బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Happiness in sharing.. లో ఉన్నమజా ఒకసారి తెలిసికోండి…


   నేను బ్లాగులు వ్రాయడం మొదట్లో english లో మొదలెట్టాను. కానీ తెలుగులో వ్రాయాలనే తపన మిగిలిపోయింది. కారణం పెద్దగా ఏమీ లేదూ, ఇంగ్లీషు భాష లో వ్రాసినవి, ఏదో మొహమ్మాటానికి, పిల్లలు చదవడం తప్ప పెద్ద trffic ఉండేది కాదు.మనకింతే ప్రాప్తం ఉందేమో అనుకుని వదిలేశాను. పిల్లల కంప్యూటరులో ప్రయోగాలు చేయాలంటే భయం, ఆ సిస్టం ఎక్కడ తగలడుతుందేమో అని ! పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే, మనకి నేర్పే తీరికా ఎవరికీ ఉండేది కాదూ.

    చివరకి రాజమండ్రీ కాపరానికి వచ్చిన తరువాత, అబ్బాయి ఇచ్చిన desktop ధర్మమా అని, నాకు నేనే ఏదో కెలకడం ప్రారంభించాను. మహా అయితే ఏమౌతుందీ, పాడవుతుంది. మా ఇంటి ఓనరు గారి అబ్బాయి దగ్గరే తీసికోడం వలన, ఎప్పుడైనా కంప్యూటరు కి సుస్తీ చేసినా, వెంటనే attend అయ్యేవాడు. ఇంక నాకెందుకూ భయం… మొత్తానికి వెదికి ..వెదికి పుటుక్కున పట్టేశాను…http://type.yanthram.com/te/. అడిగిన వాడికీ, అడగనివాళ్ళకీ, నాకు తెలిసిన ఈ so called knowledge పంచుకోడం ప్రారంభించాను. మొదటి victim ఇంకెవరూ, మా ఇంటావిడే poor soul !

    ఈ లింకు ధర్మమా అని మొత్తానికి, మీ అందరి ఆదరాభిమానములతోనూ అందరినీ ” బోరు” కొట్టేస్తున్నాను. కానీ ఈ “యంత్రం” లో ఉన్న గొడవేమిటంటే, ఎక్కడో వ్రాసుకుని, copy paste చేయడం. ఈమధ్యలో కరెంటు పోయిందా గోవిందో.. గోవిందా … మళ్ళీ మొదలూ. ఈ బాధలన్నీ పడలేక, పోనీ ఏదైనా direct గా టైపుచేసికునే సదుపాయం ఉందా అని, గూగులమ్మని అడిగితే అవేవో font.. download.. set up.. installation.. అంటూ ఏవేవో వచ్చాయి. మనకా అన్ని తెలివితేటలా లేవాయే, పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే, ఎవరికీ తీరికా లేదాయే. పోనీ, మన బ్లాగర్లనెవరినైనా అడుగుదామా అంటే,ఏవేవో లింకులు పంపుతారూ, ఎదురుగుండా ఉండి చెప్తేనే అర్ధం కాని, మట్టి బుర్రాయే నాదీ( ఈ విషయం అవతలివారికి తెలియదుగా పాపం !).

    వీటికి సాయం మధ్యమధ్యలో అవేవో వైరస్సులుట, వాటి ధర్మమా అని, నా కంప్యూటరు మొండికేసి, కూర్చునేది. వాడెవడో వచ్చి, వైద్యం చేసి మొత్తానికి బాగుచేసేవాడు. కానీ వాడు వెళ్ళీవెళ్ళగానే చూస్తే, యంత్రం బాగానే ఉండేది, కానీ, మిగిలినవన్నీ బాక్సుల్లా కనిపించెవి. వాడికి ఫోను చేస్తే, ఏదో చెప్పేవాడు. నా బాక్సుల్లో మార్పేమీ ఉండేది కాదు. మొత్తానికి వెదుక్కుని http://www.omicronlab.com/tools/icomplex-full.html అని ఒకటి పట్టుకుని, మొత్తానికి తెలుగు అక్షరాలు కనిపించేలా చేశాను. కానీ అవన్నీ గుర్తుండి ఛస్తాయా, మళ్ళీ కంప్యూటరు డౌనూ, నా వెదకడాలు ప్రారంభం…పనేమీ లెదు కాబట్టి పేద్ద గొడవేమీ లేదనుకోండీ…

    ఆ మధ్యన ఎవరినో అడిగితే ఏమిటేమిటో చెప్పారు, కావల్సొస్తే మార్కేట్ లో అదేదో తెలుగు కీ బోర్డు కూడా దొరుకుతోందన్నారు. ఇవన్నీ ఎవడిక్కావాలండి బాబూ, మళ్ళీ ఆ కీ బోర్డులో ఏ ఏ అక్షరాలు ఎక్కడెక్కడున్నాయో మళ్ళీ తెలుసుకోవాలి. ఏదో మామూలుగా వాడుతున్న కీ బోర్డులోనే హాయిగా, నాకున్న బుల్లి knowledge తో ఏదో తిప్పలు పడాలని కదా నాక్కావలిసినదీ, మళ్ళీ తెలుగు కీ బోర్డూ, ఫాంట్లూ గందరగోళం అంతా ఎందుకూ? “చదవేస్తే ఉన్న మతి పోయిందిట”-– అలాగ నాకొచ్చింది మర్చిపోతే ఎలాగా?

    ఇలా నా “వెదుకుడూ, కెలుకుడూ ” ప్రస్థానంలో మొన్న హారం లో ఓ టపా చూశాను. ఇదేదో మనకి పరిచయం ఉన్నట్టు కనిపిస్తోందే అనుకుని, తెరిచి చూశాను. అందులో చెప్పినట్టుగా చేయగానే ఇంకేముందీ..”యురేకా…” అని అరిచేశాను.ఇంక నా copy. paste.. ల గొడవోటి వదిలిందిరా బాబూ అనుకుని! తీరా ఆ టపా శీర్షికేమో wordpress కి అని ఉంది.మా ఇంటావిడేమో blogspot లో వ్రాస్తూంటుంది. పాపం అదేదో ఆవిడకీ రావద్దూ, అనుకుని ఆ కొత్త మాస్టారు శ్రీ చంద్రం గారికి ఓ మెయిల్ పంపాను, గురువుగారూ ( వయస్సెంతైనా గురువులే కదా..కొత్తదేదో నేర్పి పుణ్యం కట్టుకున్నారు..), మిగిలినవాటికి కూడా ” శాపవిమోచన మార్గం” ఉంటే చెప్పండీ అని. ఆయన వెంటనే స్పందించి జవాబిచ్చారు, వివరాలతో.

    “కోతికి కొబ్బరికాయ” దొరికినట్టుగా ఇంకేముందీ, ఆ లింకు డౌన్లోడ్ చేసేసికుని, ఒకటేమిటి, mail, chat,wordpad.,blogspot,wordpress.ఎక్కడపడితే అక్కడ హాయిగా రుచికరమైన అచ్చ తెలుగులో టైపు చేసేసి కుంటున్నాను. ఈ టపా అంతా అలా చేసిందే...

    పేద్ద గొప్పగా ఏమిటేమిటో చెప్తున్నారూ, ఇవన్నీ మాకు తెలియకనా అనొచ్చు. కానీ ఎంతమంది, శ్రీ చంద్రం గారిలా తనకు తెలిసినది ఎంతమందితో పంచుకున్నారూ? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా possessiveneస్సే కానీ, పోనీ ఇంకోళ్ళకీ ఉపయోగిస్తుందేమో అని ఆలోచించే మనస్సు ఎంతమందికుందీ అంట?

    అందుకే చెప్తూంటాను, మీకు తెలిసినదేదో ఇంకోరితో పంచుకుంటే ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు.అలాగని మీ ఆస్థుల్ని అడగడం లేదు.. just knowledge only.. మీ అందరిలాగా మా వయస్సువారు కంప్యూటర్లతో పుట్టలేదు. ఏదో ఊరికే కూర్చుని అచ్చతెలుగులో వ్రాసుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళకేమైనా ఉపయోగించే చిట్కాలు చెప్తూ ఉండండి. మాకా బయట ఏదో Institute కి వెళ్ళి నేర్చుకుందామంటే సిగ్గూ, మొహమ్మాటం ” ఈ వయస్సులో ఇప్పుడు ఈయనకి ఇవన్నీ కావాల్సొచ్చాయా..” అని ఎవరైనా చెవులు కొరుక్కుంటారేమో అనీ. పోనీ మీ అందరిలాగా IITలు,B.Tech, MCA లూ కాదాయే. ఏదో వానాకాలం చదువులాయే…

    ఉన్న keyboard మార్చుకోనఖ్ఖర్లేదు.కొత్తగా typing అసలే అఖ్ఖర్లేదు. హాయిగా శ్రీ చంద్రం గారి టపాలో పెట్టినట్టుగా ఆ లింకులు నొక్కుకుని proceed… ఇంకో సంగతి మర్చిపోకండే… తెలుగునుంచి english లోకి మార్చుకోవాల్సినప్పుడు cntrl+3 నొక్కడం మాత్రం మర్చిపోకండి. లేకపోతే, మీ mails ఓపెన్ అవవు.నన్ను తిట్టుకుంటారు.. ఇంకా వివరాలు కావలిసొస్తే ఇదిగో ఇక్కడ చూడండి. తెలుగే కాదు, ఏభాషైనా, ఎక్కడైనా అరటి పండు వలిచి చేతిలో పెట్టుకున్నట్టే...

    అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే, తెలుగుభాష భ్రష్టు పడిపోతోందే అంటూ మీటింగులూ, కమెటీలూ, నడకలూ చేస్తారే కానీ ఇలాటివి ఉన్నట్టు ఇన్నాళ్ళూ ఒక్కరైనా చెప్పకపోవడం. నేను చెప్పిన సైటులోకి వెళ్ళి చూడండి, తమిళానికి ఎంత సేవ చేస్తున్నారో. మళ్ళీ తెలుగుకి “ప్రాచీన భాష” హోదా ఓటి వచ్చిందంటారు. ఇలాటి సులభమైన సాధనాలు ఉన్నట్టు చెపితేనే కదా అందరికీ తెలిసేదీ, ఉపయోగించేదీనూ…

    Thank you Chandram again...

Advertisements

7 Responses

 1. Nice post taatayya. Blogspotlo New post సెలెక్టు చేసుకుని మనము తెలుగు మాటలని ఇంగ్లీషులో టైపు చేస్తూ స్పేస్ బారు నొక్కగానే తెలుగులో తర్జుమా అయిపోతుంది. దీనికి మనం లొ తెలుగుని సెలెక్టు చేసుకుని వుండాలి. http://lekhini.org/ ని కొంచెం కష్టపడి ఉపయోగించుకోవాలి

  Like

 2. నేను బ్లాగు వ్రాయటం ఈ మద్యనే మొదలుపెట్టాను. మీ టపా నాకు చాలా ఉపయోగపడింది.ధన్యవాదములు.

  Like

 3. @ దీపా మనవరాలా,

  ఆ experiments అన్నీ అయ్యాయి తల్లీ. ఈవేళ నేను పెట్టినంత user friendly పధ్ధతి నాకు దొరకలేదు. నా ప్రాణానికి ఇదే హాయిగా ఉంది. మా పాట్లేవో మమ్మల్ని పడనీయ్…

  @కావ్యా,

  ఎవరో ఒకరికైనా ఉపయోగించినందుకు చాలా సంతోషం గా ఉంది… thanks…

  Like

 4. పదుగురికి ఉపయోగపడే విషయం తెలిపారు..
  బ్లాగు బాగు, బాగు !

  Like

 5. డాక్టరు గారూ,

  ఇదివరకు వ్యాఖ్యలకి జవాబు వ్రాయడానికి, “యంత్రం” లోకి వెళ్ళడం, వ్రాయడం, copy, paste.. ఇంత గొడవుండేది. అలాటిది ఇప్పుడో, చిటికలో అయిపోతోంది….మా మనవడు అగస్థ్య గోడలమీద పెన్సిల్ తో వ్రాసినట్టు, నేను కూడా, కంప్యూటరు లో ఎక్కడ పడితే అక్కడ.. Face Book, Chat, Twitter.. ఒకటేమిటి, అడక్కండి.. హాయిగా ఉంది. Give a try and enjoy…

  Like

 6. I discovered your weblog web site on google and test a few of your early posts. Continue to keep up the excellent operate. I just further up your RSS feed to my MSN News Reader. In search of forward to reading more from you afterward!…
  I am typically to running a blog and i actually recognize your content. The article has really peaks my interest. I am going to bookmark your website and keep checking for brand new information.

  Like

 7. బ్లాగుల్లో ఎంతమంది చెప్తున్నా శక్తి సినిమా చూసే సాహసం చేసేశాను. దీనిక్కారణం నాకు ఫ్యాంటసీ సినిమాలంటే ఇష్టం కాబట్టి. అంజి సినిమా చూశాక ఎలాంటి ఫీలింగ్ కలిగిందో శక్తి చూశాక కూడా అలాగే అనిపించింది. రెంటిలోనూ కామన్ పాయింటు… సినిమా మొత్తం హీరో ప్యాసివ్ గా ఉండిపోవడం. అందులో చిరంజీవి ఆత్మలింగం కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. అతని ప్రమేయం లేకుండానే దొరుకుతుంది. దొరికాకైనా దాంతో ఏమైనా చేస్తాడా అంటే చేయడు. భద్రంగా గూడేనికి తీసుకొచ్చి నాగబాబు గుడిసెలో దాస్తాడు. విలన్ వచ్చాక పిల్లల్ని కిడ్నాప్ చేసి కథ నడిపిస్తాడు. సినిమా మొత్తానికీ హీరో ఏమైనా చేశాడా అని తరచి చూస్తే ప్చ్! ఏం కనిపించదు. ఎవడో కథ నడిపిస్తుంటే దానివెంట హీరోపోతుంటే చూడబుద్ధేయదు. కనీసం… చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల విషయంలో. శక్తిలోనూ అంతే. ఫస్టాఫ్ అంతా హీరోయిన్ వెంటపడి ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోతుంటాడు జూనియర్. పోనీ సెకండాఫ్ లో విషయమేదైనా ఉందా అంటే అదీ లేదు. రుద్రశూలాన్ని ఉపయోగించి హంపిలోని అధిష్ఠాన శక్తిపీఠానికి (ఇది అష్టాదశ శక్తిపీఠాలకూ మూలపీఠం అని కథారచయిత కల్పన) చేరుకునే సీన్లు చాలా పేలవంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కు అరగంట ముందు దాకా హీరోకి ఒక లక్ష్యం ఉండదు. గాలి ఎటు వీస్తే అటు పోతుంటాడు. ఇలా హీరో ప్యాసివ్ గా ఉంటే ఏం నచ్చుతుందీ! దీన్ని రివర్సులో చూద్దాం. ఒక్కడు, దిల్, ఇడియట్… పాతసినిమాలు తీసుకుంటే విజేత, మగమహారాజు, ఇంకా నాకు పేర్లు అంతగా గుర్తురావడంలేదుగానీ, ఇలా హిట్టయిన సినిమా దేన్ని తీసుకున్నా కథ బలంగా ఉంటుంది. దాన్ని నడిపించే మెయిన్ క్యారెక్టర్ హీరోనే అయి ఉంటాడు. ఇదంతా నా అనుకోలు మాత్రమే. నా థీరీకి కూడా కొన్ని ఎక్సెప్షన్లు ఉండొచ్చు. కథ అత్యద్భుతంగా ఉంటే ఈ లాజిక్కులేవీ పనిచేయకపోవచ్చు కూడా. హీరో డమ్మీ అయినా నడిచిపోతుంది. ఉదాహరణకు… బొమ్మరిల్లు. (బొమ్మరిల్లు కథ మరీ అంత ఎక్ట్రార్డినరీనా అని నా మీదకు పోట్లాటకు దిగద్దండోయ్! అది నా సొంత అభిప్రాయం మాత్రమే). థియేటరుకి వెళ్లి చూసేకన్నా… ఐదారునెల్లు ఆగితే టీవీలో వస్తుంది. అలా వచ్చినప్పుడు హాయిగా ఇంట్లోనే పడక్కుర్చీలో కూర్చుని చూడొచ్చు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: