బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బ్లాగుల్లో వ్యాఖ్యలు….


    ఏదో కాలక్షేపానికనండి, లేదా తమకి తెలిసినవి ఇతరులతో పంచుకోవాలనే సదుద్దేశ్యం తో అనండి, ఈ మధ్యన చాలా మంది, తమకు ఉన్న కొద్దిపాటి కంప్యూటరు విజ్ఞానం ఉపయోగించి, ఏదో సరదాగా బ్లాగుల వ్యాపకంలోకి అడుగెట్టారు. చదివేవాళ్ళు చదువుతారు, నచ్చిన వారు ఓ వ్యాఖ్య రూపం లో ఈ బ్లాగు టపా వ్రాసినవారికి ప్రోత్సాహం ఇస్తూంటారు. అలాగని ఒక్క వ్యాఖ్యా రాకపోతే, ఏదో కొంప మునిగిపోయిందని నిరుత్సాహ పడఖ్ఖర్లేదు. హారం లో “ఎక్కువగా చదివిన టపా ” లో తమ టపా పేరు చూసుకుని సంతోష పడడం.

    నాకైతే పెద్ద పనీ పాటా లేదు కాబట్టి, మొదట్లో రోజుకొక టపా వ్రాసేవాడిని. క్రమక్రమంగా వారానికోటిలోకి దిగిపోయింది. చదివేవారు చదువుతున్నారు, లేని వారు మానేస్తున్నారు. ఎవరిష్టం వారిదీ. పాపం, మా ఇంటావిడకి అలా కాదు కదా, సవాల‍క్ష పనులాయే, weekends లో పిల్లలతో బిజీ, వారమంతా పూజలూ, పునస్కారాలూ, కొంప neat గా పెట్టుకోవడాలూ, సాయంత్రాలు evening walk లూ, ఒకటేమిటి ఎప్పుడూ బిజీ గానే ఉంటుంది. అయినా ఏదో ఒక సమయంలో నేను system దగ్గర లేనప్పుడు ఒకటీ అరా టపాలు వ్రాస్తూంటుంది. ఏదో “ప్రవచనాలు” చెప్పాలని కాకపోయినా, తనకు తెలిసినదేదో మిగిలినవారితో పంచుకోవాలనీ మాత్రమే. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా వెర్రి వేషాలు వేస్తే వెంటనే retort రూపంలో ఓ టపా పెట్టేస్తూంటుంది. Its all fun.. మా గొడవలన్నీ చదివేవారికి ఓ entertainment అంతేకదండీ…సరదాగా వెళ్ళిపోతోంది.

   ఆ సందర్భం లోనే, నిన్న ఆవిడ ఫ్రెండు ఒకావిడ, మాకు దగ్గరలోనే ఉంటున్నారు, ఆవిడ ఫోను చేసి, ” గణపతి బప్పా మోరియా..” అని ఇక్కడవాళ్ళందరూ(పూణె లో) అంటూంటారు కదా, “మోరియా” అంటే అర్ధం తెలుసునా అని అడిగారు. ఈవిడెమో, వెంటనే “గూగులమ్మ” ని వెదికేసి, అక్కడున్నదేదో చెప్పింది. అక్కడితో ఆగిపోయుంటే, అసలు ఈ టపా యే ఉండేది కాదు. ఊరికేకూర్చోక, తను తెలిసికున్నదేదో, పోనీ అందరికీ తెలియచేద్దామూ అనే noble intention తో ఓ టపా వ్రాసింది.దానికి ఏవో వ్యాఖ్యలొస్తాయని ఆశించి కాదు. రాకపోతే గొడవే ఉండేది కాదు.

    ఓ self styled భాషాభిమానికి ఏదో పొడుచుకొచ్చేసింది.ఓ వ్యాఖ్య పెట్టాడు(రు). పోనీ పేరైనా వ్రాసుకున్నాడా అంటే అదీ లేదూ, “అజ్ఞాత” ట. నాకైతే “అనామకుడో అనామకురాలో” అన బుధ్ధేసింది.అంత పేరుకూడా చెప్పుకోడానికి ధైర్యం లేని పక్షి అసలు వ్యాఖ్యలు పెట్టడం ఎందుకూ. పోనీ పెట్టాడే, తన so called తెలివితేటలన్నీ ఉపయోగించుకోవాలా? అన్నిటికీ కొసమెరుపేమిటంటే he/she had the audacity to advise my wife not to write blogs…thats the height of it.

    పాపం మా ఇంటావిడ ఆ వ్యాఖ్య చదివి చాలా బాధ పడిపోయింది. మరీ నెమ్మదస్తురాలు కదా, ఆ కారణం చేత సుతిమెత్తగా సమాధానం వ్రాసింది. ఒక విషయం చెప్పండి, అసలు ఈ గణపతి సార్వజనీయ సంబరాలు ప్రారంభం అయింది ఎక్కడో తెలుసునా ఈ so called పాఠకుడికీ. 1893 లో స్వాతంత్ర సేనాని బాల గంగాధర తిలక్ గారు మొట్టమొదటిసారి పూణె లోనే ప్రారంభించారు. వివరాలు ఇక్కడ చదవండి. కాలక్రమేణా, దేశంలోని మిగిలిన ప్రాంతాలవారుకూడా మొదలెట్టారు.ఆ సందర్భం లోనే గణపతి నిమజ్జనం రోజున “ గణపతి బప్పా మోరియా, పుడ్చా వర్షీ లవకర్ యా..” అంటే, గణనాధా, వచ్చే ఏడాది మళ్ళీ త్వరగా రావాలి.. అని భజనలు చేసికుంటూ ఊరేగింపు చేస్తారు. ఆ భజనలోని “మోరియా” అనే పదానికి అర్ధం చెప్పడం, మా ఇంటావిడ చేసిన పాపం. ఈ మాత్రానికి ఆ so called అనామక భాషాభిమాని అంతంత రాధ్ధాంతం చేసేసి, తనని తాను expose చేసికున్నాడు.

    షిరిడీ ( మళ్ళీ మహరాష్ట్రాయే) సాయినాధ మందిరం దగ్గర “ సబ్ కా మాలిక్..” అనే కదా వ్రాస్తారు, మరి ఆంధ్ర దేశంలోని సాయిబాబా దేవాలయాల్లో “ అందరికీ యజమానీ..” అని అనువదిస్తేనే, సాయిబాబా మీద భక్తి ఉన్నట్టా ? అలాగే గజాననుని విషయం లోనూ.ఈవేళ హైదరాబాద్ లోని గణేశ నిమజ్జన ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు- ఈ so called అనామక భాషాభిమాని చూసుంటే తెలిసేది. “ గణపతి బప్పా మోరియా..” అని అచ్చ తెలుగులోనే వ్రాశారు.టివీ చూడ్డం మానేస్తారా అనామక భాషాభిమానీ..?

    అవతలివారు ఏ context లో వ్రాశారూ అని చూడాలి కానీ, ఏదో తెలుగులో వ్రాయడం వచ్చుకదా అని, అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు పెట్టడం కాదు. నచ్చకపోతే చదవడం మానేయొచ్చు. నచ్చలేదూ అనొచ్చు. అంతేకానీ, అవతలివారి గురించి
నాలుగు లైన్లకి ముఫ్ఫై తప్పులు. ఆ మాత్రం ఓపిక లేనివాళ్ళు తెలుగు బ్లాగు మొదలెట్టడం ఎందుకో?” అనేటంత పాండిత్యం ఉందా ఆ so called అనామక భాషాభిమానికీ.ఇక్కడ మా ఇంటావిడ తనకేదో పాండిత్యం ఉందని ఎప్పుడూ వ్రాసుకోలేదు.

    ఊరికే చదివేయడం కాదు, వ్యాఖ్య పెడదామనుకున్నప్పుడు కొద్దిగా సంస్కారం కూడా ఉండాలి. ఈ విషయాలన్నీ తనంతట తాను వ్రాసుకోలేదు. ఆ మాయదారి వ్యాఖ్య చదివి, “పోన్లెద్దురూ ఇంక వ్రాయడం మానేస్తే గొడవే ఉండదూ” అని అనడం వలన ఈ టపా వ్రాయవలసొచ్చింది.

    భాషమీద అభిమానం అందరికీ ఉంటుంది. దానిని వ్యక్తపరచడానికి ఓ వరసా, వావీ ఉంటుంది.అంతేకానీ, “తెలుగు వెధవ బాష. దాన్ని వదిలేయండి..” అనే దౌర్భాగ్యపు మాటలు వాడవలసిన అవసరం లేదు.ముందుగా తనకి తాను improve చేసికుంటే, ఇంకొకరికి చెప్పే చొరవా, అధికారం వస్తాయి. Good spirit లో పెట్టే ఎలాటి వ్యాఖ్యలైనా కళ్ళకద్దుకోవాలనే ఉంటుంది.అంతేకానీ, టపాలు వ్రాసేవారి feelings కించ పరచకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?

10 Responses

 1. సూర్యలక్ష్మిగారి టపా మరియు వ్యాఖ్య చదివాక నాకు కలిగిన మొదటి అభిప్రాయం ఆ వ్యాఖ్య వ్రాసిన అజ్ఞాత సామాన్యంగా తెలుగు టపాలు వ్రాసే వారిగురించి అలా అన్నాడేమో, సూర్యలక్ష్మిగారి టపా గురించి కాదేమో అని…….

  Like

 2. some people dont have manners.we have to ignore them.please ask aunty to continue her blogs .though we never comment on your blogs,me and my wife are regular readers of your blogs.

  Like

 3. Agnata lanti vaalla vyaakhyalni andhkaram lo unna varivi gaa bhaavinchi vadileyandi.

  Like

 4. నమస్తే
  ఒక అనామకుడు పెట్టిన కామెంటు కి భయపడితే ఎలా సారూ? నేను మీ ఇద్దరి టపాలూ చదువుతున్నాను రెగ్యులర్ గా. తప్పకుండా రాస్తూ ఉండండి. ఆయన చెప్పింది, హైద్రాబాద్, ఆంధ్రా గురించి అవ్వొచ్చు. అందరికీ మీరు పూణేలో ఉన్నారని తెలియపోవచ్చు కదా?

  ఆవిడకి చెప్పండి. తెలుగు లో రాసేవాళ్ళు రాస్తూ ఉండాలి. ఆ అనామకుడి బదులు నేను చెప్తున్నాను కదా, మీరు తప్పకుండా రాయండి.అదీగాక, ఇంటర్నెట్టు మీద కొంచెం థిక్ స్కిన్ ఉండాలండోయ్! ఒక వెధవ కామెంట్ కి భయపడితే ఎలా? మీ ఆవిడ పెట్టిన సమాధానం కూడా నేను చదివేను. మెత్తగా చురక అంటించేరు వాడికి. వీపు కాలి ఉంటుంది. ఇంక మాట్లాడడు.

  Like

 5. మొన్నీమధ్య శ్రీరాముడూ, సీతమ్మల వయసు గురించి చిన్న టపా ఒకటి రాసాను. ఒకతను సరిగ్గా చదవకుండా ‘You are wrong’ అని తేల్చేసాడు. మరొకతను ‘వారి మధ్య శృంగారం లేదా’ అని ప్రశ్నిస్తాడు. ఇంకోతను ‘రంగనాయకి, మావోఇష్టు, క్రిస్టియన్‌, ముస్లిమ్‌’ అంటూ డిస్క్లైమర్ పెట్టి ప్రశ్నించాడు. వీటన్నిటినీ తలదన్నేట్టు ఓ పెద్దాయన ఒక జడ్జిమెంట్ పాస్ చేసి వెళ్ళిపోయాడు. That was my tipping point. పట్టు మని పది వాక్యాలు చదివే ఓపికలేనివారితో వాదోపవాదాలకు దిగడం మూర్ఖత్వంగా తోచింది.

  ఆ సంఘటన నన్ను నేను ప్రశ్నించుకునేట్టు చేసింది. కాస్తంత ఆలోచించుకొని ఇక నుండి వ్యాఖ్యలతో పని లేదు అని నిర్ణయానికి వచ్చి – వ్యాఖ్యల అనుమతి తీసేసాను. Perhaps, this is not in good spirit of blogging. But at times the folks who drop a stupid comment fail to understand it’s potential impact.

  Like

 6. హన్నా ఎంత మాట, ఎంత మాట!

  ఎవరలా అన్నది ?

  పోనీ లెండి, అలా అంటేనే కదా మీ ఈ టపా వెలుగులోకి వచ్చింది.

  ఇంతకీ మోరియా అంటే ఏమిటో చెప్ప కుండానే ( తెలుసుకోవాలంటే మా ఆవిడ టపా చూడవలె అని చెప్పారు కూడాను!) మంచి టపా పెట్టారండీ,

  భమిడి పాటి వారంటే మజాకా !

  చీర్స్
  జిలేబి.

  Like

 7. అకారణంగా బూతులు మాట్లాడనంతవరకూ, అజ్ఞాతల స్వేచ్చ, స్వాతంత్రం, ఏవిషయమీదనైనా కామెంట్ చేయగలిగిన తెంపరి తనాన్ని నేను కేటగోరికల్‌గా అంగీకరిస్తాను. వేర్పాటువాద, విచ్చిన్నవాద బ్లాగర్లు అజ్ఞాతలు కాకున్నా(జ్ఞాతలు అందామా?) అజ్ఞానగా బూతులు, తిట్లు తమ సంస్కృతి అని చాటించి మరీ మాట్లాడటం చూస్తుంటాము.
  ” నేను నీ వాదనతో ఏకీభవించకపోవచ్చు, అయితే నీ మాట్లాడే స్వేచ్చకు చచ్చేదాకా మద్దతిస్తాను” అన్న వోల్టేర్ స్పూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అందరూ అతి మేధావితనంతో ఆచి తూచి, లేదా తేనెపలుకులు మాట్లాడి తీరాల్సిన అవసరం లేదు.
  అజ్ఞాతలు ఏదో చెబుతారు, పాటించడం, పాటించకపోవడమన్నది బ్లాగరు ఇష్టం, స్వేచ్చ. అజ్ఞాతలను ఆడిపోసుకోవడం కూడదు అని నా విదుర నీతి. 🙂 రమణ గారి టపాలో ఆ మొదటి అజ్ఞాత చూడండి, ఎంత ముచ్చటగా ముద్దొచ్చేలా స్పందిచాడో… మనస్థత్వ డాక్టర్ గారికే అర్థం కాలేదట! సామాన్యులం మనకు అర్థమవుతుందా? ఏదో నిగూఢ సత్యాలుంటాయి. :)) 😛
  మేడం గారిని ఆ అజ్ఞాతల కామెంటును చిరునవ్వుతో తీసుకోమని నా మాటగా చెప్పండి. అజ్ఞాతలు మన బ్లాగింట అతిథులు, అతిథులను ఆదరించడం మన ధర్మం అని ఈవేళ గాంధీగారి జయతి సందర్భంగా ఆయన సూక్తిని గుర్తుచేసుకుందాం.

  Like

 8. “గణపతి బప్పా మోరియా” ని సంధులు విడతీసి, వుచ్చారణా బేధాలు సవరించి తెనిగీకరిస్తే … “గణపతి అక్క మేరియా (మేరిమాత)” అని!!!

  ‘అప్పా ‘ అంటే గో.జీల మాండలీకంలో ‘అక్కా’ అని అర్థమట. క్రైస్తవ-హైందవ బాంధవ్యం ఇందుమూలంగా మనకు అవగతమవుతుంది :P. ఏమంటారు, జిలేబమ్మా? 😀

  Like

  • అయ్యా శంకర్ గారు,

   గణపతి అక్కయ్య మేరీ మాత గా మీరు మాటంటే కాదంటా మా !

   చూడ గలిగితే కరుణించు మేరి మాత మేరీ మాతా అందరూ ఒక్కరే కదా మరి!

   గణపతి కి చాలా సంతోషం కలిగి ఉండాలి మీ మాట తో ! ప్చ్ ఆల్ మేల్ గాంగ్ – సుబ్స్ అండ్ హింసెల్ఫ్ మరి

   చీర్స్
   జిలేబి.

   Like

 9. వాసూ,

  ఎంతగా benefit of doubt ఇచ్చేద్దామని అనుకున్నా, ఏమిటో వీలు పడలేదు. ఏమిటో human weakness అనుకుంటాను. పోనిద్దురూ గొడవ సమసిపోయింది… All is well that ends well.

  Truely, Tvbh,

  ఔననుకోండి. కానీ మరీ తెగేసి, ” మీకు వ్రాయడం రాకపోతే నోరుమూసుకుని కూర్చోచ్చుగా..” అనే అర్ధంలో వ్యాఖ్యలు పెడితే, కొంచం బాధేసింది..

  sunnA,

  మేము పూణె లోనే ఉంటున్నామన్న సంగతి ప్రతీ వారికీ తెలియకపోవచ్చు, మీరు చెప్పినట్టుగా. ఒప్పుకున్నాము.. కానీ ఏదో తిప్పలు పడి, తను బ్లాగులు వ్రాస్తూంటే,నచ్చితే నచ్చాయనొచ్చు, లేకపోతే నచ్చలేదూ అనొచ్చు. కానీ, judgemental గా వ్రాయడం వలనే, నేను ప్రత్యేకంగా టపా వ్రాశాను.Anyway the matter stands closed…

  తెలుగుభావాలు గారూ,

  బహుశా మీరన్నదానిలో కూడా నిజం ఉంది. అయినా మానవ బలహీనత అనండి, ఇంకోటేదో అనండి.. మీరు చేసినట్టుగా ” వ్యాఖ్యల అనుమతి తీసేటంత” స్థాయిలో ఇంకా మేము లేము. జనరల్ గా చూసిందేమిటంటే, ఎక్కడో ఒకటీ అరా తప్ప, నూటికి 99 పాళ్ళు పాఠకులు బాగానే స్పందిస్తున్నారు. అప్పుడప్పుడు ఎవరైనా mood బాగోక, react అయినా, మొదట్లో బాధపడేవాళ్ళం. ప్రస్తుతం నేర్చుకున్నదేమిటంటే, తగ్గ సమాధానం మా ఇంటావిడ వ్రాసినట్టుగానో, లేదా నేను పైన వ్రాసిన టపా రూపంలోనో
  ..give our piece of mind.. మీరు అనుసరించిన పధ్ధతి మీ ఇష్టం…

  జిలేబీ,

  ఏదో మా ఇంటావిడ టపాకి publicity ఇవ్వాలని, నేను పై టపా వ్రాశాననే అర్ధం తెచ్చారు. మా ఇంటావిడ, ఒక్కోప్పుడు నా మీద తన take వ్రాసినా, నేను లింకులు ఇస్తూనేఉంటాను… అలాటిది తనని ఎవరో బ్లాగులే వ్రాయొద్దూ అంటే, మరీ వదిలేస్తానా? మా ఇంటావిడని defend చేసుకోవద్దూ….
  Snkr,

  పైన చెప్పినట్టుగానే, టపాలమీద అభిప్రాయం వేరూ, judgemental గా ఉండడం వేరూ. తను almost చిరునవ్వుతోనే తీసికుంది… may be I over reacted ? ఎవరో ఒకరు చెప్పాలికదండీ?…”మనస్థత్వ డాక్టర్లకే అర్ధం అవలేదుట” అన్నారే, దీనికి డాక్టర్లే కానఖ్ఖర్లేదు.. ఏదో కొద్దిగా అనుభవాలోటి ఉన్నాయిగా….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: