బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– second opinion…


    అప్పుడే వారం రోజులైపోయింది టపా వ్రాసి. కిందటి టపాలో వ్రాశానుగా, attention seeking అని కాకపోయినా, నాకూ అవసరం ( అంటే ప్రస్థుతం) లేని attention ధర్మమా అని ఓ ఎముకల డాక్టరుగారిదగ్గరకు తీసికెళ్ళిపోయారు.చెప్పానుగా ఆ డాక్టరుగారు నా xray చూసీచూడడంతోనే, fit for surgery అని ఓ తీర్పిచ్చేశారు. నాకైతే, పోనీ ఇంకో డాక్టరు దగ్గరకూడా అడిగిచూద్దామా అని అనిపించింది. ఏ మూడ్ లో ఉన్నాడో, అబ్బాయీ,కోడలూ కూడా మొత్తానికి ఒప్పుకున్నారు !

    మా ఇంటావిడైతే అంటూనే ఉంది- మీ నాన్నగారికి ఈ మోకాలునొప్పి నా పెళ్ళైనప్పటినుంచీ చూస్తున్నానూ, ఏదో ఎవరినీ బాధపెట్టకుండా, తన బాధేదో తనే పడుతూ ఏదో కాలక్షేపం చేసేస్తున్నారు,, నాకు తెలిసినంతవరకూ ఎప్పుడూ కాలినొప్పి వలన శలవు కూడా పెట్టలేదూ, అన్నిటిలోకీ ముఖ్యం- గత నలభై ఏళ్ళలోనూ తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం, మెట్లమీదుగా వెళ్ళే చేసికున్నారూ, మళ్ళీ ఈ వయస్సులో, ఆపరేషనూ గట్రా అంటే ఒప్పుకోరేమో.. అని ! అలాగని అబ్బాయీ,కోడలూ ఇప్పుడు ఏదో అల్లరి పెడదామని కాదు నన్ను ఆ డాక్టరుదగ్గరకి. రేపెప్పుడో ఇంకొన్ని రోజులు బతికిబావుంటే, ఇలాగ బాధపడకూడదనీ, వాళ్ళఅందోళనా. పోనీ ఆ మోకాలినొప్పేదో, నేను చెప్పినదాన్నిబట్టే కానీ, ఎప్పుడూ xrays తీయించిన పాపాన పోలేదు. చిన్నప్పుడు మోకాలు వాచిపోయేది. ఏవో అవీ ఇవీ వైద్యాలు చేయించి మొత్తానికి ఏదో కాలక్షేపం చేసేశాను. ఆ “మోకాలినొప్పి” selective గా నా rescue కి కూడా వచ్చేదనుకోండి, అంటే ఎప్పుడైనా క్లాసు టెస్టులు ఉన్నప్పుడు, వాటిని ఎగ్గొట్టడానికి ! ఏదో హెడ్మాస్టారి అబ్బాయి అవడంతో, ఈ గొడవలేమీ లేకుండా, మొత్తానికి ఎస్.ఎస్.ఎల్.సీ దాకా లాక్కొచ్చేశాను. అలాగని మరీ బడుధ్ధాయిని కాదూ! ఏదో ఓ డిగ్రీఓటి తగిలించుకున్నా కదూ! ఆ రోజుల్లో ఆమాత్రం సరిపోయేదిలెండి.

    చెప్పానుగా నా అదృష్టం బావుండి, ఏదో ఆ పళ్ళ విషయం లో తప్పించి, హాస్పిటళ్ళకి వెళ్ళవలసిన అవసరం రాలేదు. అప్పుడు కూడా,అదేదో హేమోఫీలియా ( బోర్డరు లోనే) ఉండడంతో, మా కజిన్ ధర్మమా అని, ఫాక్టరు 8 సపోర్టుతో, ఉన్న 32 పళ్ళూ పీకించేశాను.హాయిగా ఉంది.దీనితో ఏదో అప్పుడప్పుడు వచ్చే మోకాలునొప్పి, తెలిసున్న డాక్టరు ఇచ్చే మందులతోనే కాలక్షేపం చేశాను. దీనితో ఏమయ్యిందీ అంటే, గత 60 ఏళ్ళలోనూ ఒక్కటంటే ఒక్క xray లేదు.అందువలన periodical గా నా మోకాలు ఎంత deteriorate అయిందీ తెలిసే అవకాశమే రాలేదు! నొప్పొస్తే ఓ పైన్కిల్లర్ వేసేసికుని, రెస్టు తీసికోడమూ, మర్నాడు మళ్ళీ ఊరిమీద పడ్డమూ…పైగా ఒంటిని పట్టుకున్న ఆ హీమోఫీలియా వలన, సర్జెరీలూ అవీ వీలున్నంతవరకూ avoid చేయమని చెప్పడంతో, నా జాగ్రత్తలేవో నేనే పడుతూంటాను.దీనికి సాయం, అదే ఖర్మమో, నాకు తెలిసిన అయిదారు కేసులూ( knee replacement) సర్జెరీ అయినతరువాత కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నారు. దీనితో, నాక్కూడా ఆ సర్జెరీ అంటే ఓరకమైన “భయం” అనండి, లేదా ఓ “విరక్తి” అనండి, లాటిది ఏర్పడిపోయింది.ఇదండీ background.

    చెప్పానుగా ఇంకో డాక్టరుగారి దగ్గరకు తీసికెళ్ళారు. ఆయన కూడా ఏదో alternate medicine కి సంబంధించిన వారు కాదు! ఆయనా ఇంగ్లీషు మందులాయనే, ఆయనా PG చేసినాయనే..నా xray చూసీచూడగానే, ఠాఠ్ సర్జెరీలేదూ, ఏమీలేదూ,
ఈ మోకాలి నొప్పికి అసలు కారణం ఇంకోటీ అనేసి, ఓ రెండు xray లు తీయించారు.వచ్చేవారంలో అవేవో exercises చెప్తారుట. అదండి విషయం.

    ఇప్పుడు నాకో విషయం అర్ధం అవదు.చదివే చదువు ఒక్కటే అయినా, ఈ డాక్టర్లు ఒకే అస్వస్థకి అలాగ diametrically contradictory అభిప్రాయాలు ఎందుకు చెబుతారూ అనేది.ఇదివరకటి రోజుల్లో ఇలాటి గొడవలుండేవి కావు. ఏదో ఊరికో నలుగురైదుగురు డాక్టర్లు,వాళ్ళే దేవుళ్ళూ.వాళ్ళ చేతుల్లోనే పుట్టి పెద్దయాముగా!ఇప్పుడో గలీ గలీకీ ఓ డాక్టరూ,లేదా ఓ నలుగురైదుగురు డాక్టర్లు ఓ పేద్ద బిల్డింగులో practice మొదలెట్టడమూ. ఇవి కాకుండా, కార్పొరేట్ ఆసుపత్రులు వేరే. వాటిల్లోకి వెళ్ళడం వరకే మనిష్టం కానీ, బయటకి ఎప్పుడు వస్తామో, అసలు వస్తామో రామో, అవన్నీ మనచేతుల్లో ఉండదు.

   అలాగని అందరు డాక్టర్లూ అలా ఉంటారని కాదు, కానీ ప్రతీదీ వ్యాపార దృష్టి తోనే చూస్తున్న ఈ రోజుల్లో ఈ second opinion అనేది చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. ఇందులో ఏమీ పెద్ద తప్పుందనుకోను. అలాగని మనం ముందుగా చూసిన డాక్టరు efficiency ని శంకిస్తున్నామని కాదు, ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు, నాలుగైదు చోట్ల చూసికానీ, కొనమే, అలాటిది, మన శరీరం అండి బాబూ, దీనిక్కూడా ఎప్పుడైనా ఏదైనా వస్తే ఇంకో డాక్టరుదగ్గరకూడా చూపించుకోవాలి. అలా కాకుండా, ఏదో emergency లాటిది వస్తే చేసేదేమీ లేదు, మనల్ని చేర్పించిన ఆసుపత్రివాళ్ళు ఏం చెబ్తే అంతే.

    అవసరం ఉన్నా లేకపోయినా, సర్జెరీలు ఎందుకు చేస్తారో తెలియదు.ఒప్పుకున్నాం, మన శరీరంలో ఏ రోగం ఉందో, ఆ డాక్టర్లకే తెలుస్తుంది, అలాగని ఆ ఆసుపత్రికి పెట్టిన ఖర్చంతా మన నెత్తినే రుద్దేద్దామనుకుంటే కష్టంకాదూ?ఈమధ్యన పేపర్లో చదివాను- మెడిసిన్ చదవాలంటే 50 లక్షలు అవుతుందిట! వామ్మోయ్, వచ్చిన పేషెంటుకి ఏదో ఒక భాగం తీసేస్తేనేకానీ, పెట్టిన ఖర్చు తిరిగిరాదన్నమాట! వాళ్ళమాట దేముడెరుగు, మన ప్రాణాలమీదకొస్తుందన్నమాట ఇటుపైన !

    అసలు ఉండవలసింది మనం వెళ్ళే డాక్టరుమీద ఓ faith. అదుంటేనే కదా మనరోగం తగ్గేదీ? మనం అంత నమ్మకం పెట్టుకుని, వాళ్ళనే దేవుళ్ళా భావించి, మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నామే, అలాగే ఆ డాక్టర్లూ, మరీ వ్యాపార దృష్టి తో కాకుండా,మానవతా దృక్పథం తో చేస్తే ఎంతబాగుంటుందో కదా! అలాటి డాక్టర్లూ ఉన్నారు, నూటికికనీసం 80 మంది, “రోగి” ని చూసే వైద్యం చేసేవారు.ఇంకో సంగతేమంటే, ఏదో ఎప్పుడో టెస్టులు చేయించుకున్నామన్నా ఊరుకోరు, మళ్ళీ ఆటెస్టులన్నీ చేయించుకుంటేనేట తెలిసేది. మళ్ళీ ఆ టెస్టూ, ఈ టెస్టూ అంటూ చేయించినవే మళ్ళీ చేయించుకోడమూ… ఏమిటో ఓసారి డాక్టరుదగ్గరకి వెళ్ళామంటే, హడలెత్తిపోతోంది. అసలు దానివల్లనే, ఎక్కడలేని రోగాలూ (కొత్తవి) వస్తున్నాయేమో అని నాకో పేద్ద అనుమానం !

    అందరూ అలాగే అనుకుంటే, మరి లక్షలూ, కోట్లూ పెట్టుబడి పెట్టి డాక్టర్లైనవాళ్ళ సంగతేమిటండి బాబూ అంటే చెప్పేదేమీలేదనుకోండి. Life goes on…..

Advertisements

5 Responses

 1. phani babu garu,

  ఇంగ్లీసు లో ఒక వాక్యం ఉంది.

  “No two doctors and No two watches will agree the same”

  Ramu.

  Date: Fri, 7 Dec 2012 12:35:42 +0000
  To: jakrams@live.in

  Like

 2. రెండు వాచీలు ఒకే సమయం చూపించవు. అలాగే ఇద్దరు డాక్టర్లు ఒక మందు చెప్పరు. సైన్స్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఉండాలిగా, మరిదేంటి, మన ఖర్మ. మా పెద్దాయనొకరికి తలతిరిగితే ఆరుగురు డాక్టర్లు చూసి ఏం లేదన్నారు, రోగం వేరేగా తగ్గింది లెండి. జాగ్రత్త సెకెండ్ మెడికల్ ఒపీనియన్ మనకి కొత్త కాదుగా.

  Like

 3. రామూ,

  నిజమే… కానీ ఇక్కడ మన ప్రాణాలతో చలగాటాలు చూస్తూంటే ఒళ్ళు జలదరిస్తూంటుంది.

  శర్మగారూ,

  ఇప్పటిదాకా అలా second opinion తీసికోవలసిన అవసరం రాలేదు. కానీ, మొదటిసారి తీసికునేసరికి జ్ఞానోదయం కలిగింది…

  Like

 4. గత రెండు దశాబ్దాలుగా మోకాలు కీలు మార్పిడికి
  మత్తు (అనేస్తేసియా) కొన్ని వందల మందికి ఇచ్చాను
  వారిలో ఆ మార్పిడి ఇతరులకు చేసే ఎముకల వైద్యులు
  (ఆర్తోపిడిక్ సర్జన్)ఎవ్వరూ లేరు.అది వారి అసలు నిజం.

  Like

 5. డాక్టరుగారూ,

  నాకు తెలుసు… మీ అనుభవంతో నా టపా అర్ధంచేసికుంటారని..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: