బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–mind block-1


    ఇదేమిటీ ఈయన అదేదో సినిమాలో డయలాగ్గులాగ mind block అంటున్నాడూ అనుకోకండి.సినిమాలు వేరూ, నిజ జీవితాలు వేరూ. కొంతమందికి ఏదో ఒకదానిమీద అసలు ఆసక్తి అనేదే ఉండదు. పేద్ద పేద్ద కారణాలుండవు. ఎక్కడో ఎప్పుడో snap అయిపోయి, mind block చేసేసికుంటారు. తరువాత్తరువాత ఎన్ని అవకాశాలున్నా, అసలు దాని జోలికే పోరు. వీటన్నిటికీ ఓ rational explanation కూడా ఉండదు. మరీ నిలబెట్టి అడిగితే, “అవునండీ, నాకు ఇష్టం లేదు..” అనేస్తాడు. మరీ బలవంతపెడితే, ” అవునూ.. నాకిష్టం లేదు. ఇందులో మీకేమైనా నష్టమా..” అని మనం చివాట్లు కూడా తింటూండొచ్చు. అందువలన ఏ పెద్దమనిషైనా ఫలానా దానిమీద నాకంత interest లేదండీ, అంటే, మనం గౌరవంగా వదిలేసి, ఆ విషయం మళ్ళీ ఎత్తకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది, సంబంధబాంధవ్యాలు బావుంటాయి, సర్వేజనాసుఖినోభవంతూ…

    ఏదో ఫలానా వాటిమీద ఆసక్తిలేదంటే ఫరవాలేదు. ఉదాహరణకి నా సంగతే తీసికోండి. రోడ్డు మీద సైకిలు తొక్కమంటే భయం, air travel చేయమంటే భయం. లక్షలిచ్చినా ఛస్తే వీటి జోలికెళ్ళను. చాలామంది చెప్పేరు, అదేమిటండీ సైకిలు తొక్కడం రాకపోవడేమిటీ చిత్రం.. ఈరోజుల్లో పుట్టిన పిల్లాడు కూడా సైకిలుతోనో,బైక్కుతోనో పుడుతున్నాడూ, మీరు అసలు ఇన్నేళ్ళు ఎలా కాలక్షేపం చేశారూ ( సిగ్గులేదూ.. అనే అర్ధం వచ్చేటట్టు!), ఆ దిక్కుమాలిన బస్సులు పట్టుకు వెళ్ళేబదులు హాయిగా ఓ కారు నడుపుకుంటే మీకు టైమూ వేస్టవదూ, సుఖానికి సుఖం… etc..etc… ఏదో నాదారిన నన్ను పోనీకుండా, నా గొడవెందుకూ వీళ్ళకి? నేనేమైనా అందరినీ కారులో తీసికెళ్ళండీ అనేమైనా బతిమాలుతున్నానా. నాపాట్లేవో నేను పడుతున్నాను. మా ఇంటావిడనేమీ బస్సులెక్కించడం లేదుగా? అవునూ, పాపం తనకీ ఉంటుంది, స్వంత కారులో వెళ్తే ఎంత బావుంటుందో అని. ఏం చేస్తాం కొంతమంది చేసికున్న అదృష్టం. ..
ఇదిగో దీన్నే వితండ వాదనంటారు. ఏమైనా రెక్కలు కట్టుకుని గాల్లో ఎగరమన్నారా నన్నూ, ఏదో నా comfort ఆలోచించే కదూ ఈ సలహా.ఏమిటో నా భయాలు నావి. రోడ్లమీద కారుల్లో, బైక్కుల్లో వెళ్ళేవాళ్ళని చూసినప్పుడల్లా అనుకుంటూంటాను if only… అని. మళ్ళీ.. వామ్మోయ్ ఈ వయస్సులో ఏదైనా జరిగి, ఏ కాలో చెయ్యో విరిగి మంచం పడితే… అయ్యబాబోయ్… ఒద్దులెండి ఇలాగే లాగించేస్తే పోలే !!

    ఏదో అవతలివాళ్ళకి అసౌకర్యం కలక్కుండా, ఏదో విషయం మీద mind block లాటివుంటే ఫరవా లేదు, ఎవడి గొడవ వాడిది. కానీ దీనివలన అవతలివారి జీవితాలమీద ప్రభావం ఉంటే, కొద్దిగా ఆలోచించవలసిన విషయమే కదా.నేను ఉద్యోగం లో ఉండేటప్పుడు. మా colleague ఒకడుండేవాడు. అతనికి పెళ్ళి అంటే interest లేదని, బ్రహ్మచారిగానే ఉద్యోగం చేసి, నా కంటే ఓ రెండేళ్ళు ముందుగా రిటైరయ్యాడు. పెళ్ళి చేసుకోకుండా ఆజన్మబ్రహ్మచారిగా ఉండిపోవడానికి, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. పెళ్ళైన ప్రతీవాడూ, వీళ్ళని చూసి ” అబ్బ ఎంత అదృష్టవంతుడో కదా.. ఈ బాదరబందీలేమీ లేవూ...” అనుకునేవాడే. అలాగని కారణాలూ అడగలేరు పెళ్ళెందుకు చేసికోలేదూ అని. మళ్ళీ వాడేమైనా తిక్క సమాధానం ఇస్తే అదో గొడవా. వీలైనంతవరకూ ఎవరూ తెలిసికోడానికి ప్రయత్నించేవారు కాదు. అసలు అతనికి పెళ్ళైతేనేమిటి, లేకపోతే ఏమిటి, నాకెందుకూ గొడవా అంటారేమో. అందుకే కదా ఈ టపా! ఈమధ్యన ఓరోజు సాయంత్రం, మా సొసైటీ కింద నుంచునుంటే, సడెన్ గా పలకరించాడు. ఏదో ఒకే సెక్షన్ లో పనిచేశామూ, నాతో ఏమీ గొడవలేవీ లేవూ, అనుకుని పలకరించాను. చాలారోజుల తరువాత కలిశామేమో, కబుర్లు మొదలెట్టాము, ఆ విషయమూ, ఈ విషయమూ మాట్టాడుకుంటూ సడెన్ గా, తన marital status లోకి దిగాడు.తనే మొదలెట్టాడు కదా అని, ధైర్యం చేసి అడిగాను మీరు బ్రహ్మచారి కదా అని. అంతే.. flood gates తెరిచేసికున్నాయి…అవునూ అందరూ అలాగే అనుకుంటారు, కానీ కాదూ. ఇదేమి గొడవరా బాబూ, pension papers ఇచ్చేటప్పుడు, family pension column లో bachelor అని వ్రాసినప్పుడు, head of section హోదాలో నేనూ ఓ సంతకం తగలేశానే, నా పెన్షనేమైనా ఆపేస్తారా ఇప్పుడూ అని భయ పడ్డాను. ఇదేమిటి ఇలా అంటున్నాడూ అనుకున్నాను.

    అదో పేద్ద ఘనకార్యం లా, “నేను పెళ్ళంటే చేసికోలేదు కానీ, మన ఫాక్టరీలో చాలామందితో నాకు సంబంధాలుండేవీ, ఏదో కాలక్షేపం అయిపోతోంది కదా అని నేనూ, ఈ పెళ్ళి లంపటంలో దిగలేదూ…”. ఓరి వీడిల్లుబంగారంగానూ, ఇదన్నమాట అసలు వ్యవహారం అనుకున్నాను. ఇప్పుడేం వచ్చింది గొడవా ఏదో ఇన్నాళ్ళూ లాగించేసినట్టే లాగించేయ్, ఏమిటీ ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా, ఈ వయస్సులో ఇంకో ఆడమనిషిని ఎందుకు కష్టపెడతావూ, అని సలహా ఇస్తే, “ఇప్పుడు పెట్టేదేదీ లేదూ, నాకు ఓ కొడుక్కూడా ఉన్నాడు, వయస్సు 17 సంవత్సరాలు.. ” అని చల్లగా చెప్పాడు.ఆ పిల్లాడిని కాలేజీలో చేర్పించే వయస్సోటొచ్చింది. ఆ ఎప్లికేషన్ లో మరిప్రవర వ్రాయాలిగా, అందుకన్నమాట, సలహా నాకు తోచింది చెప్పాను. ముందుగా వెళ్ళి ఆ సంబంధమేదో legalise చేసి, వాళ్ళకి ఓ status తీసికుని రమ్మన్నాను. మేమసలు పెళ్ళే చేసికోలేదూ, ఇప్పుడు సర్టిఫికెట్లూ గోలా ఎక్కణ్ణించి తేవాలీ అన్నాడు.దానికేముందీ, ఓ ప్లీడరుని పట్టుకుని, ఓ affidavit తయారుచేసి, ఫలానా ఆవిడ నా భార్యా అని డిక్లేరు చేసేయ్. ఇంత ఈజీయా అన్నాడు.అంతేకాదు, వాళ్ళకి ఫామిలీ పెన్షన్ పరిధిలోకి కూడా తేవొచ్చు అనుకుంటానూ అని ఓ సలహా ఇచ్చేశాను!! దానికేం చేయాలీ అంటే, ముందుగా నీ పెళ్ళినీ, పుట్టిన ఆ కొడుకునీ legalise చెయ్యి, ఆ తరువాత చూడొచ్చు, అని చెప్పాను. అలా చెయ్యకపోతే, రేపు నువ్వెప్పుడో పోయిన తరువాత, వాళ్ళు రోడ్డుమీద పడతారూ, మీవాళ్ళెవరో నువ్వు దాచిపెట్టిందంతా ఎగరేసుకుపోతారూ, నిన్ను నమ్మి ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు, నీతో ఉంటున్నావిడకి ముందు న్యాయం చెయ్యీ అని చెప్పాను. మొదటి స్టేజ్ పూర్తిచేసినట్టున్నాడు, పలకరించాడు. ఇంకోళ్ళెవరో ఉండడంతో వివరాలు చెప్పలేదు. కానీ ముఖంలో ఓ relief కనిపించింది… చెప్పొచ్చేదేమిటంటే, ఈ mind block కి కావలిసినన్ని కారణాలుంటాయి. ఏదో కాలక్షేపం అయిపోతోందిలే.. అనుకునేవాళ్ళు కొందరు….

    నా air travel వ్యవహారం కూడా అలాటిదే. ఎలాగా ఈయనకి భయంకదా,వస్తాడా ఏమిటీ అనుకుని అని ప్రతీవాళ్ళూ left right centre ఫలానా చోటుకి రండీ అంటూ invite చేసేస్తున్నారు. ఎప్పుడో ముహూర్తం చూసుకుని వచ్చేస్తాను వదిలిపోతుంది…మహ అయితే ఆ ప్లేన్ లో కళ్ళు మూసుకుని కూర్చుంటాను. నా కళ్ళే కదా.. మీకేం నష్టం… అనొచ్చు…

3 Responses

  1. చాలా మంచి పోస్టు.

    Like

  2. అలా కళ్ళు మూసుకునప్పుడు పనిలో పని అమెరికా కూడా వచ్చేయండి…
    అదే చేత్తో పిన్నిగారు పెట్టిన ఊరగాయ మీరు అడిగి మరీ చేయించుకునే పదార్థాలు అన్నీ పట్రండి….

    సరే మరి……. మీ టికెట్ సమాచారం కోసం ఎదురు చూస్తూ….

    మాధవి

    Like

  3. @గోపాలకృష్ణ రావు గారూ,

    థాంక్స్..

    @మాధవీ,

    అప్పుడే ఎక్కడా? ఏదో ఆలోచన దాకా వచ్చింది…

    Like

Leave a comment