బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బ్లాగులోకంలో Paul the Octopus…


    ప్రస్తుతం కొలొంబో లో జరుగుతున్న T20 World Cup గురించి వ్రాసి, టైము waste చేసికోకూడదనుకున్నాను ముందు, కానీ నిన్న ఏవో బ్లాగుల గురించి చదువుతూంటే ఒక టపా గురించి చదివాను. దాని ప్రకారం, శ్రీలంక, వెస్ట్ ఇండీస్ జట్టులు ఫైనల్ కి చేరాయని వ్రాశారు. అర్రే ఇప్పుడే శ్రీలంక నెగ్గిందని విన్నాను. ఈ రెండో మ్యాచ్ ఎప్పుడు అయిందీ అనుకుని, పోన్లెద్దూ ఎంతైనా వెస్ట్ ఇండీస్ కి “పూర్వ వైభవం” రావడానికి ఇదీ బాగానే ఉందిలే అనుకున్నాను. అయినా అసలు ఈ బ్లాగ్గుకారునికి ఈ న్యూస్ ఎక్కణ్ణించి వచ్చిందా అని చదివితే, తను ప్రత్యక్షంగా చూసేసినట్టు, వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గిందీ అని కూడా నొక్కి వక్కాణించేశాడు. ఆ వివరాలేవో తెలిసికుందామని, నాకు తెలిసిన Sports Channels అన్నీ వెదికేశాను. అదేం ఖర్మమో ఎక్కడ చూసినా, Aus vs WI శుక్రవారం 5 అక్టోబర్ అనే వ్రాశారు.

    మరి ఈ పెద్దమనిషేమిటీ, అదేదో FIFA World Cup లో అదేదో Paul the Octopus లాటివాడా ఏమిటీ, జరగబోయేదానిని కూడా “ఊహించేసి” వ్రాసేశాడూ. అప్పుడెప్పుడో చదివిన Irwing Wallace వ్రాసిన Almighty జాతికి చెందినవాడేమో అనుకున్నాను. ఈవేళ న్యూస్ పేపర్లలోనూ రెండో Semi Finals ఈవేళే అని కూడా వ్రాశారు. మరి ఆ ” పెద్దమనిషి” కి ఇంత ముందుగా జరగబోయేదాని గురించి ఎలా తెలిసిందో.

    పైగా వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచిందని మరీ వ్రాశాడు. ఇప్పుడే ఆ మాచ్ పూర్తయింది.వెస్ట్ ఇండీసే నెగ్గారు, కానీ 5 వికెట్ల తేడాతో కాదు, 74 పరుగుల తేడాతో. ఎందుకొచ్చిన రాతలండీ ఇవీ? మరీ ఇంత over enthusiasm అయితే ఎలాగ బాబూ?

    ఎవరికైనా ఈ ఆటలపోటీల్లో ఏదో ఒక టీం favourites గా ఉండడంలో తప్పేమీ లేదు. కానీ అది పట్టుకుని కథలల్లేస్తే ఎలాగా?

4 Responses

 1. finally వెస్ట్ ఇండీసే నెగ్గారు,
  hip hip hurrey

  Like

 2. finally వెస్ట్ ఇండీసే నెగ్గారు, australia tho
  hip hip hurrey

  Like

 3. గెలుపు పండగను మరచిన వెస్ట్ ఇండీస్,
  ఆఖరికి చాలా రోజుల తరువాత గెలిచారు !
  sorry for hat trick of letters in ecstasy!!

  Like

 4. డాక్టరుగారూ,

  పోన్లెద్దురూ.. మొత్తానికి మన టీం గెలుపుబాటలో పడిందనే ఆశిద్దాం… All is well that ends well… I am also very happy…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: