బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– అంత ఖంగారేమిటి శంకరా…..


    ఈ శంకరెవరో తెలిసినవారా అంటే అదీ లేదు. మాకు అతనితో ఉన్న పరిచయం, నేను వ్రాసిన కోతి కొమ్మచ్చి టపా లో అతను పెట్టిన వ్యాఖ్యతో. ఓరోజు సడెన్ గా ఫోను చేసి, “గురువుగారూ, మీ పోస్టల్ ఎడ్రస్ ఇవ్వండీ..” అన్నారు, ఏమో పూణె వస్తున్నారేమో కలవ్వొచ్చూ అనుకున్నాను. అబ్బే మూడు రోజుల్లో ఓ కొరియర్ ద్వారా ఓ పుస్తకం వచ్చింది. బాపూ బొమ్మలకొలువు సందర్భంగా ప్రచురించిన souvenir. తరువాత్తరువాత ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి-3, ఈమధ్యన “రచన” సాయి గారు ప్రచురించిన శ్రీరమణ గారి “మిథునం”. మార్కెట్ లో రిలీజయిన మూడో రోజుకల్లా శంకర్ ధర్మమా అని, మా చేతుల్లో ప్రత్యక్షం ! ఏదో పుస్తకాలు పంపిస్తున్నాడు కదా అని కాదు, అసలు మాకూ అతనికీ ఏమిటీ అనుబంధం? ఇప్పటి దాకా అతనితో ఫోనుద్వారానూ, మెయిళ్ళద్వారానే పరిచయం. మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి, ఫోను చేసినా, ఒకసారి కాకినాడలోనూ, ఇంకోసారి తిరుపతిలోనూ. ఒక్కసారికూడా మాకు అతన్ని కలిసే భాగ్యం కలుగలేదు. ఎప్పుడు ఫోను చేసినా, “కట్” చేసేయడం, మరు నిముషంలో తనే “కాల్” చేయడం. పోనీ నేను చేసినప్పుడు మాటాడొచ్చుగా అంటే, ” మీతో మాట్టాడ్డం నేను చేసికున్న అదృష్టం, మళ్ళీ మీకెందుకూ ఖర్చూ.. ” అనేవాడు ! అసలు ఈ మనిషిని మార్చడం ఎలాగా అనుకునేవాడిని. అప్పుడెప్పుడో ఒకరోజు ఫోను చేసి, “మీరు కాదండీ, లక్ష్మి గారిని పిలవండీ..” అన్నాడు. ఏమిటి నాయనా అంటే, ” మీకీ విషయాలు తెలియదులెండి, ఆవిణ్ణోసారి పిలవండి, ఆవిడా, నేనూ మాట్టాడుకుంటాము..”. సంగతేమిటా అంటే, ఏదో పదచంద్రిక పజిల్ లో సందేహం వచ్చిందిట, అడగాలనీ !!

    నేను online లో ఉండగా, మొన్న 23 వ తారీఖు సాయంత్రం chatting లోకి వచ్చాడు. విషయాలు యతాతథంగా ఇస్తున్నాను….

   SHANKAR: జూలై 27 కి హైద్ లోనే ఉండచ్చు నేను. తప్పకుండా కలుస్తా
5:28 PM
వరవిక్రయం, పాండవోద్యోగవిజయాలు, చింతామణి (కొన్ని సీన్స్), ఘంటసాల పద్యాలు ఒక నూట యాబై, ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్ ఒక డెబ్భై సీడీలో పంపిద్దామని (డేటా డీవీడీ రాస్తే పరవాలేదా లేక MP3 డీవీడీగా పంపాలా అని అడిగేందుకు పింగ్ చేశా)

మొదటి మూడూ రేడియో నాటకాలు
5:29 PM
రచ్చ రచ్చ ఉన్నాయి. ఆకాశవాణి వాడివి

SHANKAR: ఒకే గురూజీ. దాంతో పాటూ ఇంకో సర్ప్రైజ్ కూడా పంపిస్తా :).

    మేము 27 వ తేదీన వస్తున్నామనీ, కలుద్దామనీ చెప్పానే, తప్పకుండా కలుస్తానని promise చేశాడే, ఆమాత్రం మంచీ, మర్యాదా లేకుండా, అలా వెళ్ళిపోవడమేమిటండీ? అసలు అంత ఖంగారేమిటీ? నిన్న online లో ఉండగా కృష్ణప్రియ ” ఈ న్యూసు విన్నారా, అంటూ, మా ఆత్మబంధువు శంకర్ ఇంక లేడండీ …” అనగానే కాళ్ళూ చేతులూ ఆడలెదు… ఏమిటో అంతా శూన్యం అయిపోయింది.. మా కుటుంబంలోని ఓ వ్యక్తిని చూడలేకపోయామే అని బాధ .ఏం వ్రాయాలో తెలియడం లేదు. ఎంత శ్రీ ముళ్ళపూడి వారితో కలిసి ఫొటోకి దిగినా, మరీ ఆయన్ని కలుసుకోడానికి ఇంత ఖంగారు పడాలా? అదీ శ్రీ వెంకటరమణ గారి పుట్టినరోజునా....

    ఈ విషాదసమయంలో చి.స్వాతికి సానుభూతి తెలియచేయడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయత….

    శంకర్ మన మధ్యలో లేకపోయినా, తను మనల్నందరినీ సంతోష పరచిన టపాలు ఇక్కడ చదవండి. టపాలద్వారా శంకర్ ఎప్పుడూ చిరంజీవే....

   అతని జ్ఞాపకార్ధంగా, తన స్వహస్తాలతో నా ఎడ్రసు వ్రాసిన కవరు గుండెల్లో దాచుకుంటాము…..

8 Responses

 1. అసలు పొద్దున్న ఇది చదివి మాటలు రాలేదు. శంకర్ గారంటే నాకు గురొచ్చేది “కాకినాడ”. ఆయన కామెంట్లు కూడా భలే తమాషా గా ఉండేవి.
  ఈ మధ్యే విన్న ఒక వార్త షాకు నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంటే మళ్ళీ ఈ న్యూసు. నాకు ఆయన బ్లాగుల ద్వారా మాత్రమే పరిచయం.అయినా ఏమిటో చాలా బాధ గా ఉంది. పాపం ఆయన అర్ధాంగి ని తలచుకుంతే గుండె బరువెక్కిపోతోంది….

  ఆగస్టు లో కాకినాడ వెళ్దామనీనుకున్నను. వెంటనే నాకు వచ్చిన ఆలోచన శంకర్ గారి బ్లాగులో “ఇంకా మీ కాకినాడ లో ఏమి తినాలి చూడాలి” కామెంటాలి అని. వీకెండ్ పెడదాములే అనుకున్నా..కానీ ఆయన గురించి ఇలాంటి వార్త వినాల్సివస్తుంది అనుకోలేదు.

  Like

 2. నిన్న వారిని గాంధి లో చూసి తట్టుకోలేక పోయాను , అశ్రుతప్త నయనాలతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను వారిని మొదటి సారి తెలుగు బాటలో కలిసాను ,
  https://plus.google.com/u/0/112277186449974183364/posts?tab=mX

  Like

 3. నిజంగా దారుణం. దేవుడు అప్పుడప్పుడు ఇదే జీవితమంటే అని చూపించే ఇలాంటి విషయాలకి ఎలా స్పందించాలో కూడా తెలియదు. ఎంత అభివృద్ధి సాదించిన మనం ఎంత అల్పులమో ఆ దేవుడి లీలల ముందు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాను. ఈ కష్టాన్ని భరించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  Like

 4. ఏమిటో!! ఎవరి దారి వారిది…

  Like

 5. Shocking news! May God give the family enough strength to overcome the loss.

  Like

 6. నాకాయన బ్లాగుల్లోకన్నా ప్లస్సులో పరిచయం. “అరుణ్, నువ్వు ఇండియా రాగానే మనం కలుద్దాం” అనేవారు. అప్పుడు నేను అదెలాగండీ మాకు మద్రాసు సౌకర్యం, టిక్కెట్ అక్కడకే అని చెప్పేవాణ్ణి. “అయితే తిరుపతి వెళ్తూ నెనే కలిసి వెళ్తా” అనేవారు. ఇప్పుడు మరిక కలిసే పనే లేకుండా వెళ్ళిపోయారు.

  Like

 7. ఫణీంద్రా,ఋషీ,కశ్యప్,వెంకట్,బోనగిరీ, డాక్టరు గారూ,అచంత,

  మీ స్పందనకు ధన్యవాదాలు….ఆలశ్యంగా చెప్తున్నందుకు క్షంతవ్యుణ్ణి….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s