బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓస్.. ఇంతేనా…


    పార్లమెంటులో FDI గురించి చర్చ జరిగినప్పుడు, ఓటింగులో అధికార పక్షం వారు నెగ్గీనెగ్గగానే, ఓ గొడవ వొదిలిపోయిందనుకున్నాము. ఇంక మిగిలిన so called “ముఖ్యాతి ముఖ్యమైన” ప్రమోషన్లూ గట్రా మీద కూడ ఓ బిల్లు పాస్ చేసేస్తే ఈ ఏడాదికి అయిపోయినట్టే అనుకున్నారు అందరూ.ఈ ఉద్యోగాల్లో రిజర్వేషన్లేమైనా కొత్తా ఏమిటీ,స్వతంత్రం వచ్చినప్పటినుండీ, పదేళ్ళకోసారి ఓ రూల్ పాస్ చేస్తున్నారు, మరీ సుప్రీంకోర్టువాళ్ళు ప్రతీసారీ ఏదో ఒక “అడ్డంకి” తెచ్చేస్తున్నారూ, వీళ్ళ పని ఇలా ఉందా ఆనేసికుని, ఓ “చట్టం” తెచ్చేస్తే ఓ గొడవొదిలిపోతుందీ, ఎవరైనా ఏమైనా “గోల” పెట్టినా, “రాజ్యాంగం” పేరుతో వాళ్ళ నోరు మూసేయొచ్చూ అని.అందులో మళ్ళీ “విభజనలూ”, “విభాగాలూ” అవీ తరువాత చూసుకోవచ్చులే అనేసికున్నారు. ఇంతలో “రామాయణం లో పిడకల వేట” లాగ, అక్కడెక్కడో అమెరికా లో walmart వాళ్ళు ఓ బాంబు పేల్చారు. విషయం ఏమిటయ్యా అంటే,భారత్ లో వాళ్ళ వ్యాపారం మొదలెట్టడానికిఅనుమతి కోసం డబ్బులు ఖర్చుపెట్టామూ అవటా.. అని !

    ఏమిటో కొంపలేమైనా మునిగిపోయాయేమో. ఆ శాండీయో, ఇంకో నీలమో మళ్ళీ వస్తోందా అనేసికుని భయ పడిపోయారు. తీరా చూస్తే, వాళ్ళెవరో ఈ “పని” కోసం, ఎంతో కొంత ఖర్చుపెట్టారని. కొండ తవ్వి ఎలకని పట్టినట్టు 120 కోట్లుట ! ఆసలు సిగ్గుండఖ్ఖర్లేదూ, మనవాళ్ళకి, మిగిలిన scam లతో పోలిస్తే ఇదీ ఓ డబ్బేనా? దీనికోసం ఆ లోక్ సభ లో అల్లరి పెట్టేసి, మనకున్న ఏకైక entertainment కి గండి కొట్టేస్తారా. హన్నా… ఏదో హాయిగా మనసారా, తనివితీరా నవ్వుకుంటున్నామంటే ఆ లోక సభ, రాజ్యసభ చానెళ్ళ ధర్మమే.హాయిగా టివీ ఎదురుగుండా కూర్చుంటే కావలిసినంత మసాళా.పొద్దుణ్ణించీ కాలక్షేపం లేక ఇలా టపా వ్రాయవలసొస్తోంది.

    అసలు వివిధ scaమ్ముల్లోనూ జైలు పాలైనవాళ్ళూ, అదేదో బెయిలు మీద బయటకొచ్చిన మా కల్మాడీలూ, రామలింగరాజులూ, బెయిలుకోసమే కోట్లకొద్దీ ఖర్చుపెట్టిన జనార్ధనాలూ,జీతాలు ఎగ్గొట్టేసిన మాల్యాలూ,”మామూళ్ళు” రూపంలో వసూళ్ళు చేసే, మన రాజకీయ దురంధరుళ్ళూ,ఏ ఎన్నికలముందో ఓ ప్రాజెక్టుకి శంఖుస్థాపన చేసేసి, దాని మొహం మళ్ళీ చూడకుండా, ఏదో మళ్ళీ టెండర్లూ అవీ అనేసి ఆ ప్రాజెక్టు ఖర్చు మళ్ళీ escalate చేసేసే ప్రభుత్వాలూ, పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికే ఓ ” ఫీజు” వసూలుచేసే మన “గౌరవనీయ” పార్లమెంటేరియన్లూ నవ్వుకోరూ?

    ఇంతా చేసి 120 కోట్లా, దీనికింత హడావిడా? బుధ్ధిలేకపోతే సరీ, మనవేమిటి, మన దేశమేమిటి, దాని standard ఏమిటి,మూడంకెల్లో జరిగేవి, లక్షలైతేనేమిటి, కోట్లైతేనేమిటీ, అసలు వాటికేసి చూడమని ఎవరన్నారు? అసలు ఆ walmart వాళ్ళు చెప్పినప్పుడే, వాళ్ళతో అనాల్సింది, మాకు “లక్షల కోట్లైతేనే” మాట్టాడూ, ఇలా చిల్లరఖర్చుల్లోకి కూడా సరిపోని, మూడంకెల కోట్ల విషయం, చెప్పడానికి నీకు సిగ్గులేకపోయినా, దేశంలో ప్రజలదగ్గర మా “పరువూ ప్రతిష్ఠా” గంగపాలైపోవూ? రేపు 2014 లో ఓట్లడగడానికి ఏ మొహం పెట్టుకుని వెళ్తామూ? అని ఝణాయించి అడగడం పోయి, ఏమిటో ఏదో ఉపద్రవం వచ్చేసినంత గొడవ చేసేస్తున్నారు. ఏమిటో ఎవరో చెప్పినట్టు, “మీరు దేశంకోసం ఏం చేశారూ?” కి బదులు “ఎంత లాగించావేమిటీ..” అనేవారే ఎక్కువాయే.అలాటి ప్రజల దృష్టి లో మమ్మల్ని “నీచా” దిఖాయించడం మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంకోమాటచెప్పి ఓ రెండో మూడో సున్నలు, నువ్వు చెప్పిన సంఖ్యకే చేర్చేయ్, కావలిసిస్తే అలా చేయడం కోసం ఓ పాతిక్కోట్లు పుచ్చుకో, అంతేకానీ ఇలా మమ్మల్ని ఇరుకులో పెట్టకూ అనాల్సింది. అలా చేసేస్తే మా మాటా, పరువూ నిలబడతాయి, వెధవది 120 కోట్లకి ఇంత కంఠశోషా అని ఇప్పటికే అందరూ తిడుతున్నారు. “Reputation नाम कॅ ऍक चीज हॉतीहै बाबा॥”

    నెలాఖరుదాకా ఏదో ఓ గొడవపెట్టేసి, పార్లమెంటు సెషన్ జరక్కుండా చూస్తే, ఆ ప్రమోషన్లూ చట్టాలూ గొడవుండదు.అదిట విషయం ! ఈలోపులో, ఆవిడెవరో మన BAI (Badminton Association of India) మీద ఓ కేసేసింది.మన ఆంధ్రతేజం, గోపీచంద్ ఓవైపున Chief Selector గా ఉంటూనే, ఏదో ఎకాడమీ ఓటి నడుపుతున్నాడు, ముంబై హైకోర్టు చివాట్లేసింది, ఇదేం పని నాయనా అంటూ. ఇదివరకటి రోజుల్లో గుర్తుందా, ట్యూషన్లకెళ్ళే విద్యార్ధులకే, స్కూలు పరీక్షల్లో మార్కులేసేవారు, అలాగ ఈ ఎకాడెమీలో లక్షలు పోసి చేరినవారికే, భారత జట్టులో స్థానం. కారణం-అప్పుడెప్పుడో ఆ గోపీచంద్ గారు ఏదో టూర్నమెంటులో నెగ్గినప్పటినుంచీ, ఆయన ఏం చెప్తే అదే వేదం. మనం పాత reputations మీదే వెళ్తాము.

    ఉదాహరణకి మన క్రికెట్ కప్టెన్ చూడండి, 2011 లో world cup నెగ్గినప్పటినుంచీ, ఆహా cool..cool.. అనేవాళ్ళే. చివరకి గత రెండుమూడేళ్ళనుండీ మ్యాచ్ తరువాత మ్యాచ్ ఓడిపోతున్నా, ఆహా cool.. ఓహో cool.. అనేవాళ్ళే. మొన్నటికిమొన్న, ఇలా ఓడిపోతున్నా, తనుమాత్రం కెప్టేన్సీకి రాజీనామా చేయడుట ! Height of it ! అసలు మనకొచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే, తమంతట తాము వెళ్ళడమే law of the land అనే అభిప్రాయం ఈ క్రీడాకారుల్లో కలగచేయడం.ఆ “దేముడు” గారు అనలేదా ఏమిటీ, మనంకూడా అనేస్తే సరీ.. అనుకున్నాడు ధోణుడు !

    ఇంత ప్రఖ్యాత cultural heritage ఉన్న మనదేశంలో మరీ అంత దిగజారిపోయి, afterall 120 కోట్లకోసం కక్కూర్తిపడ్డామంటే నమ్మదగేదిగా ఉందా?Its just peanuts ! ఏమైనా చెప్తే నమ్మేటట్టుగా ఉండాలి కానీ,ఇలా కిళ్ళీకొట్టు కబుర్లా చెప్పేదీ? అసలు మన AAP ( Aam Aadmi Party) కేజ్రీవాల్ గారే నమ్మడూ not fit for consideration అని.

Advertisements

2 Responses

  1. 120కోట్లు, అదిలించి మౌనీసింగ్తో పనిచేయించినందుకు, అమ్రీక వాడికిచ్చిన ‘చాయ్ పానీ పైసల్ &’. ఇండియాలో లెగ్గెట్టాక monthly income scheme లాగా కప్పం చెల్లిస్తారట.

    Like

  2. Snkr,

    నిజమే కాబోలు…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: