బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో ఏడాది వెళ్ళిపోతోందట…so what?


    ఇంక కొద్ది గంటల్లో 2012 వెళ్ళిపోయి, 2013 వస్తుందట. అయితే ఏమిటిట? ఒకానొకప్పుడు, కొత్త సంవత్సరం వస్తోందంటే జరిగే హడావిడి గురించి క్రిందటి సంవత్సరం ఒక టపా వ్రాశాను.అప్పటికీ ఇప్పటికీ ఏమీ పెద్ద తేడా ఏమీ లేదు.ఒక విషయం ఏమిటంటే, అప్పుడు 2012 లో ఏవేవో జరుగుతాయేమో అనే ఆశన్నా ఉండేది. కానీ అలాటివేవో జరుగుతాయేమో అన్న ఆశ పెట్టుకోడం ఉఠ్ఠి బుఱ్ఱతక్కువ పనీ అని మాత్రం తేలింది.

    ప్రతీవారికీ కొత్తసంవత్సరం వచ్చిందంటే అవేవో New Year Resolutions ట, అలాటివి చేసేసికోడం ఓ పెద్ద సరదా. ఎందుకు చెప్పండి, అలాటివాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రొద్దుటే బయటకెళ్ళినవాడు లక్షణంగా కొంపకు చేరుతాడో లేదో తెలియని పరిస్థితాయే.Everything is unpredictable.ఈ మాత్రం దానికి రిజల్యూషన్లూ అవీ ఎందుకూ? పోనీ ఇదివరకటిలాగ ఏ గ్రీటింగు కార్డైనా కొందామనుకున్నా, ఆ గ్రీటింగ్ కార్డులు అమ్మే Archies, Hallmark వాళ్ళ దుకాణాలే కనిపించడం లేదాయె. ఎక్కడ చూసినా SMS లూ, e-greetings. కొద్దిరోజులక్రితం వరకూ డిసెంబరు 31 వచ్చిందంటే చాలు, టివీ ల్లో అద్భుతమైన కార్యక్రమాలు రాత్రి పన్నెండింటిదాకా. ఇప్పుడో ఆ కార్యక్రమాలంటేనే వెగటుపుట్టుకొస్తోంది. దిక్కుమాలిన రికార్డింగు డ్యాన్సుల్లోకి వెళ్ళిపోయాయి.

    గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఓ కార్యక్రమం ఉండేది. ఇప్పుడు గత సంవత్సరంలో జరిగిన వాటిని గుర్తుకుతెచ్చుకుందామన్నా ఉండేవి ఏమిటిట, స్త్రీల మీద అత్యాచారాలూ, మర్డర్లూ, కిడ్న్యాపింగులూ, పార్లమెంటులో అల్లర్లూ, తుఫానులూ ఇవే కదా? మధ్యలో లంచగొండితనం మీద దీక్షలూ, ధర్నాలూనూ. పోనీ మనదేశంలో చట్టాలు చేయాల్సినవారు ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అదీ లేదూ. ఏదో కారణంతో పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ అల్లర్లే.

    ఏదైనా “ప్రగతి” సాధించామా అంటే,అది Scams విషయంలో . ఎవరెవరినో జైళ్ళలో పెట్టారు. వాళ్ళు కూడా ఏ అరడజనుమందో తప్పించి మిగిలినవారందరూ హాయిగా బెయిలు మీద బయట తిరుగుతున్నవారే. ఆ మిగిలినవాళ్ళూ తొందరలో బయటకొచ్చేస్తారు. మనం మాత్రం Face Book, Twitter, Google+ ల్లో గ్రూపులూ, మెమొరాండాల్లమీద సంతకాలు సేకరించే హడావిడిలో ఉంటాము. ఈమధ్యన “సంతకాల సేకరణ” ఓ ఫ్యాషనైపోయింది. ప్రతీవాడూ సంతకాలు సేకరించేవాడే. వాటితో ఏం చేస్తారో మాత్రం తెలియదు.

    ఓ సంవత్సరం వెళ్ళి ఇంకో సంవత్సరం వచ్చిందీ అంటే జరిగేదేమిటయ్యా అంటే, మన వయస్సు ఇంకో సంవత్సరం పెరిగినట్టు, అంతకంటే జరిగేదేమీ లేదు.

    ఈమధ్యన నెట్ లో ఓ short film చూశాను. సరదాగా మీరూ చూడండి.

WISH YOU ALL A HAPPY 2013.

Advertisements

6 Responses

 1. Facebooking ఆసక్తిలేదని చెప్పి ఉద్యోగం నిరాకరించడం మింగుడుపడలేదుగానీ, short film బాగుందండీ.

  Like

 2. >>గ్రూపులూ, మెమొరాండాల్లమీద సంతకాలు సేకరించే హడావిడిలో ఉంటాము. ఈమధ్యన “సంతకాల సేకరణ” ఓ ఫ్యాషనైపోయింది.>.
  నాకూ అర్ధం కాదండి ఇది.

  Like

 3. అబ్బా, మరీ ఇంత నిరశాపరులై పోతే ఎట్లా ఫణి బాబు గారు. మీరే ఇట్లా అంటే, ఇక రాబోయే తరం ఏమై పోవాలి మరి?

  నూతన సంవత్సర ష్, భా(రీ) కాంక్రీటు తో !

  జీరర్
  జిలేబి.

  Like

 4. కాసేపు ఆ గోల మరిచిపోదాం.
  నూతన వత్సర శుభకామనలు

  Like

 5. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Like

 6. Indian Minerva,

  నేను పెట్టిన లింకెక్కడైతే చూశారో అక్కడ ఇంకా కొన్ని short films ఉన్నాయి, బావున్నాయి కూడానూ. మనకు ఇలాటి అవకాశం కలగడానికి యూ ట్యూబ్బే దిక్కు !

  జ్యోతిర్మయీ,

  పోన్లెండి నాకొక్కడికే అర్ధం అవలేదనుకుని ఇన్నాళ్ళూ ఎవరితోనూ చెప్పుకోలేదు కూడానూ. నాలాటివారు ఇంకా ఉన్నందుకు సంతోషంగా ఉంది.

  జిలేబీ,

  నిరాశ అని కాదు కానీ, ఏమిటో మరీ అంత ఉత్సాహంగా కూడా లేదు. దానికి సాయం నిన్న రాత్రి తెలుగు చానెళ్ళలో వచ్చిన కొన్ని కార్యక్రమాలు ఖర్మకాలి కొద్దిగా చూడవలసొచ్చింది, while browsing. తెల్లారేదాకా మళ్ళీ టివీ రిమోట్ ముట్టుకోలేదు. కట్టి పారేశాము.

  శర్మగారూ,

  ధన్యవాదాలండి. మీక్కూడా మా కుటుంబం నుంచి శుభాకాంక్షలు.

  కిశోర్,

  ధన్యవాదాలు.. మానుంచి కూడా అందుకోండి. జనవరి లో జరిగే “ప్రభల తీర్థం” గురించి కూడా మీ దగ్గరనుంచి ఒక టపా ఆశిస్తున్నాను. నిరాశ పరచకండి. ఇంతదూరంలో ఉన్న మాలాటివారికి మీ టపాలే ఉపశమనం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: