బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-batteries recharged…


   అప్పుడే almost వారంరోజులైపోయింది, టపా వ్రాసి.ఎప్పుడు మొదలెడదామని కంప్యూటర్ ముందు కూర్చున్నా, అస్సలు వ్రాయడానికే మూడ్ రావడం లేదు. పొనీ అలాగని టాపిక్కులకి కొదవా అంటే అదీ లేదు.అదేదో బ్యాటరీలు డౌన్ అయిపోయాయంటారే అలాగన్నమాట. ఇదివరకటి రోజుల్లో అయితే, బ్యాటరీలు ఒకసారి డౌన్ అయిపోయాయీ అంటే, వాటిని అవతల పారేయడమే. కానీ ఈ రోజుల్లో అదేదో recharging ట. ఒకసారి అదేదో చేసేస్తే కొన్ని నెలలపాటు శుభ్రంగా పనిచేస్తాయిట! ఇదీ బాగానే ఉందనుకుంటూ, ఈ బ్యాటరీ recharging కి మార్గమేమిటా అని ఆలోచిస్తూంటే, కృష్ణాష్టమి రోజున, మా నవ్యకి స్కూలుకి శలవని, మా దగ్గర వదిలేసి వెళ్ళాడు అబ్బాయి. ఇదివరకెప్పుడైనా వస్తే, టివీ ముందరే సెటిల్ అయిపోయేది. అలవాటు ప్రకారం తను చూసే చిన్నపిల్లల ఛానెల్స్ పెడుతూంటే, ” వద్దు తాతయ్యా ఈవేళ టివీ అస్సలు చూడనని డడ్డా కి చెప్పాను..” అంది. బాప్రే ఇంత బంగారు తల్లివెప్పుడు అయ్యావే బంగారం అన్నాను.

    ఏదో కొంతసేపు ఏవో డ్రాయింగులు వేసికుంది. పాపం ఎంతసేపని వేసికుంటుందీ, తను మాత్రం. ఇంటావిడ తనని తీసికొచ్చి, కంప్యూటరు ఓపెన్ చేసి, ముందుగా ఏవేవో పాటలు వింది. అప్పుడు మొదలెట్టింది, ఆ సైట్ లో బ్రౌజింగ్.ఇంక చూడండి, వదిలితే ఒట్టు.ఏమిటో గేమ్స్ అంటుంది, ఇంకోసారి పైంటింగ్స్ అంటుంది. టైము ఇట్టే గడిచిపోయింది. ఇంతట్లో అబ్బాయి ఫోనూ, రెడీగా ఉన్నారా అంటూ. కృష్ణాష్టమి సాయంత్రం పూజా అవీ చేసికుంటుందిగా, మా శిరీష, అగస్త్య ని creche నుండి తీసికుని, మా ఇంటికి వెళ్ళాము.

    అక్కడ మా నవ్యేమో రాధట, అగస్త్యేమో కృష్ణుడుట తనేమో వాళ్ళ అక్కని ” ఆదా డియర్..( రాధకొచ్చిన పాట్లు!)” అంటూ ఏడిపించడం, తనేమో ఆదా కాదూ, రాధా అనూ అని అనడం. వాళ్ళకి కొన్ని ఫొటోలూ వగైరా తీసి, శిరీష పూజ పూర్తయిన తరువాత, మా నవ్యేమో వాళ్ళ నాన్నని ” మనక్కూడా “దహి అండీ” ఉండాలీ అంటూ పేచీ పెట్టేటప్పటికి, అబ్బాయేమో ఓ indigenous దహి అండీ తయారు చేసేశాడు.

   అగస్త్యేమో కృషుణ్ణి వసుదేవుడు బుట్టలో పెట్టుకున్నట్టు, నన్నుకూడా ఓ బుట్టలో పెట్టి తీసికెళ్ళూ అన్నాడు, ఇప్పుడు బుట్టా, తట్టా ఎక్కణ్ణుంచి తెచ్చేదీ? ఇంట్లో ఐడియాలకేమీ తక్కువ కాదుగా, బాత్రూం లోంచి ఓ ప్లాస్టిక్ టబ్ తీసికొచ్చి దాంట్లో పిల్లలిద్దరినీ చెరోసారీ నెత్తిమీద పెట్టుకుని, ఆ ప్రకరణమేదో పూర్తిచేశాడు. రోజంతా ఇంత హాయిగా గడిపిన తరువాత మా బ్యాటరీలు ఛార్జయ్యేయంటే మరి అవవూ? చివరి రెండు ఫొటోలకీ background చూశారా, బాపూ గారి అద్భుత సృష్టి “ దశావతారాలు”.

    మనవలూ, మనవరాళ్ళూ మనం ఉండే ఊళ్ళోనే ఉంటే వచ్చే ఆనందాలు ఇవే మరి !!

Advertisements

4 Responses

 1. తాత గారి బేట్రీ ఛార్జి అయినట్లేనా?

  Like

 2. చాలా అదృష్టవంతులు.
  మీ బాటరీ చర్గేర్స్ మీ ఊర్లోనే ఉన్నాయి.
  నేను అదే పనికి సెలవు తీసుకొని వేరే వేరే ఉరు వెళ్ళాలి.
  అభినందనలు

  Like

 3. మీ టపా చదివాక చాలా ఆనందంగా ఉంది.
  మీరు ఇలా ప్రతీ వారం బ్యాటరీ రీచార్జు చేయించుకుంటే ఇక మాకు సంబరమే….
  ఎందుకంటారా…? మరి ఆ వారం అంతా టపాలు కోకొల్లలుగా వచ్చి పడతాయి కదా మీ నుంచి….. అందుకు…

  Like

 4. @శర్మగారూ,

  అయినట్టే అనిపిస్తోంది….

  @డాక్టరు గారూ,

  ఈ విషయంలో మాత్రం మేము చాలా అదృష్టవంతులం( భగవంతుడి దయ వలన)

  @మాధవీ,

  అదీ నిజమే ! కానీ బ్యాటరీలు మరీ ఎక్కువసార్లు చేసికోకూడదుట ! చూద్దాం….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: