బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Name/brand sells…


    ఎవరైనా సరే ఒకసారి పేరు,ప్రఖ్యాతులు వచ్చిన తరువాత, వారు ఏమి చేసినా చెల్లుతుంది, ఏమి వ్రాసినా ఆహా..ఓహో.. అనుకుంటారు. మరి పేరు తెచ్చుకోడం అంటే మరి అంత సులభమా? అలా పేరు తెచ్చుకోడానికి వారు ఎంతో కష్టపడుంటారు, కానీ అదంతా ఇదివరకటి రోజుల్లో అంటే మన మీడియావారు రాత్రనకా పగలనకా మనల్ని హోరెత్తించేయడానికి పూర్వం అన్నమాట. ఇప్పుడో, ఓ మీడియా వారిని మంచి చేసికుంటే చాలు, ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా అదే పేరు.

    ఆ వ్యక్తి ఒక రచయిత/త్రి అవొచ్చు, ఒక క్రీడాకారుడవొచ్చు, అలాటివారికి అన్నీ మాఫ్… మామూలుగా మనం ఏదైనా పత్రికకో ఇంకోదానికో ఓ రచన పంపుదామనుకుందాము, ఆ రచనతో పాటు ఓ “హామీ” పత్రం ఒకటి అడుగుతారు. “ఫలానా మీ రచన ఇంకో మాధ్యమం లో(including internet) ప్రచురింపబడలేదూ” అని. కానీ ఈ రోజుల్లో చూస్తున్నదేమంటే, అంతర్జాలపత్రికల్లో ప్రచురితమైన కొన్ని రచనలు, కొన్ని పత్రికల్లో కూడా రావడం. అడిగితే, అందరికీ net access లేదుకదా, అందువలన ప్రచురిస్తున్నామూ అని. ఇలాటిదానికి మళ్ళీ హామీ పత్రాలూ సింగినాదాలూ ఎందుకుట?

    ఈమధ్యన కొంతమంది “ప్రముఖులు” కూడా అంతర్జాలంలోకి అడుగెట్టారు. ఏదో పేరూ ప్రఖ్యాతీ ఉన్నవాడు కదా అని, వారు వ్రాసింది చదివి, ఓ వ్యాఖ్య పెడతాము. ఈ మాత్రం దానికి సమాధానం వ్రాసేదేమిటీ, అనుకుంటారు ఆ “ప్రముఖులు”. అది Blog అవనీయండి, Facebook అవనీయండి,Twitter అవనీయండి. కానీ వారుచేసే ” జ్ఞానబోధలు” మాత్రం ఆపరు. ఈమధ్యన ప్రారంభించిన ఓ కార్యక్రమం గురించి, అన్ని పేపర్లలోనూ ఎంతో పొగుడుతూ వ్రాశారు. అలాటివి, అంతకంటె మంచివీ కూడా ఎన్నో కార్యక్రమాలు చాలా చూశాము.కానీ, వాటికీ, ఈ కార్యక్రమానికీ తేడా ” మీడియా పబ్లిసిటీ..”.

    అలాగే టీవీ ల్లో అవేవో చర్చా కార్యక్రమాలొస్తూంటాయి. అందులో పాల్గొనేవారు ఎవరూ? ఈ విషయంలో ఈమధ్యన ఒక వార్త చదివాను. TV Audience ! రాజకీయ పార్టీల రాలీలకి జనాల్ని డబ్బిచ్చి పోగేసుకునేవారుట. ఇప్పుడు టివీ కార్యక్రమాలకి కూడా అదే గతి పట్టింది. మొన్న ఆదివారం నాడు అదేదో చానెల్ లో father’s day గురించి ఓ కార్యక్రమం చూపించారు.అందులో ఓ ముగ్గురు జంటలు( తండ్రి-కూతుళ్ళు), వారి మధ్య ఉండే అభిమానాలూ వగైరాలగురించి ఓ అరగంట, చెప్పిందే చెప్పి బోరుకొట్టేశారనుకోండి. నాకు ఒక విషయం అర్ధం అవదూ, ఇలాటి కార్యక్రమాల్లోకి తండ్రీ కొడుకుల్ని ఎందుకు తీసుకురారుట?

    ఇదివరకెప్పుడో వ్రాశాను, ఈ లాఫింగ్ క్లబ్బుల గురించి. ఈమధ్యన ముంబైలో ఆయనెవరో కోర్టుకి వెళ్ళారుట. రోగం కుదిరింది ఆ క్లబ్బువాళ్ళకి !HC orders laughter out of the club

Advertisements

5 Responses

 1. valla gurinchi aalochistye mana burra chedutundi

  Like

 2. /ఇలాటి కార్యక్రమాల్లోకి తండ్రీ కొడుకుల్ని ఎందుకు తీసుకురారుట?/
  వూ… అవును ఎందుకు?! ఆఁ…
  నంగిరి మాటలు, ముదురు డైలాగులు ఆడపిల్లలంత అశువుగా ఆక్షన్‌తో పాటు చేసి మగపిల్లలు సాధారణంగా చెప్పలేకపోవడేమే అనుకుంటా, అవునా? అంతేనా సార్?

  Like

 3. @మూర్తి గారూ,

  అవుననుకోండి. అయినా….ఉన్నదేదో చెప్పాలి కదా…

  @Snkr,

  అదికూడా అయుండొచ్చు….

  Like

 4. మాధవీ,

  థాంక్స్..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: