బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– We get what we deserve…..


    ఈ టపాకి పెట్టిన శీర్షిక, ఆయనెవరో పెద్దాయన చెప్పారుట. నిజమే కదూ ! ఏదో పెద్దాయన చెప్పారని కాకపోయినా, ఒప్పుకోడానికి కొంచం కష్టమనుకోండి.అయినా నిజం నిజమే కదా ! ఉదాహరణకి చూడండి, నిన్నా మొన్నట్లో భాగ్యనగరం ఎడతెరిపి లేని వర్షానికి బలైపోయింది. కాలనీలకి కాలనీలు అతలాకుతలం అయిపోయాయి. ఎపార్టుమెంట్ల బేస్మెంట్లలోకి నీళ్ళొచ్చేసి, కార్లు కొట్టుకుపోయాయిట. పల్లంలో ఉండే చిన్న చిన్న ఇళ్ళల్లోకి నీళ్ళొచ్చేసి అపార నష్టాన్ని రుచి చూపించింది.ఇంక ప్రతీ వాళ్ళు టివీ ల్లోకి వచ్చేసి అయ్యోయ్ నాయనోయ్ మా బ్రతుకులిలా అయిపోయాయో అని గోల పెట్టేవారే. ఛాన్సు దొరికితే చాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఉండేవే. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ లేదు.ప్రతీ వర్షాకాలంలోనూ సంవత్సరాల తరబడి మనందరమూ చూస్తూనే ఉన్నాము.ఈ ప్రభుత్వాలని ఎన్నుకున్నదీ మనమే కదా, ఇప్పుడేమీ చేయడం లేదో అని గోల పెట్టడం దేనికీ? అలాగని మనం మాత్రం చేస్తున్నదేమిటీ? ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జా చేసేయడం, ఓ డ్రైనేజీ మీద ఓ జోపిడీ వేసేసికోవడం, లేక ఇంకో రియల్ ఎస్టేట్ వాడు ఓ ఎపార్ట్మెంటు సముదాయం కట్టేయడం, మనమేమో ఎగేసుకుపోవడం మరి వర్షాలొచ్చినప్పుడు, ఆ నీళ్ళన్నీ ఎక్కడకి పోతాయిట? ఏదో underground drainage లాటివి కట్టి, ఎప్పుడైనా అవి choke అయితే దాన్ని బాగుచేయడానికి రోడ్లమీద manholes లాటివి కట్టారు. మనజనాలు చేసేదేమిటీ, అదేదో dust bin అనుకుని, చెత్తా చెదారమూ వాటిల్లో religeous గా పారేస్తూంటారు.మరి ఆ నీళ్ళు పైకి రోడ్లమీదకి కాక ఏ గంగలోకి వెళ్తాయి?
కార్పొరేషన్ వాళ్ళేమీ చేయలేదో అని గోలోటీ పైగా! మన పని మనం సరీగ్గా చేసికుంటే అన్నీ బాగానే ఉంటాయి. అందుకే We get what we deserve….

    అలాగే ఇదివరకటి ప్రముఖ రచయితలు ఈ మధ్యన అసలు వ్రాయడమే లేదో అని ఓ ఉవాచ. ఔనండీ వాళ్ళు వ్రాయరు. వారిలో ఉండే ఆ ఇఛ్ఛ ని చంపేసింది ఎవరూ, మనమే. ఇప్పుటి రోజుల్లో ఎక్కడ చూసినా ఈ బుక్కులూ, ఇంకోటీనూ. ఎవరికీ పుస్తకం కొని చదివే ఓపిక ఎవరికీ లేదు.ఆ మధ్యన మాకు తెలిసిన ఓ ప్రముఖ రచయితని అడిగాను, ఏమిటి సార్ మీ రచనలేవీ కనిపించడం లేదూ ఈ మధ్యనా అంటే ఆయనిచ్చిన సమాధానమే ఇది. ఓ పుస్తకం ప్రచురించాలంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడిన పని అది. పబ్లిషర్ కి వాటా ఉంటుంది, అమ్మేవాడికి వాటా ఉంటుంది, అన్నీ పోయిన తరువాత ఇంక ఆ రచయితకి మిగిలేది ఏమిటీ చిప్ప !!తన వాటాకొచ్చిన పుస్తకాలు, వాళ్ళింటికొచ్చిన మిత్రులకి ఓ సంతకం పెట్టి తాంబూలంలా ఇవ్వడమో, ఆయన్ని ఏ సన్మానికో పిలిచినప్పుడు, ఆ ఆర్గనైజర్లకి ఇచ్చుకోడమో. పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ రివ్యూలు వ్రాయించుకోడానికి ప్రతీ పత్రిక వాడికీ ఓ కాంప్లిమెంటరీ కాపీ పంపించుకోడం, పైగా వాటి పోస్టల్ ఖర్చులూ. ఇవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళావిడ చేత చివాట్లూ, ఏమిటండీ ఇంటినిండా ఈ పుస్తకాలూ, ఇవేమైనా తిండి పెడతాయా అంటూ… ఇన్ని గొడవలు భరించడం కన్నా హాయిగా వ్రాయడమే మానేస్తే హాయీ అనుకుంటాడాయన. ఇంగ్లీషులో పుస్తకాలు మరీ వందల్లో ఉన్నా, పాపం మన తెలుగు పుస్తకాలు ఇంకా వందలోపే. అయినా పుస్తకాలు కొని చదివే ఓపికా సహనం ఎవరికీ లేదు.అలాగని వీళ్ళు ఓ సినిమాకి వెళ్ళి పెట్టే ఖర్చులో పాతిక శాతం కూడా ఉండదు.అందుకనే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీరమణ గారు, మీరు నవలలు ఎందుకు వ్రాయరూ అంటే, మొహమ్మాటానికి ఈ రోజుల్లో పెద్ద నవలలు వ్రాస్తే చదవడానికి పాఠకులెక్కడండీ అన్నారు.ఆయన ఉద్దేశ్యం అసలు కొనేవాళ్ళెక్కడండీ అని!అందుకే హాయిగా “కాలం” లో సెటిల్ అయిపోయారు. పొనీ కొనుఖ్ఖోనఖ్ఖర్లేదు, హాయిగా మీకు కావలిసిన పుస్తకాలు మీ ఇంటికే తెచ్చి ఇస్తామూ అని, ఓ లైబ్రరీ పెట్టి అందులో తెలుగు పుస్తకాలుంచితే, ఎవరో కొందరు పుస్తక ప్రియులు తప్ప, వాటి మొహమే చూడ్డానికి టైమే లేదు, మా పూణె లోని తెలుగు వారికి! అందుకే We get what we deserve….

   ఇవన్నీ ఓ ఎత్తూ, ఈమధ్యన ఓ ప్రముఖ బ్లాగరు, తెలుగులో ” మంచి” బ్లాగులు రావడం లేదని రెండు భాగాల్లో ఓ టపా వ్రాశారు. ఆ టపా మీద మన intellectual readers అందరూ తమ తమ అభిప్రాయాల్ని వ్యక్త పరిచారు. వాటిని చదివిన తరువాత నిజం చెప్పాలంటే నవ్వొచ్చింది.ఎవరికి వారే–
” ఏమిటోనండీ ఈ మధ్యన అసలు ఏగ్రిగేటర్లు చూడాలంటేనే విసుగొస్తోందీ, ఎక్కడ చూసినా కాపీ పేస్టులూ, వార్తాపత్రికల్లోని విషయాలూ, ఏవేవో సినిమా కబుర్లూ etc..etc..” అని ఒకరూ.ఇంకా ఏవేవో అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఎవరిష్టం వారిదీ. కానీ ఇందులో పాఠకుల పాత్ర ఎంతవరకూ ఉందనేది కూడా ఆలోచించుకోవాలి. మూడేళ్ళనుండీ వ్రాస్తున్నాను కాబట్టి, నేనూ ఓ అభిప్రాయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను.

    తమ తమ అనుభవాలూ, అభిప్రాయాలూ వ్యక్త పరిచి మిగిలిన వారితో పంచుకోవాలని ప్రతీ వారికీ ఉంటుంది. ఏదో మన పేరు బ్లాగుల్లో కనిపిస్తే ఈ virtual world లో కనిపిస్తే బావుంటుందీ అనుకుని ఓ బ్లాగు మొదలెడతారు. మొదట్లో పాఠకులందరి దగ్గరనుంచీ స్పందనలు వచ్చేస్తాయి. ” బ్లాగులోకంలోకి స్వాగతం” ” మీలాటి పెద్దవారు చెప్పే విషయాలు ఎంతో బావుంటాయీ..” ” మీరు వ్రాసినవి చదువుతూంటే, ఏదో మా బాబయ్యో, పెదనాన్నో, మావయ్యో మాట్టాడుతున్నట్టే ఉంటుందీ…” etc..etc…. అడక్కండి ఎత్తేస్తారు… ఇంక అ వ్రాసే పెద్దమనిషి కూడా, ఓహో మనం ఇంత బాగా రాస్తామన్న మాట, ఎంతమంది చదువుతున్నారో కదూ అనుకుంటూ, ప్రతీ రోజూ పొద్దుటే లేవగానే పళ్ళేనా తోముకోకుండా మెయిళ్ళు చూడ్డం, తను ముందు రోజు వ్రాసిన టపాకి ఏమైనా స్పందనలు వచ్చాయా అని. ఏదో ఓ ఏడాదివరకూ బాగానే ఉంటుంది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. పేకాట ఆడేవాళ్ళని చూడండి, లేదా తాగే వాళ్ళని చూడండి, చుట్టుపక్కలుండేవాళ్ళే అసలు పురెక్కిస్తారు. నషా నెత్తికెక్కేస్తుంది.ఈ ఆడేవాడి చావు వాణ్ణి చావనీయండి అనుకుని, చల్లగా జారుకుంటారు.వీడికేమో చేతిలో బాటిలో, లేక పేకముక్కలో మిగులుతాయి.తుపాగ్గుండుకోడూ కనిపించడు.

    అలాగే ఈ బ్లాగుల “మత్తు” లో పడ్డవాడు రాసుకుంటూ పోతాడు. అలాగని ఈ టపాలేమైనా ఊరికే వస్తాయా ఏదో విషయం గురించి ఆలోచించాలి, వాటికో అక్షర రూపం తేవాలి, వాటిని ” కొత్త టపా” లో పేస్టు చేసికోవాలి, మళ్ళీ వాటికి అలంకారాలు చేయాలి, ఎంతో కొంత సమయం కేటాయించాలి కదా.ఈ పడ్డ శ్రమకంతా ఆశించేది ఏమిటీ, టపాలు చదివేవారి దగ్గరనుంచి ఓ స్పందన, ఓ స్మైలీ.. బస్.. అదికూడా ఎక్కువేనంటారా? చెప్పొచ్చేదేమిటంటే, ఎక్కువ సంఖ్యల్లో వ్యాఖ్యలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రాణం, ఒక్కసారిగా nil comments చూసి, దిగాలు పడిపోతాడు.పాపం ఓ టపా వ్రాసుకుంటాడు ఏమిటో ఈమధ్య నా టపాలు నచ్చడంలేదేమో , పోనీ రాయడం మానేస్తే బాగుంటుందేమో అని. మళ్ళీ వ్యాఖ్యలొచ్చేస్తాయి. — ” అయ్యో మీ టపాలు చదువుతూనే ఉంటామండీ, ఎప్పుడూ ఒకే రకమైన కామెంటే పెట్టాలీ ” సూపర్..” అని,మళ్ళీ మళ్ళీ పెట్టేదేమిటిలే అని మానేస్తూంటామూ…” అని. అదేదో సామెత చెప్పినట్టు లేదూ– ఊళ్ళో ఉన్న ప్రతీ వాడినీ ఓ బిందెడు పాలు తెచ్చి పోయమంటే, ఒకడనుకున్నాడుట, నేనొఖ్ఖాణ్ణీ నీళ్ళు పోస్తే తెలుస్తుందా అనుకుని, నీళ్ళు తెచ్చి పోశాడుట.అలాగే ఎవడికి వాడే అనుకుని చివరకి అందరూ నీళ్ళే పోశారుట ! అలా ఉంది బ్లాగుల్లోని టపాల పరిస్థితి !

    అవతలివాడు ఏదో చెప్తూంటే మన స్పందన కూడా ఉండాలి. అప్పుడే రాసేవాడికీ ఉత్సాహంగా ఉండి ఇంకా వ్రాయకలుగుతారు. అంతే కానీ, పాఠకులు స్పందించడం మానేసి, బ్లాగులు బావుండడంలేదో అనడం బావుండలేదు. పోనీ అలాగని చదవడంలేదూ అనడానికీ వీల్లేదూ, dashboard లోకి వెళ్ళి చూస్తే, ఎంతమంది చదివారో తెలుస్తుంది. చివరకి ఏమౌతుందీ, ఇంతమంది చదివినా ఒక్కళ్ళకీ నచ్చలేదూ అనుకుని, ఆ రచయితకి నిరుత్సాహం వస్తుంది. అలా టపాలు వ్రాయడం మానేసిన వారెందరో ఉన్నారు. ఇలాటప్పుడు, మంచి టపాలు రావడం లేదో అనడం ఎంతవరకూ సమంజసం ? అందుకే We get what we deserve…..

35 Responses

 1. విషయం వున్నదున్నట్టు చెప్పారండీ…

  Like

 2. నేను రోజూ మీరు వ్రాసే బ్లాగులు చదువుతుంటాను. కోపగించకోకండి కామెంట్లు పెట్టట్లేదని.

  Like

 3. nenu kuda andi complusory mee blog chaduvutha,but comments pettanandi .badhakam.

  Like

 4. మీరేంటీ నా మనస్సు చదివేసి, ఎల్లుండి నేను వేయబోయే టపా ఈ వేళ చదివేసి, నా మీద కామెంట్ రాసేశారా ముందే! అన్యాయం గురువుగారూ!! 🙂

  Like

 5. 🙂
  I too almost regular and always like to read you sir….:-)

  Like

 6. చాల చక్కగా చెప్పారు. చదివే వారి నుంచి ఒక మెచ్చుకోలో, సలహానో లేకపోతే రాసేవాళ్ళకు అంతగా interest అనిపించదు రాయడంలో.. నిజమే కానీ నాలాంటి వాళ్ళ ఇబ్బంది ఏంటి అంటే ఈ busy ప్రపంచంలో రోజు పరుగులు పెడుతూ మనస్సు చంపుకోలేక వీలయినప్పుడు traveling లోనో ఎప్పుడు వీలయితే అప్పుడు బ్లాగ్లు తిరగేస్తాము. నా మటుకు నేను సెల్ ఫోన్ లోనే ఎక్కువగా బ్లాగ్లు చదువుతాను. ఇలాంటప్పుడు ఒక టపా నచ్చి వ్యాఖ్య పెట్టాలంటే ఎంత కష్టమో కదా.. తెలుగు బ్లాగ్ చదువుతూ ఇంగ్లిష్ లో వ్యాఖ్య పెట్టడానికి మనసొప్పదు, నచ్చిన టపా కు సింపుల్ గా super, excellent, good writing లాంటి వ్యాఖ్యలు పెట్టి రాసిన వాళ్ళను చిన్నబుచ్చబుద్ది కాదు .. నాకు అనిపించేది ఏంటి అంటే మనం వ్యాఖ్య పెడితే రాసిన వారికి మనం వారి టపా ఆస్వాదిన్చామన్న అనుభూతిని మిగిల్చాలి. అందుకే వీలయినప్పుడు వ్యాఖ్య పెడుతూనే ఉంటాము.

  అంచేత బ్లాగు రచయితలందరికి నే విన్నవిన్చుకునేది ఏమిటంటే వ్యాఖ్యలు ఉన్నాయా, లేవా అని చూసుకోకుండా మీరు అందరు మీరు ఎంచుకున్న అంశాల పైన మంచి, మంచి టపాలతో మమ్మలిని అలరించ ప్రార్థన.

  ఉదాహారణ కి, నెమలి కన్ను మురళి గారి దగ్గరి నుండి ఒక నెల దాటింది టపా వచ్చి, ఇక నేస్తం (jaajpoolu) గారయితే ఈ సంవత్సరంలో ఇంతవరకు మాకు ఒకే ఒక టపా అందించారు. మేము కోరుకొనేది ఒకటే మేము వ్యాఖ్యలు రాస్తున్నామ లేదా అని చూసుకోకుండా మీరు మాత్రం మీకు వీలు చిక్కినప్పుడల్లా మాకు మంచి టపాలు అందించాలి.

  చివరగా ఒక మాట

  కొందరు రాయడానికే పుడతారు…. కొందరు చదవడానికే పుడతారు… (నా లాగా) 🙂

  Like

  • కొందరు రాయడానికే పుడతారు…. కొందరు చదవడానికే పుడతారు… (నా లాగా)

   nenu kuda mee category ne 🙂

   Like

 7. @లక్ష్మి గారూ,

  ధన్యవాదాలు…

  @వేణు గోపాల్,

  ఎవరూ కామెంట్లు పెట్టడం లేదని కాదు బాధ. తెలుగు బ్లాగుల్లో చదవదగ్గవి లేవని ఆ మధ్య ఎందరెందరో అభిప్రాయాలు వ్యక్త పరచినందుకు పడ్డ బాధ.మరీ వార్తాపత్రికల్లోవే కాకుండా, ఏదో ఒక కొత్త టాపిక్కు మీద వ్రాసినా స్పందన లేకపోతే, మరి అది బాగా ఉందో లేదో తెలిసేది ఎలా?

  @స్వాతీ,

  మీకే కాదు. నాకూ ఉంది బధ్ధకం…..

  @శర్మ గారూ,

  మీరు మరీ నన్ను ” గురువు” గారూ అనడం బాగోలేదు. ఇంక ఈవేళ్టి టపా విషయానికొస్తే, మీరు పడుతున్న ఆవేదన పసికట్టేశాను. అదేదో టెలిపతీ అనో ఇంకోటో అంటారనుకుంటాను…..

  @రాజా,

  థాంక్స్…

  @శ్రీకరా,

  మీరు మొబైలూ టపాలూ అని వ్రాశారు కాబట్టి, వయస్సులో నాకంటే చిన్నవారే అనే అభిప్రాయంతో ఏక వచనంలోనే సంబోధించాను.మీరు చెప్పింది ఒకవిధంగా బాగానే ఉందనుకోండి, కానీ స్పందన అనేది ఒక టానిక్కు లాటిది. వ్రాసిన ప్రతీ టపాకీ వ్యాఖ్యలుండాలని లేదు. పైగా అది అత్యాశ అవుతుంది.
  కానీ ఒక్కొక్కప్పుడు ఏదో ఓ మంచి టాపిక్కు మీద వ్రాశాననే అనుకుంటాను. చదివిన వారి సంఖ్య చూస్తే వందల్లో ఉంటుంది. మరి చదివిన అంతమందిలోనూ ఏ ఒక్కరికీ నచ్చలేదా అనిపిస్తూంటుంది. అలాటప్పుడు పోనీ మన పధ్ధతి (genre) లోనే రాద్దామా అంటే, ఏదో ఒకటి తెలియాలి కదా. మరీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్రాయడం కూడా బాగుండదు.మీరు చెప్పిన వారినుండి టపాలు ఈ కారణంచేతే రావడం లేదేమో? అందుకనే ఈవేళ్టి నా టపాకి శీర్షిక అలా పెట్టాను. మీరు సహృదయంతో చదివి స్పందించినందుకుధన్యవాదాలు.” కొందరు రాయడానికే పుడతారు…. కొందరు చదవడానికే పుడతారు… (నా లాగా)” బహుశా అదే కరెక్టేమో….

  Like

 8. మీరు చెపుతున్న విషయాలలో ఉపయోగకరం అయినవి లేదా మంచి అనిపించినవి ఆలోచిస్తారు చదివినవారు . వ్యాఖ్య కన్నా అది మిన్న కదా?

  ఈ టపా కు కూడా వ్యాఖ్య వ్రాయాలని లేదు అండి. చూసి వెళ్ళిపోతున్నాను నేను కూడా. కారణం వ్రాయడం వీలు పడకేం కాదు. వ్యాఖ్య ని ‘ ప్రోత్సహించడం కోసం’ వ్రాయడం లో నాకు నమ్మకం లేదు ( కనీసం ఆ పరిస్థితులు బ్లాగుల్లో లేవు కాబట్టి )

  అయితే మరి వ్యాఖ్య ఎందుకు వ్రాయాలి అన్న ప్రశ్నకు ఇంకేమయినా సమాధానం ఉందేమో చూద్దాం ఇపుడు. అది అర్ధం కావాలంటే మీరు వ్రాసే వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలి. అవి మీ ఆసక్తులను, మీరు ఎవరితో మాత్రమె కలవాలి అనుకొంటూ ఉన్నారు అన్నవి ఇతరులకు తెలియజేస్తాయి. మీ సర్కిల్ లో ఇమడలేని వారు జస్ట్ చదివి వెళ్ళిపోతూ ఉంటారు. లేదా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు అది న్యాయమే కదా ? కాబట్టి మీరు పెట్టిన శీర్షిక ఈ విధం గా నిజమే

  మీరు వ్రాసిన అన్ని టపాలు చూసాక మీరడిగినందుకు మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ధర్మం కాబట్టి ఈ వ్యాఖ్య. తర్వాతి టపాలు మళ్ళి మామూలే ! నేను ఆసక్తి చూపే బ్లాగుల్లో ఇటువంటి టపా మీరొక్కరే వ్రాస్తారు. కాబట్టి ఈ వ్యాఖ్యను రిపీట్ చేసే పనికూడా నాకు రాదు 🙂

  Like

 9. హన్నా,

  బ్లాగులోళ్ళ కి ఎన్ని కష్టాలు వచ్చేయి సుమీ

  ప్చ్… రాయడానికి మేటరు లేక పోయెనే నాకు అని బాధ పడి పోయా.

  రాయక పోయినా ఫర్లేదు అని రాసినా ఫర్లేదు అని బాతాఖానీ వారూ zilebi you get what you deserve అనేసారు చక్కంగా.

  చీర్స్
  జిలేబి.

  Like

 10. :)) బాగా చెప్పారండీ, మీరన్నట్టు … నాలాంటి మంచి కామెంటర్లు దొరకడం కష్టమే కాని అసంభవమైతే కాదనుకోండి 😛 🙂
  తేరగా చదివి వెళ్ళి పోతారు గాని, ఓ కామెంటు పెట్టడానికి బద్ధకమేందుకో! 🙂
  “నిగ్గ దీసి అడుగు” అని ఎవరో కవి అన్నట్టు అప్పుడప్పుడిలా అడుగుతుండాలండి. 😀

  Like

 11. గురువుగారంటే కాదంటే పోతుందా! ఏమండోయ్ మీరు బాగా రాయగలరు, బ్లాగు రాయండి అని, దూలగొండి అంటించేసేరు కదా 🙂 గోక్కోలేక చస్తున్నా:) 🙂 🙂 ముందే చెప్పేరు లెండి చాలా అనుభవాలొస్తాయని, గురువుగారిని తప్పు పట్టటం లేదండోయ్! 🙂

  Like

 12. మీరెట్టి పరిస్థితులలోను రాయని భాస్కరుడు కాకండి.
  మీ రెగ్యులర్లలో నేనుంటాను ఎప్పటికీ.

  Like

 13. బ్లాగు వ్రాయటం మన చేతిదురద కారణంగా. ఆటే దురద లేని వాళ్ళు చదివేసి వ్యాఖ్య యేమి చెప్పకుండా ఊరుకుంటారు. కొందరైతే ఊరికే ‘బాగుంది’ అని comment వేయటం దండగ కదా అని ఊరుకుంటున్నాం అంటారు. నిజమే మరి. అయినా మనం వ్ర్రాసేది మన తృప్తికి. నచ్చినవాళ్ళు చదువుతున్నారు. అంతే. ఆమధ్యనే అన్నట్లున్నాను ఒక వ్యాఖ్యలో కాలక్షేపం సామాగ్రి చదవటం మీద ఉన్న ఆసక్తి కాస్త serious టపాలు చదవటం పైన ఉండదూ జనానికి అని. పుస్తకప్రచురణపైన మీరన్నది అక్షరాలా నిజం. మన వాళ్ళకు తెలుగు పుస్తకాలు చదవటానికి మాత్రమే తీరిక ఉండదు – ఆసక్తీ ఉండదు పెద్దగా!

  Like

 14. మీ టపాకి మొదట బాగా నవ్వు వచ్చింది. కోపడంకండి !!
  నాలంటి బద్దకస్తులు చాలా మంది వున్నరా అని ఆశ్చర్యం మాత్రమే . కామెంట్స్ విష్యములోనే కొంచెం తాతస్రం నిజం. పుస్తకాలని ఇంక వదిలి ఫెట్టలెదు.

  Like

 15. మీరు కూడా అన్ని బ్లాగులకీ కామెంట్లు రాయడం లేదుకదా!రాయకపోడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి
  1.బద్ధకం 2. ఆ బ్లాగు మీద ఆసక్తి లేకపోవడం.అందరికీ అన్ని సబ్జెక్టుల మీద ఆసక్తి ఉండదు కదా 3.ఒకరు మంచి ఫొటోలు ప్రచురిస్తున్నారు.ప్రతిసారి అవి బాగున్నాయని రాయనక్కరలేదు.4.కొన్ని బ్లాగుల్లో పరుషపదజాలంలో తిట్టుకుంటారు.పెద్దమనుషులు వాటి జోలికి పోరు.5,కొందరు బ్లాగర్లు విమర్శలు సహించలేరు.అప్పుడు ఏమిటి రాస్తాము.6.కవిత్వం,సైన్సు ,చరిత్ర ,మెడిసిన్ వంటివి చాలా మందికి ఇష్టం ఉండవు.ఉదాహరణకి నేను చైనా చరిత్ర చదివి ,అది మనకు ముఖ్యమని రాసాను.మరొకరు evolution మీద రాసారు .వీటికి స్పందన లేదు .అంతలో నిరుత్సాహపడనక్కర లేదు.మన ధర్మం రాయాలనుకున్నది రాయడమే.

  Like

 16. @మౌళీ,

  మీ విమర్శనాత్మక వ్యాఖ్య చాలా నచ్చింది. ఈ విషయంలో నేను త్వరలో ఇంకొక టపా వ్రాస్తాను, అసలు ఈ టపా ఎందుకు వ్రాయవలసొచ్చిందో వివరిస్తూ…మీరు వ్రాసిన వ్యాఖ్యలకి కూడా సమాధానంగా. ధన్యవాదాలు…

  @జిలేబీ,

  తిట్టినట్టా పొగిడినట్టా… ఏమిటో మీరు పెట్టే వ్యాఖ్యలు అర్ధం చేసికొనేటంత IQ ఆ భగవంతుడు నాకు పెట్టలేదు….

  @Snkr,

  ఏదో మీ అందరి దగ్గరా ఉన్న చనువు చేత ఇలాటి టపాలు వ్రాస్తూంటాను…..

  @శర్మగారూ,

  థాంక్స్….

  @శ్యామలరావుగారూ,

  మరీ “దురద” అని అనను కానీ, మిగిలిన వ్యాపకాలకంటే ఇదే బావుంటుందనిపిస్తూంటుంది. ఏదో అప్పుడప్పుడు ఇలాటి టపాలు వ్రాసి చివాట్లు తింటూంటాను …

  @డాక్టరు గారూ,

  నేను వ్రాసింది, ఈమధ్యన నేను చదివిన ఒక టపాలోని వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. పన్లో పనిగా నా గోలా వ్రాసేశాను. థాంక్స్…

  @సమీరా,
  వెదకాలే కానీ కావలిసినంతమంది దొరుకుతారు… థాంక్స్…

  Like

  • 🙂 🙂 ఇప్పుడు కూడా స్మైలీ యే నండీ!
   మీరు చెప్పినట్లు హైదరాబాద్ నగరమే కాదు అన్ని చోట్ల అక్రమంగా కట్టడాలు కట్టేసి నీళ్ళలో మునిగిపోతున్నాం అంటే.. మరి ఆ నీళ్ళు ఎ గంగ లో కి వెళతాయి.
   మంచి ప్రశ్న అండీ!
   అలాగే పుస్తక ప్రచురణ అనేది పెద్ద ప్రహసనమే!
   ముచ్చటగా మూడో విషయం ..బ్లాగ్ వ్రాయడం మంచి పోస్ట్ కోసం బోలెడన్ని ప్రయాసలు, కామెంట్ల కోసం ఎదుచూపులు ..అన్నీ నిజమేనండోయ్!
   మూడు విషయాలు చాలా బాగున్నాయి. అక్షర సత్యాలే!

   Like

 17. In bhagavad-Geeta Lord Krishna told Arjuna, do what you are expected to, leave the result to me. If you do work in the expectation of results, you would never be happy, as there is no limit for it. Writing blogs is a hobby. You write blogs for yourself alone. You don’t need anyone’s approval or disapproval for your own thoughts penned as blog content. So, comments are irrelevant. All that matter is that “are you happy?” writing blogs for yourself alone with zero expectations? On the otherside of coin, a reader has same choice. Readers like us has a hobby of reading blogs. It’s not compulsary for a reader to write a comment, but a courtesy to do so. Same way the writer reply a courtesy thank you for any comments on his blog. The problem is that not all are courteous & often many skip protocols just like they violate traffic rules in real life. Do we fight for them all or leave them alone considering the bigger thought of having personal satisfaction of maintaining a blog to share our own ideas is the question to ponder.
  — I do enjoy reading your blog, but being lazy, won’t comment often. This woke me up from my slumber. 😉 I guess we need more of such wake up calls time to time? 😉

  Like

 18. చటకం,

  మీరు చెప్పిన “గీతా సారం” ని ఎవరూ కాదనలేరు. ఎంత చెప్పినా మానవమాత్రులం కదండీ.. అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది, అసలు మనం ఊరికే రాసుకుంటూ పోవడమేనా, చదివేవారికి నచ్చుతోందా లేదా అని కూడా తెలిసికోవాలిగా. తప్పులేమైనా ఉన్నా, ఇంకోరి ఫీలింగ్స్ హర్ట్ చేసినా సరిదిద్దుకోడానికి అవకాశం కోసమే
  వ్యాఖ్యల రూపంలో feedback అడిగేది….

  Like

 19. రమణారావు గారూ,

  ” తనదాకా వస్తే కానీ…” అన్నట్టు, మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. కారణం మరేమీ లేదు బధ్ధకం అని మాత్రం అనను. ప్రస్తుతం వస్తున్న టపాల్లో చాలా భాగం అర్ధం చేసికునేటంత IQ నాకు ఆ భగవంతుడు ప్రసాదించలేదు. నా టపాలు చదివితేనే తెలుస్తుంది, నా “పరిజ్ఞానం” ఎంతో. ఏదో బాతాఖానీ లా వ్రాసుకోడం తప్పి పేద్ద విషయాలు బుర్రకెక్కవు. మూడేళ్ళనుండి నా టపాలు చదివినవారు వ్యాఖ్యల రూపంలో ప్రోత్సాహపరుస్తున్నారు. దానితో ఇప్పటిదాకా ఓ ఎనిమిదివందల టపాలు వ్రాయకలిగాను. ఏదో కొందరికైనా నచ్చుతున్నాయిలే అనే ( దుర) అభిప్రాయంతో… అకస్మాత్తుగా వ్యాఖ్యలు dry up అయిపోవడంతో వ్రాసిన టపా ఇది. ఈమధ్యన వచ్చిన ఓ రెండు టపాల్లో పెట్టిన వ్యాఖ్యలు కూడా ఓ కారణం….

  Like

 20. , ఓహో మనం ఇంత బాగా రాస్తామన్న మాట, ఎంతమంది చదువుతున్నారో కదూ అనుకుంటూ, ప్రతీ రోజూ పొద్దుటే లేవగానే పళ్ళేనా తోముకోకుండా మెయిళ్ళు చూడ్డం, తను ముందు రోజు వ్రాసిన టపాకి ఏమైనా స్పందనలు వచ్చాయా అని.

  మీరేదో నాగురించే రాసినట్టున్నారు, అబ్జక్షన్ యువరానార్,
  ఇలా రాయడం ఏమన్నా బాగుందా మీకు, కోపం వుంటే మాత్రం ……… చక్కగా రాశారు, అభినందనలు.

  Like

 21. చక్కని విశ్లేషణ ఫణిబాబు గారు. ఎవరో చదువుతారని ఏదో కామెంటుతారని బ్లాగడం మొదలుపెడితే అది మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుంది!

  అన్నట్టు మీరు ఇది చూసారా? http://100telugublogs.blogspot.com

  Like

 22. To my dear grandpa,
  Nenu mee blog gurunchi marchlo telusukunnanu..Nenu me archiveslo vunna postlanni chadivesaanu.. Nenu aa type ante class motham vinna taravatha any doubts annappudu buddimanthuraalilaaga No ani samadhaanam cheppedaanni.. So me postlu kuda anni easy artham avvadam valana inka questions,comments pettadam vrutha ani feel ayyi pettaledu. ammammani adiginattu cheppagalaru. Pune vasthe kachitange mimmalni kalavakunda vellanu.

  Like

 23. @the tree,

  బ్లాగులు ప్రారంభించి టపాలు వ్రాసే ప్రతీ వారూ భుజాలు తడుముకోవలసిందేనండీ. ప్రతీ వారూ కూడా ఇలాటి అనుభవానికి లోనైన వారే. ప్రత్యేకంగా ఎవరూ సిగ్గుపడఖ్ఖర్లేదు…

  @జీడిపప్పు గారూ,

  అసలు ఈ టపాకి inspiration, మీరు ఆ మధ్యన ఏగ్రిగేటర్ల గురించి రెండు భాగాల్లో వ్రాసిన టపాలూ, వాటిమీద వచ్చిన వ్యాఖ్యలూనూ… ఇంక మీరు పెట్టిన లింకు గురించి… ఓ టపా ప్రచురించేయగానే ముందుగా, మీరిచ్చిన లింకులో వచ్చిందా లేదా అని చూసుకోవడం. అలాగే శరత్ సంకలినీ కూడా. హారం, కూడలి లలో రావడానికి కొంత సమయం పడుతోంది. నేనూ, నా శ్రీమతీ వ్రాసే టపాలకి మీరిచ్చే ప్రోత్సాహానికి ధన్యవాదాలు…

  @మనవరాలా ( దీపా),

  నేను వ్రాసిన టపాలన్నిటికీ ఒకే ఒక్క మాటతో, మమ్మల్ని మునగ చెట్టు ఎక్కించేశావు. మరి అమ్మమ్మ వ్రాసే బ్లాగులు చదవడం లేదా?
  @ వనజ గారూ,

  మీరు నేను ప్రస్తావించిన మూడు విషయాలతోనూ ఏకీభవించినందుకు ధన్యవాదాలు…

  Like

 24. చిన్నీ,

  థాంక్స్…

  Like

 25. Ammamma blog kuda uptodate chadivesthutaanu..:)

  Like

 26. దీపా,

  గుడ్… ఇంక నా టపాలు నచ్చవు… బైదవే ఒక మెయిల్ పంపాను.జవాబు ఇస్తావని ఆశిస్తున్నాను…

  Like

 27. నేను మీ టపాలు ఆలస్యంగానైనా తప్పక చదువుతాను….

  వెంటనే కామెంటు రాకపొతే అలా అలోచించకండి….ప్లీజ్…

  Like

 28. ఏమీ అనుకోకపొతే ఏమేమి నైవేద్యాలు పెట్టారో లిస్టు రాస్తారా…

  మా అమ్మవారు ఈ శుక్రవారమే వస్తున్నారు…. నాకు చేతనైనవి చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది అందుకు…..

  Like

  • ఈ కామెంటు వేరే టపాలోనిది అమ్మవారి ప్రశంస వచ్చింది కనుక తీసివేయవద్దని మనవి…..

   Like

  • ఈ శుక్రవారమే వస్తున్నారా?! నైవేద్యాలా?! నోట్ చేసుకోండి:
   జిలేబి, జాంగ్రీ, ఆవుపాలతో కోవా, బూందీ లడ్డు, చక్కెర పొంగలి, … బొబ్బట్లు కంపల్సరీ, లేదంటే అమ్మవారు ఆగ్రహిస్తారు అని మీకు తెలిసిందే. ఇక కారం పులిహోరం, గిలిహోర, వెజిటబుల్ పలావు, చిత్రాన్నాలు, లైట్‌గా బంగాళాదుంపల వేపుడు, చేమదుంపల ఫ్రై, నూలొంకాయ కూర/బగారా బైగాన్ (తెలగానతల్లి అమ్మవారికి), మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, దద్ధోజనం, పెరుగుపచ్చడి…
   మేము గురువారమే వచ్చేస్తాము, చిన్న పైలెట్ దేవుళ్ళలా.
   :)) :))) :)))) 😛

   Like

 29. ఫణిబాబుగారు,
  వేరే బ్లాగుల్లో పడాల్సిన కామెంట్లు మీరు దారి మళ్ళిస్తున్నారని అభియోగం. ఎలాగూ అమ్మవారి ప్రసక్తి వచ్చింది కాబట్టి నైవేద్యాలు, పిండివంటల మీద మీరో పోస్ట్ వేయాలని మనవి. 😀

  Like

 30. @మాధవీ,

  తెలుసు తల్లీ. ఆలశ్యంగానైనా వ్రాసిన టపాలన్నిటికీ ఒకే రోజు వ్యాఖ్యలు పెట్టే కొంతమందిలోనూ మీరూ ఉన్నారు. ఇంక వ్యాఖ్య అన్నది ఏ టపాలో పెడితే ఏమిటీ? అప్పుడప్పుడు ఇలాటివి జరుగుతూంటాయి. వీలున్నంతవరకూ నేను ఏ వ్యాఖ్యనూ డిలీట్ చేయను.

  @Snkr,( పైలట్ దేముడు)

  ఏమిటీ మరీ అభాండాలు వేసేస్తున్నారూ? ఇంక ప్రసాదాల గురించి పోస్టా? నాకు తెలిసింది నైవేద్యం పెట్టించుకోడమే !!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: