బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– possessiveness….


    మనలో ప్రతీవారికీ ఈ possessiveness అనేది, ఏదో విషయంలోనో, ఏదో వస్తువులోనో, అదీ కాదంటే, ఎవరో ఒకరి విషయంలోనో తప్పకుండా ఉంటూనే ఉంటుంది. పసిపిల్లల్ని చూస్తూంటాము, ఏదో ఒక బొమ్మమీద ఇలాటి గుణం ఉంటూంటూంది. చిన్నప్పుడెప్పుడో ప్రారంభం అయినది, పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత కూడా కంటిన్యూ అవుతూనేఉంటుంది, పరిస్థితులు అనుకూలిస్తే .

మామూలుగా ఇంటి ఆడపిల్లకి, చిన్నప్పుడు ఎంత పేచీ పెట్టినా, కొద్దిగా పెద్దయిన తరువాత, ఎన్ని సార్లు విసుక్కున్నా( మరి విసుక్కోదూ, ప్రతీదానికీ ఏదో ఒకటి అంటేనే కానీ ఒక్కరోజెళ్ళదు. డ్రెస్స్ సరీగ్గా వేసికోలేదనీ, ఊరికే షికార్లు కొట్టకుండా స్కూలు అయిన తరువాత ఇంటికి త్వరగా వచ్చేస్తూండమనీ, పధ్ధతిగా ఉండమనీ,ప్రొద్దుటే నిద్రలేచి స్నానాలు చేయమనీ, తిండి సరీగ్గా తినమనీ… ఒకటేమిటి, ప్రతీ దాంట్లోనూ ఆంక్షలే …), పెళ్ళై కాపరానికి వచ్చేసి, పిల్లలు కన్న తరువాత , అప్పుడు మొదలౌతుంది ఈ “అమ్మ” అంటే possessiveness. అమ్మ అనే character మీద ఇంకోళ్ళెవరికీ హక్కు ఉండకూడదు. బస్ ! అంతే !! ఈ ” అమ్మ” అనే ప్రాణికి, తను ఫోను చేసినప్పుడు “కట్” చేసే “ హక్కు” లేదు. తను చెప్పే ” పచర్ పచర్” అంతా నోరెత్తకుండా వినాలి. ఏ ఖర్మ కాలో ఈ పిల్ల ఫోను చేసినప్పుడే, ఎవరో వచ్చారని తలుపు తీసినా, కుక్కరు కూత పెట్టేసిందని “కొద్దిగా ఆగమ్మా…” అని కూడా చెప్పిన్నా అంతే “కోపం ” వచ్చేస్తుంది. “నాతో మాట్టాడ్డం కన్నా ఎక్కువా అవన్నీ...” అని ఫోను పెట్టేసినా పెట్టేయొచ్చు.

ఒకత్తే పిల్ల అయితే ఏ గొడవా ఉండదు.ఇద్దరు పిల్లలు అదీ ఒక మగా, ఆడా ఉన్నారంటే అయిపోయిందే ఈ ” అమ్మ” గారి పని ! ఈ మధ్యన మా మిత్రులు ఒకరు వచ్చారులెండి మా ఇంటికి. అవీ ఇవీ కబుర్లు చెప్పుకుంటూ, వారి అమ్మగారి గురించి చెప్పుకొచ్చారు. వీళ్ళు నలుగురు అప్పచెళ్ళెలుట,వీళ్ళందరి పిల్లలకీ అమ్మమ్మ గారి దగ్గరే చనువు. వారి చిన్నప్పటినుంచీ, ఒకళ్ళకైతే పెంపకం కూడా వారింటి దగ్గరే. మిగిలిన ముగ్గురు కూతుళ్ళ విషయంలోనూ, వారికి అవసరం అని కాకితో కబురెట్టినా, ఈ అమ్మమ్మ గారు రెక్కలు కట్టుకు వాలిపోయేవారుట.పాపం ఆవిడకి మనవళ్ళూ, మనవరాళ్ళూ అంటే అంత possessiveness మరి, ఏం చేస్తామూ? ఈ నలుగురి పిల్లలూ ప్రస్తుతం వయస్సులో పెద్దవారే. అయినా సరే ఆ అమ్మమ్మ గారు ఇప్పటికీ ఎప్పుడైనా అవసరం వస్తే క్షణాల్లో వెళ్తారుట.

మా ఫ్రెండు ( అంటే మా ఇంటికొచ్చినాయన) అంటూనే ఉన్నారు. ” మీ అమ్మ గారిని మీ అప్ప చెల్లెళ్ళందరూ ఇన్నాళ్ళూ exploit చేసికున్నారూ, ఆవిడ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా, ఊరికే చేస్తున్నారు కదా అని చేయించేసికూడదూ…” అని.ఆవిడ మాత్రం ఒప్పుకోరు, ” మా అమ్మ అంత enthusiastic చేస్తూంటే, అసలు మీకెందుకూ..” అని వాదన. చివరకి నేను రంగంలోకి వచ్చి, మీరు నలుగురు అప్పచెల్లెళ్ళేనా, ఇంకా అన్నదమ్ములెవరైనా ఉన్నారా అని అడిగితే, ఆవిడ మేము నలుగురమేనండీ, ఇంకెవరూ లేరూ అన్నారు. అదన్నమాట సంగతి, ఓ తమ్ముడో, అన్నగారో ఉండుంటే తెలిసొచ్చేది అసలు సంగతి అన్నాను.ఏమో నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే, ఈ possessiveness అనేది ఇంకోలా ఉండేది.. కొడుక్కి అంత possessiveness అనేది లేకపోయినా ( ఉన్నా కానీ, మగపిల్లలకి దాన్ని ప్రకటించే పధ్ధతి అంత బాగా తెలియదులెండి !), కోడలు మాత్రం ఆ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసికుంటుంది. వదినగారు ఎక్కడ, అత్తగారిని మంచి చేసేసికుంటుందో అని దుగ్ధ !ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందని తెలిస్తే చాలు, మూడ్ మారిపోతుంది ఆ ఇంటి కోడలుకి.అక్కడకి ఏదో అత్తగారంటే ప్రేమా అభిమానమూ అని కాదు, ఆ కూతురు ఈవిడదగ్గరనుంచి ఏమేం దోచుకుపోతోందో అని బాధ ! ఇదో రకం possessiveness !

అత్తగారి మీద సర్వహక్కులూ తనవీ, తన పిల్లలవీనూ అనే భావంలో ఉంటుంది. వీటిల్లో ఆ అత్తగారికి ఒరిగేదేమీ ఉండదు. పాపం ఆ తల్లికి ఇద్దరు పిల్లలమీదా అభిమానం ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? రేపెప్పుడో మంచం పడితే, ఆ కొడుకూ, కోడలే చేయాలిగా, అందుకోసం, తెలివిగా manage చేసుకుంటూంటుంది. కూతురిగురించి, కోడలు దగ్గరా, కోడలు గురించి కూతురి దగ్గరా చెప్పకుండా …!

అలాగే మనవడూ, మనవరాలూ ఉంటారనుకోండి, ఈ మనవడు character తన మామ్మ దగ్గరకి ఎవరినీ రానీయడు, ( మా అగస్థ్య టైపన్న మాట !).ఇంకొంతమందుంటారు, వాళ్ళు వాడుకునే వస్తువులు ఓ స్కూటరో, కారో ఛస్తే ఇంకోళ్ళకి ఇవ్వరు, ప్రాణం మీదకొచ్చినా సరే ! కావలిసిస్తే టాక్సీలో వెళ్ళడానికి డబ్బులైనా ఇస్తారు కానీ… స్కూటర్, కారు, బైక్కు నో..నో…

చదువుకునే రోజుల్లో, కొంతమంది, తమ నోట్స్లులు ఛస్తే ఇంకోళ్ళని చూడనిచ్చేవారు కాదు. దాన్ని possessiveness అనండి లేకపోతే, తన నోట్సులు చదివేసి అవతలవాళ్ళు బాగుపడిపోతారేమో అనండి, మీ ఇష్టం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, బస్సులో వెళ్తున్నప్పుడో, రైల్లో వెళ్తున్నప్పుడో, ఏ పసిపిల్లో కనబడి, ఆ పిల్లని ముద్దు చేయండి తెలుస్తుంది ! నాలుగు రోజులు తిండుండదు ! మీ ప్రేమా, అభిమానం ,అన్నీ మీ పిల్లలమీదే కానీ ఊళ్ళోవాళ్ళ పిల్లలమీద కాదు చూపించడం…

ఏదో రిటైరయిపోయారూ, నాలుగూళ్ళూ తిరిగొద్దామని అనుకున్నారే అనుకోండి.. ఊళ్ళోనే ఉండే కూతురు – “అస్తమానూ ఊళ్ళు వెళ్ళకపోతే హాయిగా ఇంటి పట్టునుండొచ్చుగా రెస్టు తీసికుంటే ఏం పోయిందీ..”– అంటూ జ్ఞానబోధలు. అలాగని పోనీ, ఎప్పుడైనా అమ్మా నాన్నలని చూడ్డానికి తీరికుంటుందా అంటే అదీ ఉండదు. ఏమిటో ఒక్కొక్కాళ్ళకి ఒక్కో రకం possessiveness….

గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు, చిన్నప్పుడేమిటిలండి, ఇప్పటికీ కొంతమందికి ఓ చిత్రమైన అలవాటుంది. తెలుగు/హిందీ సినిమా అభిమాన తారల ఫొటోలు, ఎక్కడ కనిపించినా దాచేసికోడం. ఇదివరకైతే అభిమాన తార ముఖపత్రంగా ఏ పత్రికైనా వస్తే, ఆ కాగితం తన నోట్సుకో, ఇంకోదానికో “అట్ట” వేసికోడం.పుస్తకమైనా చిరగొచ్చు కానీ, అభిమాన తార మాత్రం “చిరంజీవి” గానే ఉండేది. ఇంకోళ్ళెవరూ తన అభిమాన తార అంటే ఇష్ట పడకూడదు. ఈ సందర్భంలో మొన్నెప్పుడో ఓ మెయిల్ వచ్చింది. దాంట్లో మన glamorous cine stars మేకప్పు లేకుండా ఎలా ఉంటారో చూపించడానికి. ఇవి చూశైనా మనవాళ్ళు, ఆ సినిమా వాళ్ళంటే ఉన్న craze తగ్గించుకుంటే బాగుండును….enjoy…

Advertisements

6 Responses

 1. నమస్కారం ఫణిబాబు గారు,

  possessiveness గురించి మీరిచ్చిన పోస్ట్ చాలా బాగుంది. నిత్యజీవతంలో అందరి ఇళ్ళల్లోనూ జరిగే వాస్తవాలను బాగా చెప్పారు. మీ పోస్టులు ఇప్పుడే చదవడం మొదలు పెట్టాను. నా జీవితం సరిపోతుందా!!! అయినా చదువుతాను. ఇక మా గురించి (నా పేరు పంతుల రాజారావు, S/o పంతుల విశ్వనాధ శాస్త్రి, విశాఖపట్టణం లో ఓ చిన్న ఉద్యోగం), నేను నా భార్య చైతన్య (నీలిమ), మా అబ్బాయి సాయి ప్రశాంత్ ప్రస్తుతం ఇదీ నా ప్రస్తుత జీవితం.

  Like

 2. నాణేనికి ఒకవైపు చక్కగా వివరించారు. కాని రెండవ వైపు కూడా ఉంటుంది అని మీకు తెలియదు 🙂

  Like

 3. @రాజారావు గారూ,

  ధన్యవాదాలు. నా పోస్టులు అన్నీ చదువుతానన్నారు, సంతోషం. బాగోలేకపోతే మాత్రం తిట్టుకోకండి….

  @మౌళీ,

  ఆ రెండో వైపు ఏముంటుందో చెప్పి పుణ్యం కట్టుకోకూడదూ..?

  Like

 4. మీరన్నవి అన్ని తండ్రి, కొడుకులు, అల్లుళ్ళ మధ్య కూడా కనిపిస్తాయి అండీ (లేదా ఇప్పటి వారి లో బాగా కనిపిస్తున్నాయేమో )

  Like

 5. మౌళీ,

  ఎవరి మధ్యనైతేనేమిటీ, చాలా పారదర్శకంగా, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి…

  Like

 6. కొడుకు: కొೞು-/కోೞು- అన్న మూల ధాతువుకు కొత్త, లేత, పసివాడు, కొడుకు అన్న అర్థాలు ఉన్నాయి. ೞ- కారం తెలుగులో అచ్చుల మధ్య డ- కారంగా మారిందని “ఏడు” సంఖ్యాపదం గురించి చర్చించినప్పుడు అనుకున్నాం కదా. ఆ రకంగా కొೞು- > కొడు- అవుతుంది, అయితే, కొడుకు లో చివరి –కు కారాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు. కోడలు: కోೞು- అళ్ = కోడళు > కోడలు అని ఈ పదాన్ని సూటిగానే వివరింపవచ్చును.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: