బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అతిథిదేవోభవ…


    కొన్ని దశాబ్దాలనుండి పూణె నగరవాసులు, తమ దినవారీ సమస్యల్ని పక్కకు పెట్టి, ఆషాఢ మాసంలో, అళంది నుండి వచ్చిన సంత్ జ్ఞానేశ్వర్ పాదుకలూ, దెహూ గావ్ నుండి వచ్చిన సంత్ తుకారాం పాదుకలూ, ఊరేగింపుగా పంఢరీపురం లోని పాండురంగ విఠల మందిరానికి వెళ్తూ పూణె మహానగరం లో ప్రవేశించిన రోజున, ఆ వార్కారీలకి చేసే అతిథిసత్కారం నభూతోనభవిష్యతి. కొన్ని లక్షలమంది భక్తులు మూడు రోజులపాటు పూణె నగరాన్ని పావనం చేస్తారు.

    ఈ ఊరేగింపు ఈ సంవత్సరం ( 2012) ఈవేళ మధ్యాన్నానికి పైచెప్పిన రెండు పుణ్యస్థలాలనుంచీ వచ్చిన ఊరేగింపు ముంబై-పూణె రోడ్డు మీద, మరియాయీ గేట్ అన్న ప్రదేశంలో ఒకటిగా చేరి ఊరేగింపుగా విఠల మందిరానికి వెళ్తాయి. జూన్ 15 తేదీదాకా ఇక్కడ పూణె లో విశ్రమించి, పంఢరీపురానికి బయలుదేరతాయి. ఈ మూడురోజులూ ఈనగరంలో అంతా పండగ వాతావరణమే. ఎక్కడ చూసినా కాషాయ రంగులే. ఊరు ఊరంతా విఠల భజనలే.ప్రతీ హవుసింగు సొసైటిలో కారు పార్కింగ్ స్థలాల్లో కార్లన్ని మాయం అయిపోతాయి.వార్కరీల భోజన సదుపాయాల్ల్తో లేక వారికి విశ్రాంతి స్ఠలాలాగో మారిపోతాయి.
ఎక్కడ చూసినా Traffic diversions, ఊళ్ళో ఎక్కడ చూసినా Traffic Jams. అయినా సరే ఎవ్వరూ విసుక్కోరు. అడుగడుక్కీ ఈ వార్కరీలకి భోజనసదుపాయాలు కలగచేసే చలవ పందిళ్ళు. ఓహ్… చూడాలి..అంతే వర్ణించలేము. 2011 లో జరిగిన పాల్కీ ఊరేగింపు ఇక్కడ చూడండి.

   సహ్యాద్రి పర్వతాలకీ, “సంత్” గురువులకీ ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటాను. సహ్యాద్రి సాంగత్యంతో “సంత్” లు అవుతారో, లేక ” సంత్” లు అందరినీ తనలో సగర్వంగా దాచుకుంటుందో మాత్రం తెలియదు. అక్కల్ కోట్ మహరాజ్, షిరిడి సాయి రాం, షేగాం గజానన్ మహరాజ్, స్వామి శ్రీ సమర్ధ రామదాసు, అళందీ లో ఉండే సంత్ జ్ఞానేశ్వర్, సోదరులు నివృత్తి నాద్,సోపానదేవ, సోదరి ముక్తాబాయి,వీరి గురువు చాంగ్ దేవ్, దేహూ లోని సంత్ తుకారాం, అందరూ సిధ్ధపురుషులే కదా! వీరే కాకుండా, మనందరికీ తెలిసిన సక్కూబాయి మహిళల్లోనే మణి హారం.

   వార్కరీ ల గురించి, ఓ విదేశీయుడు వ్రాసినది ఇక్కడ చదవండి.

    దేనికైనా పెట్టిపుట్టాలంటారు. ఇన్నేళ్ళనుండీ పూణె లో ఉంటున్నా, దగ్గరలోనే ఉండే పుణ్యస్థలాలు దేహూ గావ్, ఆళందీ చూసే అదృష్టం కలగలేదు. చూడకూడదని కాదు, సందర్భం కుదరలేదు. కానీ ఈ మధ్యన ఆ లోటు కూడా మా స్నేహితుడు శ్రీ దాసరి అమరేంద్ర గారు తీర్చేశారు. ఓరోజు ప్రొద్దుటే మా ఇంటికి వచ్చి, దగ్గరలో ఉన్న దేహు, అళందీ లకి వెళ్ళొద్దామా అన్నారు. అంతకంటేనా అనుకుంటూ వెళ్ళాము. ముందుగా దెహూ గావ్ కి వెళ్ళాము.
అక్కడ తీసిన కొన్ని ఫొటోలు:

సంత్ తుకారాం విగ్రహం
దేహు గావ్ లో సంత్ తుకారాం మందిరం

సంత్ తుకారాం జన్మస్థానం

సంత్ తుకారాం రచించిన అభంగ్ లు ఇంద్రాయిణి నదిలో విసిరేసిన స్థలం

సంత్ తుకారాం వైకుంఠానికి వెళ్ళిన స్థలం

సంత్ తుకారాం విరచిత అభంగాలు

    ఇంక అళందీ

   సంత్ జ్ఞానేశ్వర మందిరం

   అళందీ జ్ఞానేశ్వర మందిరం బయట

    ఈ దర్శనాలు చేసికునే అదృష్టం కలిగిన మేము….

    పాదుకల ఊరేగింపు ఇలా ఉంటుంది….

    ఇలాటివి చూసినప్పుడే అనిపిస్తుంది, ఇలాటి “పుణ్య నగరి” పూణే లో ఉండడానికి ఎంత అదృష్టం చేసికోవాలో కదా అని !!

జై మహరాష్ట్ర ! జైహింద్….

Advertisements

4 Responses

 1. Bagundandi.. Informative thx

  Like

 2. నేను 2010 నవంబరు నెలలో పూణేవచ్చాను. పూణేనుండి శిరిడి వెళ్లాను. వచ్చేటప్పుడు నేను చూసిన దృశ్యం ఏమిటంటే జనం గుంపులు గుంపులుగా వెళుతున్నారు. కొందరి నెత్తిమీద తులసికోటలు ఉన్నాయి. కొందరు తుకారాంలా చిన్న వీణ చిడతలు వాయించుకుంటూ వాళ్లతో ఉన్నారు. కారితీక మాసం వలభోజనాలలాంటిని అనుకుంటాను. నాకు నచ్చింది.

  Like

 3. మాక్కూడా దర్సన భాగ్యం కలిగించారు కదా . ధన్యవాదాలు.

  Like

 4. @వంశీ కమల్,

  థాంక్స్…

  @వేణు గోపాల్,

  మీరు అప్పుడు చూసినది కార్తీక ఏకాదశి సంబరాలనుకుంటా…

  ఈ సందర్భం లో ఈ లింకు కూడా చూడండి http://solapur.gov.in/htmldocs/rpandharpur.pdf

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ధన్యవాదాలు….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: