బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– అసలు అంత అవసరమంటారా ఇప్పుడు…


    ప్రపంచంలో ప్రతీవారూ, ఊరికే Great అవరు. అలా చెప్పుకోవాలంటే, తన field లోనే great అవడం కాదు.మిగిలిన విషయాల్లో అంటే, ప్రవర్తన, బయటి వారితో వారి సంబంధ బాంధవ్యాలూ.. ఇలా చాలా వాటిలో వారి గొప్పతనం చాటుకోవాలి.
పాటల విషయంలో ఆవిడకు ఆవిడే సాటి. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ” పాట” అనే “మాట” ఎక్కడ ప్రస్తావనకొచ్చినా, ఈ మధుర గాయని తరువాతే కదా ఇంకోరి పేరు తీసికునేది. మనదేశంలో వాడుకలో ఉన్న ప్రతీ భాషలోనూ పాటలు పాడీన ఘనత లతా మంగేష్కర్ కాక ఇంకెవరికుందీ?

    భారత ప్రభుత్వం ఆవిడని “ భారత రత్న” తో సత్కరించింది. సంగీత సామ్రాజ్యంలో మనకున్న “రత్నాల్లో”ఆవిడొక్కరూ.ఈవేళే 83 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు.

    ఇంతంత పేరు ప్రఖ్యాతులు అలవోకగా స్వంతం చేసికుని, దేశప్రజలందరి గుండెల్లోనూ ఓ స్థానం సంపాదించుకున్న ఆవిడకి, ఇన్ని సంవత్సరాల ( 50 ) ఎందుకూ, ఎవరికీ ఉపయోగించని ఓ controversy లేవతీయడం ఏమైనా బాగుందా? దీనివలన ఆవిడ సాధించిందేమిటంట? ప్రముఖ గాయకుడు రఫీ సాబ్, ఈవిడకి క్షమాపణ వ్రాసిచ్చేరా అని ఎవరైనా అడిగారా, అదీ 50 సంవత్సరాల తరువాత? పోనీరాసిచ్చేరే అనుకుందాము, రఫీ గారి జీవిత కాలంలో బయట ఎందుకు పెట్టలేదూ?

    మామూలుగా ఎవరూ తమను పట్టించుకోడం లేదని, కొంతమంది లేనిపోనివేవో లేవతీస్తూంటారు. అలాటి అవసరమూ ఆవిడకి లేదే. ఆవిడ గొంతుకు వినిపించకుండా ఒక్కరోజైనా ఉంటుందా. మరి ఏమిటి ఆవిడ బాధ? రఫీ గొప్పవారా, లతా గొప్పవారా అన్నది అసలు debatable కాదు. కారణం ఇద్దరి గొంతుకులకూ పోలికే లేదు for the simple reason ,one is male and the other a female !!

   అదేదో “నెత్తిమీద శని దేవత ఆవహించినట్టుగా” ఆవిడ ఉత్తిపుణ్యాన్న ఈ గొడవ లేవదీసింది. ఎందుకు లేవదీశారో ఆవిడకే తెలియాలి. ఇప్పుడు చివరకి జరిగేదేమిటీ, ఎప్పుడు లతా మంగేషకర్ పేరు వచ్చినా, ” పంటికింద రాయి” లా ఈ గొడవ గుర్తుకొస్తుంది. అంత అవసరమా ఇప్పుడు? ఆవిడ పాడిన వేల ఆణిముత్యాల కంటే, ఈ గొడవే మిగిలిపోతుంది.

2 Responses

  1. కడుపు లో ఏమీ దాచుకొలెరీ ఆడ వారు
    పాపం ఆవిడ 50 ఏళ్ళు దాచుకున్నారు

    Like

  2. డాక్టరు గారూ,

    అలాగే ఉందిలెండి…

    Like

Leave a comment