బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    తెలుగులో మంచి సినిమాలు రావడంలేదో అని బాధ పడఖ్ఖర్లేదని ఈవేళ ‘జీ’ తెలుగులో చూపించిన ఓ డబ్బింగు సినిమా చూసిన తరువాత అనిపించింది.అసలు ఈ చిత్రం డబ్బింగు అని గూగుల్ లో వెదికినతరువాతే తెలిసింది. అంత అద్భుతంగా ఉంది.మామూలుగా ఏ సినిమా అయినా ఇంకోభాషలోకి డబ్ చేసినప్పుడు, ఆ నటీనటుల గొంతుక/ హావభావాలతో తెలిసిపోతుంది. కానీ ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం లు వారి స్వంత గొంతుకతోనే డయలాగ్గులు చెప్పడంతో, అసలు ఇది డబ్బింగు సినిమానా అని ఆశ్చర్యం వేసింది.దానికి సాయం విద్యాసాగర్ అందించిన పాటలు.ఇక్కడ వినండి.ఏ చానెల్ పెట్టినా దౌర్భాగ్యపు డయలాగ్గులూ, అర్ధం పర్ధం లేని పాటలూ వినవలసిన పరిస్థితుల్లో ఇలాటి అచ్చతెలుగు సాహిత్యంతో శ్రీ వేటూరి, శ్రీ వెన్నెలకంటి వ్రాసిన పాటలు అద్భుతం.సినిమా పేరంటారా “మాటరాని మౌనమిది“.సినిమా online లో దొరికితే లింకిద్దామనుకున్నాను, కానీ రివ్యూతోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది.జ్యోతిక నటన అద్బుతం.అవకాశం వస్తే తప్పకుండా చూడాల్సిన చిత్రం.

    ఎవరి దేశంలోనో ఉంటూ, వారి చట్టాలను అతిక్రమిస్తానంటే ఊరుకుంటారా ఆ దేశం వాళ్ళు? May be, మన దేశంలోని చట్టాలు అవతలివారికి చిత్రంగా కనిపించొచ్చునేమో ( ఊరికే పేరుకేలెండి, మన చట్టాలు, అవి మనలాటివారికే పరిమితం.పెద్దపెద్దవారు పెద్ద పట్టించుకోరు). ఫేసుబుక్కు లో ఏమైనా వ్రాస్తే జైలూ, ఖర్మకాలి ఎవరినైనా ఏదైనా అంటే అట్రాసిటీ, అడక్కండి, అవతలివాడు ఓ “కులం” గురించి ఏదైనా వాగొచ్చు!ఎలాగైనా అపహాస్యం చేయొచ్చు. అది మన దురదృష్టం.ఏమైనా అంటే చట్టం, చట్టుబండలూ అంటారు.అలాటప్పుడు, పరాయిదేశానికి వెళ్ళినప్పుడు, వారి చట్టాలని గౌరవించవలసిన అవసరం ఉండదంటే ఎలా కుదురుతుందీ? మన దేశవాతావరణానికి, పిల్లలు ఏదైనా అల్లరి చేసినా ఓ దెబ్బవేయడం, మంచినీళ్ళు గొంతుకలో పోసుకున్నంత సులభం. ఈ టపాలు చదువుతున్నవారిలో నూటికి తొంభైమంది, ఎప్పుడో ఒకప్పుడు, వారివారి తండ్రిచేతిలో ఓ దెబ్బతిన్నవారే. ఏదో ఇక్కడే ఉండిపోయాముకాబట్టి బతికిపోయాము కానీ, లేకపోతే, ఏ నార్వేలాటి దేశంలోనో అయిఉంటే, ఊచలు లెఖ్ఖపెట్టవలసివచ్చేది ! అమెరికాలో అయితే, అదేదో నెంబరు తిప్పగానే పోలీసులు వచ్చేస్తారుట, నేనెప్పుడూ వెళ్ళలేదు, ఏదో అక్కడా ఇక్కడా చదివినదే. ఏది ఏమైతేనేం, వాళ్ళ చట్టం వాళ్ళదీ.

    అలాగే, అరబ్ దేశాల్లో, వెధవపనిచేసి పట్టుబడితే, limb for limb ట ! నచ్చితే అక్కడకి వెళ్ళండి, వెళ్తే వాళ్ళ చట్టాలు గౌరవించండి. లేదా, నోరుమూసుకుని ఇక్కడే ఉండండి.అంతే కానీ, అప్పుడెప్పుడో వాళ్ళెవరో బెంగాలీ దంపతులూ, ఇప్పుడేమో ఆంధ్రా దంపతులూ,అక్కడికేదో ఆ దేశంవాళ్ళు చేసింది, అమానుషం అనీ, వాళ్ళవి ఆటవికచట్టాలూ అని, మీడియాలోనూ, పేపర్లలోనూ ఘోష పెడితే అవుతుందా? మనదేశకాలమాన పరిస్థితులను బట్టి, అదేదో అమానుషం అనిపించొచ్చు, కానీ వాళ్ళకి చట్టవిరుధ్ధమే మరి.

   నిన్న అమెరికాలో Wallmart వాళ్ళు,మనదేశంలో వ్యాపారం మొదలెట్టడానికి lobbying కోసం లక్షలకొద్దీ డాలర్లు ఖర్చుపెట్టారుట. ఆ lobbying అనే దానిని మన చట్టప్రకారంముద్దుగా “లంచం” అంటారు, అదేమో చట్టవిరుధ్ధం ఇక్కడ, ఈవేళంతా, బిజెపీ వాళ్ళు ఆ విషయం పట్టుకుని గొడవచేశారు.అంతదాకా ఎందుకూ, బయటిదేశాల్లో విమానాశ్రయ సెక్యూరిటీ వాళ్ళు ప్రతీవాళ్ళనీ చెక్ చేస్తారుట ( విన్నదే లెండి, ఎప్పుడైనా వెళ్ళనా పెట్టానా!), అదేమో మన వాళ్ళకి నామోషీ. ఎందుకంటే, ఇక్కడ మామూలు ప్రజలకి తప్ప, ఇంకోళ్ళకి ఇలాటివిలేవు కనుక! మిగిలిన దేశాల్లో betting చట్టబధ్ధం, ఇక్కడో?

   నాకు మన క్రికెట్ టీం పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నారు ! ఒకటిమాత్రం ఒప్పుకోవాలి- ఎప్పుడూ నిరాశ పరచరు. ఏదో అదృష్టం బావుండి కానీ, నాలుగోరోజుకే అయిపోవలసిన మ్యాచ్ అయిదో రోజుకి వెళ్ళింది ! ఎప్పుడూ ఒకటే excuse.

    నాకు లోక్ సభ టివీ చూడ్డం అంటే ఎంత entertainmenటో.. ఎవడిదారిన వాడు అరుస్తూంటాడు, ఆ స్పీకరుగారేమో నిర్వికార్, నిరాకార్ గా కూర్చుంటాడు.FDI గురించి ప్రతీవాడూ, ఏదో ఒకటి చెప్పారు.ఇదివరకు malls వచ్చినప్పుడూ ఇదే గోల. కిరాణా దుకాణాలవాళ్ళు దివళా ఎత్తేస్తారన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఎలాగూవస్తాయి, ఆ Wallmart లూ అవీనూ.ఈరోజుల్లో ఎవరిచేతుల్లో చూసినా ఐపాడ్లూ, ఐఫోన్లూ, గెలాక్సీలే కదా, మరి అంతంత స్వదేశీఅభిమానం ఉన్న దేశభక్తులు, వాటినే ఎందుకు పట్టుకుతిరుగుతున్నారుట?

    నిన్న ETV2 లో తెలుగుభాష గురించి, ఓ గంటన్నర కార్యక్రమం వచ్చింది. అంతర్జాలం విషయంలో తెలుగు గురించి చేస్తున్న ప్రగతి గురించి, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు చాలా బాగా వివరించారు.

    చివరకు విసుగెత్తేసి అన్నా హజారేగారు కేజ్రీవాల్ గారి “గుట్టు” కాస్తా బయటపెట్టేశారు ! మరీ ఆయన అలా అనవలసిందికాదూ అని బేడీ గారు “బాధ” పడిపోయారు ! ఓ 72 రోజులు “శలవు” లో ఉండి, తిరిగి ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. ఈవేళ ఉత్తర్ ప్రదేశ్ లో అదేదో కార్యక్రమానికి ఆడపిల్లల్ని “నల్ల” బట్టల్లో రాకూడదన్నారుట,నలుపు విచారానికి “సంకేతం” ట !

Advertisements

8 Responses

 1. వ్యాఖానించడం మొదలెడితే టపా అయిపోతుందేమోనని :)…బాగుంది.

  Like

 2. /నచ్చితే అక్కడకి వెళ్ళండి, వెళ్తే వాళ్ళ చట్టాలు గౌరవించండి/
  లేదా… ద్వారములు తెరిచియే వున్నవి! :)) జీతం మాత్రం డాలర్లలో కావాలి, చట్టాలు మాత్రం రూపాయల్లో వుండాలి(అదే మన చికెన్ బిరియాని సట్టాలు) అంటే ఎలా కుదురుద్ది? అహా… ఎలా?! :))

  క్రికెట్ నాకూ నచ్చింది. కేప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు అంటూ తనది కాకుంటే తాటిపట్టకు అనే లెవిల్లో ధోనీ భరోసాఇచ్చారు… నాకు టెన్షన్ తగ్గింది. ఈ దేశం యువతకు క్రికెట్ మీద ఆశ చచ్చిపోయేలా చేయాలి. 🙂

  Like

 3. మీకు తెలుసా ? నెక్స్ట్ మాచ్ అశ్విన్ ఆడకపోవచ్చుట. అనవసరంగా ఇంకో రోజు ఆడించాడు. లేకపోతే ఇంకో అడ్వర్టైజ్ మెంట్ చేసుకునే వాళ్ళం అని గుర్రుగా ఉన్నారుట కొందరు……..దహా.

  Like

 4. శర్మగారూ,

  ఈమధ్యన ఎలాగూ వ్యాఖ్యలకి బదులుగా ఎలాగూ టపాలే పెడుతున్నారు.. అదేదో వ్రాసేయకూడదూ?

  Snkr,

  అదే కదండీ వచ్చిన గొడవంతా ! అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదురుతుందా?

  సుబ్రహ్మణ్యంగారూ,

  “బ్లాగు సన్యాసం” తీసికుంటే తీసికున్నారు. కానీ అప్పుడప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తూండండి. నా లాటి mortals కి అంత ధైర్యం ( వైరాగ్యం) లేదు. ఏదో తోచిందేదో వ్రాస్తేనేకానీ, “దురద” తీరదు.
  వ్యాఖ్యలనే కాదు, అప్పుడప్పుడు “శ్రవణ భాగ్యం” కూడా కలిగించాలని ప్రార్ధన !

  Like

 5. మొழி (నాలుక అడ్డంగా అంగిట్లో బాగా వెనక్కి పెట్టి మడతేసి ళి అంటే ழி పలుకుతుంది) అనే అరవ చిత్రం ఇది. నాకూ చాలా నచ్చింది. అరవంలో, తెలుగులో మొత్తం వెరసి నాలుగుసార్ల వరకు చూసాను.

  Like

 6. వాళ్ళ చట్టాలను ఎవరు విమర్శిం చారు అండీ, అవేవో పొద్దుపోని వ్రాతలు ..

  ఎవరి దేశంలో ఉన్నా మన దేశం అలవాట్లు ఊరికే వదిలేస్తాయా . ఒకటి పిల్లలు నిజం చెప్పకుండా ఇంకేదో దెబ్బ తాకింది అని చెప్పాలి. కొంతమంది పిల్లలు అర్ధం చేసికొని చెప్పేస్తారు కూడ 🙂

  లేదా అబద్దం చెప్పమని పిల్లలకి నేర్పడం ఎందుకు అనుకొంటే, తల్లి మాత్రమె దండిస్తే సరి. ఆ జైల్లో పెట్టేదేదో తల్లినే పెడతారు. ఆ పిల్లాడికి కూడా కొన్నాళ్ళు తల్లి లేకపోతె తెలిసొస్తుంది . తండ్రి ఉజ్జోగం కి ఇబ్బంది ఉండదు , ఏమంటారు 🙂

  Like

 7. సుబ్రహ్మణ్యంగారూ,

  ఆ మాత్రంచాలు… Thanks…

  కాళిదాసు గారూ,

  మీక్కూడా ఆ సినిమా నచ్చి, ఇప్పటికే నాలుగుసార్లు చూశారంటే, మీకు “మంచి” సినిమాలమీద అభిరుచి తెలుస్తోంది. Keep it up…

  మౌళీ,

  చానెళ్ళలోనూ, న్యూస్ పేపర్లలోనూ వస్తున్న వార్తలు/ చర్చలు నార్వే చట్టాలగురించే ఘోషిస్తున్నాయి. ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు, ఆ దేశపు చట్టాల గురించికూడా తెలిసికోవాలిగా. మా ఊళ్ళో అలాగే చేస్తామూ అంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. Be a Roman while in Rome అని ఏదో తూతూ మంత్రంగా అంటే కుదురుతుందా మరి?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: