బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– enjoy your job…


    నేను Mystery Shopping లు చేస్తున్న ఒక సంస్థ వారు, మొన్న శనివారం నాడు, ఇక్కడ పూణే లో ఓ interaction session ఒకటి ఏర్పాటు చేసి, రమ్మనమని ఫోను చేశారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఓ యాభై పైగా ఆడిట్లు చేశానులెండి. ఓ మూడు గంటల కాలక్షేపం. అక్కడకి వచ్చిన పాతికమందిలోనూ, ” తాతయ్య” ని నేనొక్కడినే. మిగిలినవారిలో ఓ ఇద్దరు ladies నాకంటే ఎక్కువ ఆడిట్లు చేసినవారు.కారణమేమిటంటే, వారు కొన్ని కొత్తసంస్థలకి కూడా చేస్తూంటారుట. ఆ వివరాలేవో చెప్పమని అడగ్గానే, ఒకసారి google లోకి వెళ్ళి వెదికితే కావలిసినన్ని దొరుకుతాయీ అని చెప్పారు. సరే ఇంటికి వెళ్ళి అదేదో చూద్దాములే అని వదిలేశాను. తరువాత ఇంకో రెండింటిలో జాయినయ్యాను.

    మేము ముగ్గురం తప్ప, మిగిలినవారందరూ ఈమధ్యనే దీంట్లోకి వచ్చినవారు. ఆ సంస్థవారు, మమ్మల్ని,వాళ్ళందరికీ explain చేయమన్నారు. ఏదో నాకు తెలిసినవీ, నా అనుభవాలూ వారందరితోనూ పంచుకున్నాను. అందరికీ ఒకటే సందేహం- ఇంత వయస్సొచ్చినా అంత ఉత్సాహంగా ఎలా చేయకలుగుతున్నానా అని ! దానికి సాయం, ఆ మీటింగు పెట్టినవాళ్ళు కూడా, ” మాకు పూణె లో ఎప్పుడైనా అకస్మాత్తుగా అవసరం వచ్చినప్పుడల్లా, మాకు తెలుసు ఫణిబాబు మా rescue కి వస్తారూ అని, దానితో ఆయనకు ఫోను చేసీ చేయగానే Ok .. no problem.. అనేయడం, మర్నాడు వెళ్ళి చేసేయడం.”.

    వాళ్ళందరూ వ్యక్తపరిచిన సందేహానికి నేను ఒక్కటే సమాధానం చెప్పాను– I enjoy the job… bottomline is ” enjoy”.. మనం ఏ పనిచేసినా దానిని enjoy చేస్తేనే దానికి న్యాయం చేయగలం. ఉదాహరణకి మా అబ్బాయి, ఇదివరకు చేసే 9-7 జాబ్ కంటే, ఇప్పుడు తను నడుపుతున్న tenderleaves లోనే ఎక్కువగా enjoy చేయకలుగుతున్నాడు. పైగా రోజుకి 24 గంటలుకూడా సరిపోవడం లేదు. ఊరికే పుస్తకాలతోనే సరిపెట్టికోకుండా, మిగిలిన వాటిలోకీ diversify Workshop for children – Times Of India చేస్తున్నాడు. దీనికి సాయం తను ఉపాధి కల్పించిన పదిమందీ కూడా ఇదే కోవకి చెందినవారవడంతో ఇంకా సంతోషపడుతున్నాడు.వారంలో ఒకటి రెండు రోజులు వెళ్తూంటాను, అప్పుడు చూస్తూంటాను అక్కడ జరిగేవన్నీ…

    ఇంక నేను నా Mystery Shopping ల సందర్భంగా ఈమధ్యన వరుసగా ఓ అరడజను Jewellery Shops కి వెళ్ళవలసొచ్చింది. అసలే బంగారం రేటు చుక్కల్నంటుకుంటున్న ఈ రోజుల్లో ఈ గొడవేమిటిరా బాబూ అని అనుకున్నా, పోనీ ఈ వంకతోనైనా కొద్దీ సమయం గడుపుదామని ఒప్పేసికున్నాను.నేను చేసినవి Tanishq, Gitanjali, Sparkles షాపులు. వీటిలో రెండు Tanishq వి. పైగా వాటిలో ఏదో ఒక వస్తువు కూడా కొనాలన్నారు. మళ్ళీ ఇదో తిరకాసా అనుకుని, కొనడానికి డబ్బులిస్తారా అని అడిగాను. మరేంలేదూ, ఇదివరకెప్పుడో SOTC వాళ్ళది ఆడిట్ చేయమని,పైగా ఓ ఇద్దరికి ఓ ప్యాకేజీ టూర్ బుక్ చేయాలన్నారు. బుక్కింగు ఏమైనా ఊరికే చేస్తారా ఏమిటీ, 20,000 ముందుగా కట్టాలిట. అదేదో“ఆయనే ఉంటే…” అన్న సామెతలాగ, నాలాటి కేంద్రప్రభుత్వ పెన్షనరు దగ్గర అంతడబ్బు ఎలా ఉంటుందీ, నేను చెయ్యనూ అని చెప్పేశా. కాదూ, పదిరోజుల్లో నా రిపోర్టు రాగానే ఆ 20.000లూ reimburse చేసేస్తామూ అన్నారు. నేను ఒప్పుకోలేదు.. చివరకి వాళ్ళు ఆ 20,000 లూ నా ఎకౌంటులోకి ట్రాన్స్ఫర్ చేశారూ, తరువాత ఆ డబ్బే ఉపయోగించి,ఆ ఆడిట్టేదో పూర్తిచేశాను.

    ఈసారి Tanishq కి, ముందుగా ఓ 10,000 పెట్టి ఏదో ఒకవస్తువు కొని, బయటకు వచ్చి, మళ్ళీ లోపలకి ఈ ఏజన్సీ వాళ్ళిచ్చిన ఓ అథారిటీ లెటర్ తీసికెళ్ళి, చూపిస్తే ఆ వస్తువు తిరిగి తీసికుని, మన డబ్బులు పుచ్చేసికోవచ్చుట ! ఇదీబాగుందీ అనుకుని ఒక outlet ఒకరోజూ, ఇంకోటి మర్నాడూ చేసేసి, అదే 10,000 లనీ తిప్పేశాను…మిగిలిన రెండింటిల్లోనూ పేద్ద ఖరీదారీ ఏమీ లేదనుకోండి, ఊరికే రెండు మూడు ఫొటోలు తీయడమే..

   అలాగే ఆమధ్య NIKE కి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ ఏమిటో తెలిసికునిరమ్మన్నారు. అప్పటికే ఆ షాప్పుకి ఒకసారి వెళ్ళి కాకమ్మ కథలు చెప్పొచ్చాను. మళ్ళీ ఆ కొట్టువాడు గుర్తుపట్టి ఏమైనా అంటే..వచ్చినప్పుడల్లా ఈయన తిక్కశంకరయ్య ప్రశ్నలేస్తూంటాడూ, కొనేబేరం కాదూ అనుకోవచ్చుగా. దానికీ ప్రిపేర్ అయ్యి, మా మనవడు ఆదిత్యకి స్కూల్లో ఏదో వ్యాసం వ్రాయాలిటా, ఈ shoes లో ఉపయోగించే టెక్నాలజీ గురించీ, బాబ్బాబు అదేదో చెప్పి పుణ్యం కట్టుకో అని అడగ్గానే ఆ టెక్నాలజీ గురించి ఓ లెక్చరిచ్చేశాడు. ఆ వివరాలు మా ఏజన్సీవాళ్ళకి పంపేశాను.

    ఇలా అత్యవసరాలకి మా వాళ్ళందరినీ ఉపయోగించేస్తూంటాను! ఏదో నాకూ కాలక్షేపం అయిపోతోంది. చివరగా చెప్పొచ్చేదేమిటంటే, మనం ఏపని చేసినా దాన్ని enjoy చేస్తేనే దానికి న్యాయం చేసినవాళ్ళవుతాము…

Advertisements

6 Responses

 1. ఫస్ట్ చదువుతు ఉంటె ఏమి అర్ధం కాలేదు, ఈ మిస్టరీ షాపింగ్ ఏంటని. తరువాత గూగ్లమ్మ తల్లి చెప్పింది. భలే ఉంది మీ జేమ్స్ బాండ్ 007 job. ఇంటరెస్టింగ్…

  Like

 2. ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పని చెయ్యడం, చాలా బాగుంది.

  Like

 3. వెంకట్,

  వివరాలు చదివిన తరువాత తెలిసిందనుకుంటాను. గత అయిదారేళ్ళనుండీ, నాకు కాలక్షేపం ఇవీ, నా టపాలూనూ.. ప్రతీసారీ ఓ assignment చేసినప్పుడు, కొత్తవారితో పరిచయాలూ, నా వయస్సు ధర్మమా అని, ఆ malls లో ఉన్నవారు, నేను చెప్పేదీ, అడిగేదీ శ్రధ్ధగా వినడమూ, దానితో నేను చేస్తున్న పనికి justice చేయడమూ, నేను పనిచేస్తున్న ఏజన్సీ వాళ్ళకి కూడా నచ్చడమూ.. నా రిపోర్టులు వాళ్ళూ assess చేస్తారు. సాధారణంగా 8,9/10 వస్తూంటాయి. నెలలో ఓ పదిదాకా చేసినా, నాకూ శ్రమా ఉండదూ… రిటైరయి ఇన్నేళయినా బయటివారుకూడా, మన మాట వింటూంటారనుకుంటే అదో ego satisfaction. Overall I am enjoying…

  డాక్టరుగారూ,

  ధన్యవాదాలు…

  Like

  • మీ సమాధానానికి కృతజ్ఞతలు, ఏది ఏమైనా, ఇష్టమైన జాబు చేయడం లో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు.

   Like

 4. తాతయ్య సమస్య మనవడు తీర్చిన వైనం బాగుంది 🙂

  Like

 5. జీడిపప్పు గారూ,

  Thanks.. మా మనవడనే ఏమిటి, ఒక్కో చోట మా పెద్దమనవరాలు, ఇంకో చోట అంతకంటే చిన్నదీ, ఇంకా అవసరం వచ్చినప్పుడు, మా అగస్త్య.. ఉన్న నలుగురినీ ఉపయోగించేస్తూంటాను. కాలక్షేపం అయిపోతోంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: