బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు అలా ఇరుకులో ఎందుకు పెడతారో….


    ప్రతీవారికీ ప్రతీ దానిమీదా ఓ అభిప్రాయం ఉంటుంది. కారణాలు ఏమైనా కావొచ్చు. అదీ ఓ సినిమామీదైతే, ఈమధ్య హిందీలో, చాలా సినిమాలు పాతవాటిని కొత్త నటీనటులతో తీస్తున్నారు. పాత తరంవారు, “ఎన్నిచెప్పండి, పాతది పాతదే..” అనడం మామూలైపోయింది. అది నిజం కూడానూ. ఇంకా తెలుగులో అలాటి ప్రయోగాలు మరీ అంత ఎక్కువగా లేవు. ఏదో అప్పుడెప్పుడో పాండురంగడు అని ఓ సినిమా తీసి, చేతులు కాల్చుకున్నారు. ఏం చేస్తాం పాండురంగమహాత్మ్యం తో పొల్చి చూస్తే, కొత్తది అంత దరిద్రంగా ఉంది. బాలయ్య అభిమానులకి తప్ప ఇంకెవరికీ నచ్చినట్టు లేదు. ఆ బాలయ్య కేమో, తన తండ్రిగారికి తనే పేద్ద వారసుడని ఓ వెర్రి నమ్మకం.దానికి సాయం నిర్మాతలు కూడా, అన్నగారి పాత చిత్రాల్లో, బాలయ్య తప్ప ఇంకెవరు చేయగలరూ అనుకోడం.మన ప్రాణం మీదకి తెస్తున్నారు. ఆ ఒరవడి లో వచ్చిందే “శ్రీరామరాజ్యం”.బాపు గారి దర్శకత్వం లో వచ్చిందీ, పైగా శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారి జీవితంలో వ్రాసిన చిట్టచివరి screenplay కదా అనే అభిమానంతో, శ్ర్రీరామరాజ్యం విడుదల అయిన మొదటి రోజు మొదటాటకే వెళ్ళాము. శ్రీ బాపూ గారి : మత్తు” లో ఉండి, దానికి సాయం ఇళయరాజా ఇచ్చిన ఒకటి రెండు పాటల ధర్మమా అని నచ్చేసినట్టే అనిపించింది ( inspite of Balakrishna). అప్పటికీ అనుకున్నాను కూడానూ, బాలయ్య తప్పితే ఇంకోళ్ళున్నా బాగుండేదీ అని. మన బ్లాగుల్లో అన్ని రకాల అభిప్రాయాలూ వ్రాశారు, “లవకుశ” తో పోలుస్తూ.. కొంతమంది ఏకీభవించారు, ఈ తరం వారైతే “పాత చింతకాయ పచ్చడి” అని తోసిపారేశారు. ఏమిటో బాపూగారు ఇన్నాళ్ళకి ఓ సినిమాకి దర్శకత్వం వహించారూ, అదేమో బాగోలేదంటున్నారూ అనుకుని కొంచం disappoint మాత్రం అయ్యాను.ఇంక ఆ విషయం వదిలేశాను.

    మన టివీ చానెళ్ళవాళ్ళు ఒక్కొక్కప్పుడు కొంపలంటిచేస్తూంటారు. ఎందుకు చెప్పండి, మన ప్రాణం తీయడానికి కాకపోతే, ఇవాళే
ఒకే సమయానికి ( సాయంత్రం 6.00 గంటలకి) జెమినీ లో “లవకుశ”, జీ లో ” శ్రిరామరాజ్యం” చూపించాలా? దీనితో జరిగిందేమిటంటే, ఓ రిమోట్ నొక్కు తో రెండు సినిమాలూ చూసే భాగ్యం కలిగింది. The differences were too striking.. దీనికి సాయం ఒకదాంట్లో ఒక సీన్ అయిన తరువాత, అదే సీన్ రెండో దాంట్లో చూడ్డంతో, ఆ తేడాలు మరీ కళ్ళకు కట్టినట్టుగా కనిపించాయి.

   మొట్టమొదటగా శ్రీరాముడు– అసలు NTR చేసిన పాత్ర బాలయ్య చేయడమేమిటీ? ఏదో ఆయన కొడుగ్గా పుట్టడం తప్పించి, ఆయనతో (specially నటన విషయంలో) అస్సలు పోలికే లేదు. ఆయనేమో భారీ విగ్రహం, ఇక్కడ బాలయ్యేమో బుల్లిబుడంకాయ, పైగా మెడంతా ముడతలూ..ఏదో అగ్నానం, క్రుతగ్నత లాటివి సద్దేసికుంటే, ఇంక మిగిలిన సంభాషణలు, డయలాగ్గులూ simply memorable. ఇంక బాలయ్య ఏ డయలాగ్గు చెప్పినా ” సింహా” గుర్తుకొస్తాడు.మాయాబజారు పాత సినిమాలో పాండవుల్ని ఎక్కడా చూపించకుండా మహాభారత కథని ఆ కె.వి.రెడ్డి గారు ఎలా నడిపారో, అలాగ శ్రి బాపూ గారు, ఇప్పటి శ్రీరాముణ్ణి కనిపించనీయకుండా, ” శ్రీరామరాజ్యం” తీసుంటే ఎంత బావుండేదో అనిపించింది. మాయాబజారు నచ్చలేదూ, ఇదీ అలాగే అనుకునేవాళ్ళం. అదో novel పధ్ధతీ…పోనిద్దురూ బాపూ గారిమీదుండే అభిమానంతో మొహమ్మాటానికి బావుందనుకున్నాను.

   ఇంక సీత పాత్ర– అంజలీ దేవి born for that role.. స్వయంగా డయలాగ్గులు, పైగా ఆ పాత్రలో ఇమిడిపోయింది.శ్రీరామరాజ్యం లో నయనతార, ఫరవాలేదు,సునీత డబ్బింగు ధర్మమా అని వీధిన పడలేదు. But still… ఇద్దరికీ “ముత్యమంత పసుపూ” కీ ” Fair and Lovely” కీ ఉన్నంత తేడా ఉంది.

    సంగీతం విషయంలో ఏదో రెండు మూడు పాటలు తప్పించి, శ్రీ ఘంటసాల మాస్టారు head and shoulders above.. దానికి సందేహమే లేదు.లవకుశ లో ఉన్నన్ని పద్యాలు ఇప్పటి సినిమాలో ఉంటే ఎలాగండీ, ఈరోజుల్లో ఎవరికి అర్ధం అవుతాయీ అన్నారు జనం. ఆ పద్యాల్లో అంత అర్ధంకానంత పదాలేమున్నాయి? పైగా they suited the occasion.. ఒక్కో పాటా ఆణిముత్యం. ఇన్నేళ్ళయినా ఇప్పటికీ పాడుకుంటున్నారంటేనే తెలుస్తోంది.

    యుధ్ధాల సీన్లు పాత సినిమాలో ఏదో దీపావళి బాణాసంచా లాగ ఉన్నాయి. కానీ ఇప్పుడో గ్రాఫిక్స్ ధర్మమా అని, realistic గా ఉన్నాయి.కొన్ని సీన్లలో తేడా మరీ కనిపించిపోయింది. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించి, స్వర్ణ సీత ప్రతిమని తయారు చేయించాలని అనుకోడం ఏమిటీ ( ఇంకా బయటివారికి తెలిసే అవకాశమే లేదూ), సింహద్వారం తలుపులు తోసుకుంటూ, జనం అందరూ వచ్చేసి తమ బంగారం ఇచ్చేస్తారూ అని శ్రీరామరాజ్యంలో చూపించారు. అదే “లవకుశ” లో, ఓ పధ్ధతిగా, ముందుగా ఓ శిల్పీ, తరువాత జనం వచ్చినట్టూ ఓ disciplined way లో. అవునుకదా ఎంతచెప్పినా ఆ రోజుల్లో ఓ క్రమశిక్షణా అవీ ఉండేవి, ఇప్పుడో ఎక్కడ చూసినా ధర్నాలూ, ప్రొటెస్టులూనూ…బాపూగారు కూడా పోన్లెద్దూ అనేసికునుంటారు..

   చివరలో సీతామ్మవారు నోము చేసినప్పుడు ఆ రోజుల్లో కాగితప్పూలు (they were too obvious). ఇప్పుడేమో ఏక్ దం ఓవెన్ ఫ్రెష్…చివరకి నాకనిపించిందేమిటంటే రెండు సినిమాలకీ ఉన్న తేడా– లవకుశ ఏ ఎరువూ లేకుండా తయారయిన పువ్వులనండి, కూరగాయలనండి, శ్రీరామరాజ్యం hybrid variety.. సరుకు ఒక్కటే అయినా రుచిలో తేడా ఉండదూ మరి?

   అన్నిటిలోకీ ముఖ్యం 1963 లో 26 కేంద్రాల్లో మాత్రమే రిలీజు చేసి అన్నిటిలోనూ శతదినోత్సవాలూ, అందులో 16 కేంద్రాల్లో 175 రోజులూ ఆడిందిట. మరి శ్రీరామరాజ్యమో.. ప్రపంచం అంతా రిలీజు చేసి… ఎందుకులెండి..ఇంకా ఏమైనా అంటే బాగోదు...

    ఏదో శ్రీ బాపూ గారిమీద అభిమానం చేత సినిమా ఫరవాలేదనుకున్నాను కానీ, అసలు తేడాలు ఈవేళ తెలిశాయి…

Advertisements

5 Responses

 1. క్రిందటి వారం శ్రీ రామరాజ్యం డివిడి పదిహేను నిమిషాలు కూడా చూడలేక పోయాను. డైలాగులు విన లేక. మా ఆవిడైతే పూర్తిగా చూసేసింది. ఏమిటో జిహ్వకో రుచి.

  Like

 2. అంతేనండి, అంతే! ఈ వయసులో బాపుకు ఇలాంటి జనహింసాత్మక సినిమాలు తీయాలనిపించడం, ETvసుమన్ కెక్కువ, హీరో సుమన్‌కు తక్కువ అయిన బాలకృష్ణ మనమీద పగబూనడం, మన దురదృష్టం.
  బాపు-రమణల చిత్రాన్ని తీసిపారేసిన మనల్ని, వారు క్షమించినా, స్వర్గీయ కాకినాడ శంకర్ మనల్ని క్షమిస్తాడని నేననుకోను. 😦

  Like

 3. నాకేమో రెండూ నచ్చేసాయి.
  తినగ తినగ తియ్యగుందన్నట్లు,
  ఇలయ రాజ పాటలు కూడా బాగున్నాయి.

  Like

 4. రావుగారూ,

  మీరన్నట్టు “జిహ్వకో రుచి”. డయలాగ్గులు చదవడానికి మాత్రమే బాగున్నాయి( ఆ క్రెడిట్ ముళ్ళపూడి వారిది కదా మరి! ), బాలయ్య గళంలో కొంపముంచేశాడు…

  Snkr,

  అవుననుకోండి… కానీ రెండు సినిమాలూ, ఒకే టైములో చూసేటప్పటికి, ఇంక ఉండబట్టలేక, ఎంత బాపూగారి వీరాభిమానినైనా ( with due appologies to our dear Sankar) బయట పడిపోయాను…

  డాక్టరుగారూ,

  ఏదో కొద్దిరోజుల తేడాలో రెండు సినిమాలూ చూసుంటే, బహుశా నచ్చేవేమో. కానీ ఒకే టైములో చూడ్డం ధర్మమా అని “తేడాలు” మరీ కొట్టొచ్చినట్టు కనిపించిపోయాయి. చాలామంది మనోభావాలు ( చాలా మందేమిటీ, నావికూడా) గాయపరచివలసివచ్చినా, నేననుకున్నదేదో వ్యక్తపరిచేశాను ( శ్రీ బాపూ గారికి క్షమాపణలతో). బహుశా స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ గారిని, రివ్యూ వ్రాయమంటే ఇలాగే వ్రాసేవారేమో…అలాగని ఆయనతో పోల్చుకుంటున్నానని కాదు, నా ఉద్దేశ్యం calling spade a spade…

  Like

 5. Hi there, just became aware of your blog through Google, and found that it’s really informative. I am gonna watch out for brussels. I’ll appreciate if you continue this in future. Numerous people will be benefited from your writing. Cheers!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: