బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఇదివరకటి రోజుల్లోనూ పిల్లలు పై ఊళ్ళకి వెళ్ళి హాస్టళ్ళలో ఉండి చదువుకునేవారు. కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళుండి, పని కానిచ్చేసేవారు.కానీ ఈ రోజుల్లో పిల్లలు పైచదువులకి పై ఊళ్ళకి వెళ్ళారూ అంటే చాలు, పేపర్లలో చదివే వార్తలు, సంఘటనలూ చూసి, గుండె బేజారెత్తిపోతోంది.పై ఊళ్ళకనేమిటిలెండి, ఉన్న ఊళ్ళో చదివినా, ఎప్పుడు ఏం కొంపముంచుతాడో అనే భయం.అంటే దీనర్ధం పిల్లలకి values తగ్గాయనుకోవాలా, లేక అక్కడి peer pressure కారణంగా అనుకోని పరిస్థితుల్లో చిక్కడిపోతున్నారో తెలియడం లేదు. ఏది ఏమైనా తల్లితండ్రులకి మాత్రం దినదినగండం గా తయారయింది ప్రస్తుత పరిస్థితి.పిల్లలు ఎవరైనా, ఎక్కడివారైనా వాళ్ళని కన్నతల్లితండ్రులు పడే బాధ కి, కులం, ప్రాంతం, భాష అనే వ్యత్యాసం ఉండదు.

   ఈరోజుల్లో వచ్చిన వాతావరణ మార్పుల ధర్మమా అని, ప్రతీదీ super fasటే. ఇప్పటి తరం తల్లితండ్రులకి గుర్తుండే ఉంటుంది, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇళ్ళల్లో కట్టుబాట్లు ఎలా ఉండేవో. అవేవో dictatorship లాటివీ, మనం మన పిల్లల్ని అలాటి వాతావరణం లో పెంచడమా అనేసికుని, so called freedom లాటివి ఇచ్చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. It is their own making, can not blame anybody..స్వేఛ్ఛ ఇవ్వాలి, కాదనం, కానీ ఎంతవరకూ? ఇదివరకూ ఇచ్చేవారు, కానీ ఆ ఇచ్చిన స్వేఛ్ఛని monitor చేసేవారు.ఈరోజుల్లో టైముండడం లేదు.ప్రతీదానికీ change, development అంటూ పేర్లోటీ..ఏమైనా అడిగినా, ” మీ రోజుల్లోలా ఉండమంటే ఎలా కుదురుతుందీ, కాంపిటీషన్ ధర్మమా అని పిల్లలు అన్నిరంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలీ, వాళ్ళకి free hand ఇస్తేనేకానీ కుదరడం లేదూ అంటూ ఏవేవో కారణాలు చెప్తుంటారు.

    మొన్నెప్పుడో పేపర్లో చదివాను- అమలాపురంలో ఒక అమ్మాయి, తన తల్లితండ్రులు నిశ్చయించిన సంబంధానికి ఇష్ట పడక, తాను ప్రేమించిన పిల్లాడితో పారిపోతూ, కొత్తపేట దగ్గర వాళ్ళు ప్రయాణం చేస్తూన్న కారు పంట కాలవలో పడడంతో , ఈ పిల్ల కాస్తా మరణించింది ప్రమాదంలో ! పైగా ఈ పారిపోవడాలూ వగైరా process అంతా, ఈ అమ్మాయి ప్రేమించిన పిల్లాడి ఫ్రెండ్స్ ఎరేంజ్ చేశారుట! వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ పిల్లమాత్రం వెళ్ళిపోయింది. ఏం సాధించిందిట? పైగా ఏదో సినిమాల్లో చూపించినట్టు, ఎవడో రావడం ఏమిటీ, ఈ పిల్లేమో పెళ్ళికోసం తల్లితండ్రులు ఇంట్లో ఉంచిన 30 లక్షల రూపాయలూ, బంగారమూ తీసికుని పారిపోవడేమిటీ.. వివరాలు ఇక్కడ చదవండి..

   వాడెవడో అదేదో సినిమాలో అలా చేశాడుట అందువలన మనమూ అలాగే చేద్దామూ అనుకోడమూ- ఇంకో ఆలోచన రాదసలు. దిక్కుమాలిన సినిమాలు కూడా అలాగే తగలడ్డాయి. ఓ అర్ధం పర్ధం ఉండదు.ఏమైనా అంటే, సినిమాలేం చేస్తున్నాయీ, క్రమశిక్షణ అనేది తల్లితండ్రులు నేర్పాలికానీ అంటారు ఆ సినిమా వాళ్ళు. వీళ్ళేమో సినిమాల ప్రభావం ఎక్కువవుతోందీ అంటారు. ఇవన్నీ కాశ్మీరుసమస్య లాటివి. Final losers are parents..

    నిన్నెక్కడో విశాఖపట్నం రుషి కొండ బీచ్ లో ఓ అరడజనుమంది పిల్లలు ( బి.టెక్ మొదటి ఏడాది) సముద్రంలో గల్లంతయ్యారుట.పోలీసులూ, మత్స్యకారులూ చెప్తున్నా వినకుండా సముద్రం లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ రోజూ దేశంలో ఎక్కడో అక్కడ ఇలాటివి సామాన్యం అయిపోయాయి. ఇలాటి సంఘటనలకి అసలు అంతెక్కడా?

Advertisements

9 Responses

 1. ఈ విషయం మీద టపా రద్దామనుకుంటున్నా, మీరు రాశారు, బాగుంది.

  Like

 2. ఆలోచించదగ్గ విషయాన్ని ప్రస్తావించారు. సంతోషం.

  కట్టుబాట్లు యెపుడూ ఉన్నాయి. కాకపోతే లోగడ యింతగా మీడియా, సినిమాల ప్రభావం లేదు. రేడియోనే‌ గొప్ప అనే రోజులవి. అందుచేత పిల్లలకు తల్లిదండ్రులు, గురువులే role models. కాని యీ రోజుల్లో వారికి విస్తృతమైన choice ఉంది కదా.

  ప్రాప్తే షోడశ వర్షాణి పుత్రం మిత్రవదాచరేత్ అని సుబాషితం. కాని యెందరు పెద్దలు దాన్ని పాటిస్తున్నారు? నచ్చచెప్పలేక నిర్బంధిస్తున్నారు – సరికాదు కదా? దాని వలన తెలిసీ తెలియని పిన్నలు వయసు ప్రభావంతో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆనక అనర్థం యేదో జరిగాక పెద్దలు తలబాదుకుంటున్నారు. పిల్లలను స్నేహగౌరవాలతో‌ తీర్చిదిద్దవలసిన బాధ్యతను పెద్దలు విస్మరిస్తూ పిల్లలను తప్పు పట్టటం కనిపిస్తోంది. బాధాకరం.

  రాజకీయ నాయకులను ప్రస్తావించారు. ఇది కూడా ఆలోచించవలసిన విషయమే. మహాత్మా అని పేరుబడ్డ గాంధీగారే విద్యార్థులను రాజకీయాలలోనికి లాగారు నాడు. ఈనాడు మనం, అలా కాదు రాజకీయనాయకులు తప్పు చేస్తున్నారు అనటం వలన ప్రయోజనం లేదు. పైగా ఇటూంటి వాక్యాలను నేటి తరం ప్రజలు తమ తమ రాజకీయ దృక్పధాల్లోంచి చూసి మీ విమర్శలేవో తమ అభిమాన మాననీయ/మానవీయ ఉద్యమాల మీద చేసిన విమర్శలని భావించే ప్రమాదం ఉంది.

  బొడ్డూడని పిల్లల చేత జెండాలూ, నోట నినాదాలూ చూస్తూనే‌ ఉన్నాం కాని అటువంటి వారసత్వాన్ని వదులుకోమని చెప్పగల స్థితిలోనూ‌ లేము కద. ఒకప్పుడు విద్యార్థులం ‘విశాఖ ఉక్కు – ఆంద్రుల హక్కు’ అంటూ నినాదాలు చేస్తూ‌ ఊరేగుతున్నాం. ఊరేగింపులో elementary school పిల్లలూ ఉన్నారు. ఒక పిల్లాడు పక్క వాడితో ‘ఒరే ఉక్కంటే ఏంట్రా?’ అనటం విన్నాను.

  పిల్లలు తలిదండ్రులనూ‌గురువులనూ role modelsగా స్వీకరించాలన్నది నిజమే కాని అటువంటి వాతావరణాన్ని పెద్దలే కల్పించవలసి ఉంటుంది. రకరకాల ప్రలోభాలవలల రోజుల్లో పెద్దలు మరింత శ్రధ్ధగా ఆ బాధ్యతను నిర్వరించాలని గుర్తించగలిగితే, చాలా చాలా మంది పిల్లలను రక్షించుకోగలం.

  Like

  • ఇది బాగుంది, గాంధీ కాలంలో ఇప్పటిలాగా కిరాయి విధ్యార్థులు, కిరాయి ఉజ్జమాలు, రాజకీయ నిరుద్యోగ విజయాలు వుండేవి కావనుకుంటా.

   30లక్షలతో వుడాయించిన ముందుచూపు ప్రేమ, యముడు చల్లగా చూసివుంటే ఓ ఏడాది జల్సాగా గడిచేదేమో. ఆ తరువాతి కథలు మామూలే… గృహహింస, 498A, పెటాకులు, కోర్ట్ల వాయిదాలు, లాయర్లను, పోలీసులను మేపడాలు…
   /పోలీసులూ, మత్స్యకారులూ చెప్తున్నా వినకుండా /
   పోలీసులు ఆ సమయంలో అక్కడెందుకున్నారు? కనీసం భజరంగదళ్ కార్యకర్తలున్నా వాళ్ళ ప్రాణాలు నిలిచేవేమో! 😦

   Like

 3. శర్మగారూ,

  ధన్యవాదాలు..

  శ్యామలరావు గారూ,

  నేను ఎవరినీ ఉద్దేశించి వ్రాయలేదు. మీరన్నట్టు ఎవరెవరివో మనోభావాలు కించపరచినవాడినౌతాను. ఆ కాస్తా తీసేస్తే పోలేదూ…రోజులసలే బాగోలేవు..

  Like

 4. రెండు మూడేళ్ళ బదిలీలలోవూరులెన్ని మారినా
  కేంద్రీయ విద్యాలయాల వల్ల పిల్లల స్కూలు
  చదువులు హాయిగా గడిచాయి.
  ఆనంద్- విద్యాపూర్ (గుజరాత్) లో మా అమ్మాయి
  భుఖంపం, సబర్మతి ఎక్స్ప్రెప్రెస్సు , ఉచకోతలు
  అన్నిటినీ ప్ర త్యక్షంగా అనుభవించింది.
  ఇంజనీరింగు అయ్యిన వెంటనే పెళ్లి కుదిరిపోయింది.

  Like

 5. డాక్టరుగారూ,

  మీరన్నట్టు కేంద్రీయ విద్యాలయాల ధర్మమా అని, మా పిల్లలూ మేముండే చోటే చదువుకున్నారు…

  Like

 6. Snkr,

  మీరన్నట్టు.. ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలే…life goes on..

  Like

 7. అందుకే మనవాళ్ళు “వినాశకాలే విపరీతబుద్దీ” అన్నారు.

  Like

 8. రావుగారూ,

  ప్రస్థుతం అదే పరిస్థితిలో ఉన్నారు…, వాడెవడో plan చేసి మరీ తండ్రిని చంపేశాడని పేపర్లో చదివాము. ఈ లెఖ్ఖన ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత ఊరికే పెట్టలేదనిపిస్తోంది…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: