బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–temptation…..


    ఈ భూమ్మీదున్న ప్రతీ మనిషిలోనూ ఉండేది ఈ temptation… దీన్నే మనలాటివాళ్ళల్లో ఉండేది “కకూర్తి” అని ముద్దుగా పిలుచుకుంటూంటాము. ఈ కక్కూర్తి అనేది ఓ తిండి విషయం లో అవొచ్చు, లేదా ఇంకేవిషయమైనా కూడా అవొచ్చు.దీనికి దాసుడవనివాడు ఈ భూప్రపంచంలో ఉంటాడనుకోను. ఏదో హిమాలయాల్లోనూ, గుహల్లోనూ తపస్సులు చేసికొనే పుణ్యపురుషులని వదిలేయండి. వారు వీటన్నిటికీ అతీతులు. పైగా వారిగురించి వ్రాసే అర్హత నాకు లేదు. ఇంక మిగిలినవాళ్ళంటారా, ఎక్కడో అక్కడ, ఏదో అప్పుడు, దేనికో దానికి కక్కూర్తి పడ్డవాళ్ళే. లేదని చెప్పే గుండె ధైర్యం ఎవరికీ ఉందనుకోను. May be అలా పడ్డవారి దృష్టిలో తాము చేసినది కక్కూర్తి అనుకోపోవచ్చు. ఆలోచించి చూస్తే at the end of the day అది కక్కూర్తిలోకే వస్తుంది. ఉదాహరణకి మనం ఏ కొట్టుకైనా వెళ్తామనుకోండి, సరుకులు కొన్న తరువాత, ఆ కొట్టు యజమాని, మనకి చిల్లర తిరిగిచ్చేటప్పుడు, ఎంతో కొంత ఎక్కువే ఇచ్చినా, ఏదో చూసుకోలేదని తప్పించుకుంటామే కానీ, ఎక్కువ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇద్దామని మాత్రం ఆలోచించము.అలా వచ్చిన డబ్బులతో మనం ఏమీ భవనాలు కట్టలేము, ఆస్థులేమీ పెంచుకోలేము, అయినా సరే అదో temptation… ఇచ్చేదేమిటిలెద్దూ అనేసికుని జేబులో పడేసికుంటాము.

    కొంతమందుంటారు పెద్దపెద్ద షాపుల్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులు నొక్కేస్తూంటారు. దాన్ని kleptomania అంటారుట. అదో రోగంట ! పెద్దపెద్ద హొటళ్ళకెళ్ళి ఆ రూమ్ములో పెట్టే సబ్బులూ, స్టేషనరీ, అలాటివే ఇంకా మనకి ఉపయోగించే వస్తువులు మూట కట్టేసికోడం. పైగా ఏమైనా అంటే, రూమ్ముకి వేలకువేలు గుంజడం లేదేమిటీ అనడం. ఇంక హాస్పిటళ్ళలో ఎవరినైనా చేర్పించేమనుకోండి, ఓ కొల్లేరు చాంతాడంత లిస్టిస్తారు కొని తీసుకురమ్మని. ఏదో మన patient కే అవసరమైనవేమో అనుకుని తెచ్చిస్తాము. ఆ హాస్పిటల్ స్టాఫ్ వాటిల్లో సగం మాత్రమే వాడి,మిగిలినవి వాళ్ళ స్టాక్ లో పెట్టేసికుంటారు. దీన్ని కక్కూర్తనక ఇంకేమిటంటాము?

    ఈ మధ్యన అన్నవరం లో ప్రసాదాలు అమ్మే కౌంటర్ల దగ్గర రెండు మూడు రూపాయల చిల్లరైతే అసలు తిరిగే ఇవ్వడం లేదుట, రోజుకి వేలల్లో ఆదాయం ! ఎక్కడ చూడండి, కక్కూర్తే ! ఇంక పెద్ద పెద్ద కంపెనీలవాళ్ళైతే కోట్లల్లోనే టాక్సులు కట్టడం మానేసి, మహరాజుల్లా తిరుగుతూంటారు.రాజకీయనాయకుల సంగతి అడక్కండి.
కొంతమందికి పబ్లిసిటీ కి కక్కూర్తి. ఇంకొంతమందుంటారు, స్వంతంగా వ్రాయలేక plagarise చేసేసి కక్కూర్తి పడుతూంటారు .

    కొంతమందిని చూస్తూంటాము, ఎక్కడైనా బఫేలకి వెళ్ళినప్పుడు కూడా, అటూఇటూ చూసి, తరువాత ఇంటికెళ్ళి తినొచ్చులే అనుకుని జేబులో ఓ కారీ బాగ్ పెట్టుకుని దాంట్లో పడేసికునేవారిని . వరంగాంలో ఉన్నప్పుడు , మా క్లబ్ సెక్రెటరీ ఒకాయనుండేవాడు, వీకెండ్స్ లో పార్టీలయినప్పుడు, కేక్కులూ, బర్ఫీలూ రెండేసి ముక్కల కింద కట్ చేసి, వాటిల్లో సగం కొంపకి పట్టికెళ్ళిపోయేవాడు. ఇంకొంతమంది, ఏ exhibition కైనా వెళ్ళినప్పుడు, ప్రతీ తినుబండారాల స్టాళ్ళలోనూ, ఆ స్టాలువాడిచ్చే శాంపిళ్ళు తినేసి కడుపు నింపేసికోవడం, చివరకి ఊరగాయలు కూడా వదలరు ఈ పక్షులు !

    అంతదాకా ఎందుకూ, ఏ రిసెప్షన్కైనా వెళ్తే, మన పొట్టసంగతైనా చూసుకోకుండా, ఎడాపెడా లాగించేయడం.అక్కడికేదో ఎన్నో రోజులనుండి తిండి మొహమే చూడనట్టు, పైగా కొంతమంది సాయంత్రం డిన్నరంటే, పొద్దుణ్ణించీ కడుపు ఖాళీగా ఉంచేసికోడం!పీకల్దాకా తిని తిని ప్రాణం మీదకు తెచ్చేసికోడం.అసలంత కక్కూర్తెందుకో అర్ధం అవదు.

    ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నెన్ని కక్కూర్తి లని list out చేయొచ్చో ! అసలు ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈవేళ ప్రొద్దుట బయటకి వెళ్దామని bus stop లో నుంచున్నాను. దగ్గరలోనే ఓ wine shop ఉంది. దానెదురుగుండా రోడ్డు మీద ఓ బాటిల్ ( క్వార్టరో ఏదో అంటారనుకుంటా) ముప్పావు వంతు “ద్రవం” తో నిండి పడుంది. ఇంతలో ఒకడొచ్చి, ఆ బాటిల్ మూత తెరిచి, వాసన చూసి,మళ్ళీ cap పెట్టేసి, అక్కడే పడేశాడు. అతన్ని అడిగా, అలా ఎందుకుచేశావూ అని, తనన్నాడూ, బాటిల్లో ఉన్నది మద్యం లాటిదే, కానీ దుర్వాసనొస్తోందీ అందుకు పడేశానూ అన్నాడు. అంటే బావుంటే లాగించేసేవాడన్నమాట! అలా ఎందుకు పడేశావూ, ఖాళీ చేసేసి పడేయ్, లేకపోతే ఇంకో తాగుబోతు చూసుకోకుండా తాగేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటే కష్టం కదా అన్నాను. పాపం ఏ మూడ్ లో ఉన్నాడో, అందులోది పారపోసి బాటిల్ అక్కడే పడేశాడు.

    ఈమధ్యన ICICI Lombard వాళ్ళు చేసిన fraud గురించి ఓ వార్త వచ్చింది. అంతంత డబ్బులు వసూలు చేస్తారే అసలు వాళ్ళకంత కక్కూర్తెందుకండీ? ఈ వ్యవహారం బయట పెట్టిన వాణ్ణి ఉద్యోగం లోంచి పీకేశారనుకోండి. అది వేరే విషయం !

    సరదాగా ఈ కింది బొమ్మ చూడండి, ఈ రోజుల్లో పిల్లలు అంత superfast !!!!

Advertisements

4 Responses

 1. అమ్మయ్య! మళ్ళీ ప్రజల్లో పడ్డారు కదా!! నాలాగా!!! ఫర్వాలేదు కక్కుర్తి పడదాం, సమయంతో!!!!

  Like

 2. శర్మగారూ,

  అదేనండి నా ప్రయత్నమూనూ….

  Like

 3. మొదట్లో బయటకి వెళ్ళి రెస్టారెంటులో బఫే తినేప్పుడు ప్లేటు నింపేసుకొని తినలేక వదిలేసేదాన్ని (ఇంటికి పట్టుకెళ్ళవచ్చుననే ఆలోచన రాలేదు లెండి)

  కానీ ఒక 2 సార్లు అలా చేసాక నాకే ఎంత వృధా చేస్తున్నానా అనిపించి…. తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే తినగలను అనుకున్నవి కాస్త కాస్త పెట్టుకుని నచ్చితే మళ్ళీ పెట్టుకుని తినడం చేస్తున్నా…..

  ఈ రకంగా నా వల్ల ఏమి పారవేయబడటం లేదు అనే తృప్తి ఉంది….

  మా వారు మటుకు నువ్వు తినే తిండి కి అంత డబ్బు దండగ అని అంటుంటారు… (బఫ్ఫే కాస్టు వేరు , ఆర్డర్ చేస్తే వేరుగా ఉంటాయి లెండి… )

  🙂

  Like

 4. మాధవీ,

  పోనిద్దూ… ఇప్పటికైనా తెలిసింది కదా… ఈమధ్య నాకూ తెలుస్తోంది బఫే కీ, ఆర్డర్ కీ తేడా…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: