బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం…


    బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురౌవుతూంటాయి. అలాటిదే ఈవేళ నాకు అనుభవంలోకి వచ్చింది. ప్రొద్దుటే, మామూలుగా రైల్వే స్టేషను కి వెళ్ళి, తెలుగు పుస్తకాలు తీసికుందామని బయలుదేరాను.ప్రొద్దుట తొమ్మిదిన్నర సమయం కావడంతో బస్సులన్నీ, నిండుగా వస్తున్నాయి. ఏదో senior citizen అవడం ధర్మమా అని, వెనక్కాలనుంచి కాకుండా, ముందునుంచే బస్సెక్కే privilege ఒకటుందిలెండి. నేనెక్కేటప్పటికే, బస్సు కిక్కిరిసి ఉంది. ఏదో, కొంత దూరం వెళ్ళిన తరువాత, ఓ ఎంట్రెన్స్ దగ్గరుండే ఓ సింగిల్ సీట్ ఖాళీఅవడంతో, దాంట్లో కూర్చున్నాను. కొంత దూరం వెళ్ళాక, తరువాతి స్టాప్ లో చాలా మంది స్త్రీలు ఎక్కారు.అందులో ఒకావిడ కొద్దిగా more active అనుకుంటా.నన్ను ఉద్దేశించి, बायि माण्सा ला बसाला जागा दॅयाला काय झाला ( దాని తెలుగు అనువాదం : ఆడవాళ్ళకి సీటివ్వొచ్చు గా అని…). దానికి సమాధానంగా నేనన్నానూ, మరాఠీలో..” ఈ సీటు సీనియర్ సిటిజెన్లకీ, మీకు విడిగా సీట్లిచ్చారు కదా, దాంట్లో కూర్చోవచ్చుకదా. పోనీ మీరు కానీ, నాకంటే ఎక్కువ వయస్సున్నవారైతే ఖాళీ చేసుండేవాడినీ..” అని.ఆవిడకి మహ ఉంటే యాభై ఏళ్ళుండొచ్చు. ” మీరు ఈ బస్సు బుక్కు చేసినున్నారా.. ” అంటూ, ఏదేదో సణుక్కుంటూ నుంచుంది. స్త్రీల హక్కులూ,బస్సుల్లో సీట్ల సంగతులూ, ఏవేవో గొణుగుతూనే ఉంది. నేను దిగే స్టాప్ వస్తూండడంతో, ఆవిణ్ణి పిలిచి, సీట్ ఆఫరు చేస్తూ అన్నానూ…” మీరూ సుఖంగా కూర్చోండీ, అవతలివాళ్ళనీ సుఖంగా బతకనివ్వండీ, ఊరికే లెక్చర్లివ్వకండీ...” అంటూ నా దారిన నేను దిగిపోయాను.

    పుస్తకాలు తీసికుని, మా ఇంటివైపు వెళ్ళే బస్సు ఎక్కాను. ఇక్కడ బస్సుల్లో రెండు సీట్లు senior citizen లకీ, రెండు సీట్లు physically challenged వారికీ రిజర్వ్ చేస్తారు. వాటిల్లో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ( గుండ్రాయిలా ఉన్న వాళ్ళే !!) కూర్చుంటూంటారు.ఛస్తే లేవరు. పోనీ ఏమైనా uneducated వాళ్ళా అంటే, అలాగా కనిపించరూ, పెద్ద పెద్ద పోజులూ, చెవుల్లో “పువ్వులు” ( earphones) పెట్టేసికుని, దిక్కుమాలిన పాటలు వింటూనే ఉంటారు.వాళ్ళు ఒకలా చెప్పాలంటే beyond economic repairs... అంతే. అలాటప్పుడే అనిపిస్తూంటుంది సంస్కారం అనేది చదువుతో రాదూ, జన్మతహా ఉండాలీ అని !ఇంతకీ చెప్పొచేదేమిటంటే, నాకు ఓ ఖాళీ సీటు దొరికితే అందులో కూర్చున్నాను.

   కొంత దూరం వెళ్ళాక బస్సులోకి ఒకతను ఎక్కాడు. అతను చేతిలో కర్ర పట్టుకుని, ఎంతో కష్టంతో, చేతిలో పేద్ద సూట్ కేసు తో ఎక్కాడు.అతన్ని చూసైనా, ఆ రిజర్వ్ చేసిన సీట్లలోంచి ఎవరైనా లేచి, సీట్ ఇస్తారేమో అని చూశాను. ఎవరూ లేవకపోయేసరికి, నేనే లేచి, నా సీట్ లో కూర్చోమన్నాను. ఈ తమాషా అంతా చూస్తూంటారు కానీ, ఒక్కడూ లేచిన పాపాన్ని పోలేదు. నాకైతే చిర్రెత్తుకొచ్చేసింది. ఛడా మడా కోప్పడేశాను. మీకు సిగ్గూ శరమనేదేమైనా అసలుందా, physically challenged వారికోసం ఉంచిన సీట్లో కూర్చోడమే తప్పు. పోనీ ఖాళీగా ఉండడం చేత కూర్చున్నారూ, పోనీ అలాటివారెవరైనా వచ్చినప్పుడైనా, లేచి సీటు ఆఫర్ చేయకుండా, అలాగే కూర్చున్నారూ etc..etc… అని.

    నా కేకలు విని, అక్కడ కూర్చున్న నలుగురిలో ఒకతను లేచి, ” ఇక్కడ కూర్చున్న మిగిలిన ముగ్గురునీ వదిలేసి, నామీదే ఎందుకరుస్తున్నారూ...” అని.తను లేచి ఆ వచ్చిన physically challenged ఆసామీని కూర్చోపెట్టాడు. అప్పుడు అతనితో అన్నానూ ” నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి అనలేదూ, కానీ మీలో ఇంకా ” మానవత్వం, సంస్కారం..” లాటివి ఇంకా మిగిలే ఉన్నాయి కాబట్టి, మీరు అంతలా రియాక్టయ్యారూ, ఆ గుణాలు/ స్వభావం మాత్రం వదలొద్దూ జీవితంలో...” అని. కావలిసొస్తే మీరు నా సీటు లో కూర్చోండీ..అన్నాను. కానీ అతను నుంచునే ప్రయాణం చేశాడు. దిగే ముందర ఇంకోసారి అతనికి ఎపాలజీ చెప్పి, నా దారిన నేను దిగిపోయాను.

    అక్కడితో అయిందా, ఇంకో బస్సు ఎక్కాల్సొచ్చింది. ఖాళీ లేదు, నా చేతిలో రెండు సంచీలూ, గొడుగూ. అలాగే నుంచున్నాను.ఇంతలో ఒకతను లేచి నుంచుని సీట్ ఆఫర్ చేశాడు. ఫరవాలేదూ, మూడు స్టాప్పుల తరువాత దిగిపోతానూ, అని చెప్పినా సరే, బలవంత పెట్టి కూర్చోపెట్టాడు.అప్పుడు అనుకున్నాను, సంస్కారం అనేది ఎవరో చెప్తే నేర్చుకునేది కాదూ…అని.అక్కడకేదో, అతను నాకు సీటిచ్చేశాడని సంస్కారవంతుడూ అనడం లేదు, బస్సుల్లో ఎప్పుడైనా ఎవరికోసం రిజర్వ్ చేశారో, అలాటివారు వచ్చినప్పుడైనా, వారి సీట్ వారికిస్తే దాన్ని సంస్కారమనే అంటాను !! రేపెప్పుడో, వాళ్ళుకూడా వృధ్ధులవుతారు, వాళ్ళకీ ఈవేళ మాలాటి వారు ఎదుర్కొంటున్న పరిస్థితి రావొచ్చు. అది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలనేదే నా ఉద్దేశ్యం…

    పోనీ అలా కాదనుకుందాము. ఇక్కడ బస్సుల్లో ఓ రూలుంది.ఎవడైనా నాలాటి తిక్కశంకరయ్యలు, complain చేస్తే, అలా కూర్చున్నవాడికి ఫైను వేస్తారు !
అంతదాకా ఎందుకూ, ఏదో కాలూ చెయ్యీ ఆడుతోందీ భగవంతుడి దయ వలనా, ఈమాత్రం దానికి ఇంకోడి పొట్ట మీద కొట్టడం ఎందుకూ అని చూసీ చూడనట్టు వదిలేస్తూంటారు.దాన్ని ” చేతకానితనం” అనుకుంటే ఎలాగా….

Advertisements

2 Responses

  1. ఇలాంటి వాళ్ళంతా మానసిక వికలాంగులు బాల్య వృద్దులు
    క్షమించి వదిలేయండి .వీలయినంతవరకు అలాంటి వాళ్లే విడిగా కూర్చోవాలి మనం దూరం పాటించాలి

    Like

  2. శాస్త్రి గారూ,

    మీరన్నదీ నిజమే అనుకోండి. కానీ ఒక్కొక్కప్పుడు చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: