బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–outsourcing….


    ఏమిటో ఈ రోజుల్లో ఎక్కడ విన్నా ఇదే మాట.outsourcing అని. అక్కడికేదో కొత్తగా వచ్చిన concept లాగ. యుగయుగాలనుండీ జరుగుతున్నదే. అయినా ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్పేస్తారు. ఒంట్లో ఓపిక లేక, పనిమనిషిని పెట్టుకోడం లేదూ, అదీ ఈ కోవలోకే వస్తుంది కదా. ఏదో ఉద్యోగంలో ఉన్నప్పుడు, తప్పించుకున్నాము కానీ, రిటైరయిన తరువాత, ఊరికే కూర్చుంటే, ఇంటావిడ కి తోచదు.

   వంట గిన్నెలు నాలుగూ కడిగేసికుని సింకు పక్కన పెట్టేస్తుంది. వాటిని వాటివాటి స్థానాల్లో సద్దడం మన పనన్న మాట! ఏదో మొదట్లో, ” ఊరికే కూర్చోపోతే ఆ నాలుగ్గిన్నెలూ సద్దేయకూడదండీ...” అని ప్రారంభించింది, కాలక్రమేణా, “సద్దకెక్కడ పొతాళ్ళెద్దూ…” లోకి వచ్చేస్తుంది.అలాగే, ఆరేసిన బట్టలు, మడతపెట్టడం దగ్గరనుంచీ, ఇస్త్రీకి తీసికెళ్ళడం దాకా అన్నీ ఈ outsourcing లోకే వస్తాయి. వీటితో ఎక్కడయ్యిందీ, ఏదో జిహ్వచాపల్యం కొద్దీ, ఏ మెంతికూరో, గోంగూరో తెస్తామనుకోండి, ఏదో మొదట్లో అయితే తను చేసేది కానీ, రోజులు గడిచే కొద్దీ, ఈ ఆకుకూరలు బాగుచేయడం ఇంటావిడoutsourceచేసేసింది! ఇదివరకైతే నేను మార్కెట్ కెళ్ళి సంచీ ఖాళీ చేస్తున్నప్పుడు, ముందుగా చూసేది, ఈవేళేమైనా ఆక్కూరలు తెచ్చారా అని. కానీ, వాటిని బాగుచేసి, నా ” గొంతేరమ్మ కోరికలు” తీర్చాలంటే కొద్దిగా శ్రమతో కూడిన పనేగా మరి. ఆ శ్రమంతా తను బాగుచేసిన ఆకుకూరల్లో తెలిసేది. ఏదో ఆకులు విడివిడిగా ఉంటే పరవాలేదు కానీ, మరీ “కాడల” తో ఉంటే ఎలాగండి బాబూ? నవలడానికి పళ్ళా లేవు, మరీ తినేటప్పుడు, ఆ కాడేదో గొంతుక్కడ్డం పడితే కష్టం కదూ? పైగా ఏమీ అనకూడదూ, ఆ ఆకులేవో సరీగ్గా బాగుచేయకూడదోయ్ అంటే చాలు, “నాకు తెలిసిందింతే, తినాలంటే తినండి, కాకపోతే, ఎవరిచేతైనా బాగు చేయించుకోండి…”. మళ్ళీ ఈ కూరలు బాగుచేసికోవడానికి ఇంకోళ్ళా? అంటే not in so many words, “ఓపికుంటే, బాగుచెయ్యి, లేకపోతే నోరుమూసుకుని మింగూ...” అనే కదా మరి. దానితో ఈమధ్యన ఏం జరుగుతోందంటే, మార్కెట్ నుండి ఏ ఆక్కూరైనా తేవడం, డైనింగ్ టేబుల్ మీద ఓ రెండు న్యూస్ పేపర్లేసికుని, ఆ కూరేదో బాగుచేయడం. మధ్యమధ్యలో ఎక్కడదాకా చేశానో చూస్తూంటుంది, చివరకొచ్చేసరికి మాత్రం ఓ సానుభూతి వాక్యం- ” అయ్యో ఆక్కూర తెచ్చారని చెప్పొచ్చుగా, బాగుచేసేదాన్నీ” అంటూ. మేముండే ఇల్లు ఏమైనా ప్యాలెస్సా ఏమిటీ, అంత కనిపించకపోవడానికి? ఏమిటో ఇలా ఉంటుంది.

   అలాగే, టీ పొడుం, కాఫీ పౌడరూ, పంచదారా డబ్బాల్లో పెడతాముకదా, పోనీ అవి ఖాళీ అయినప్పుడు చెప్తే ఏంపోతుందీ? అబ్బే, తనే చూసుకుంటాడులే. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే కాఫీ, మధ్యాన్నం పూట చాయీ తనే పెడుతూంటుంది. మధ్యాన్నం కొద్దిగా రెస్టు తీసికుంటోంది కదా, పోనీ ఈవేళ ఆ చాయేదో పెడదామని చూస్తే, చాయ్ డబ్బా, పంచదార డబ్బా ఖాళీ. అందుకన్నమాట, మెళుకువొచ్చినా, లేచి చాయ్ పెట్టకపోవడం! ఛస్తానా, టైముకి ఆ చాయ్ నీళ్ళు పడకపోతే రోజెళ్ళదూ.మాట్టాడకుండా, చాయ్ ప్యాకెట్టు తెరిచి, చాయ్ పొడి డబ్బాలో పోసి, అలాగే పంచదార పెద్ద డబ్బాలోంచి, చిన్నదాంట్లోకి పోసి, చాయ్ పెట్టడం, అప్పుడు తీరిగ్గా కళ్ళు తెరుస్తుంది.. “ అర్రే నేను పెడుదునుగా చాయి, ఇంకా అయిదవలేదని ఆగాను..”. అసలు విషయం ఏమిటంటే, ఆ చిన్న డబ్బాలు refill చేయాలి, బధ్ధకం. ఇదిగో ఇలాటి వాటిని outsource చేసేయడం లోకే వస్తుంది! వామ్మోయ్ ఎన్ని తెలివితేట్లండీ.అలాగే తను ఎప్పుడో ప్రొద్దుటే లేచి కాఫీ పెట్టలేదూ అంటే, డబ్బాలు ఖాళీ అన్నమాట!అదేదో చెప్పేయకూడదూ, మళ్ళీ లౌక్యాలూ! మన నోటితో మనం చెప్పకూడదు. తనూ తాగాలి కదా, తయారుచెయ్యకేం చేస్తారూ? పైగా, ఓ గ్లాసుడు కాఫీ తీసికుని వచ్చి, విషయం ఇదన్నమాట అన్నామనుకోండి, ప్రపంచంలో ఎక్కడా చూడని అమాయక మొహం ఓటి పెట్టేసి, ఏమిటీ అంటున్నారూ అనడం! నేనేం అంటున్నానో తనకీ తెలుసును.

    ఇలాటి వాటిని subtle outsourcing అంటారు. ఊళ్ళోవాళ్ళకి తెలియదు, ప్రతీవాళ్ళూ ఆహా ఓహో అనుకునేవారే, అబ్బ ఎంత అన్యోన్యదాంపత్యమో అనుకునేవారే! ఇలాటివి నూటికి తొంభైమంది ఇళ్ళల్లో జరుగుతూనే ఉంటాయి. ఎన్నిచెప్పండి ఇలాటి outsourcing ల్లో ఉన్న హాయి ఎందులో ఉంటుంది చెప్పండి….

    ” మన తెలుగు” గురించి శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు ఏమి వ్రాశారో, అదీ 1935 లో ఇక్కడ చదవండి.ఇందులో రెండో వ్యాసం. ఏమిటో మనవాళ్ళకి భాషాబిమానం ఈమధ్యనే తగ్గిందేమో అని బాధపడిపోతూంటాము. కానీ ఈ “రోగం” ఎప్పటినుంచో ఉందని తెలుస్తోంది…

Advertisements

15 Responses

 1. subtle outsourcing
  —————
  New Name. This is a good one.
  రిటైరు అయినవాళ్ళ దైనందిన జీవితం దాదాపు ఇల్లాగే ఉంటుందల్లె ఉంది. ఇంకోవిధంగా ఆలోచిస్తే ఆకాస్తన్నా చేసేవాళ్ళు వున్నారు కదా అని సంతోషిస్తాను.

  Like

 2. “subtle outsourcing” — 🙂

  Like

 3. Chla Bavundi uncle… ila aloochistu unte nenu enni chinna chinna panulu outsource chesaano telustomdi 🙂
  -Suma

  Like

 4. అహా… ఓహో… మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి మళ్ళీ దానికి Outsorcing అని పేరా …. ??

  అయినా సరే చాలా చాలా బాగా చెప్పారు … బహుషా ఇలాంటివి ఉంటేనే బాగుంటుందేమో… 🙂

  Like

 5. ఏమండీ,

  బ్లాగ్ టపాలు రాయ డానికి outsourcing ఏజెన్సీ ఏవైనా వున్నాయా ? తెలియ జేయ గలరు !

  చీర్స్
  జిలేబి.

  Like

 6. ఫణి బాబు గారూ మీ outsourcing పోస్ట్ నా శ్రీమతి చదవకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాను

  ఎంచేతంటే ఇప్పటిదాకా తప్పించుకుని తిరుగుతున్నాను నా శ్రీమతి కాని చదివిందా నా పని ఇంతే.

  Like

 7. “ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటె అలుపు సొలుపేమున్నది
  ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది,
  మనకు కొదవేమున్నది ” అని యుగాల గీతం పాడుకోవాలండి బాబు!

  Like

 8. @రావుగారూ,

  ఏదో గుర్తొచ్చి అలా వ్రాశాను. ఔట్సోర్సింగ్ అని చెప్పాకూడదూ, పనులన్నీ కానిచ్చేయాలి. పోలిసోళ్ళ దెబ్బల్లా ఇవి ఎవరికీ కనిపించవు….

  @ఫణీంద్రా,

  థాంక్స్..

  @సుమా,

  పోనిద్దూ, ఎప్పటికో అప్పటికి తెలిసింది చాలు….

  @మాధవీ,

  మీరందరూ పేద్ద sophisticated గా అలాటి ప్రయోగాలు చేసేస్తూంటారు. కానీ ఇళ్ళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరిగే ఇలాటి వాటి గురించి కూడా తెలియొద్దూ….

  @జిలేబీ,

  అదేదో కూడా ఉంటే బాగుండేదేమో….

  @శాస్త్రిగారూ,

  మనకలాటి అదృష్టం లేదండి బాబూ.. మా ఇంటావిడ ఈ టపా చదివిన తరువాత ఇంకొన్ని పన్లు చెప్పడం ప్రారంభించింది. ఎలాగూ రోడ్దున పడ్డాడీయనా అనుకుంటూ….

  @మోహన్ గారూ,
  ఇంక మిగిలింది పాటలు పడుకోవడమే…..

  Like

 9. బాగుంది. మీరు రిటైర్ అయ్యాక ఇవ్వన్నీ చేస్తున్నారు. మాకు ఇప్పటినుంచే మొదలయిపోయింది. వాళ్లుచెప్పకుండా మనం తెచ్చామా అంతే సంగతులు, మనమే బాగుచేసుకోవాలి లేకపోతే నాలుగయిదు రోజులు ఫ్రిజ్ లోను తరవాత ….

  Like

 10. వేణుగోపాల్,

  ఉద్యోగంలో ఉన్నప్పుడనండి, రిటైరయిన తరువాత అనండి. ఇవి తప్పవు… అందుకే చెప్పానుగా కొన్ని కనిపించేవీ, కొన్ని subtle గా ఉండేవీనూ….

  Like

 11. […] మనతెలుగు వ్యాసాలు కనిపించేయి ఫణిబాబుగారి బాతాఖానీ కబుర్లు బ్లాగులో. ఇక్కడ చూడండి. వారికి […]

  Like

 12. మాలతీ గారూ,

  మీలాటి ప్రసిధ్ధ రచయిత్రుల స్పందనకి ముందుగా ధన్యవాదాలు. మీరు వ్రాసిన వ్యాసం చదివాను. నాకు ఒక విషయం అర్ధం అవలేదు. శ్రీ భమిడిపాటి వారి వ్యాసాల లింకు నా టపాలో ఇచ్చినందుకు కానీ, కోప్పడ్డారా మీరూ అని. ఏ దురుద్దేశ్యంతోనూ పెట్టలేదు. మిగిలిన పాఠకులు కూడా చదివి ఆనందిస్తారనే ఉద్దేశ్యం మాత్రమే.
  ఇటుపైన ఎక్కడైనా ఏదైనా చదివినా, నా టపాల్లో పెట్టనని మాటిస్తున్నాను. ఇదేదో తప్పు అనిమాత్రం నేనెప్పుడూ అనుకోలేదు.

  Like

 13. there is no need to be retired. This is the normal fate of POWs (prisoners of Wives)

  Like

 14. మీరు Outsourcing అంటున్నారు, నేను “అంటగట్టిఫైయింగ్” అందామనుకుంటున్నాను కానీ బ్లాగులోకంలోని మహిళామణులు “ఇంటి పనులలో ఆ మాత్రం సహాయం చెయ్యలేవా ఆఃయ్” అని నామీద వ్యాఖ్యలతో దండెత్తుతారేమోనని సంకోచిస్తున్నాను 😳🙂.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: