బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వ్యవస్థ లో క్రమశిక్షణ లేదో.. అని ఏడవడం ఎందుకో…


    ఈమధ్యన రిజర్వ్ పోలీసు దళానికి చెందిన వారి కుటుంబాలు, రోడ్డెక్కేసరికి, మన పోలీసు అధికారులందరూ గుండెలు బాదేసికున్నారు. రూల్సూ, క్రమశిక్షణా అంటూ ఏమేమో చెప్పడం మొదలెట్టేశారు. ఆ కుటుంబాలు మాత్రం ఏం చేస్తాయీ? మన డిజీపీలూ వాళ్ళూ CAT/High Court లలో ఒకళ్ళమీద ఒకళ్ళు వ్యాజ్యాలు వేసికోవడానికే టైము చాలడం లేదు. ఒకాయనెవరో డిజిపి గా నియమింపబడగానే, ఠక్కున ఇంకో ఆయన కోర్టుకెళ్ళిపోతాడు.పోనీ ఆ అవతాలాయనేమైనా బుధ్ధిమంతుడా అంటే అదీ లేదూ, ఎవరిదో సంతకం ఫోర్జరీ చేశాడుట, ఈమాత్రం దానికి ఇంకోళ్ళమీద పడి ఏడవడం ఎందుకో? పోనీ మన రాష్ట్ర ప్రభుత్వానికైనా బుధ్ధుందా, గత కొన్నేళ్ళుగా డిజిపీ నియామకాల్లో ఓ పారదర్శకత అనేదుండాలని, సుప్రీం కోర్టు వారు ఎంత గడ్డి పెడుతున్నా, అసలు పట్టించుకునే నాధుడే లేడు. అయినా మన మంత్రులకి ఇవన్నీ చూసే తీరికెక్కడిదీ, కొడుకులు చేసే భూకబ్జాలే కవరు చేసికుంటారా, లేదా తమమీద వచ్చిన ఆరోపణలకే జవాబులిచ్చుకుంటారా?

    ఇంతంత పనుల హడావిడిలో పడి, ఆ afterall పోలీసుల గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఈవేళ సాక్షి పేపరు “తూ.గో.జి” ఎడిషన్ చదువుతూంటే తెలిసింది, పోలీసులకి ( ఆఫీసర్లు కాదు) ఇచ్చిన గృహాల స్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో. మళ్ళీ “సాక్షి” పేపరుని కోట్ చేస్తున్నారా అనకండి.ఏ పేపరువాడైనా సరే, ఉన్నదున్నట్టుగా చెప్తే కొద్దిగా చేదుగానే ఉంటుంది. గోదావరి జిల్లాల్లో పోలీసు క్వార్టర్లు పశువుల పాకలకంటే హీనంగా ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కట్టిన క్వార్టర్లే గతి. మళ్ళీ మన రాజకీయనాయకులూ, మంత్రులూ– వీళ్ళకిచ్చిన నివాసస్థలాలేమో పెద్ద పెద్ద బిల్డింగులూ, కొత్తగా వచ్చిన వాడు వాస్తూ, వల్లకాడూ అంటూ వాటికి కోట్లకి కోట్లు మనం కట్టిన పన్నుల్లోంచే డబ్బులు తగలేయడం. ఇలాటివి ఎవడూ అడక్కూడదు. ఏమైనా అంటే రూల్సూ, సింగినాదాలూనూ.
వీటికి సాయం, వాళ్ళ డ్యూటీ టైములు- మరి ఆ కుటుంబాలన్నీ రోడ్డెక్కాయంటే ఎక్కవూ మరి? ఏదో ఈ పోలీసులన్నవాళ్ళు, నూటికి తొంభై పాళ్ళు, డ్యూటీ చేస్తున్నారు కాబట్టే ఈమాత్రమైనా బతుకుతున్నాము. ప్రతీ వ్యవస్థలోనూ ఉంటాయి కలుపుమొక్కలు. అలాగని పూర్తి వ్యవస్థే మంచిదికాదూ అనడం బావుందా? మొత్తం అందరూ, అదేదో సినిమాలో చూపించినట్టు, శలవు పెట్టేసి పోతే వదుల్తాయి రోగాలు.

    మొన్న పూణె లో జరిగిన పేలుళ్ళ గురించి వినే ఉంటారు. బాంబులూ వగైరాలు పెట్టినప్పుడు, అదేదో BDDS అనేవాళ్ళు రంగం లోకి వస్తూంటారు.ఇంకా పేలకుండా ఉన్న బాంబులు, ఎక్కడున్నాయో చూడ్డం, వాటిని జాగ్రత్తగా వాటిని నిర్వీర్యం చేయడమూ వీళ్ళ పని. ఆ రోజున జరిగిన సంఘటన సందర్భంగా, ఇంకా పేలని రెండు బాంబులు కనుక్కుని, మొత్తానికి వాటిని నిర్వీర్యం చేశారులెండి.ఆ సందర్భంలో ఈ BDDS గురించి, ఓ పేపరు వాళ్ళు సమాచారం సేకరించారు. దాంట్లో తేలిందేమిటయ్యా అంటే. ఈ BDDS వాళ్ళకి అసలు Insurance cover లేదుట !! అసలంటూ ఉందిలెండి, కానీ దానికి కట్టాల్సిన premium కట్టడం కొద్ది నెలలుగా మర్చిపోయారుట… వహ్వా వహ్వా…అదండీ మనం, మన ప్రాణాలు కాపాడే వాళ్ళకిస్తున్న విలువ! ఇలాటివొచ్చినప్పుడు, ఆ ఆఫీసర్లని వెళ్ళి ఆ బాంబుల వ్యవహారమేదో చూడమంటే తెలిసొస్తుంది. వదులుతుంది రోగం ! మొత్తానికి ఆ పేపరు ధర్మమా అని, ఆ ప్రీమియం ఏదో కట్టారుట.అలాగే సాక్షి వారు వ్రాశిన న్యూసు ధర్మమా అని, ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులుండే ఇళ్ళు బాగుపడితే మంచిదేగా.

    కొద్ది సంవత్సరాలుగా మన సైన్యం లో ఉంటున్న విజయకుమార్, ఈ ఒలింపిక్స్ లో సిల్వర్ సంపాదించిన షూటర్ మొన్నెప్పుడొ, ఆర్మీలోంచి బయటకొచ్చేస్తానూ అని ఓ ప్రకటన చేశారు. కారణం తను అన్నన్ని రికార్డులు సృష్టించినా గత అరేళ్ళుగా ఎవడూ పట్టించుకోనే లేదూ, ఆర్మీలో కూడా ఒక్క ప్రమోషనూ రాలేదూ అని. దిక్కుమాలిన క్రికెట్టులో ఓ వైపున డబ్బులకి డబ్బులు సంపాదించుకుంటూన్నా అదీ కోట్లలో, మన కాప్టెన్లకి, మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు, వారికి నీరాంజనాలిచ్చి, ఆర్మీలో అవేవో ఆనరరీ కల్నల్లూ అవీ చేసేస్తారే, అలాటిది ఆర్మీలోనే ఉంటూ, దేశానికి అఖండ గౌరవం తెస్తున్న విజయకుమార్ లాటి వారిని పట్టించుకోకపోవడం అసలు ఏమైనా బాగుందా?

    అందుకే పోలీసు కుటుంబాలూ అవీ రోడ్డెక్కాయి…..

Advertisements

3 Responses

 1. అందరూ ఆ తానులో ముక్కలే. నిజంగా పోలీసులకి జరిగేది శూన్యం.

  Like

 2. 1.ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.
  ప్రతి ఒక్కడికి ఎదుటివాడి తప్పులే కనిపిస్తాయి.
  అదే జీవితం, మోరల్ సైన్స్ నేర్పడం మానేసారుగా, మరి!
  2.అమ్మయిన అడగ కుండా పెట్టదుట,
  విజయ కుమార్ దేశానికి తెచ్చిన అరుదయిన (ఓన్లీ)
  రజతానికి బహుమానాల వర్షమే, చూస్తూ ఉండండి.
  మెడల్ ఏవీ రాకుండానే సుబేదార్ మిల్కా సింగ్,
  పదవి లో ఉన్నతి తో బాటుగా ఎన్నో సాధించుకున్నాడు.

  Like

 3. @శర్మ గారూ,

  ఔను కదా…

  @డాక్టరు గారూ,

  మీరు చెప్పేదీ నిజమే.. మరీ విజయ్ కుమార్ అనుకున్నట్టుగా కాక, ఈసారి వెల్కం లు, మీడియా కవరేజీ బాగానే ఉన్నట్టున్నాయి. ఇంక పదోన్నతి వ్యవహారం చూడాలి…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: