బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఏదో రాఘవేంద్రరావు సినిమా కదా, నాగార్జున నటించిన “అన్నమయ్య” దృష్టిలో పెట్టుకుని, కీర్వాణి సంగీతం బాగుంటుందీ, అనుకుని ఎన్నో expectations పెట్టుకుని, షిరిడీ సాయి సినిమాకి మొదటిరోజు పన్నెండు గంటల షోకి వెళ్తే, థియేటరు లోంచి బయటకు, ఓ పెద్ద disappointment తో వచ్చాను. గ్రాఫిక్స్ తో ఒక డాక్యుమెంటరీ చూసినట్టుంది కానీ, ఏదో దృశ్యకావ్యం చూసిన అనుభూతిమాత్రం కలగలేదు. మొత్తం సినిమాలో నాకు నచ్చినవి బాపూ గారు దత్తాత్రేయ అవతారానికి సృష్టించిన చిత్రాలు మాత్రమే.

    కామెడీ పేరుతో సినిమా చివరికంటా శాయాజీషిందే, ఆలీ పెట్టిన హింస, అదీ డాల్బీ సౌండులో..అడక్కండి… ధర్మవరపు సుబ్రహమణ్యం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అంతకంటే, బ్రహ్మానందం ఇచ్చిన పాత్ర చిన్నదే అయినా, డయలాగ్గులు బావున్నాయి.

    నాగార్జున pre release interviews చెప్పుకున్నట్టు ఇదేమీ, తన most unforgettable పాత్ర ఏమీ కాదు! అన్నమయ్య లో నటించిన అంశ అడుగడుగునా కనిపిస్తుంది. ఇక్కడ తేడా ఏమిటీ అంటే, సాయిబాబా మేకప్పు- రాఘవేంద్రరావు పోలికలతో !! మరీ అంత obvious గా ఉండాలంటారా?
సినిమా ప్రపంచం అంతా రిలీజు చేయడం వల్లనైతేనేమిటి, సాయిబాబా పేరులోని మహిమ అయితేనేమిటి, డబ్బులు మాత్రం వస్తాయి. రెండోసారి చూస్తారనిమాత్రం అనుకోను, ఎంత “షిరిడీ సాయి” పేరుతో సినిమా అయినా.

    లోకోభిన్నరుచి… ఎవరిష్టం వారిదీ….

Advertisements

8 Responses

 1. చూడొచ్చునేమో అనుకుని ఆగాను. ఎలాగూ దసరాకో,దీపావలికో మా ఛానెల్లో చూస్తాను. Nice review తాతయ్య.

  Like

 2. వెర్రి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి. బుద్ధి లేకపోతే అసలు ఈ ఏజ్ లో మీరు అంత అవస్థ పడి అందులోనూ మధ్యాహ్నం సినిమాకి వెళ్ళవల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్నేళ్ళు వచ్చినా తెలుగు సినిమా ఎలా ఉంటుందో ఊహించలేకపోయేరా? సాక్షాత్తూ ఎన్ టీ వోడు వచ్చినా ఏ-ఎన్నారొచ్చిన మన సినిమాలు బాగుపడతాయా? మీ లాంటి వాళ్ళు చూస్తూ ఉండబట్టే సినిమాలు అలా తగలబడుతున్నాయి.

  ఈ మధ్య వచ్చిన సినిమాల్లో (అవును అన్నమయ్యతో సహా) గుండెల మీద చెయ్యేస్కుని మీ మనవల్ని పంపించే సినిమా (ఒక మాయాబజార్ లాంటిది) చెప్పండి? ఈ సినిమాలు ఎంత తగలబడి పోతున్నాయో తెల్సుకోలేని మనదే తప్పు అంతా. ఆ మధ్య ఒక ఐ ఐ టి ఎం టెక్కు నాతో ఇలా అన్నాడు: సినిమాలు మన కల్చర్!! వీడు ఒక ఎం టెక్కూ, ఒక ఐ ఐ టీ ని మళ్ళీ. దరిద్రం కాకపోతే ‘సినిమాలు మన కల్చర్ని చూపిస్తాయీ అనడం కూడా చేతకాని దరిద్రం మనలో ఉన్నంత కాలం మనం ఇలాగే ఉంటాం.

  గత పది రోజులుగా రోజూ నా మెయిల్ బాక్సులో దాదాపు రోజుకి పది మెయిల్స్ వస్తున్నాయి. కెనడాలో షిర్డీ సాయి సినిమా, అమెరికాలో ఇక్కడా అంటూ. వీళ్ళకి భక్తి ఉండొచ్చు కానీ అందర్నీ చంపడం ఎందుకో? పదేళ్ళ క్రితం టేపో, డి వి డి వచ్చేదాకా అగేవాళ్ళం. ఇప్పుడో మొదటి రోజు షో ఉద్యోగం మానేసి మరీ వెళ్తున్నారు. ఇదా ‘బ్రైన్ డ్రైన్ ‘ అంటే? ఆ షిర్డీ సాయి వచ్చినా మనం మారం.

  తప్పు మీదే. అనుభవించండి.

  Like

 3. సార్..75 శాతం శ్రుంగారం, 25 శాతం వేరే రసముంటేనే రాఘవేంద్రరావు గారు మేనేజ్ చేయలరు. వందశాతం భక్తిరసమంటే అయనవల్ల కాదు మాస్టారూ. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలే చూడండి, ఏ స్థాయిలో రాఘవేంద్రుడు శ్రుంగార రసాన్ని కుమ్మరించాడో. .శిరిడీ సాయిలో అది కుదరనట్టుంది.

  Like

 4. షిర్ది లొ మొదట విగ్రహారాధన ఉండేది కాదు.
  కర్నూల్ బాబా మందిరం లొ మొదటి
  విగ్రహం అందుబాటులోకి వచ్చింది.
  బాబా సినిమాలు రామాయణాన్ని మించి వచ్చాయి.
  తిరుపతి గాలి వీధి లోని బాబామందిరం లో
  ఉన్న జనం కోదండ రామాలయంలొ లేరు.
  పబ్లిసిటి అన్నిట్లో పని చేస్తూఉంది.
  మన గురించి గిరీశం ద్వారా గురుజాడ
  వారన్న మాటలు అక్షర సత్యాలు.

  Like

 5. “తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది
  డ్రైనేజీస్కీము లేక డేంజరుగా మారుతోంది” — గజ్జెల మల్లారెడ్డి

  Like

 6. అసలు సినిమాని యెందుకు తీస్తారు?
  ౧. ఒక మంచి సినిమాని తీయాలనే తపన వల్లనా?
  ౨. కళాసేవ చేయాలనే ఆరాటంతోనా?
  ౩. సినిమాలు తీయటం మా వృత్తి, మానుకో లేము అనా?
  ౪. ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి బోలెడన్ని కోట్లు రాబట్టు కోవాలనే లాభాపేక్షతోనా?

  ఎవరేమి చెప్పినా, నిజం అందరికీ తెలుసు.

  సినిమా యెలా తీస్తే బాగా ఆడుతుందీ అని సమకాలీన ప్రజారంజక సమీకరణాలతో కుస్తీపట్టి మంచి పాళ్ళు వేసి వండుతారు సినిమాని బోలెడు డబ్బు తగలేసి. మొగమోటమి లేకుండా చెప్పాలంటే మంచి బిజినెస్ చేసేదే మంచి సినిమా. అదే నిర్మాతల దృక్పధం అని తప్పు పట్టవలసిన పనిలేదు.

  ఒక్కొక్కరు ఒక్కొకరకంగా వంట చేసినట్లే ఒక్కొకరు ఒక్కొకరకం సమీకరణాలను నమ్ముకుంటారు ఈ రంగంలో – ముఖ్యంగా దర్శకులూ, నిర్మాతలు, నాయకులూ.
  అది వాళ్ళ తప్పు కాదేమో.

  కళాతపస్వి అని బిరుదుకొన్న మహానుభావుడి సినిమాలో సంగీతనాట్యాలు బిజినెస్ ఫార్ములాలు – కొన్ని సార్లు పండకపోయినా సరే. కొందరి ఫార్ములాలో భక్తిరసం పాలు యెక్కువ. మరొకాయన ఫార్ములాలో శృంగారం పాలు యెక్కువ కావచ్చును.

  అన్నీ అలాగు తీసే సినిమాలే. బాగుంటే చూడటం లెకుంటె తిప్పికొట్టటం జనం పని. అంతే!

  Like

 7. @దీపా,

  థాంక్స్..

  @sunnA,

  ఇదిబావుంది. చివరకి చివాట్లు నాకన్నమాట! ఉన్నమాట చెప్పినందుకు…మొదటి రోజు మధ్యాన్నం ఆటకే ఎందుకు వెళ్ళాల్సొచ్చిందీ అన్నదానికి– ఏదో ఒక కాలక్షేపం ఉండొద్దూ? మాతో కలిపి పాతికమంది మాత్రమే ఉన్నారు థియేటరులో…మీరు చెప్పినట్టుగా ఈరోజుల్లో చూడతగ్గ సినిమా అనేదే లేదు. రాజకీయాలు భ్రష్టు పడిపోయాయని, ఓట్లు వేయడం మానేమా? అలాగే ఇవీనూ…అంత పెద్దగా స్పందించినందుకు ధన్యవాదాలు…

  @వెన్నెలరాజ్యం1,

  మీరు సినిమాలకి రివ్యూలు వ్రాసే ఇంకో వెన్నెలరాజ్యం గారికి క్లోన్నా? మీరు చెప్పిందానితో పూర్తిగా ఏకీభవిస్తాను. ఆ విషయం నాకూ తట్టిందనుకోండి, కానీ ప్రస్తావిస్తే, ఇంత వయస్సొచ్చిన తరువాత, వాటికోసమనా వెళ్ళేదీ అని పాఠకులు కోప్పడతారేమో అని, వ్రాసిందే తీసేశాను…

  @డాక్టరుగారూ,

  ” మన గురించి గిరీశం ద్వారా గురుజాడ
  వారన్న మాటలు అక్షర సత్యాలు.” అదేదో వ్రాయడానికి అంత మొహమ్మాటం ఎందుకండీ…?

  @శ్యామలరావుగారూ,

  మీరన్నది నిజం. అలాటి ఆశలే పెట్టుకుని తీరా సినిమాకి వెళ్తే, చివరకి జరిగిందేదోనే కదా నా టపాలో వ్రాసిందీ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: