బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొత్తదేదో కొనాల్నుండడమే కాదు….


    ఏమిటో ఇదివరకటి రోజుల్లో అయితే, పుట్టినరోజులకి ఇంట్లోవారికి ( పిల్లలూ, ఇంటావిడ) ఏదైనా బహుమతీగా ఇవ్వాలంటే, ఏదో ఒకటి కొని, ఇంకోరెవరికీ చెప్పకుండా, అదే రోజు ఇస్తే అందులో ఒక అందమూ, surprise elemenటూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అలా కుదరడంలేదు. కారణాలు మరేమీ పెద్దవి కాదనుకోండి, అయినా ఆ అవకాశం కూడా కలగడంలేదు.

    పిల్లల విషయంలో వాళ్ళకి అవసరమైనవి, వారే కొనుక్కుంటారులే అనే సదుద్దేశ్యంతో ఏ Shopperstop గిఫ్ట్ ఓచర్లో ఇచ్చేస్తున్నాము. అదీ కాకపోతే, ఓ కవరులో మనకి ఓపికున్నంత డబ్బు పెట్టేసి చేతిలో పెట్టేస్తే సరిపోతోంది.మరీ, మనవరాళ్ళకీ, మనవలకీ అలా డబ్బూ, గిఫ్ట్ వోచర్లూ పెడితే ఏమ్ బావుంటుందీ, పోనీ అలాగని ఏదైనా కొందామా, అంటే, నేను కొందామనుకున్న వస్తువు అప్పటికే వాళ్ళ అమ్మా, నాన్నలు కొనేయడం ధర్మమా అని, దీంట్లో ఏమీ novelty ఉండడం లేదు.పైగా మనం ఇచ్చినదాన్ని చూస్తూనే–“అర్రే తాతయ్యా, నా దగ్గర ఇదివరకే ఉందీ.”.. అనడం, దాన్ని సద్దడానికి పిల్లలు ఏదో మొహమ్మాటానికి వాళ్ళతో, “నీదగ్గర ఉన్నది, పాత వెర్షనూ, ఇది కొత్తదీ..” అనేసి ఊరుకోబెట్టడమూ పిల్లల్నీ, మనల్నీ..ఏమిటో ఈ రోజుల్లో ప్రతీదానికీ( ఒక్క కట్టుకున్నదానికి తప్పించి) వెర్షన్లూ అవీనూ…

    ఇంక ఇంటావిడతో అయితే, పుట్టినరోజుల గిఫ్టుల విషయంలో, ఇదివరకటి రోజుల్లో అయితే, ఇంట్లో అందరికీ ఉపయోగించే వస్తువోటి తెచ్చేసి, దానికే నీ పుట్టినరోజు గిఫ్టూ అని పేరెట్టేసి లాగించేసేవాడిని !! ఆనాటి కాలమానపరిస్థితుల బట్టి, పాపం తనూ సరిపెట్టేసికునేది, అప్పట్లో మరీ వీధిన పెట్టకుండా !! కానీ రోజులు గడిచే కొద్దీ, ఎప్పటికో అప్పటికి తను ఇన్నాళ్ళూ కడుపులో దాచుకున్నవేవో , రావొద్దూ మరీ. కడుపులో తొమ్మిది నెలలూ దాచుకున్న పిల్లల్నైతే 1974 ఒకరినీ, 1980 లో ఒకర్నీ, బయటకు తెచ్చేసి, వాళ్ళని పెంచి పెద్దచేసి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేటట్టు చేసేసి, వాళ్ళకో తోడూ ఏర్పాటు చేసింది.

    కానీ ఆ మిగిలినవాటిని కూడా బయటకు తేవొద్దూ మరీ, ప్రతీ పుట్టినరోజుకీ, తనను నేనూ పిల్లలూ ఎలా “ taken for riడ్డో ” అల్లుడితోనూ, కోడలుతోనూ, మనవళ్ళూ, మనవరాళ్ళతోనూ,ఓ చిఠ్ఠా తెరిచి, చెప్పుకుని సంతోషిస్తూంటుంది…అయినా ఇన్నేళ్ళొచ్చినతరువాత ఇంకా surpriజులు ఇచ్చే ఓపికెక్కడా? అయినా ఓసారి ప్రయత్నిద్దామని, ఈసారి ( oct 15) ఓ రెండు మూడు రోజులు ముందుగానే, పాపం ఎప్పణ్ణుంచో అడుగుతోందీ, ఆ మాయదారి సెల్ ఫోను మారుస్తారాఅంటూ, పోన్లే అదేదో తెద్దామని కొట్టుకి బయలుదేరాను.పోనీ అందరూ ఈ రోజుల్లో తెప్పించుకునేటట్టు అవేవో online stores ల ద్వారా తెప్పిద్దామా అంటే, ఏదో ఒకటి తెప్పించామే అనుకోండి, అదేదో వాడడం తెలియకో, సరుకులోని నాణ్యత తక్కువో అయితే, మళ్ళీ మార్చడం అవీ అదో గొడవా.

    ఈమధ్యన mystery shopping సందర్భాల్లో ప్రతీ పెద్ద పెద్ద షాపులకి వెళ్ళడమోటొచ్చిందిగా, పోనీ ఈసారి ఓ genuine shopper గా వెళ్దామూ, లేకపోతే ఆ అలవాటు మర్చిపోయినా మర్చిపోవచ్చూ, అనే సదుద్దేశ్యంతో, మా ఇంటావిడ దగ్గరుండేది ఎలాగూ Nokia ఏ కదా అదేదో తెచ్చేస్తే సరిపోతుందీ అని బయలుదేరాను, మరీ ipad లూ, Galaaxiలూ, Smartphonలూ తెచ్చే ఓపిక లేక నిజం చెప్పొద్దూ.. వాడిదగ్గరకెళ్ళి, ఏదో ఫలానా రేంజ్ లో ఓ ఫోను చూపించూ అని అడిగాను.ఏమిటేమిటో చూపించేసి ఏవేవో చెప్పేశాడు. అవేమీ అర్ధం అవలేదనుకోండి, అయినా ఓ టోపీ అవీ పెట్టుకుని వెళ్ళి, వాడు చెప్పినవాటికన్నీ తలూపేస్తే ఎలా, నాకూ తెలుసునని పోజు పెట్టొద్దూ? అదేదో Wi-fi ఉందా దీంట్లో అని అడిగాను. నిజం చెప్పాలంటే నాకు Hi-fi కీ Wi-fi కీ తేడా ఈషణ్మాత్రం తెలియదంటే ఒట్టు ! ఏదో వినడానికి బావుంది కదా అని, అలా అడిగాను, ఆ కొట్టులోవాడికి అర్ధం అయిందో లేదో– ఉందీ అన్నాడు.

   అయినా ఈమధ్యే తెలిసిందిలెండి, ఈ Wi-fi అంటే ఏమిటో, అదీ మా అమ్మాయీ అల్లుడూ ఇచ్చిన Tab ధర్మమా అని- ఇంట్లో ఉపయోగిస్తే డబ్బులవవూ, బయటకివెళ్ళి ఉపయోగిస్తే బిల్లులు తడిపిమోపెడవుతాయీ అని!ఏదో మొత్తానికి అదేదో touch screenట తీసికున్నాను.ఇంటికొచ్చి, మా మనవడు నిద్రపోతూండగా, అబ్బాయికిచ్చి ఆ పాతదానిలోని siమ్మో,సింగినాదమో అదేదో మార్పించి, ఇంటావిడ చేతిలో పెట్టేస్తే ఆవిడే ఏదో తిప్పలు పడుతుందీ అనుకుని, చేతిలో పెట్టేశాను ఓ రెండు మూడు రోజులు ముందుగానే. పిల్లల్ని అడిగే కొన్నారా అంటూ ఓ query.. ఏదో సరదా పడి నాకు నచ్చిందేదో కొంటే మళ్ళీ ఇదోటా?

    దీనిల్లుబంగారంగానూ, దాంట్లో Wi-fi లేదుట. పైగా ఆ Touch screeనో అదేదో, త్వరగా జరగదూ, జరపాలని చూడ్డం, ఎక్కడ నొక్కితే అదేదో open అయిపోవడమూ, ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది! ఏమిటో స్వంతంగా ఏదో మొదటిసారి కొందామనుకుంటే ఇలా ఉంది నిర్వాకం! ఇంటావిడ మొహంలోకి చూడాలంటేనే కుదరలేదు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, కొత్తది కదా,అలవాటయ్యేకొద్దీ అదే కదులుతుందిలే అంటూ.. ఇదేమైనా కొత్త చెప్పుల్లాటివా ఏమిటీ, వాడేకొద్దీ కఱవడం మానేస్తాయీ అనడానికీ?

    ఇలా కాదనుకుని, పోనీ మారుస్తాడేమో అని అడుగుదామా అంటే, ఒప్పుకుంటాడో లేదో, అయినా అదేదో Wi-fi ఉందీ అన్నాడూ, అదిలేదూ అని ఓ సాకు చెప్పి మారుస్తావా అని ఫోనులో అడిగాను.మారుస్తానూ అని ఆ ఫోనెత్తిన పిల్ల చెప్తే, ఆ ఎండలో పడి పోయాను. చెప్పానుగా నా Mystery Shopping “తెలివితేటలు”, అన్నీ ఉపయోగించేసి, తప్పంతా వాళ్ళదే అన్నట్టు చెప్పేశాను.నా అవతారంచూసి, పోనీ పెద్దాయన్ని శ్రమ పెట్టడం ఎందుకులే అనుకుందేమో, ఇంకో మోడల్ చూపించింది.చూపించింది కదా అని, ఈ రెండు మూడు రోజుల్లో నేర్చుకున్న కొత్త vocabulary అంతా ఉపయోగించేసి, ఫలానాదుందా, ఫలానాదుందా అంటూ అడిగేశాను.

    ముందుగా అది సరీగ్గా “జరుగుతోందో లేదో ” చూసుకున్నాను.మనలో మనమాట, నాకున్న సందేహాలన్నీ తీర్చేసికుని, ఆ అమ్మాయికి “God bless you” చెప్పేసి,ఎక్కువయిన డబ్బులేవో ఇచ్చేసి ( కొత్తదానికైన ఖరీదు మాత్రమే), కొంపకు చేరాను.

    కొత్తగా తెచ్చింది, మొత్తానికి నా పరువు కాపాడింది.మనం చెప్పినట్టుగా వినడమూ, ఓ పధ్ధతిలో నడుచుకోడమూ లాటివన్నమాట! అయినా నాకేమిటీ, నేనేమైనా ఉపయోగించుకోవాలా ఏమిటీ, నిన్నటినుంచి మాత్రం నెట్ ఎడా పెడా ఉపయోగించేస్తోంది… నాకంటే ముందరే మెయిల్స్ చెక్ చేసేసికోడం లాటివి…

Advertisements

4 Responses

 1. చూసేరా మరి.. మీరు కొనితేవడమే ఆలస్యమయింది కాని ఆవిడ చూడండి..ఎంచక్కా ఎంతబాగా వాడుకుంటున్నారో…
  “హమ్మయ్య.. ఇన్నాళ్ళకో మంచిపని చేసేరు..” అన్న డైలాగ్ అన్నారా.. ఇంకా లేదాండీ..(సరదాకి అన్నానంతే..)

  Like

 2. కాలయాపన అయిన పుట్టిన రోజు శుభాకంక్షలు మీ శ్రీమతిగారికి !
  ఎలాగైతేనేమి, కష్టపడి,చాకచక్యంగా ఆవిడకు ఉపయోగపడే కానుకఇచ్చారు.
  బేష్! మరి మీకు తిరుగులో ఏమి ముట్టింది ? అ రోజెలా గడిచింది?
  మరో టపా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నాము.

  Like

 3. లలితగారూ,

  డయలాగ్గులకేమి తక్కువా? అవీ అయ్యాయి..ఆ handset మా మనవడు(అగస్థ్య) చేతిలో రూపం మారిపోయి రెండేళ్ళయింది. ఏదో అతుకులూ, బొతుకులూ వేసి లాగించేస్తోంది…దాని షేప్పే మారిపోయింది మరీ.. వాడిక్కూడా నచ్చడంలేదు. దానితో ఇంకో దారిలేక కొనేయాల్సొచ్చింది…

  డాక్టరుగారూ,

  ఆవిడ తరపున ధన్యవాదాలు…ఆరోజేమీ లేదు… ఆదివారం ( తిథుల ప్రకారం), అందరితో కలిసి, బయటకి వెళ్దామని ప్లానైతే ఉంది…

  Like

 4. తనకున్న తెలివితేటలకి తగినట్టుగా, విజయవాడలో సీటు దొరికిన కాలేజీలో సీటు దొరికిన డిగ్రీ చదివాడు రాజారావు. ఓ మాదిరి కాలేజి. కో ఎడ్యుకేషన్‌. నలభయ్‌ మందున్న క్లాసులో పదిమంది అమ్మాయిలు. అందులో ఒకర్తి రమాదేవి. ఎలా మొదలయ్యిందో తెలీదు. తనేమీ గొప్ప అందగాడూ కాదు. ఆస్తిపరుడూ కాదు, తెలివయిన వాడు అసలే కాదు. అత్తెసరు మార్కులతో పాస్‌ అవుతూ చెప్పుకోతగ్గ ఏ గొప్ప విషయమూ లేని సర్వసాధారణమయిన రాజారావుకు రమాదేవి ‘గర్ల్‌ఫ్రెండ్‌‘ అయి కూర్చుంది. రాజారావు దృష్టిలో రమాదేవి చాలా తెలివయింది. అందరి దృష్టిలోనూ ఆమె అందగత్తెకిందే లెక్క. వాళ్ల నాన్నకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో చాలా భూములూ గట్రా ఉన్నాయని కూడా క్లాసందరికీ తెలుసు. అసలు ఆమె నెల్లూరు వదిలి విజయవాడ వచ్చి ఆ కాలేజీలోనే ఎందుకు పనికిరాని చదువు చదవాల్సి వచ్చిందో కూడా రాజారావుకు గుర్తులేదు.మీరు లవ్వర్సా” అని అడిగేవారు ఫ్రెండ్స్‌ రాజారావును. “పెళ్లి చేసుకుంటారా,” ” ఏరా ఎంత దూరం వచ్చావ్‌… చెయ్యెయ్యనిచ్చిందా?” ఇంకా చాలా ఎన్నెన్నో.”తనకి నేనంటే ఇష్టం. నేనే ఏమీ ఆలోచించుకోలా” అని చెప్పేవాడు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: