బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదీ పట్టించుకుంటూ పోతే…..


    ఏమిటో అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది… మనకి తెలిసినవారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఇంట్లోని వారు మనకి కూడా తెలియపరిస్తే, ఒకసారి వారిని వెళ్ళి పలకరించేవారము కదా అని. తీరా మనకు తెలిసేసరికి it is too late..క్రితం పదిహేను రోజుల్లోనూ అలాటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. నేనైతే చాలా బాధపడిపోయాను. May be I belong to the old school of thought..అవతలివారిని అడిగినప్పుడు, వారిచ్చిన explanation విని, బహుశా నేనే over react అయ్యానేమో అనిపించింది.

    నిజమే కదూ.. ఎవరెలాపోతే మనకేమిటీ? మనం, మనవాళ్ళూ సుఖసంతోషాలతో ఉంటే సరిపోదూ, ఊళ్ళోవాళ్ళ గొడవంతా మనకెందుకూ అసలు? కానీ, అలాగ ఉండలేనే. ఓ విషయం చెప్పండి, ఈ ప్రపంచంలో, ఈ సొసైటీ లో ఉండే ప్రతీ మనిషికీ, ఇంకోరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడుతుంది. అలాగని మనకి తెలిసిన వారి దగ్గరకు వెళ్ళి, అదేదో పోలియో డ్రాప్పులకీ, మలేరియా ఇంజెక్షన్లకీ ఇంటింటికీ వెళ్ళే పబ్లిక్ హెల్త్ వాళ్ళలాగ, ” మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదూ.. ఎవరినైనా ఆసుపత్రిలో చేర్పించారా..” అంటూ అడగలేము కదా!

    మాకు గత మూడేళ్ళుగా పరిచయం ఉన్న వారి తండ్రి స్వర్గస్థులైన పదిహేనో రోజుకి తెలిసింది.మేముండే ఫ్లాట్ పక్కనే, ఆ ఫ్రెండు గారి ఆడబడుచు ఉన్నారు. అయినా they never felt like informing us.. తెలిస్తే ఏమి చేసేవాళ్ళమంట, ఓసారి వెళ్ళి పరామర్శించే వాళ్ళం. ఎలాగూ ఈ పరామర్శలనేవి, పెదవులమీద మాటలే. అదో formality.ఈ పరామర్శలు చేసేవాళ్ళెవరూ ఆర్చేవారూ, తీర్చేవారూ కాదు. అసలు బాధంతా ఆ పోయినవారి life partnerకి మాత్రమే. ఆ బాధెలాగూ ఎవరూ తీర్చలేరు.కొద్దిగా స్వాంత పలకరింపు తప్పితే ఇంకోటి లేదు. దొంగొచ్చిన ఆర్నెల్లకన్నట్టు, ఎప్పుడో వెళ్ళి పలకరించడానికీ బాగోదూ, అలాగని అసలు ఆ సంగతే తెలియనట్టు ఉండడం కూడా కుదరదు. అసలు అందుకే కదా ఎవరింట్లోనైనా అశుభం జరిగితే అందరికీ ఓ కార్డుముక్క వ్రాసిపడేసేవారు ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడైతే ఓ sms, ఇంకా డబ్బులున్నవారైతే పేపర్లో ప్రకటనలు. ఇవన్నీ ఎవరో వచ్చి ఉధ్ధరించెస్తారని కాదు, ఓ సంప్రదాయం.

    తరువాత పదిరోజులకి మా ఫ్రెండు ఇంటికి ఏదో పనిమీద వెళ్ళినప్పుడు, ఈ విషయం ప్రస్తావించి, తెలిపుంటే బావుండేదీ అన్నాను. దానికి వారు చెప్పింది విన్న తరువాతే మొదటి పేరాలో చెప్పినట్టు, over react అవుతున్నానేమో అనిపించింది. “మీకెందుకూ చెప్పడం, మా బంధువులేమీ కాదుకదా… అందుకే చెప్పవలసిన అవసరం అనుకోలేదూ..” as simple as that !!.అంటే చుట్టాలైతేనన్నమాట తెలియపరిచేదీ? ఇంక ఈ స్నేహాలూ, సింగినాదాలూ ఎందుకూ? అలాటప్పుడే అనిపిస్తూంటుంది ఎవడెలా పోతే మనకెందుకూ అని..
.

   కానీ ప్రపంచంలో ఇలాటి ప్రాణులు just one off అనుకున్నాను మొదట్లో. కానీ రెండు రోజులకే ఇంకో సంఘటన జరిగింది. గత 30 ఏళ్ళుగా పరిచయం. ఫాక్టరీలో స్నేహంలెండి. అలాగని ప్రతీరోజూ ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి కూర్చుండేటంత స్నేహం కూడా కాదు. రిటైరయ్యి ఇన్నేళ్ళైనా, వాళ్ళ కొడుకు పెళ్ళికి పిలిచాడూ, ఆ రిసెప్షన్ కి నేనువెళ్ళే టైములేక, మా ఇంటావిణ్ణీ, పిల్లల్నీ పంపేటంత స్నేహం అన్నమాట..ఎప్పుడు కనిపించినా, అతని భార్య ఆరోగ్యం విషయం ఎప్పుడూ అడుగుతూంటాను కారణం ఆవిడకి కొద్దిగా అనారోగ్యం. ఓ వారం ముందు కలిసినప్పుడు కూడా అడిగినా, అంతా బాగానే ఉందీ అన్నాడు. ఆ మధ్యన సడెన్ గా ఓ సాయంత్రం, మా ఇంకో ఫ్రెండు ఫోను చేసి, ఈ ఫ్రెండు భార్య పోయారూ అన్నాడు. అంటే సడెన్ గానా అన్నాను, కాదూ గత పదిహేను రోజులుగా హాస్పిటల్ లో ఉన్నారూ..అర్రే అతను చెప్పనేలేదూ కలిసినప్పుడూ, పోనీ ఒకసారి చూసివచ్చేవాళ్ళము కదా అని మాత్రం బాధ పడ్డాను. అసలు ఇప్పుడైనా ఫోను చేసిందెందుకా అంటే, వాళ్ళకి funeral rites కోసం ఓ పూజారి కావలిసొచ్చి, మేముండే ప్రాంతంలో ఉన్నాయనకి చెప్పడానికి !! పోన్లెండి అవసరానికైనా ఉపయోగించానూ అని సరిపెట్టుకున్నాను…

    ఇవన్నీ ఒక ఎత్తూ, ఈమధ్యన నాకు గత అయిదారు సంవత్సరాలనుండీ పరిచయం ఉన్న స్నేహితుడు చాలా కాలంనుంచి కనబడలేదు. మా స్వంత ఫ్లాట్ పక్కనే ఉంటూంటారు. వాళ్ళ అబ్బాయిని చూస్తూంటాను, కానీ వాళ్ళ నాన్నగారి welfare అడగాలని అనిపించకపోవడం నా తప్పే.ఎవరో ఒకాయన చెప్పగా తెలిసింది, ఆయనకి కాలు fracture అయి మంచంమీద ఉన్నారని, వెంటనే వెళ్ళి ఓ రెండు గంటలు గడిపొచ్చాను. అప్పుడు ఆయన కూతురు నాతో
మరీ మొహమ్మాట పెట్టేసి thank you uncle.. వగైరాలు చెప్పడం మొదలెడితే చెప్పాను- మరీ ప్రతీ రోజూ మంచంపట్టి, రోజూ చూస్తున్న మొహాలే చూసి చూసి బోరుకొట్టేసిన మీ నాన్నగారికి just for a change of scene.. గా వచ్చానూ, దీనికింత థాంక్సులూ అవీ అఖ్ఖర్లేదూ అని. చెప్పొచ్చేదేమిటంటే, ఇంట్లో ఎవరినైనా ఏ ఆసుపత్రిలోనైనా చేర్పిస్తే, కనీసం ఆ పేషెంటుకి తెలిసినవారికి, చెప్తే వాళ్ళకి తీరికుంటే, ఒకసారి చూసి నాలుగు కబుర్లు చెప్పి వెళ్తారు. అలాగని ఇదేదో పేద్ద ఘనకార్యం అనడంలెదు. Just a social obligation.. ఏదో ఉప్పూ కారంతింటూ, ఓ సంఘజీవిగా బతుకుతున్నాము కాబట్టి…

Advertisements

15 Responses

 1. మీరంటే వాళ్ళందరికీ యెంత ప్రేమ !!!! మీకు తెలిస్తే బాధ పడతారని చెప్పలేదు 🙂

  Like

 2. జనాలు మరీ mechanical అయిపోతున్నారండి, నాకు కూడా గుర్తు, ఇంతకు ముందు పోస్ట్ కార్డ్స్ వచ్చేవి. ఇప్పుడు ఫోన్స్ చేస్తున్నారనుకోండి. కాని మీకెందుకు చెప్పాలి అని అంటున్నారంటే నమ్మకం కలగడం లేదు. ఇంకా మాకు తగలలేదు లెండి అటువంటివాళ్ళు.
  చావు కూడా ఇరుకైపోయింది .
  :venkat

  Like

 3. మనుషులం సంఘజీవులుగా బతుకుతున్నామన్న మాట ఇంకా నిజమేనంటారా? మన జీవితాలు అక్షరాలా యాంత్రికమైపోయాయి. అయినవాళ్ళమధ్య పలుకరింపులే అవసరార్థం అయిపోతున్న రోజులు. పిల్లల్ని యంత్రాల్లాగా పెంచుతూ పెద్దల్ని యంత్రాల్లాగా వాడుకుంటూ, యంత్రాలమధ్య యంత్రాల్లాగే బ్రతికేస్తున్న జనం తరం యిది.

  Like

 4. మన రిటర్న్ టికెట్టు ఎప్పుడుందో ఎవ్వరూ చెప్పలేరు కదా!
  ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు బుర్ర పనిచెయ్యదు కదా!
  పోయిన మంచి మనిషి తన స్నేహితుల కు చెప్పమని చెప్పీ, వారు చెప్పకపోతే తప్పే.
  కొంచం పరిస్థితులకు అలవాటు పడక తప్పదు.
  మారుతున్న కాలం, మారిన విలువలు.

  Like

 5. బాగా చెప్పారు. ఎవరినైనా ఓదార్చడం నాకు ఇప్పటికీ ఎప్పటికీ వంట పట్టని ఓ కళ, మహామేత వేలాది మందిని ఎలా ఓదార్చాడో ఏమో, జైల్లో పెట్టారు కాబట్టి సరిపోయింది గాని, ఈ పాటికి నైజాము ప్రాంతంలో 600 అమరుల బంధువులతో పాటు వేలాదిమందికి బుగ్గలు బూరెలయి వుండేవి. గిన్నీస్ బుక్ వాళ్ళకు ఈ విషయం తెలుసో లేదో.

  Like

 6. @snkr (మహామేత వేలాది మందిని ఎలా ఓదార్చాడో ఏమో)
  వేల కోట్లు అప్పనంగా కష్ట పడకుండా వస్తే ఎంత ఓ…పిక అయినా వస్తుంది….ఆడా, మగా తేడా లేకుండా.. రోడ్ల మీదకు వస్తారు, ఆస్తులు కాపాడుకోడానికి అదే, ఓ….దార్చటానికి…

  Like

 7. @మౌళీ,

  పోనీ అలాగే అనుకుందాము… కానీ నేను వ్రాసిన రెండో సంఘటనలో వాళ్ళకి అవసరమయినప్పుడు మాత్రం గుర్తొచ్చాను. ఇలాటివి చూసినప్పుడే బాధేస్తుంది…

  @వెంకట్,
  అదేకదా వచ్చిన బాధంతా..రానురాను అనుబంధాలు మరీ commercialise అయిపోతున్నాయి…

  @శ్యామలరావు గారూ,

  ఇంకా పాతతరంవారు ఈ సంఘజీవీ అంటూ ప్రాకులాడుతున్నారు.. బహుశా కాలంతో మారాలేమో…

  @డాక్టరుగారూ,

  అది రైటేనండి. శుభకార్యాలవాటికి ఎవరైనా రాకపోయినా, పట్టించుకునేవారు లేరు, పోన్లెద్దూ ఖర్చైనా తగ్గిందీ అనుకునే రోజులు ఇవి… కానీ, రెండోదానికి, మరీ ఇంట్లోవాళ్ళే కాకుండా, పోయినవారి స్నేహితులూ, హితోభిలాషులూ కూడా బాధపడతారు కదా..అలాటివారి గురించే వ్రాసింది..

  @Snkr,

  మీరేమిటీ, నాకూ ఇదే సమస్య.. అలాగని వెళ్ళకుండాకూడా ఉండలేము కదా… ఇంక మీవ్యాఖ్యలోని later part కి no comments.. ఇలాటివాటిల్లోకి అడుగెడితే ఇంకోరికి కోపం రావొచ్చు..

  @kvsv,

  No comments.. మీరూ మీరూ చూసుకోండి…

  Like

 8. /ఇంక మీవ్యాఖ్యలోని later part కి no comments.. /

  🙂 😉

  Like

 9. sorry to express my opinion in english !
  This is my recent experience-
  Never dealt death so closely and it may seem small.
  My pet bird Mittu got sick due to tumor and the pain was so deep I couldn’t share with anybody. Prayed for his health and atlast vet said he is in very much pain ,we have to put him down. Still I didn’t inform my parents who took good care of him when they visited us and later on I think my brother shared the news.It’s not so easy to talk and chokes me when I think about Mittu.
  In tragedies like death, I don’t know how effective are condolences to the family but they work wonders when people are sick or recovering from accidents.

  Like

 10. @@@@పోనీ అలాగే అనుకుందాము…

  అలాగే అనుకోడం ఏమిటి అండీ, నేను జోక్ చేస్తేనూ ..

  రెండో సంఘటన అంటారా, మిస్టరీ షాపింగ్ వారికి గుర్తు రావడం లేదా. ఇదీ అంతే!

  మీ అసలు బాధ కి కారణం వాళ్ళెవరూ కాదు. అక్కడ మీరు చెప్పిన ప్రకారం అయితే ఎవరూ మీకు చెప్పాల్సిన సందర్భం నాకయితే కనిపించలేదు 🙂

  Like

 11. Snkr,
  Thanks…

  సమీరా,

  ఏ భాషలోనైతేనేమిటి, మీ భావాలు వ్యక్తపరిచారు. ఎవరైనా పోయినప్పుడు, మనం చేసేది,నేను నా టపాలో ప్రస్తావించినట్టుగా lip sympathy మాత్రమే, రైటే.. కానీ ఆ పరిస్థితుల్లో ఇంకోరెవరో వచ్చి ప్రకటించింది, ఎంత lip sympathy అయినా, దాని విలువ దానికెప్పుడూ దానికి ఉంటుంది. అంతదాకా ఎందుకూ, మా అమ్మగారు స్వర్గస్థులైనప్పుడు, మా చుట్టాలనుకునేవారికే పరామర్శించడానికి అయిదేళ్ళు పట్టింది
  inspite of my informing the news on the same day..ఎవరిష్టం వారిదీ అనుకుని ఆ విషయం వదిలేశాను. కానీ ఆ విషయం ఎప్పుడు తలచుకున్నా బాధేస్తుంది….

  మౌళీ,

  ప్రతీసారీ, మీరు నా టపాలమీద జోక్ చేస్తున్నారో, లేక సీరియస్సుగా చెప్తున్నారో ఇప్పటికీ అర్ధం అవదు. But I like your responses… to the point.always..
  చెప్పానుగా బహుశా old school కి సంబంధించిన వాడినవడం చేత, ఇలాటివి జరిగినప్పుడు, బాధపడుతూంటాను. కానీ ఒక్కొక్క ” అనుభవం” జరిగేటప్పడికి కొద్ది కొద్దిగా maturity లాటిది వస్తోంది. Though late than never…

  Like

 12. నిజం చెప్పి అసలే బాధలో ఉన్న 🙂 మిమ్మల్ని ఇంకా కష్టపెట్టడం ఎందుకు అని అలా !!

  ఇంట్లో వాళ్ళ ద్వారా తెలియాల్సినవే తెలియడం లేదు. మీరు చెప్పిన సంఘటనలో మీరు అసలు వ్యక్తులని నిందిస్తున్నారు. అది చాల పొరపాటు.
  ఇలాంటివి వాళ్ళు తప్పకుండా చెప్పవలసినవారికి మర్చిపోకుండా తెలియచేస్తారు. మిగిలిన మనలాంటి వాళ్లకి నెట్వర్క్ ద్వారానే తెలియాలి. లేదంటే మనం వారిని ఏమంతగా పట్టించుకోనట్లు అన్నమాట.
  ఇలా పెద్దకర్మ లోపు తెలిసి పలకరించి వెళ్ళిన వారిని కర్మ రోజు తప్పకుండా పిలుస్తారు.

  పెళ్లి కి డబ్బును పట్టి పిలుస్తారు, కాని ఖర్మలకి కుడా అలా చేస్తున్నారేమో ఇప్పుడు తెలిదు. ఇబ్బంది అనిపించినా అది కుడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ కాకుండా పోదు.

  Like

 13. మౌళీ,

  ” ఇంట్లో వాళ్ళ ద్వారా తెలియాల్సినవే తెలియడం లేదు “— that is the bottom line.
  గుర్తుండే ఉందనుకుంటాను- నేను కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో నేను వ్రాసిన రెండు టపాలమీదా, నాకు ” అక్షింతలు” వేశారు !!! Now you are coming to my point…. అసలు రోజునే గుర్తుండనివారికి కర్మ రోజున పిలుస్తారని ఆశించడం అనవసరం. One more thing.. నేను ఎవరినీ నిందించలేదు. ఇలాటివి జరిగినప్పుడు పడ్డ ఆవేదన గురించి చెప్పాను. ఇలాటివి చాలామందికి జరుగుతోంటాయి, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు.. thats all…

  Like

 14. @ Now you are coming to my point….

  How!!! Don’t think so

  @అసలు రోజునే గుర్తుండనివారికి కర్మ రోజున పిలుస్తారని ఆశించడం అనవసరం

  అసలు రోజున వాళ్ళు పిలువాల్సిన పని లేదు అన్నది నేను చెప్పేది. ఇంకా కర్మ రోజు ఎందుకు పిలుస్తారు. మధ్య లో వచ్చి పలుకరించినవారిని మాత్రం ఆత్మీయులుగా భావించి పిలుస్తారు. (పొరపాటున మరచిపోతే తప్ప ) ఆ జ్ఞాపకం అలా ఉండిపోతుంది కుడా.

  మీ ఆవేదన అలాపెట్టండి, మీకు తెలిసీ రాలేదేమో అని వాళ్ళు అనుకుంటూ ఉండి ఉండొచ్చు 🙂 అది మీరు వారికి సర్దిచేప్పుకొంటే చాలు. నేనెందుకు చెప్పుకోవాలి అని మీరు అనుకొంటే, ఈ టపాలో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం దొరికినట్లే కదా.,

  Like

 15. మీబోటి పెద్దాయన ( అలాని మిమ్మల్ని అంటూన్నట్లు కాదు) , వియ్యాలవారింట్లో ఎవరో చనిపోతే, కనీసం అవతలివారు వియ్యాలవారి(పెద్దాయన) తరపు పదిమందిని అన్నా తక్కువలో తక్కువ పిలవాలని ఆశపడితే, సదరు వియ్యంకులవారు ఏమన్నారంటే …చనిపోయింది కుర్రాయన కాదు కదా ముసలాయనేగా, అంత మందిని పిలవడం ఎందుకు మేము ఇద్దరం వస్తాం లే అన్నారుట . నాకు కాని ఎదురుపడితే, ముసలి వాళ్ళు కాక చిన్న వాళ్ళు పోవాలా బాబూ నలుగురికి చెప్పుకోవాలి అనుకొంటే అని అడగాలి అనిపించింది 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: