బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఎవడిని నమ్మేటట్టు?


    అప్పుడెప్పుడో ప్రవచనాల్లో విన్నాను- దేముడు ఇదివరకటి యుగాల్లో వివిధ అవతారాలు ఎత్తి, రా‍క్షసుల్ని, దుష్టులనీ తెగనాడడానికి కారణం, ఆ రాక్షసులకి ఓ unique identity అనేది ఉండేదిట. కానీ ఈ కలియుగంలో రాక్షసుడు అనేవాడు, విడిగా ఉండడుట.మనిషి రూపంలోనే ఉంటాడుట, అలాగని భూమిమీద ఉన్న ప్రతీ మనిషినీ సంహరించడం అంటే మాటలు కాదుగా, దానితో దేముడు, ఈ కలియుగంలో అవతారం ఎత్తడం మానేసికున్నాడుట. విజ్ఞులు చెప్పిన మాటల్ని, వారంత పెద్దపెద్ద మాటలలో చెప్పేటంత పరిజ్ఞానం నాకు లేదు కానీ, నేను విన్న మాటల సారాంశం మాత్రం ఇదే.

    నిజమే కదూ.. మనలోనే రాక్షస ప్రవృత్తి కలవాళ్ళు ఎంతమందిలేరూ? ప్రతీ రోజూ పేపర్లలో చూస్తూంటాము, ఫలానా ఊళ్ళో కొడుకు తల్లినో, తండ్రినో చంపేశాడనీ, ఎవరో ఓ చిన్న పిల్లమీద అత్యాచారం చేశాడనీ, ఇంట్లోనే దుర్వ్యసనాలకోసం దొంగతనం చేశాడనీ, ఒకటేమిటీ…ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్ని. ఇదివరకటి యుగాల్లోని రాక్షసులు చేసే ప్రతీదీ ఈ కలియుగంలో మానవరూపంలో ఉన్న రాక్షసులు చేస్తున్నవే, ఎవడిని నమ్మాలో, ఎవడిని నమ్మకూడదో తెలియదు.

    కాకపోతే, అమెరికాలో ఈమధ్య ఆ దరిద్రుడెవడో, ఆ పసిపాపని కిడ్నాప్ చేసి చంపేయడమేమిటీ? ఆ పసిపాప చేసిన పాపం ఏమిటీ? ఈ దౌర్భాగ్యుడి దృష్టిలో పడడం తప్ప.అమెరికాలో జరిగుండడం కాబట్టి, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, దోషిని పట్టకలిగారు, శిక్ష కూడా అంత త్వరలోనూ అమలు చేస్తారనే ఆశిద్దాము. ఆ దరిద్రుణ్ణి శిక్షించడం వలన, పోయిన పాప తిరిగొస్తుందని కాకపోయినా, ఇలాటి పనులు చేసినవాడికి శిక్ష పడాలి.

    ఇదే సంఘటన మన దేశంలో జరిగుంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవేమో. పోలీసు యంత్రాంగం అసలు వాడిని పట్టినా, రకరకాల ఒత్తిళ్ళూ వచ్చుండేవి. అన్నీ పూర్తిచేసి కోర్టులో శిక్ష పడేసరికి ఓ దశాబ్దం, మళ్ళీ presidential pardon అంటూ ఇంకో దశాబ్దం.

   మనకు దగ్గరవాళ్ళే అసలు dangerous characters అనడానికి ఓ ఉదాహరణ, మా కళ్ళెదురుగుండానే, మేము వరంగాం లో ఉన్నప్పుడు జరిగింది. Victim మన తెలుగువారే.వారిదీ మా అమలాపురమే,కొద్దిగా average కంటే ఎక్కువ స్థాయి డబ్బున్నవాళ్ళూ.ఇంకో చిత్రం ఏమిటంటే, వారికి మన తెలుగువారి కుటుంబాలకంటే, మిగిలిన వారితోనే intimacy ఎక్కువా.ఒక్కో బిల్డింగులోనూ, నాలుగేసి ఫ్లాట్లుండేవి.ఒకదాంట్లో వీళ్ళూ, ఇంకోదాంట్లో ఓ బెంగాలీ కుటుంబమూ.

    ఒకరోజు ఫాక్టరీలో ఉండగా ఫోను వచ్చింది, ఫలానా వారింట్లో దొంగతనం జరిగిందీ, ఇంట్లో ఉన్న, మా ఫ్రెండు భార్యని, సీరియస్సుగా గాయపరచి, బంగారం తీసికుని వెళ్ళిపోయారూ అంటూ..అప్పటికే సాయంత్రం అయిదున్నరయింది, ఇంటికొచ్చి,ఈ సంఘటన జరిగిన ఫ్రెండింటికి వెళ్ళేటప్పటికి, అప్పటికే ఆవిడని సీరియస్సు కండిషన్ లో జలగాం పెద్ద ఆసుపత్రికి తీసికెళ్ళిపోయారుట, ఆ రోజు రాత్రి, మా జిఎంగారు కారు పంపించి,నన్ను అక్కడకి వెళ్ళి పరిస్థితి ఏమిటో తెలిసికునిరమ్మన్నారు.

    అసలు జరిగినవిషయంలోకి వస్తే తెలిసిందేమిటంటే, ఈ దోపిడీ చేసినవాడు, ఎక్కడో బయటనుండి వచ్చినవాడు కాదు, వీళ్ళ పక్క పోర్షనులోనే ఉంటున్న బెంగాలీవాళ్ళ కొడుకు. ఇంటరో, ఏదో చదివేవాడు.వాడి తండ్రి, మా కొలీగ్.వీళ్ళకీ, వాళ్ళకీ రాకపోకలూ, ఒకళ్ళింట్లో చేసికున్నవి, ఇంకోళ్ళింట్లో పంచుకోవడాలూ వగైరాలన్నీ ఉండేవి.ఇదేదో చాలదన్నట్టుగా, ఈవిడ ఇంట్లో ఉన్న నగా, నట్రా వివరాలూ అవీ కూడా ఆవిడో, వాళ్ళాయనో ఈ బెంగాలీవాళ్ళతో పంచుకున్నారు.ఎంతదాకా వచ్చిందీ అంటే, ఈ తెలుగువారింట్లో ఏ వస్తువు ఎక్కడుందో, వాళ్ళకంటే ఈ బెంగాలీ కుర్రాడికి ఎక్కువ తెలుసు!

    ఓ రోజు మధ్యాన్నం మూడింటికి, ఎవరో కాలింగు బెల్లు నొక్కితే, ఈవిడ తలుపు తెరిచేసరికి, ఆవిడని తోసుకుంటూ, మొహానికి ఓ మాస్క్ లాటిది చుట్టుకుని, ఓ కుర్రాడు లోపలికి వచ్చి, ఈవిడని బెదిరించి (కత్తితో),నగా నట్రా మూటకట్టేశాడు.ఎక్కడెక్కడ ఏమేమున్నాయో, ఇదివరకే తెలిసున్నవాడు కాబట్టి,అన్నీ సద్దేసి, ఇంక బయటకు పారిపోదామనుకుంటుండగా, ఆవిడ with all her might , వాడిని పట్టుకుని. ఆ మొహాన్నున్న మాస్కు కాస్తా పీకేయడంతో తెలిసింది, ఈ దరిద్రుడెవడో. తన identity తెలిసిపోయేసరికి, వాడూ చెలరేగిపోయి, నెత్తిమీద ఫ్లవరువాజు పెట్టి కొట్టడంతో ఆవిడ స్ప్ఱ్హహ తప్పి పడిపోయారు. ఇద్దరికీ మధ్య జరిగిన గొడవలో వాడికీ దెబ్బలు తగిలాయి. ఈవిడ పడిపోగానే, వాడు, నెమ్మదిగా తలుపులేసి, కిందకొచ్చేసి, ఆ నగల మూట తీసికుని ఫ్రెండింట్లో పెట్టి,ఇంతలో ఇంటికొచ్చేసరికి, అందరికీ ఆవిడ స్ప్ఱ్హహ తప్పి పడిపోయారని తెలిసి, పాపం అందరూ మూగుండడంతో, వీడూ ఆ గుంపులో చేరి, అయ్యో ..పాపం అనికూడా అన్నాడుట !

    ఇవన్నీ పోలీసువారి ఇంక్వైరీలో తేలాయనుకోండి, వివరాలన్నీ వ్రాయాలంటే ఓ పెద్ద కథ అవుతుంది.వాళ్ళింట్లో పోయిన నగల విలువ, ఉజ్జాయింపుగా ఓ మూడు లక్షలున్నాయన్నాడు, మా ఫ్రెండు, చివరకి పోలీసులు పట్టినవేమో అయిదారు లక్షలదాకా ఉండేటప్పటికి, చివరకి ఆ నగలు వీళ్ళకీ దక్కలేదుట, ఆ దొంగతనం చేసినవాడికీ కాకుండా పోలీసుల పరం అయ్యాయిట.కొసమెరుపేమిటంటే, వాడి కేసు వాడే వాదించుకుని, అతితక్కువ శిక్షతో బయటకొచ్చాడు!

    చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో కొద్దిగా పరిచయం అయిందంటే చాలు, వాళ్ళేదో వీళ్ళకి ఏదో పేద్ద intimate అయిపోయినట్టు, వీళ్ళ ఆస్థిపాస్థులూ వగైరాలన్నీ చెప్పేసికుంటారు. ఎప్పుడో వీలు చూసుకుని, ఇదిగో పైన చెప్పినట్టుగా ఆ “పక్కవాడే” నెత్తిమీద శఠగోపం పెడుతూంటాడు.

Advertisements

8 Responses

 1. హూ.. వున్నవాడిని దోచి షార్ట్కట్‌లో సమానత్వం సాధించాలనే మావోఇజం బెంగాలీలో కాస్త ఎక్కువే. 🙂

  Like

 2. Snkr,

  Incidental గా ఇక్కడ అలా చేసినవాడు బెంగాలీ అయ్యాడు. పాపం అందరు బెంగాలీలూ అలా ఉండరేమో. , అయినా అందరినీ అనుకోడం దేనికిలెండి…

  Like

 3. పాప కేసు చాల దురదృష్టకరమైన సంఘటన. ఉద్దేశ్యపూర్వక హత్యలు కాకపోయినా అతను శిక్షా ర్హుడే , కానీ ఈ మొత్తం విషయం లో మనం చూడవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి.

  అతనుకూడా కొంతవరకు సానుభూతికి అర్హుడు. ‘సమాజం’ ఈ పాప సంఘటన లోను, ఇంతకుముందు విజయవాడలో జరిగిన ఇలాంటి సంఘటనలోను నేర్చుకోవాల్సిన పాఠాలు చాల ఉన్నాయి. లేదంటే మరికొంత మంది చిన్నారులు బలి కాక తప్పదు.

  (మీరు ఈ విష్యం పై టపా వ్రాయలేదేమో అనుకొన్నాను 🙂 )

  Like

 4. మౌళీ,

  నేర్చుకోవాలిసిన పాఠాలున్నాయంటూ, ఎడా పెడా చంపుకుంటూపోతూండడమేమైనా భావ్యంగా ఉందా?

  Like

 5. తప్పదండీ, ఎవరి పిల్లలకోసం వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే. మీరు చివరి పేరా లో చెప్పిందే కొంచెం వేరుగా :

  అర్ముగా మాటలు చుస్తే అర్ధం అవుతుందేమో 🙂

  మా అమ్మ కారం మురుక్కు, స్వీట్ మురుక్కు చేస్తే కాగితాల్లో పంచుకుని ఇంటి ముందు గొప్ప గా కూర్చుని తినేవాళ్ళం.. ఇప్పుడనిపిస్తుంది సిగ్గుగా…. అది కూడా చేసుకోలేకపోయిన వాళ్లు ఎంతమంది ఉండేవారో మా బస్తీ లో… వాళ్లందరి ముందూ కూర్చుని తినటం!.. అని తల విదిల్చాడు AK.

  ఆర్ముగం కబుర్లతో మళ్ళీ ఒకసారి: http://krishna-diary.blogspot.co.uk/search/label/విశిష్టమైన వ్యక్తులు

  Like

 6. మౌళీ,

  All the best in your “trials”…

  Like

 7. ట్రైల్స్ , అంటే అర్ధం కాలేదండీ. నా వ్యాఖ్యలో ఏముందో అంతవరకే, వ్రాసేసాకా వాటికి అంత ప్రాధాన్యత లేదు. నచ్చకుంటే ప్రచురించకండి.

  Like

 8. మౌళీ,

  మీ పదాలలోనే ” ఎవరి పిల్లలకోసం వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే.” వాటినే నేను trials అని అర్ధం చేసికున్నాను. వ్రాసేశాక వాటికి అంత ప్రాధాన్యత లేదూ అంటే అయిఫొదుగా! ఇంకో విషయం- ” నచ్చకుంటే ప్రచురించకండి” అనే మాటే లేదు. Public domain లో వ్రాస్తున్నప్పుడు, నచ్చినా నచ్చకపోయినా వ్యాఖ్యలు ప్రచురించే ధైర్యం ఉండాలి. లేదా నోరుమూసుకుని కూర్చోవాలి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: