బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– inhibitions….1


    అసలు ఇలాటి శీర్షికతో టపా వ్రాస్తాననగానే మా ఇంటావిడ, “ఎందుకండీ లేనిపోనివీ, ఏదో వ్రాస్తున్నారూ, మీమీద అభిమానం ఉన్నవాళ్ళు చదువుతూంటారూ, ఇప్పుడు ఇలాటివి వ్రాయడం అంత అవసరమంటారా, బావుండదేమో…” తో మొదలయింది, ఈ inhibitions. తో ఎలా పెరిగిపెద్దయామో చెప్పడానికి.ప్రతీదానికీ ఏదో ఒకటనేవారు. పెద్దాళ్ళు అదీ “అమ్మ” లు కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఆటలకి పంపేసేవారు. వాళ్ళు చెప్పుకునే కబుర్లేవో వినాలని ఈ చిన్నపిల్లలకి ఆత్రుత, వాళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు మధ్యలో ఏమైనా ప్రశ్నలేసి ఇరుకులో పెడతారేమో అని భయం కావొచ్చు, లేదా ఆ particular topic గురించి మనకు తెలియచేసే టైము రాలేదనుకోవచ్చు, ఏదో ఒకటీ, చిన్నపిల్లలకి తెలియకూడదూ అంతే… దానితో ఆరోజుల్లో ప్రతీదీ mystery గానే మిగిలిపోయింది ! అలాగని అడిగినా తప్పే మళ్ళీ- “ పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటీ వెధవ ప్రశ్నలూ నువ్వూనూ..” అంటూ కసిరిపారేసేవారు.మరి వాళ్ళకి అసలు అలాటి విషయాలెప్పుడు తెలిశాయిట అనే ప్రశ్నుండేది కాదు.వాళ్ళకెప్పుడు తెలిస్తే నీకెందుకూ, నువ్వుమాత్రం నోరుమూసుక్కూర్చో..అలా ప్రతీ విషయంలోనూ ఎన్నెన్నో inhibitions.తోటే చిన్నతనమంతా గడచిపోయింది.వాటన్నిటినీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది.అలా పెరిగాము కదా అని ఏమీ regret ఏమీ లేదండోయ్.ఆ కాలమానపరిస్థితులకి అలాగే బావుండేది.

కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా, మెల్లిమెల్లిగా ప్రతీ రంగంలోనూ ఓ “పారదర్శకత”( transperency) లాటిది మొదలయింది.గుర్తుండేఉంటుంది, సినిమాల్లో చూపించేవారు హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ, అనురాగం లాటివి వస్తే అదేదో “పక్షుల్ని” దగ్గర చేర్చడమూ, ఆ “తరువాతి” కార్యక్రమం కోసం ఓ పువ్వూ, దానిమీద ఓ తుమ్మెదా etc.etc.. కాలక్రమేణా హీరో హీరోయిన్లని ఇంకొంచం దగ్గరగా తీసికొచ్చి తరువాతిది.. leave it to our imagination.. తరువాత్తరువాత బ్లూ ఫిల్ములకీ సినిమాలకీ తేడాయే లేదనుకోండి.. all in the name of entertainment.

ఇంక పుస్తకాల విషయంలోకూడా అలాగే ఉండేది. కిళ్ళీకొట్లలో వేల్లాడతీసి పెట్టేవారు “కొన్ని” genre పుస్తకాలు, అసలు అలాటివాటివైపు చూస్తేనే పాపమేమో అనే అభిప్రాయంతో పెరిగాము. కానీ మగాడన్నా, ఆడపిల్లన్నా అవేవో harmonal changes అనేవుంటాయి కదా, ఆడపిల్ల ” పెద్దమనిషి” అయేటప్పటికి అప్పటిదాకా ఆ లొకాలిటీ లో ఉండే అందరు పిల్లలతో ఆడుకునే ఆ పిల్లకి ఓ పరికిణీ, ఓణీ వేసేయడం, ఆ పిల్లేమో ఎవరిని చూసినా పమిట సద్దుకోడం…లాటివి మొదలయ్యేది. ఇంక మగపిల్లాడు, ఇంట్లోవాళ్ళకి కనిపించకుండా, ఆ “కిళ్ళీకొట్టు పుస్తకాలు” తన నోట్సుల్లో దాచేసి తెచ్చుకోడమూ, ఎవరూ చూడకుండా చదివి చొంగ కార్చుకోడమూనూ. ఎందుకంటే అలాటి పుస్తకాలు ఏక్ దం taboo. మరి వీటినే inhibitions అంటారు.కానీ రోజులు గడిచేకొద్దీ వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆరోజుల్లో “చలం” గారి పుస్తకాలు చదివినా, చూసినా డొక్క చించేసేవారు. ఓహో ఆ చలంగారు వ్రాసేవన్నీ “బూతు” పుస్తకాలేమో అనే ఓ దురభిప్రాయంతోనే పెరిగాము. అలాగే “కొవ్వలి” వారివీనూ.

అదేకాకుండా అమ్మలు ఏ పేరంటానికైనా వెళ్ళినప్పుడు తన పిల్లాడిని తీసికెళ్ళిందనుకోండి, వాడిని “ కోతిపేరంటాలు” అని ఏడిపించేవారు. దానితో ఓహో.. మొగాళ్ళు పేరంటాలకి కానీ, ఆడవారి functions కి కానీ వెళ్ళకూడదన్నమాట అనే ఓ inhibition ఏర్పడిపోయేది.మరి ఈరోజుల్లో అలా జరగాలంటే కుదురుతుందా, ఇంటికో భార్యా భర్తా ఓ పిల్లో పిల్లాడో ఉండే రోజుల్లో,“ఫలానా పని నేను చేయకూడదూ, నా చిన్నప్పుడు చెయ్యనిచ్చేదికాదూ మా అమ్మా..” అంటే కుదురుతుందా. ఏ శ్రావణమంగళవారం పేరంటమో చేస్తే, నచ్చినా నచ్చకపోయినా శలవు పెట్టుకుని, శనగలూ, తాంబూలాలూ ప్లేట్లలో సద్దే కుర్రాళ్ళని చూస్తూంటాము. అయినా ఈరోజుల్లో నోములూ, వ్రతాలూ ఎవరు చేస్తున్నారులెండి అనకండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇంకా మన ఇళ్ళల్లో ఆచారాలూ, వ్యవహారాలూ ఇంకా బ్రష్టు పడిపోలేదు.

అంతదాకా ఎందుకూ మా ఇంటావిడ ఇప్పటికీ ఛస్తే కేక్కు తినదు, దాంట్లో ఎగ్ వేస్తారని! ఇంకో చిత్రం spring onion అని ఈరోజుల్లో మార్కెట్ లో దొరికేవాటిని తన చిన్నప్పుడు “ఉల్లికోళ్ళు” అనేవారుట, అదేదో మాంసాహారమనే భావంతో ఇంట్లోకి కూడా తేనిచ్చేది కాదు. పైగా పిల్లలతో, “మనము అలాటివి వండుకోమమ్మా..” అని కూడా చెప్పేది ! నిజమే కాబోసనుకునేవారు మా పిల్లలు. మార్కెట్ లో దొరికే స్వీట్లమీద అద్దుతారే సిల్వర్ ఫాయిల్, దాన్ని అదేదో జంతువు పేగులతో తయారు చేస్తారని ఎక్కడో చదివిందిట, బస్.. అలాటి స్వీట్స్ కి lifelong ban.. !

ఇవన్నీ “ఆ కాలం” నాటివాళ్ళకనుకోండి. ఇప్పుడు inhibitionసూ లెవూ, సింగినాదమూ లేదూ. ఏం కావలిసొస్తే దాన్ని నెట్ లో వెదుక్కోడమూ, పైగా తలితండ్రులకే కొన్నిటిని నేర్పడమూ. సేఫ్ పీరియడ్ అంటే, తల్లితండ్రులకంటే పిల్లలకే ఎక్కువ తెలిసే కాలం ఇది. టివీలలో కార్యక్రమాలూ అలాగే ఉన్నాయనుకోండి.సినిమాలకి సంబంధించినంతవరకూ ఏదో నామ్ కే వాస్తే ఓ సెన్సార్ బోర్డూ, ఓ సర్టిఫికేట్టూనూ.

అసలు ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈవేళ ప్రొద్దుట రైల్వే స్టేషనుకి తెలుగు పుస్తకాలు తెచ్చుకోడానికి వెళ్ళాను. ఈ వారం “స్వాతి” అట్టమీద “whisper ఈ సంచికతో ఉచితం” అని వ్రాసుందికదా అని, ఇమ్మన్నాను.దానికి ఆ కొట్టబ్బాయి అన్నాడూ, ” అడగడానికి సిగ్గుపడుతున్నారూ అందుకని అడిగినవారికే ఇస్తున్నానూ..”. “నాయనా ఇప్పుడు ఇలాటివి నాకేమీ అవసరం లేదూ, కానీ ఓ కూతురూ, కోడలూ, ఇద్దరు మనవరాళ్ళూ ఉన్నప్పుడు ఇలాటివాటి అవసరాలుంటాయి కదా..” అనేసి తీసికుంటూంటే పక్కనే ఉన్న ఒకావిడ నవ్వాపుకోలేకపోయారు. ” నిజం అంకుల్ ఎంత బాగా చెప్పారూ, అయినా ఈరొజుల్లో ఎవరు సిగ్గుపడుతున్నారులెండి..”,మరి అది ప్రశంసో, వెటకారమో తెలియదు. కానీ చిన్నప్పటి inhibitions. లోంచి మాత్రం బయటపడాలి.

Advertisements

8 Responses

 1. కోతి పోరంటాలు కాదు పోతు పోరంటాలు అనుకుంటాను.

  Like

 2. ఇంతమంచి టపా వద్దన్నా లక్ష్మిగారి అభిప్రాయాన్ని ఖండిస్తున్నాం. ఫ్రీ ఐటెం ఏమో కాని మమ్మల్ని నవ్వించారు.

  మీకసలు ఇలాంటి అసైన్మెంట్స్ కూడా ఇచ్చి ఆ మిస్టరీ షాపింగు వారు మీ తో ఇలాంటి బోల్డన్ని టపా లు వ్రాయంచాలని కోరుకుంటున్నా

  Like

 3. హమ్మయ్య నా బాధ అర్ధం చేసుకున్నారు. ఈ inhibitions నాకే ఉన్నయమో అని పెద్ద సందేహం ఉండేది. నేను పుట్టిన ఒక పదిహేను సంవత్సరాల తరువాత ఈ ప్రపంచం ఉన్న ఫళంగా పరిగెట్టడం ప్రారభించింది. నేనేమో ఓపెన్ గా మాట్లాడలేను, ఓపెన్ గా మాట్లాదేవాల్లకి సమాధానం చెప్పలేను. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ కాలం లో పుట్టి ఎంతో స్వేచ్చగా మాట్లాదేస్తున్న వాళ్ళని చుస్తే ఒక్కోసారి అసూయా అనిపిస్తుంది. ఒక్కోసారి అమ్మో అని అనిపిస్తుంది. అన్ని ఓపెన్ గా చెప్పేస్తుంటే వాళ్ళ మనసు లో మాటలు ని అర్ధం చేసుకునే అవకాశం, అవసరం ఎవరికుంటుంది. ఏమో అంటా కన్ఫుసింగ్ గా ఉంటుంది. మీరు మాత్రం కాలం తో పాటు మారిపోయరన్నమాట.

  Like

 4. వేణుగోపాల్,

  ఏమో మరి, నాకైతే కోతి పేరంటాలనే గుర్తు… పోన్లెద్దురూ ఏదో ఒకటీ వేళాకోళం చేయడానికి కోతైతేనేమిటి, పోతైతేనేమిటి..

  మౌళీ,

  Thanks.. మిస్టరీ షాపింగుల్లో ఆ ముచ్చటా తీరింది.Shopperstop లో Women’s Section లు చాలానే చేశాను.మొదట్లో కొద్దిగా delicate గా ఉండేది. అయినా మొత్తానికి నా inhibitions నుంచి బయట పడి చేసేసేవాడిని…

  వెంకట్,

  మీకేనేమిటండీ చాలామందికి ఇలాటివి ఉంటూనే ఉంటాయి, వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి. కొంతమంది చెప్పుకుంటారు నాలాగ, కొంతమంది గుంభనంగా ఉండి, వాటిల్లోంచి బయట పడరు. ఇంక నా సంగతి అంటారా, ఇంకా బతికేది ఎన్ని రోజులండి బాబూ, ఉన్నంతకాలమైనా ఇలాటివి వదిలెస్తే బావుంటుందనుకున్నాను..

  Like

 5. పెంపకం లో మార్పు రావాలండి.
  స్కూల్లో నీతి శాస్త్రం, సర్వ శృంగార శాస్త్ర అవగాహన చేరాలి.
  దాచి ఉంచితే కుతూహలం, తద్వారా
  అవకాశం దొరికితే అనుకోకుండా పొరబాట్లు దొర్లడం.
  టీ.వీ లో సినిమా లో రెచ్చ గొట్టడం తగ్గాలి.
  తిరుగ పడుతున్న స్త్రీ పురుషుల అనుపాతం సరి చేయాలి
  దొరికిన వాడికి , తప్పించుకోలేని వాడికి ఉరి ,
  లేని వాడికి సర్వం సుందరం???

  Like

 6. నేను కొన్న మొదటి పుస్తకం గుర్తుకు వచ్చింది. వైజాగ్ లో ఆనర్స్ కోర్స్ లో చేరిన కొత్తలో. నలుగురు స్నేహితులం గుంపుగా వెళ్లేం. ముగ్గురు వెనకాల నుంచుని కవర్ చేస్తుంటే పుస్తకం కొని వెంటనే బనిన్లో దాచేసి వచ్చేం హాస్టల్ కి.

  పుస్తకం ఏమిటి అంటారా. తెలుగులో ఏకైక శృంగార పత్రిక, ‘మదన’. ….దహా.

  Like

 7. చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులను బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదండి.
  ” No inhibitions please” అని అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను.

  Like

 8. డాక్టరుగారూ,

  ఈరొజుల్లో పిల్లలపెంపకం విషయంలో, ఇంకోరి ప్రమేయం ఎలాగూ ఒప్పుకోరు. అందువలన ఈ పెద్దాళ్ళే వారి వారి inhibitions లోంచి బయటపడ్డం ఉభయతారకం….

  సుబ్రహ్మణ్యం గారూ,

  పోన్లెద్దురూ నా టపా చదివి “ఆనాటి” జ్ఞాపకాలు తాజా చేసికున్నారు….

  బోనగిరీ,

  నేను చెప్పేదీ అదే !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: