బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–రెండేళ్ళకి తెలిసింది మొత్తానికి….


    మన ప్రజాజీవనంలో లంచాలనేవి ఒక భాగంగా మారిపోయాయి. అదేమిటో ఎవడైనా డబ్బులు తీసికోకుండా ఓ ఉపకారం చేశాడంటే, అదో విచిత్రంగా భావిస్తారు. దానితో ఆ పుచ్చుకునేవాళ్ళు కూడా ఒహో తీసికోవాలి కాబోసు అనుకుని, మొదటిసారి మొహమ్మాట పడ్డా, దానికి అలవాటు పడిపోతాడు. దానితో ఈ లంచాలు అనేవి institutionalise అయిపోయాయి. కట్నాలూ అలాటివే. ఎవరైనా కట్నం వద్దన్నాడనుకోండి, అతనిలో ఏదో లోపం ఉండుంటుందనుకుంటారు. మన జీవితాలు అలా తగలడ్డాయి మరి.ఏం చేస్తాం?

ఏదో ఈమధ్యన మన న్యాయవ్యవస్థ కూడా కొద్దిగా, నిద్రలేచి, అక్కడక్కడ కేసులు విచారిస్తున్నారు.కానీ లాభం ఏమిటీ? ఓ అయిదారు నెలలు జైల్లో పెట్టి, బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళ కేసులు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదూ అంటే లేవు.రావణ కాష్ఠం లా అవి ఉంటూనే ఉంటాయి. అధికారంలో ఉండే పార్టికి ఈ కేసులు ఓ తురపు ముక్క లాటివి.ఆ కేసులున్నవాళ్ళు ఎప్పుడైనా అల్లరి పెట్టడం ప్రారంభిస్తే, ఓ సారి వాళ్ళమీదుండే కేసులు ఓపెన్ చేస్తూంటారు. మన జనాభా అందరూ ఆహా.. ఓహో ..అనుకుంటూ చంకలు కొట్టుకుంటూంటారు. మన యువతైతే social networking sites లో హడావిడి చేసేస్తారు. ఎవడైనా ఖర్మకాలి వాటికి against గా మాట్టాడితే, వాణ్ణి ఓ traitor లా చూస్తారు.

రెండేళ్ళ క్రితం మా అన్నా హజారే గారు, దేశాన్ని బాగుచేసే మహత్తర ఉద్దేశ్యంతో ఓ ఆందోళన ప్రారంభించారు.దేశంలో ఎక్కడలేని రాజకీయనాయకులూ, అర్రే ఇదీబాగానే ఉందీ అనుకుంటూ, ఆయన వెనక్కాల బయలుదేరారు. ఓ ఏడాది పాటు, మీడియాలోనూ హడావిడి జరిగింది.ఇంక social networking sites లో జరిగిన హడావిడి గురించి అడక్కండి.ఒకటి రెండు సార్లు నిరాహార దీక్షలూ వగైరాలు నిర్వహించిన తరువాత, ఏదో కొద్దిగా చలనం కనిపించింది.ఇదీ బాగానే ఉందీ అనుకుని, periodical గా అన్నా టీం వాళ్ళు కూడా హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభించారు- ఫలానా రోజుకి అదేదో చట్టం తేకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామూ అని. సరే అలాగే కానివ్వండి అన్నారు మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు.చివరకేమయ్యిందీ, ఓ పదిరోజులపాటు మీడియా నిండా న్యూసులో ఉండి, చివరకి ఓ గ్లాసుడు నిమ్మరసం పుచ్చుకుని ఉద్వాపన చెప్పేశారు.ఓ రాజకీయ పార్టీ మొదలెడతామూ అని ఓ ప్రకటన కూడా చేసేశారు!

అక్కడికేదో రాజకీయాల్లోకి వస్తే ఏదో పొడిచేసినట్టు. అలాగని అన్నా హజారే గారి intentions లను dilute చేయడం లేదు.నన్ను తప్పుగా అర్ధం చేసికోకండి.ఈ విషయం మీద అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను.మన రాష్ట్రంలో పాపం జయప్రకాశ్హ్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ మొదలెట్టారు. ఆ పార్టీ నుండి ఎంతమంది అసెంబ్లీకి వచ్చారూ? ఒక్కరూ అదీ ఆయనే. అన్నన్ని కబుర్లు చెప్పేసిన మన రాష్ట్ర ప్రజలకి, లంచాలంటేనే ఇష్టమంటారా? Definetely not. కానీ ఈ ఎలెక్షన్లన్నవున్నాయే, వాటిదాకా వచ్చేసరికి పాతవన్నీ మర్చిపోయి ఆ particular moment లో చేతిలో పడ్డ డబ్బులూ, నోట్లో పడ్డ మందు మాత్రమే గుర్తుంటుంది. మనకి ఎలెక్షన్లలో ఓట్లు కదా లెఖ్ఖలోకొచ్చేది, ఉద్దేశ్యాలూ, పాలసీలూ ఎవడిక్కావాలండి బాబూ?

అప్పుడెప్పుడో మన మెగాస్టారు గారు, సామాజిక న్యాయం అంటూ ఓ పార్టీ పెట్టేశాడు. చివరికేమయ్యిందీ, పెట్టే బేడా పట్టుకుని కాంగ్రెస్ లో చేరి, రాజ్యసభకి వెళ్ళాడు. హాయిగా అయిదారేళ్ళు ఎవడూ అడిగేవాడు లేడు. ఏదో పార్టీ పెట్టేశామూ అంటే సరిపోతుందా, దానికి ఎంత కథా కమామీషూ. 1977 లో జయప్రకాశ్ నారాయణ గారి ధర్మమా అని, దేశం దేశం అంతా అట్టుడికిపోయింది. జైల్లో ఉన్న ప్రతిపక్షాలవాళ్ళు అందరూ జనతా పార్టీ అన్నారు, వాళ్ళ నిర్వాకం ఎన్నిరోజులుట, రెండంటే రెండేళ్ళు ! ఆ పార్టీ నామో నిషానీ లేకుండా పోయింది, ఆ సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడూ దానికి దిక్కు. పార్టీలకేమి లోటు? కావలిసినన్నున్నాయి. కానీ వాటిలో ఎన్ని effective అని ప్రశ్న.అన్నా గారి పార్టీ ఎంతదాకా వస్తుందో చూద్దాం.

పార్టీ ఎం నాకు ఒక విషయం అర్ధం కాదు, మొన్నెప్పుడో ఓ అమ్మాయి ఇన్ఫోసిస్ బిల్డింగు లోంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసికుందిట. ఇది చాలా విచారకరమైన విషయమే. కాదనము. కానీ ఆ పోలీసులేమిటీ, నిన్న ఓ మీటింగు పెట్టి, అవేవో cc camera clips,sms, phone calls data అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటిటా? అసలే మన మీడియా ఓ కోతి, వాళ్ళ చేతుల్లో ఇలాటివి అవసరమా. ప్రతీ దానికీ trial by media అంత అవసరమా? ఇంక ఆ పోలీసులెందుకూ, కోర్టులెందుకూ?

ఎందుకొచ్చిన గొడవల్లెండి. లంచాలూ ఉంటాయి, మనమూ ఉంటాము. ఎప్పుడూ ఉండే గొడవలే.ఆ మాత్రం లంచాలు లేకుండా వెళ్తాయేమిటీ రోజులూ? మనం తిట్టుకుంటునే ఇస్తూ ఉంటాము, తీసికునేవాళ్ళు పుచ్చుకుంటూనే ఉంటారు. ఈవేళ న్యూస్ పేపర్లోలో ఒక వ్యాసం వచ్చింది. హాయిగా చదివి ఆనందించండి.Times Crest

Advertisements

4 Responses

 1. @ వాటిదాకా వచ్చేసరికి పాతవన్నీ మర్చిపోయి ఆ particular moment లో చేతిలో పడ్డ డబ్బులూ, నోట్లో పడ్డ మందు మాత్రమే గుర్తుంటుంది.

  నీతి, అవినీతి ప్రసక్తి ఎందుకు, మీకు మాత్రం మిమ్మల్ని పొగిడేస్తూ వ్యాఖ్యలు వ్రాసే వారే గుర్తుండటం లెదూ ! అదీ ఒకరకమైన … అన్నమాట !
  ఉద్దేశ్యాలూ, పాలసీలూ ఎవడిక్కావాలండి బాబూ? 🙂

  Like

 2. మౌళీ,

  అవును కదా…. నేనూ సగటు మనిషినే కదండీ…..

  Like

 3. పార్టీ పెట్టాల్సిన అవసరం తెచ్చారు అవినీతి పార్టీలు, ప్రభుత్వాలు. ఇదీ ఓ పార్టీగానే మిగిలిపోతుందో, ఆశయాలకు తగ్గట్టు పోరాడుతుందో చూద్దాం.

  ఎన్నికల్లో అవినీతి సాధారణం, ఆ తమదైన అవినీతి బురదలోకి దించి, యుద్ధాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవడం అవినీతి పార్టీల పన్నాగం. అందుకో దమ్ముంటే ఎన్నికల్లో నిలబడు అని చాలెంజ్ చేసే వారు. వచ్చాక వాడికీ ఇంత అంటించేస్తే సరి.
  ఈ సంఘర్షణ జరుగుతూనే వుంటుంది, వుండాలి. ఏదో ఒకనాడు గెలుస్తామనే స్పూర్తి. మరోసారి ఇలాంటి కొత్త పార్టీలను నమ్మితే పోయేదేమీ లేదు, మహా అంటే మరో సారి మోసపోతాం, అంతేగా.

  Like

 4. Snkr,

  పురిట్లోనే సంధిలాగ, ఆ టీమ్మునే ఎత్తేశారు మా అన్నాజీ . ఇంక పార్టీ సంగతంటారా……

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: