బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    గత నాలూగైదు రోజులనుండీ దేశమంతా “అట్టుడికి” పోతోంది, దేశ రాజధానీ నగరంలో జరిగిన ఓ దురదృష్టకరమైన సంఘటన వలన. నిజమే ఆ విషయం తెలిసి చాలా బాధ పడ్డాము. కానీ దేశంలో ఇలాటివి కొత్తేమీ కాదు. అలాగని ఆ సంఘటనని dilute చేయాలని మాత్రం కాదు ఈ టపా.కానీ విశేషమేమిటంటే, దేశరాజధానీ నగరంలో జరిగేటప్పటికే, పార్లమెంటులోనూ, పెద్ద పెద్దనగరాల్లోనూ చేశారే హడావిడి, అదీ. నిందితులకు ఉరిశిక్ష వేయమన్నారు. దేశ విద్రోహచర్యలకు పాల్పడినవాడికే, ఉరిశిక్ష వేసినా, దాని సంగతేదో ఇప్పటిదాకా తేలలేదు.మళ్ళీ ఇంతలో ఇంకోటా? ఈ సందర్భంలో ఈవేళ “సాక్షి” పేపర్లో ఒక వ్యాసం వచ్చింది, చదవండి. ఉన్నదున్నట్టుగా చక్కగా సమీక్షించారు. చాలామందికి నచ్చకపోవచ్చు, ఎప్పుడూ ఉండేదేగా నిజాన్ని ఒప్పుకోపోడం. అలాగే Indian-Express-Pune-20-December-2012-8 ఒకసారి చదవండి.దేశంలో ఎలా ఉందో.

    ఆడపిల్లలమీద యాసిడ్ దాడిల విషయం అసలు లెఖ్ఖలోకే తీసికోరు.కానీ ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే జనం నిద్రలేస్తారు. రాజకీయనాయకులూ, సెలిబ్రెటీలూ అయితే అడగనే అడగఖ్ఖర్లేదు.ఇక్కడ జరిగేవాటికి దిక్కులేదు కానీ, ఆమధ్యన అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనమీద మాత్రం చర్చలూ, అభిప్రాయాలూనూ. ముక్తకంఠంతో అందరూ చెప్పేశారు, అసలు వాళ్ళది gun culture అండీ అంటూ.మరి మన culture ని ఏమంటారుట?

    ఇంక eve teasing గురించి ప్రతీవాడూ మాట్టాడేవాడే. ఆ మధ్యన పంజాబ్ లో ఒక తండ్రి, తన కుమార్తెను ఏడిపిస్తూన్నారని అడ్డుకోబోతే, ఓ ప్రబుధ్ధుడు తుపాకీతో కాల్చిపారేశాడు. చిత్రం ఏమిటంటే ఆ తండ్రి ఓ పోలీసు అధికారీ, కాల్చిన దౌర్భాగ్యుడు అధికారపక్షానికి చెందినవాడూనూ.మరి మనకి లేదా ఆ gun cultuరో ఏదో.

    ఈవేళ ప్రొద్దుట టివీ చానెళ్ళలో scrolling లో చూశాము, కాకినాడలో ఓ corporate college లో పిల్లలు 500 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందీ అనిన్నూ అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉందనిన్నూ. ఎవడో ఓ చానెల్ వాడు ఆ కాలేజీ పేరు (చైతన్య) బైటపెట్టేశాడు. మళ్ళీ ఆ విషయం మాత్రం ఎవడికీ పట్టలేదు. అసలు అలాటి సంఘటనే జరిగినట్టుకూడా లేనట్టుగా, మన మీడియా ప్రవర్తిస్తోంది. అంటే ఆ కాలేజీనుంచి వివిధ చానెళ్ళవాళ్ళకీ “ఆమ్యామ్యాలు” ముట్టినట్టా? ఈ మాత్రందానికి ఫ్రీ మీడియా అంటూ ఇళ్ళెక్కి అరవడం ఎందుకో? అప్పటికీ శ్రీ కట్జూ గారు చెప్పనేచెప్పారు– మొన్నటి గుజరాత్ ఎన్నికల సందర్భంలో వచ్చినవన్నీ paid news లే అని ! అంత ఉన్నతస్థానంలో ఉన్నాయనే అలా చెప్పారంటే, మన మీడియా ఎంత దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉందో చెప్పఖ్ఖర్లేదు.

13 Responses

 1. ఎవరు లేని ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిం చాల్సిన పరిస్థితులు తగ్గించుకోవాలి. ఒకవేళ ఎక్కినా ఎవరేమన్నా నోర్మూసుకొని కూర్చోవాలి తప్పదు.

  నిందితులకు మరణ భయం అంటే ఏంటో తెలియాలి, కాబట్టే మరణ శిక్ష వెయ్యాలి అని డిమాండ్ చెయ్యడం.

  యాసిడ్ దాడి చేసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళని కూడా షూట్ చేసిపారేసిన సంగతే తేలిగ్గా మర్చిపోతే ఎలా మీరు .

  Like

 2. మరణ శిక్ష వల్ల లాభం లేదు. ఇలాంటి కేసుల్లో ఏమిటి chemical castration ఏదో అంటున్నారుగా అది అవుతే మంచిది. జీవితాంతం వాళ్ళకి గుర్తు ఉంటుంది వాళ్లను చూసి మిగిలినవాళ్లూ బుద్ధిగా ఉంటారు. (మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఏదో వార్త చదివాను – చెన్నై కోర్టులో జడ్జి గారు కన్నుకు కన్ను అంటూ లించింగ్ చేసి చంపమని జడ్జుమెంటు ఇస్తే సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది – ఆ జడ్జిగి జ్యూరిస్ ప్రుడేన్స్ తెలవదు అంటూను)

  Like

 3. కోరలు లేని చట్టాలు ఎన్ని ఉంటే ఏమి ఉపయోగం?
  చట్టాలంటే నాయకులకి, అధికారులకి, ప్రజలకి భయం ఉండాలి.
  మన దేశంలో ఉన్న చట్టాలు కూడ తమంత తాముగా పని చెయ్యవు.
  ఏ నాయకుడో, మీడియానో గొడవ చేస్తే కొంత చలనం వస్తుంది.

  Like

 4. ప్రతిదానికీ మరణ శిక్షేనా?!
  ఓ కిడ్నీ, కొంత లివరు, లీటరు రక్తం, ఓ తొడెముకలో మజ్జ, కావాల్సిన పేషంట్లెందరో వుంటారు,వారికి ఇచ్చేయాలి. పోతే శిక్షగా ఓ కాలు, ఓ చేయి, ముందున్న తోక, నొప్పిలేకుండా సర్జికల్‌గా తొలగీంచి, వీల్ చేర్ ఇచ్చి జుమ్మా మసీద్ ముందు జీవితాంతం సుఖంగా అడుక్కోనివ్వాలి.
  మరణ శిక్షకు నేను బద్దవ్యతిరేకిని. జీవం ఇవ్వని వారికి దాన్ని తీసుకునే హక్కు లేదు, అంటాను. 🙂

  Like

 5. మౌళీ,

  మరణ శిక్ష వేసేస్తే, తాను చేసిన తప్పుపనికి శిక్ష అనుభవించినట్టుండదుగా… యాసిడ్ దాడి చేసినవారినీ, వారికి సహకరించినవారినీ షూట్ చేసిన సంగతి మర్చిపోలేదు.. కానీ ఎన్ని అలాటి సంఘటనల్లో అలా చేశారు? ఒకేఒక షూటింగుతో generalise చేసేయలేముగా…

  వేణుగోపాల్,

  “chemical castration” అన్నారు ఇదేదో బాగుంది.

  బోనగిరీ,

  అదేకదండీ “సాక్షి” వ్యాసంలో ఆయన వ్రాసిందీ. మన దేశంలో వచ్చిన గొడవల్లా ఇదే..

  Snkr,

  పైన శ్రీ వేణుగోపాల్ గారు సూచించినదానికంటే ఇదేదో ఇంకా బాగున్నట్టుందే…

  Like

 6. నేనెక్కడ మరణశిక్ష వెయ్యాలి అని అన్నాను అండీ, మరణ భయం రావాలి అన్నాను అంతే 🙂

  Like

 7. మౌళీ,

  ” మరణ శిక్ష వెయ్యాలి” నిజం చెప్పాలంటే నేనే తప్పుగా అర్ధం చేసికున్నాను ! మీరు కూడా మన రాజకీయ నాయకుల్లా ” I am quoted out of context” అనేసేయండి…

  Like

 8. @నిందితులకు మరణ భయం అంటే ఏంటో తెలియాలి, కాబట్టే మరణ శిక్ష వెయ్యాలి అని డిమాండ్ చెయ్యడం.
  ఇదండీ నా వ్యాఖ్య, అదీ మీ వ్యాసాన్ని బట్టి ‘మరణ శిక్ష వెయ్యాలని డిమాండ్ చెయ్యడం పై విశ్లేషణ ‘ చదివాక నా అభిప్రాయం చెప్పాను.’అమ్మాయి చనిపోక ముందే మరణ శిక్ష వెయ్యాలని డిమాండ్ చెయ్యడాన్ని’ సమర్ధిస్తూ నేను చెప్పిన అభిప్రాయం అది. ఇప్పటికీ నా మాటకు కట్టుబడి ఉన్నాను. ఆమె చనిపోయే దాకా ఎదురుచూసి అప్పుడు మరణ శిక్ష అని హడావుడి చెయ్యమని ఎవరేనా అంటే నవ్వుకుంటాను.

  ఇలాంటి నేరాల్లో గరిష్టంగా మరణ శిక్ష ఉండొచ్చు అని అందరికీ అవగాహనా రావాలి. ఇక ఈ కేసులో దోషులకు శిక్ష, ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో ఎంతోమంది తప్పించుకొన్నారు, వాళ్ళకి రాజకీయ అండ లేకపోతే తప్ప. ఈ కేసులో యావరేజ్ న ఇంతకుముందు ఉన్న దోషులకు పడిన శిక్ష కన్నా కఠిన శిక్షే పడాలి. దానికి ముందు భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే చిన్న, పెద్ద నేరస్తులందరి గురించి ఇలానే చర్చిస్తారు, ఉద్యమిస్తారు, శిక్షిస్తారు అని కనీసం నమ్మకం కుదరాలి.

  @మీరు కూడా మన రాజకీయ నాయకుల్లా ” I am quoted out of context” అనేసేయండి…

  బహుసా ఇన్నిరోజుల నా వ్యాఖ్యల్లో మీరు అర్ధం చేసికోగాలిగినది ఇంతే అయితే ఇకపై మీ బ్లాగులో వ్యాఖ్యానించడం లో అర్ధం లేదు, సెలవు 🙂

  Like

  • నా కోడి కూయకపొతే తెల్లారదు, నా ఆవు పేడ వేయకపోతే కళ్ళాపి వుండదు అన్నదట, వెనకటి ఓ యెంకమ్మ. అలా అలిగితే ఎలా తల్లీ?

   Like

 9. మౌళీ,

  “బహుసా ఇన్నిరోజుల నా వ్యాఖ్యల్లో మీరు అర్ధం చేసికోగాలిగినది ఇంతే అయితే ఇకపై మీ బ్లాగులో వ్యాఖ్యానించడం లో అర్ధం లేదు, సెలవు “– మరీ ఇంత కోపం తెచ్చేసికుంటే ఎలా తల్లీ? ఇక్కడ మా అమ్మాయీ అంతే… ప్రపంచంలో నేనొక్కణ్ణే తేరగా కనిపిస్తున్నానందరికీ… ofcourse నేను అలాటివేవీ పట్టించుకోను…

  Like

 10. కోపం ఏమి లేదండీ, మీ బ్లాగు ..మీ ఇష్టం! మీరంటే గౌరవము ఉంది కాబట్టే చదవడం మానేస్తున్నాను చదివీ అభిప్రాయం వ్రాయడం మానెయ్యడం కాకుండా . మీరేదో కాలక్షేపం కోసం వ్రాసుకోనేవాటికి అభిప్రాయాలతో పనిలేదు.అలాగే మీరీ వయసులో తెలుసుకోవాల్సినవి ఏమి లేదు, సంతోషం గా ఉండడం తప్ప . నిద్ర లేవగానే మీకు నచ్చని అభిప్రాయం మెయిల్ బాక్స్ ఉండడం న్యాయం కాదు. మీ అమ్మాయి కూడా మీకు చెప్పడం మానేసి ఉండాలి 🙂

  Like

  • ” మీరేదో కాలక్షేపం కోసం వ్రాసుకోనేవాటికి అభిప్రాయాలతో పనిలేదు.అలాగే మీరీ వయసులో తెలుసుకోవాల్సినవి ఏమి లేదు”
   I think that is none of your business to decide. Move your ass away, no need to rub it to every wall.

   Like

 11. Anonymous,

  నా అభిప్రాయమూ అంతేనండి…

  మౌళీ,

  చదవడం, చదవకపోవడమూ మీ ఇష్టం.. మా అమ్మాయి ” పట్టువదలని విక్రమార్కుడి” లా నేను, విన్నా వినకపోయినా చెప్తూనే ఉంటుంది. …

  Anon,

  No comment please, I leave it to readers’ discretion.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: