాను
ఇంతవరకు తెలుగు సినిమా అంటే సిగ్గుతో తల దించుకొవల్సిన పరిస్తితి ఉండేది
ఇప్పుడు గర్వంగా మనమందరం తల ఎత్తుకు తిరగవచ్చు మిధునం సినిమా చూశాక

గబ్బిట కృష్ణ మోహన్ ” అన్నారు.ఇదిచాలదూ, ఇలాటి సినిమాల ధర్మాన్నైనా మన తెలుగువారూ, తెలుగుభాషా గర్వంగా నాలుక్కాలాలపాటు బతకడానికీ?

3 Responses

 1. ఉతికేశారు సరే మరి….

  Like

 2. కొంచం పెద్ద ఖతి ని వాడితే మంచిగ ఉంటుదండి… అక్షరాలు అలుక్కుపోయినట్టు కనిపిస్తోంది…

  Like

 3. శర్మగారూ,

  ఏదో నాకు తోచింది వ్రాసేశాను…

  రఘునందన్ గారూ,

  మూడేళ్ళనుండీ ఇదే పధ్ధతిలో వ్రాస్తున్నానండి. అయినా మీ సూచన ప్రకారం “ఖతి” ప్రమాణం పెంచి వ్రాసి చూస్తాను. నాకు బావుందనిపిస్తే కొనసాగిస్తాను. మీ సూచనకి ధన్యవాదాలు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: