బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– The other side of it……


   ఈమధ్యన వచ్చిన జనాభా లెఖ్ఖలూ, projections చదువూతూంటే తేలిందేమిటంటే, కొన్ని సంవత్సరాల్లో, ప్రపంచంలోకెల్లా, మన భారత దేశం లోనే ఎక్కువ సంఖ్యలో Senior Citizens ఉంటారని. ఇంక ప్రతీ వాళ్ళూ, అయ్యో.. అయ్యో.. అనుకుని గుండెలు బాదేసికోడమే. ఈరోజుల్లో పిల్లలకి తమ తల్లితండ్రులంటే, ఎంత అనాదరణో, ఈ Senior Citizens ఎన్నెన్ని బాధలు పడిపోతున్నారో, etc etc … లమీద రిసెర్చ్ రిపోర్టులూ, వాటిని ఎక్కడెక్కడి మీటింగుల్లో చదివేయడమూ, మీడియాలో ఆ రిపోర్టుల గురించి, exaggerate చేసేయడమూ చూస్తున్నాము.దానికి సాయం మన ప్రభుత్వం వారు కూడా Parents and Senior Citizens Bill, 2007 అని అదేదో చేశారుట. దాని వివరాలు ఇక్కడ చదవండి. కానీ ఒక్కళ్ళైనా వారివైపునుండి కూడా చూడాలని అనిపించిందా? ఎవరో ఖర్మ కాలి చెప్పాలని ప్రయత్నించినా, ” చెప్పొచ్చేవులేవోయ్..” అనేయడం.This is not fair అని నా అభిప్రాయం. దానితోటి జరుగుతున్న దేమిటంటే, మా ఇంటావిడ వ్రాసిన టపా sandwich generation లో సభ్యుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎవరికి వాళ్ళే అనుకుంటారు అసలు సిసలు శాండ్విచ్ జనరేషన్ అంటే మనమే అని ! దీనికి అంతం అనేదుండదు. కాశ్మీరు సమస్య లాటిది.

   వారి సమస్యలు వాళ్ళకీ ఉంటాయి, అర్ధం చేసికోడంలోనే అసలు సమస్యంతా.కొంతమంది పెద్దాళ్ళను చూస్తూంటాము, మాకు విడిగా రూమ్ముండాలీ అని మొదలెడతారు. ఇదివరకటి రోజుల్లో లాగ, పడగ్గదులూ, పురుటి గదులూ, బయటుండే గదులూ, కచేరీ సావిళ్ళూ ఉండే రోజులా ఇవి. ఆరోజుల్లో అంటే చెల్లేయి, ఇలాటి లగ్జరీస్ అన్నీనూ. అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లలో ఇలాటివన్నీ కావాలంటే కుదురుతుందా? ముందుగా adaptable mentality ఉండాలంటాను.

Advertisements

3 Responses

 1. సద్దుబాటు గొప్ప ఆయుధం,దీన్ని మరిచిపోతున్నారు.

  Like

 2. సర్దుకొని పోవడాన్ని ఎప్పుడూ ఎదుటి మనిషి నుంచే ఆశించడం లోనే చిక్కు వస్తుంది మరి.

  Like

 3. @శర్మగారూ,

  అక్కడే కదా వచ్చిన గొడవంతానూ….

  @డాక్టరుగారూ,

  సద్దుబాటనేది రెండు పార్టీలనుండీ ఉండాలి. కానీ ప్రస్తుతం అది one sided అయిపోయింది…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: