బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్….


   ఏమిటో మమతా బెనర్జీకి “కోపం” వచ్చేసిందిట. అలిగి కూర్చుంది. రెండు మూడేళ్ళనుంచీ ఈవిడకిది అలవాటే.అదేదో FDI కుదరదంటుంది. పోన్లే ఇప్పటికి వదిలేద్దామూ అనుకుని, UPA ముందుసారి సరే అన్నారు.కానీ ఈసారి మాత్రం, “రోజూ పోయేవాడికి ఏడ్చేదెవరూ..” అనుకున్నారేమో ఏమిటో,నీ దిక్కున్నచోట చెప్పుకో ఫో అనేసి, ఆ FDI, Disel price, Subsidy on LPG మొత్తం మూడింటికీ ఒకే రోజు కొత్త policy చేసేశారు. రోజుకోటి చేయడం కంటే ఇదే హాయి కదా. వచ్చే గొడవలన్నిటికీ, Bandh లూ,ధర్నాలూ, దిష్టి బొమ్మలు అంటించుకోడాలూ,టీవీ ల్లో చర్చలూ all under one roof లా అదేదో single window లో చేసేసికోవచ్చు. ఖర్చులైనా కలిసొస్తాయి !!

   ఈవేళ భారత్ బంద్ అన్నారు. పోనీ దాంట్లోనైనా unity ఉందా అంటే అదీ లేదు.మమతా అన్ని కబుర్లూ చెప్పి, ఠాఠ్ బెంగాల్లో బందుండదూ అంది.వాళ్ళెవరో చెప్పారూ, మనం చేయడం ఏమిటీ అనుకుని.అసలు ఈ గొడవంతా ప్రారంభించింది తనే కదా. అలాగని, పెట్రోలు బంకులకెళ్ళడం మానేశారా, అదీ లేదూ.పెట్రోల్ రేట్లు ఈ మూడేళ్ళలోనూ, లెఖ్ఖలేనన్నిసార్లు పెంచారు. ప్రతీ సారీ రాజకీయ పార్టీలు ఒకటే slogan… “Roll back.. otherwise..”- అంటూ.ఏం చేశారుట? ప్రభుత్వమేమో, వాళ్ళ దారిన వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళకీ తెలుసు, ఊరికే కబుర్లు చెప్పడం కాదూ, ఏ పార్టీ power లో ఉన్నా కానీ, ఇలాటివి తప్పవూ, ఛస్తారేమిటీ, డబ్బులెక్కడినుంచొస్తాయీ? ఈ protest లూ అవీ ఓ కాలక్షేపం (ఉత్తుత్తినే..).

   పోనీ అంత నచ్చకపోతే, ప్రభుత్వాన్నేమైనా దింపేస్తారా అంటే అదీ లేదూ. మజాకా ఏమిటీ, గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు recoverచేసికోకుండా, మళ్ళీ ఎన్నికలంటే మాటలాఏమిటీ? ఎవడబ్బ ఇస్తాడూ? దీనితో ఏమౌతుందీ, ఏదో ఓ పార్టీ వాడు, ప్రభుత్వానికేమీ ఫరవాలేదూ, మేము outside support ఇస్తామూ అంటారు. ఇదో భాగవతం. పాత కేసులో, ఏవో మళ్ళీ తెరిచి, “vote for Government or...” అని ఓ వార్నింగిచ్చేస్తే నోరుమూసుకుని కూర్చుంటారు. ప్రతీవాడూ black mailచేసేవాడే.ఈ mixed masaalaa ప్రభుత్వాల్లో ఉండే గొడవే ఇది. అప్పుడెప్పుడో, మన “సహస్రఫణ్” నరస్ంహరావుగారు చూడండి, అయిదేళ్ళూ మైనారిటీ ప్రభుత్వమే నడిపారు.ఎవడెలా అనుకున్నా పట్టించుకునేవారు కాదు, ఎప్పుడైనా గొడవొచ్చినా నాలుగైదు” సూట్ కేసులు” పంపించేసి, “పని” కానిచ్చేసేవారు.పోనీ అలాగని historical events జరగలేదంటారా, economic reforms, Babri Masjid ఆ రోజుల్లోనే కదా. అదీ ” తెలుగు తేజం” power(దమ్ము) అంటే. అప్పటి మనిషే కాబట్టి, మన్మోహన్ గారూ, హాయిగా ” నిర్వికారంగా” తన పనేదో తను చేసేస్తున్నారు. మహా అయితే ఏమౌతుందిట, ప్రధానమంత్రిత్వం పోతుంది. పీడా వదుల్తుంది, ఎలాగూ “ ఆవిడెవరో” చెప్పిందే చేయాలీ, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు.

   రామాయణం లో పిడకల వేట లాగ, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంటవగానే ఆయన సీటుకి ఆయన కొడుక్కిచ్చేద్దామనుకున్నారుట, సంబంధాలు బావున్న రోజుల్లో “దీదీ” “OK dont worry..” అందట. ఇప్పుడేమో పరిస్థితుల ప్రభావం కారణంగా,కుదరదనేసరికి ప్రణబ్ గారి కొడుకు ఆయనెవరో అభిజీత్ ముఖర్జీట, ఆయనకి గుండెల్లో రాయి పడింది. వాళ్ళబాబేదో చేస్తూన్నాడుగా, మళ్ళీ ఇంకోడెందుకూ? ఏమిటో “పీత కష్టాలు పీతవీ..”.మన దేశంలో ఇదో హాయి, తల్లి ప్రెశిడెంటు కొడుకేమో మహరాష్ట్రఅసెంబ్లీ సభ్యుడు, తండ్రి ప్రెశిడెంటు కొడుకు already బెంగాల్ సభ్యుడేట, అయినా తండ్రికి దగ్గరగా ఉండొద్దూ అందుకోసం అన్నమాట.మొగుడేమో ముఖ్యమంత్రీ, భార్యేమో ఎంపీ. They can happen here only... ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదూ..ప్రతీవాడూ dynastical rule ఉండకూడదనేవాడే, వాళ్ళెవరో చేస్తే తప్పా, మరి ఈ ప్రబుధ్ధులుచేస్తున్నదేమిటంటా?

   ఇవన్నీ ఒకవైపూ, IIM B వాళ్ళు అదేదో course ప్రారంభించేరుట ” Professional politicians” కోసం. ” చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు” దీనికి కూడా ఓ కోర్సా !! చేతిలో డబ్బులున్నవాళ్ళందరూ పొలోమంటూచేరిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఉధ్ధరించేదేమిటో చూడాలి.

    పేద్ద హడావిడి చేసేసి ధర్నాలన్నారు, దీక్ష లన్నారు, ఉపోషాలన్నారు, నెట్ లో ఆసక్తున్నవాళ్ళందరూ అవేవో group లన్నారు, ఒకటేమిటి హోరెత్తించేశారు ఏడాదిపాటు. చివరకి పార్టీ పెట్టేయాలన్నారు. ” మాకు మాత్రం తెలియదా ఏమిటీ..” అంటూ మిగతా రాజకీయనాయకులూ అన్నారు, Team Anna ఎత్తేశామన్నారు, అయినా మాకూమాకూ అభిప్రాయ బేధాలే లేవుపొమ్మన్నారు, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ తన పేరెక్కడ ఉపయోగించేసికుంటారో అని అన్నా హజారే గారు, తన పేరుకీ, ఫొటోకీ ఓ Patent/ Copy right పెట్టేసికున్నారు ఈవేళ.

    ఈ మధ్యలో మళ్ళీ అదేదో World Cup ట ప్రారంభం అయింది కొలొంబో లో. అప్పుడెప్పుడో ODI లో నెగ్గడం, అతనెవరో “అతని” కోసమైనానెగ్గి తీరాలీ అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమో “ఇంకో అతని” నెగ్గితీరాలీ అనుకుని డిసైడైపోయిందిట మన టీమ్. Great.. Great... వాడెవడిగురించో అనేకానీ, అంతమంది జనాభా వెర్రివెధవల్లాగచూస్తున్నారూ, పోనీ ” దేశం కోసం” ” భారతీయుల కోసం” అనాలని ఒక్కడికైనా తోచిందా. అబ్బే. ఎవడిగోల వాడిదే.. And we glorify these fellows and waste our time..

    ఈమధ్యలో మన నాయుడు గారు “పాదయాత్ర” మొదలెట్టారుట. అదీ 121 రోజులుట. అదో కాలక్షేపం. ఆ జగన్ మోహన రెడ్డి ఓదార్పు యాత్రలన్నాడు, జైల్లో కూర్చున్నాడు. ఏదో మొదటి సారే novel గా ఉంటుంది. అప్పుడెప్పుడో YSR చేశాడంటే, ముఖ్య మంత్రి అయ్యారూ,కొడుక్కి అన్నీ చేశాడూ, మధ్యమధ్యలో ప్రజలక్కూడా ఏదో విదిలించారు కాబట్టి, ఆ చేసిన పుణ్యం ధర్మమా అని, ” నల్లమలై” కొండల్లో, శ్రీశైల ప్రాంతంలో వెళ్ళిపోయాడు.

   అసలు గొప్పదనంతా ఏమిటంటే inspite of all these.. దేశంలో ఇంకా మనకి రోజులెళ్తున్నాయి… అందుకే “మేరాభారత్ మహాన్…”

Advertisements

7 Responses

 1. అందరిని ఒకే టపాలొ దులిపేసారు తాతయ్య.. MEraa bhaarat mahaan

  Like

 2. Perfect summary of all events!!

  Like

 3. దీపా,

  మన ప్రభుత్వం లాగే, జరుగుతున్న విషయాలన్నీ ( as far as possible) ఒకే టపాలో వ్రాయడం హాయి కదా ! మళ్ళీ ఒక్కో దానికీ విడిగా టపాలెందుకూ? అలగని మనం వ్రాసేస్తే ఏదో అయిపోతుందని కాదు. కంఠ శోష…

  సమీరా,

  This is only a part of it. Thought I would write once every fortnight on this subject. I would continue with my regular ones as usual…
  ధన్యవాదాలు…

  Like

 4. “వాడెవడిగురించో అనేకానీ, అంతమంది జనాభా వెర్రివెధవల్లాగచూస్తున్నారూ, పోనీ ” దేశం కోసం” ” భారతీయుల కోసం” అనాలని ఒక్కడికైనా తోచిందా. ” hats off sir.

  Like

 5. చంద్రం గారూ,

  ధన్యవాదాలు…

  Like

 6. మళ్ళీ ఇల్లు మారాము. ఈసారి భారతి వచ్చింది మా ఇంటికి. మంచి చలాకీ మనిషి. వయసు 40 పైనే. నిజాయితీకి మారుపేరు. చురుకుగా సరదాగా ఉంటుంది. నేను ఏదైనా అంటే నామీదే మళ్ళీ అరుస్తుంది (నవ్వుతూ అరిచేది). మొదట్లో నామీద అరుస్తోందేంటి అని విస్మయంగా ఉండేది. కానీ అప్పటికే మాయపొరలు తొలగి ఉండడంతో చిరాకు కలిగేదికాదు. నేను తిరిగి “అరుస్తున్నావెందుకు” అని అరిచేదాన్ని. 🙂 అలా ఇద్దరం సరదాగా ఒకరిమీద ఒకరం అరుచుకుంటాం ఇప్పటికీ. రెండేళ్ళై మా ఇంట్లోనే పని చేస్తోంది. మిగిలిపోయినది, పాచివి ఇవ్వడం అన్న సమస్యే లేదు. మేమైదైనా కొనుక్కుంటే తనకీ ఒక పొట్లాం కట్టిస్తాను. డబ్బుల దగ్గర పేచీయే లేదు. వచ్చిన దగ్గర నుండీ కబుర్లు చెబుతూ పనిచేస్తుంది. తన నోరు ఒక్క నిముషం మూతపడదు. తన సొంత విషయాలు, ఊర్లో విషయాలు అన్నీ చెబుతుంది. మా అమ్మ, నాన్న ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాళ్ళకి దణ్ణం పెడుతుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలంటూ. అలా పడేసింది వాళ్ళని 🙂 ఈ మధ్యన తనకి కాస్త ఒంట్లో బాగాలేక ఒక ఇల్లు మానేద్దామనుకుంది. మానేస్తే మా ఇల్లు గానీ, మా కింది ఇల్లుగానీ మానేయాలి. నాతో ఆ మాటే చెప్పింది. “మా ఇల్లు మానేయకు” అని మాత్రం చెప్పాను నేను. కిందింటి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. దానితో పాటు “పై ఇల్లు మానేయ్ కావాలంటే” అని కూడా చెప్పారట. మొన్నోరోజు వచ్చి “కింద వాళ్ళ ఇల్లు మానేసాను వదినా…వాళ్ళ ప్రవర్తన బాలేదు. నన్నసలు మనిషిలాగే చూడరు. మీతో ఇంత సరదాగా ఉంటానా, అక్కడికి వెళితే నోరే మెదపను. పైగా ఈ మధ్య మీ ఇల్లు మానేయమని బలవంతపెట్టారు నన్ను. మీ ఇల్లు ఎలా మానేస్తాను. మీరు నాకు ఎంత దగ్గరయ్యారు! అందుకే వాళ్ళదే మానేసాను” అని దగ్గరకొచ్చి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. నామొహం వెయ్యొ ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అని వేరే చెప్పక్కర్లేదుగా!

  Like

 7. ఒకే మనిషి ఇన్ని కాలేరు కనక ఇద్దరం ఓ ప్లాను వేశాము. ముందు డాక్టరవ్వాలి . ఆ ఎం.బి బి ఎస్ పట్టా అలంకారంగా అట్టే పెట్టుకుని ఆ పైన , కలెక్టరవాలి. కొంతకాలం పాటు ఎడా పెడా మంచి పనులు చేసేసి, సిన్మాల్లోలాగా ఈ డాక్టర్ cum కలెక్టరమ్మ దేవతతో సమానం అన్న పేరు తెచ్చుకున్న తర్వాత, ఆ ఉద్యోగం మొహాన రాజీనామా విసిరికొట్టి రాజకీయాల్లో చేరి , లీడర్ అయిపోవాలి. స్టేజిల మీద ధారాళంగా ప్రసంగించేస్తూ ప్రజా సేవలో తరిస్తూ గొప్ప పేరుతెచ్చుకోవాలి. అదీ ప్లాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s