బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…


    మన దేశంలో ఎక్కడ ఏది జరిగినా, అంతంత హడావిడి చేసేస్తారే, అలాటిది మన బ్లాగుల్లో అంతమంది మనవాళ్ళు, అమెరికాలో ఉన్నారే, వాళ్ళ గురించి, కనీసం ఆ దేశంలోనే ఉంటున్న మనవారు కొద్దిగా తెలియచేసుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగని మన చానెళ్ళలో చూడ్డం లేదా అని కాదు. చూడ్డం వేరూ, జరిగిన విపత్తు గురించి, first hand account వినడం వేరూ. అంతమందికి అంత కష్టం వచ్చిందే, అయినా సరే, మనవాళ్ళలాగ ప్రతీ రాజకీయనాయకుడూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నట్టు వినలేదూ, చూడలేదూ. అప్పటికీ ప్రతీ రోజూ CNN చూస్తూనే ఉన్నాను.ఇలాటి స్వభావం చూస్తూంటే, వారే more mature గా కనిపిస్తున్నారు. మనవాళ్ళు చూడండి, దురదృష్టవశాత్తూ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీ ఎర్రంనాయుడి గారి మరణానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు.అంటే నేను ఏదో ప్రభుత్వాన్నే సమర్ధిస్తున్నానని కాదు. ప్రతీ దానికీ, ఎవరో ఒకరిని దుమ్మెత్తిపోయడం తప్ప మన నాయకులకి ఇంకో పనే లేదా అని అనిపిస్తూంటుంది.అసలు విషయాన్ని పక్కకుపెట్టి, ఏమిటేమిటో ఊహించేసికోడంలో చూపే నేర్పు, పాలనలోనూ, ప్రజలకి చేసిన promiseలు నెరవేర్చుకోడంలోనూ ఉంటే ఎంత బాగుండేదోకదూ!

    అలాగే మన టివీ చానెళ్ళ వ్యవహారాల్లోనూ, అంత నష్టం జరిగిందే, ఎంతోమంది ప్రాణాలు పోయాయే, ఆ విదారక దృశ్యాలను ఒక్కటంటే ఒక్కటీ చూపించకపోడంలో ఉన్నవిదేశీ చానెళ్ళ విజ్ఞత కి హ్యాట్స్ ఆఫ్ ! మనవాళ్ళు చూడండి, ఎక్కడైనా ఏ దుర్ఘటనైనా జరగడం తరవాయి, క్లోజప్పు చేసి మరీ చూపిస్తూంటారు. పైగా ఎవరైనా చూడలేకపోతారేమో అని, రోజంతా చర్చలూ, పక్కనే పొద్దుణ్ణించీ చూసిన visualసూనూ.గాయపడిన వాడిని హాస్పిటల్కి తీసికెళ్ళడం మానేసి, అతనితో ఇంటర్వ్యూలూ, బైట్టులూనూ. మన వాళ్ళకి అసలు ఎప్పుడు బుధ్ధొస్తుందీ?

    రెండు మూడు రోజుల్లో అత్యంతముఖ్యమైన ప్రెసిడెంటు ఎన్నిక ఉంది.అక్కడవాళ్ళూ ఒకళ్ళమీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటారు, అయినా ప్రస్థుత విపత్కర పరిస్థితి దృష్ట్యా, ఆ ఎన్నిక ప్రచారాలూ అవీ పక్కకు పెట్టేశారు. ఇక్కడ చూడండి, గుజరాత్ లోనూ, ఇంకోచోటా త్వరలో ఎన్నికలంటున్నారు, ఆ ప్రచారాలు చూడండి– ఈవేళ దిగ్విజయసింగు, మోడీని నీ భార్యనెక్కడ దాచేశావూ..” అంటూ ఓ చురక.దానిక్కారణం ఆ మోడీమహాశయుడేమో, ఆ తరూరు భార్యని ఏదో అన్నాడుట. దరిద్రులు, వాళ్ళవాళ్ళ భార్యలు ఏ గంగలో దిగితే అసలు మనకెందుకూ? వీటికి సాయం ఆ ట్విట్టరూ, ఫేస్ బుక్కులూ ఒకటీ? ప్రతీ తలమాసినవాడూ ఏదో ఒకటనడం, ఎవడిగురించన్నాడో వాడేమో, ఈ రాసినవాడిమీద పరువునష్టం దావా వేయడం. ఆ చిదంబరం గారి కొడుకుని చూళ్ళేదూ?

    ఇంక సుబ్రహ్మణ్యస్వామి “పట్టువదలని విక్రమార్కుడి” లాటివాడు. రాజాని దింపేశాడు. ఇప్పుడు రాణివాసంమీద పడ్డారు, ఏదో ఋజువులూ అవీ ఉన్నాయనే కదా, ఓ పెద్ద పత్రికా సమావేశం పెట్టి చెప్పుకుంటూ పోయాడూ. ఠాఠ్ అదంతా బోగస్సూ, కోర్టులో పరువునష్టం దావా వేస్తామూ అనేశారు. మన దేశంలో ఓ సౌలభ్యం ఉంది, ఎప్పుడైనా ఎవడైనా ఏదైనా అంటే, కోర్టులో ఓ దావా వేసేస్తే సరి, ఎవడికీ సమాధానం చెప్పుకోనఖ్ఖర్లేదు. మరీ బలవంత పెడితే sub judice అంటూ తప్పించుకోవచ్చు! మనం బతికుండగా, ఆ కేసూ విచారణకి రాదు, అందరూ సుఖంగా ఉంటారు.ఇవన్నీ, మీలాటి, మాలాటి “ఆం ఆద్మీలకి” మాత్రం కాదు. Its the exclusive privilege of our politicians and celebrities only. ఆయనెవడో మంత్రిగారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుని హాయిగా కూతురి పెళ్ళి చేసేస్తున్నాడుట. మనందరికీ కూడా అలాటి ఓ అవకాశం ఇస్తే ఎంత బావుండేదో?

    ఒకదాని తరువాత ఒక్కో రాజగోపురం కూలిపోతోంది. కొత్తగా పాలకొల్లులో క్షీరారామ దేవాలయపురాజగోపురం కూలిపోయింది. ఆ మధ్య శ్రీశైలంలోనిదీ, అంతకు పూర్వం కాళహస్తీ, అంతకుముందు బాపట్ల భావన్నారయణ గుడిదీనూ.కొత్తగా మంత్రిపదవికూడా దొరికిందీ, మన మెగాస్టారు గారు, ఏవేవో ప్రకటనలు చెసేయడం కంటే, స్వంత ఊరు పాలకొల్లు ( ఆయనని ఎన్నుకోలేదనుకోండీ, అది వేరే విషయం)లో గోపురం సంగతి చూడకూడదూ? ఇలాటివి ఆయన శాఖలోకి రావా ఏమిటీ? 200 ఏళ్ళ పురాతన కట్టడం, మరీ tourist attraction లోకి రాదంటారా? ఏమోరాదేమో.సినిమావాళ్ళకి షూటింగులకోసం ఏవేవో చేసేస్తానూ, అస్సలు భారతదేశాన్నే ఓ బ్రాండ్ ఎంబాశడర్ చేసేస్తారుట ! అదీ మన ప్రధానమంత్రిగారు ఈయనతో చెప్పారుట! వినేవాడుండాలి కానీ ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు! ఉన్నవాటిని చూసే దిక్కులేదుకానీ కబుర్లకేమీ లోటులేదు.

    ఇదండీ విషయం.. అయినా బతికేస్తున్నాము. ఏదో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను. చెప్పొచ్చేదేమిటంటే, అమెరికాలో ఉంటూన్న మన పాఠకులు అక్కడ జరిగిన ఘోర తుఫాను గురించీ, అక్కడుండే ప్రజానీకం, దానినుండి ఎలా బయటపడకలిగిందీ బ్లాగుల ద్వారా తెలియచేస్తే, మీ యోగక్షేమాలు మాక్కూడా తెలుస్తాయిగా. Give a thought !

Advertisements

15 Responses

 1. చాలా చక్కగా చెప్పారు.మీరు అనుకున్నట్లు బహుశా ఇద్దరు ముగ్గరు బ్లాగర్ మిత్రులు
  అక్కడ జరిగిన విపత్తు గురుంచి రాసినట్లున్నారు.

  Like

 2. BBC website లో శాండీ తుఫాను గురించి బానే కవర్ చేస్తున్నారండీ

  మన తెలుగు వాళ్ళు పాపం వాళ్ళ వాళ్లకి ఇన్ఫార్మ్ చెయ్యగలిగితే చాలండీ. ఒకపని చెయ్యండి మీరు ఎవరెవరి యోగక్షేమాలు కనుక్కోవాలనుకోన్నారో వారి పేర్లు వ్రాయండి. ఎవరికైనా తెలిస్తే స్పందిస్తారు.

  అందరూ అని అనేస్తారేమో మీరు, చాల మంది చాలా విషాదాలు పంచుకొంటున్నారు బ్లాగుల్లో మీరు మీక్కావాల్సిన వారినే పలుకరించారు కదా అలాంటి సందర్భాలలో. అందరిని అయ్యో అన్నారా ఏంటి 🙂

  Like

 3. Well said Phani Babu garu. Our Media is yet to mature. The media in USA or Europe also passed through these ugly phases our media is passing through. Of course, our people could have learnt fromtheir bad phase but as Aleksandr Solzhenitsyn rightly said “We do not err because we do not know. We err because its convenient that way” or words to that effect. For media to be the way they are now is convenient and profitable so why to change?

  Like

 4. Coming to Bloggers in USA in the Cyclone area to write about the calamity, my son is in New Jersey. Till yesterday there was no power. Cell phones batteries evoporated so how to write. After seeing the cyclone and how the USA coped with it, I thought that had they got just 3-4 Tehasildars from our East Coast, they would have managed the disaster in an excellent way limiting the damage to barest minimum. When such cyclone is hitting the coast, power supply was just allowed which in itself created fire accidents. Our Revenue Department can teach leassons on Disaster Management to anybody in the world. US Govt can think of sending their officials to learn from our people for future requirement.

  Like

 5. “శాండీ” రాక ముందు జరిగినవి: అది ఎప్పుడు ఎలా వస్తుందో కంప్యుటర్ మోడల్స్ తో నిర్ధారించారు. కాకపోతే అది కొన్ని గంటలముందే అమెరికా తీరానికి చేరింది.

  వస్తుందని తెలిసిన దగ్గరనుండీ, అడ్డుకునే పరిస్థితి లేదు కాబట్టి, ధాటికి తట్టుకోటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. shelters తెరిచి అక్కడ నివసించే వారిని రమ్మన్నారు. చాలామంది వెళ్లారు. కొందరు వెళ్ళటానికి నిరాకరించారు. అక్కడ భోజన సదుపాయాలూ అన్నీ ఉంటాయి.

  భీభత్సం ఎల్లాఉంట్టుందో ఊహించారు కాబట్టి కావలసిన వాటిని సమీకరించారు. ఉదా: చెట్లు విద్యుత్ లైనులు పడిపోతాయని తెలుసు కాబట్టి, దేశంలో నిపుణులను సమీకరించారు. చికాగో నుంచి కూడా విద్యుత్ లైనులు బాగు చేసే ట్రక్కులు వెళ్ళి నాయి(దాదాపు రెండు వేల మైళ్ళ దూరం).

  “శాండీ” వచ్చినాక జరిగినవి: అనుకోకుండా తీరానికి కొన్ని గంటల ముందరే చేరింది. గాలుల ధాటికి చెట్లు పడిపోయినాయి. అవి విద్యుత్ తీగల మీద పడటం మూలాన తీగలు తెగి కిందపడి మంటలు లేచాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్టేషన్లు దెబ్బ తిని దీపావళి లాగా కాంతులు వచ్చాయి. కొన్ని చోట్ల పునాదులతోపాటు ఇళ్ళు బయటికి వచ్చాయి. కార్లు, బోట్లు, గాలిలో తేలిపోయి చెల్లా చేదరమూ అయిపోయినాయి. సముద్రపు/నదుల అలలు ఇరవై అడుగుల దాకా లేచి దగ్గరలో వున్నపల్లపు ప్రాంతాలని ముంచి వేశాయి. న్యూయార్క్ లో భూమికింద ప్రయాణించే రైలు సోరంగాలన్నీ నీళ్ళతో నిండి పోయాయి. ఉన్న మూడు ఎయిర్పోర్తులు నీళ్ళతో పనికి రాకుండా పోయాయి. ఉదా: ఒకళ్ళకి బ్యాటరీతో పనిచేసే రేడియో ఉంటే అందరూ వార్తలు వినటానికి బయట కిటికీలో పెట్టాడు.

  వెరసి ఒక రాత్రిలో జరిగిన విధ్వంసం: విద్యుత్ లేదు. పెట్రోల పంపులు పనిచెయ్యవు. రోడ్లు లేవు. కార్లు తిరగవు. రైళ్ళు లేవు. కొన్ని చోట్ల మంచి నీళ్ళు లేవు. చలికాలం చలి. ఉదా: ఇరవై అంతస్తునుండి క్రిందకు దిగాలంటే మెట్ల మీదే.

  మిల్లియన్నైర్స్ ఉన్న చోట్లో ఒక్క రాత్రిలో మంచి నీళ్ళకి వేడి కాఫీకి భోజనానికీ దొరక్క బికారీ లవ్వాలసి వచ్చింది. ప్రకృతి ఎదురు తిరిగితే మనమెంత.

  ఈవారంలో జరిగినవి: shelters లో ఉన్న వాళ్ళకి ఆహారం అందుతోంది. వీలయినంతవరకూ విద్యుత్ తీగలు సరి చేసి విద్యుత్ ఇస్తున్నారు. సగం మందికి అందింది. కందకాల్లోంచి నీళ్ళు తోడి కొన్ని రైళ్ళను నడుపుతున్నారు. రోడ్లమీద ఉన్న చెత్తా చెదారం చెట్లు తీసి కొద్ది కొద్దిగా బస్సులు నడుపుతున్నారు. ఏర్పోర్తులు తెరిచారు. నావలు రావటానికి పోర్ట్లు తెరిచారు. దేశం నలుమూలల నుండీ సహాయం రావటం మొదలెట్టింది. ఇంకొక వారం రోజులలో దాదాపు అందరూ ఎవరిపని వాళ్ళు చేసుకోవటం మొదలు పెడుతారు.

  Like

 6. ఫల్గుణీ,

  స్పందించినందుకు ధన్యవాదాలు.

  మౌళీ,

  నాకు “తెలిసినవారి” గురించి ఆడగమన్నారు. నేను ఏదో అక్కడ విపత్తు జరిగిందీ విశేషాలు తెలుస్తాయనే ఉద్దేశ్యంతో వ్రాయలేదు. తెలిసిన బంధువులు 100 పైగా ఉన్నారు,ఎంతమంది పేర్లు వ్రాయనూ?స్పందించే పధ్ధతిలో ఉంటుంది.. క్రింద శ్రీ లక్కరాజు రావుగారు, వ్రాశారు చూడండీ, అలాగన్నమాటOK? ఇలాటివొచినప్పుడు disaster planning ఎలా ఉంటుందీ తెలుస్తుందని నా ఉద్దేశ్యం.BBC నేనూ చూస్తాను..personal accounts తెలిస్తే బావుంటుందేమో అనే ఉద్దేశ్యం.. anyway leave it.

  శివరామప్రసాద్ గారూ,

  స్పందించినందుకు ధన్యవాదాలు. మీడియా గురించి మీ స్పందన బావుంది.TRP లకోసం పాకులాడకుండా వచ్చే రోజుకి వేచి ఉందాము.

  రావుగారూ,

  Thanks a lot. అక్కడ disaster planning ఎలా ఉంటుందో తెలియచేశారు. అన్నిటిలోకీ చివరగా వ్రాశారే”ఇంకొక వారం రోజులలో దాదాపు అందరూ ఎవరిపని వాళ్ళు చేసుకోవటం మొదలు పెడుతారు.” అదీ bottomline. ఇక్కడా రిలీఫ్ ఉంటుంది, కానీ మనవాళ్ళు, ఎలక్షన్లలో ఎవరైతే వాళ్ళకి ఓట్లేశారో,వాళ్ళకి మాత్రమే, ముందర ఇస్తారు. మిగిలినవారికి, ఏదైనా “మిగిలితేనే”, చేతులు దులుపుతారు!
  Thanks again..

  Like

 7. Hero one day, zero on an another
  Power should be put of , though it may be irritating during that time.

  Like

 8. డాక్టరుగారూ,

  “Hero one day, zero on an another” అక్షరసత్యం…

  Like

 9. అక్కడ వేరే టౌన్స్ లో ఉంటున్నవారు కుడా ఎవరు బ్లాగ్స్ లో వ్రాయలేదు 🙂
  ఇంకా మనతో పోలిస్తే అతికొద్ది మంది మంది (చాలా జాగ్రత్తలు తీసికోన్నాక కూడా ) మరణించారు. ఆ కొద్ది మంది ని తీ వీ లో చూపే అవసరం తక్కువా. వారి మంచి చెడు ప్రభుత్వమే చూసుకోగలదు.

  మనలాంటి దేశాల్లో జనం మద్దతు చాలా అవసరం కాబట్టి ఫోటోలు, వీడియొ లు చూపించాలి తప్పదు . కాబట్టి మన మీడియా యి విజ్ఞత లేదనడం ఎంతవరకు సబబో అర్ధం కాలేదు.

  మిలియనీర్స్ వుండేచోట బీభత్సం కనిపించింది కానీ, వాళ్ళకి అదొక్కటే నివాసం అయి ఉండదు కదా, షిఫ్ట్ అయి ఉంటారు అని నా ఊహ, శ్రీ లక్కరాజు రావుగారు వ్రాసింది చుస్తే ఆశ్చర్యం గా ఉంది .

  Like

 10. పాలకొల్లులో కూలినది ధ్వజస్థంభం కదా, రాజగోపురం కాదనుకుంటా.

  Like

 11. మౌళి,

  నేను వ్రాసిన visuals సంగతి, విపత్తులు సంభవించినప్పుడు కాదు, మామూలుగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కూడా ఇదే తంతు. శ్రీ రావుగారు వ్రాసినదానికి అభినందించడం పోయి, దానిక్కూడా వంకలు పెట్టగలిగారంటే మీరు చాలా.. చాలా.. గ్రేట్ !!

  బోనగిరీ,
  నేను టపా వ్రాసేముందు scroll లో రాజగొపురం అని చదివాను. కానీ తరువాత వివరాల్లో తెలిసింది, ధ్వజ స్థంభమని. Sorry…

  Like

 12. అమెరికాలో తుఫాను ఎప్పుడో వస్తుంది, మనకు ప్రతి ఏడాది తుఫాను రాకున్నా మోకాళ్ళలోతు నీళ్ళలో నగరాలు, కరెంటుకోత, దోమల మోత, విషజ్వ్రాలు… అమెరికావాళ్ళకేం లేండి గోరంతలు కొండంతలు చేసి, సెంటిమెంటు కలిపి క్యాండిల్స్ వెలిగించేసి సంతాపం చెప్పేసి అయ్యింది అనిపించేస్తారు. :)) ఎర్రంనాయుడికి ఆక్సిజన్ ఇచ్చి వుంటే బ్రతికేవాడేమో, దేశ సేవ చేసేవాడేమో. 😀
  ఇంతకీ మీ వోటు ఒబామయ్యకా? రోముడికా? 🙂

  Like

 13. Snkr,

  కోస్తాజిల్లాలన్నీ అతలాకుతలమైపోయాయి..కానీ అమెరికాలో కూడా ఈసారి బాగా ఎక్కువగానే వచ్చినట్టుంది.. ఇంక ఎర్రంనాయుడి గారి విషయం- ఇప్పటిదాకా చేసిన దేశసేవ చాలనుకుంటాను.. ఇప్పటిదాకా ఏఒక్కరో ఇద్దరో తప్పించి, పదవిలో ఉన్నవాళ్ళకే రెండో టర్మూ వచ్చినట్టుంది, పోనిద్దురూ ఒబామయ్యని కూడా continue చేసేయమందాము…

  Like

 14. ఆశ్చర్యం గా అనిపించింది అనడం వంకలు పెట్టడం ఎలా అవుతుంది అండీ. అలాగని ఆయన్ని అభినందించే సందర్భం కూడా కాదు 🙂

  మీకు ఇష్టమైన అర్ధం తీసికొన్నట్లే , మీ వ్యాసం లో మొదటి లైన్ లో నాకు నిజానికి వేరే అర్ధం గోచరించింది.

  దుర్ఘటన లలో విజువల్స్ గురించి, మీడియా అంటే చాలావరకు మనమే, మనకి అంటే ప్రజల్లో పరిణితి ని బట్టి మీడియా లో వస్తుంది. మనం న్యూస్ పేపర్ ,న్యూస్ చానల్స్ పెద్దగా చూడము సమాచారం విజువల్స్ ద్వారా మాత్రమె సరిగా అందే పరిస్థితులు ఉన్నాయని నా అనుకోలు. ఈ విష్యం లో మీడియాని నిందించడం కన్నా, మన ప్రక్క వారి కి అవగాహన కలిపించడం లో మనం ఎంత శ్రద్ద చూపిస్తున్నాము ? మనకి అంత శ్రద్ద టైము సాధారణం గా ఉండదు.

  Like

 15. మౌళీ,

  ” మీకు ఇష్టమైన అర్ధం తీసికొన్నట్లే ,”… That exactly is the issue. ఎవరి perspective వారిది. శ్రీ రావుగారు, అమెరికాలో వచ్చిన తుఫాను గురించి, (ముందూ, తరువాతా) అంత స్పష్టమైనట్టుగా చెప్పారే … it definitely calls for appreciation. మీకు అలా అనిపించలేదు. మీ ఇష్టం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: