బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.


   అబ్బ ఎన్నాళ్ళకి తెలుగుసినిమాల్లో, చాలాకాలం తరువాత, ఓ శుభ్రమైన పేరు విన్నామండి బాబూ “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, సినిమా ఎలాగైనా ఉండనీయండి, పేరుమాత్రం సలక్షణంగా ఉంది. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందబ్బా మనవాళ్ళకి? “రచ్చ”, “దరువు”, “దూకుడు” “చిరుత” లాటి చెత్త పేర్లు విని విని చెవులకి పట్టిన తుప్పు వదిలిపోయింది! పేరులో ఏముందీ అంటారు, కానీ ముందుగా, పేరు లక్షణంగా ఉంటేనే కదా, మిగిలిన విషయాలు! అదేంఖర్మమో, ఈమధ్యన వచ్చే సినిమాలన్నిటికీ కూడా దిక్కుమాలిన పేర్లే. పోనిద్దురూ ఎవరో ఒకరికి సరైన పేర్లేనా పెట్టాలని ఆలోచనొచ్చింది.

    పేర్లనేటప్పటికి గుర్తొచ్చింది, ఈ మధ్యన ఈ ఐటి పిల్లల నోళ్ళలో అదేదో “గుల్టీ” అనేది వింటున్నాను. ఆ పదానికి అర్ధం ఏమిటో తెలియదు. కానీ మాటల్లో తేలిందేమిటంటే, అది తెలుగు వారికి సంబంధించిందీ అని మాత్రం తెలిసింది. నాకుమాత్రం ఈ పదం చాలా offensive గా అనిపించింది. దీని మూలాలెవరైనా చెప్తారా అని ఒకరిద్దరిని అడిగినా లాభం లేకపోయింది. పోన్లెద్దూ ఇంట్లో నెట్ ఎలాగూ ఉందీ, దాంట్లోనే వెదుక్కుంటే పోలా అనుకుని, గూగులమ్మని అడగ్గానే ఇదిగో ఇలా కనిపించింది.

    వివరాలు చదివిన తరువాత తెలిసిందేమిటంటే, అక్కడెక్కడో అమెరికాలో, తెలుగువారిని “గుల్టీ” లంటారుట. పైగా “తెలుగు” ని తిరగేసి వ్రాస్తే వచ్చే పదం “గుల్టీ” ట ! వాళ్ళ మొహమేం కాదూ? హాయిగా తేనెకంటె మధురమైన పేరు ఉండగా, అసలు తిరగేయమని ఎవరన్నారు? ఇంకో చిత్రం ఏమిటంటే, అలాగని ఎవరైనా అన్నా కానీ, మనవాళ్ళు అస్సలు ఏమీ అనుకోరుటకూడానూ. వహ్వా వహ్వా ఎంత విశాలహృదయులండి బాబూ?

   ఇదివరకటి రోజుల్లో ఉత్తరహిందూస్థ్హాన్ లో వాళ్ళందరికీ, వింధ్య పర్వతాల కిందున్నవాళ్ళందరూ “మద్రాసీ” లే. అయినా, ఎవరైనా మన తెలుగువారిని, “మద్రాసీ” అనగానే, మనవాళ్ళు వాళ్ళకి తెలియచెప్పేవారు. నా అభిప్రాయం ఏమిటంటే, ఈ “గుల్టీ” అన్న పదం మొదలెట్టినప్పుడు కూడా, బయటి దేశాల్లో ఉండే మనవారు, తెలియచెప్పుంటే, ఈనాడు తెలుగు కి ఇంత దౌర్భాగ్య స్థితి ఉండేది కాదనుకుంటా. ఇదివరకటి రోజుల్లో, అందులోనూ పరాయి రాష్ట్రాల్లో ఓ తెలుగువాడికి ఇంకో తెలుగువాడు కనిపించినప్పుడు “ మనవాడేరా”అనేవారు. మరి ఇప్పుడో….Take it sportingly, its all in fun… అని మాత్రం అనకండి. మనం మాట్టాడే భాష మన అమ్మ భాష. అలాటి అమ్మని అమ్మనే పిలుస్తాము. కొద్దిగా ఎమోషనలయిపోయాననుకుంటాను. హాయిగా నవ్వుకోడానికి ఇక్కడ ఓ గుల్టీ వ్రాసిన టపా చదవండి.

   ఈమధ్యన నా desktop బాగా స్లో అయిపోవడంతో, చెప్పానుగా ” డాక్టరు” ని పిలిచి, వైద్యం చేయించాను. అతనొచ్చి అదేదో formatting చేశాడు. స్పీడంటే పెరిగింది కానీ, మిగిలిన బాధలు మొదలయ్యాయి. ఏదో తెలుగు వ్యాసమో ఇంకోటో, మాకు నచ్చింది,bookmark చేద్దామని మొదలెడితే, ఆ తెలుగక్షరాలు కాస్తా కనిపించడం మానేశాయి. బాక్సుల్లా కనిపించడం మొదలెట్టాయి. నేనేమైనా expert నా ఏమిటీ? ఎవరినో ఒకరిని అడక్కుండా కుదరదాయె, అబ్బాయేమో హైదరాబాద్ వెళ్ళే హడావిడిలో టైము లేక, తిరిగొచ్చిన తరువాత చూస్తానూ అన్నాడు. ఆదివారందాకా ఎలాగా అనుకుని, ఆమాత్రం నేను చేసుకోలేనా అనుకుని, ముందుగా మన రెహమానుద్దీన్ కి ఫోను చేస్తే, దొరకడే. అతనికి సంబంధించిన ఇంకో నెంబరు కి ఫోనుచేస్తే, ఇంకోరెవరో దొరికారు. ఇలా కాదనుకుని, నేనే సెర్చ్ చేయడం మొదలెడితే, వీవెన్ గారి సైట్ లో ఇదేదో దొరికింది. ఆయన చెప్పినట్టుగానే చేశాను, అయినా ఎన్నిసార్లు చేసినా కుదరలేదు. పోన్లెద్దూ, మనక్కుదరడం లేదూ తరువాత చూద్దాంలే, అని ఊరుకోకుండా, కెలకడం మొదలెట్టాను. మొత్తానికి దొరికిందండి. మీగ్గూడా నాకొచ్చినలాటిది వస్తే ప్రయత్నించండి. ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు. నాలాటివాళ్ళకి ఇదో పండగ మరి!

   ఆయనెవడో సిబీఐ జడ్జి గారిని సస్పెండు చేశారుట అయిదు కోట్లు లంచం పుచ్చుకున్నాడని. ” మేరా భారత్ మహాన్”..

   అందరూ యువనాయకుణ్ణి అరెస్టు చేయడం అన్యాయం అంటున్నారు కదా, ఈ అరెస్టులోనూ పాజిటివ్ గా ఉండేదేదో ఆలోచించండి. ఆయనది అక్రమ సంపాదనా, కాదా అన్నది కోర్టువాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ అరెస్టు ధర్మమా అని, ఈ ఎండల్లో ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళాల్సిన అవసరం తప్పింది కదా! వాళ్ళ తండ్రిగారు పోయినప్పటినుంచీ ఓదార్పు యాత్ర అన్నారు, ఇంకోటేదో అన్నారు, తిరిగినవాడు తిరక్కుండా రోడ్దుమీదే ఉన్నారు. ఒక్కరోజైనా రెస్టు దొరికిందా? అతనే ఉండుంటే, వాళ్ళ అమ్మగారు ఇల్లు కదిలేదా? పోనిద్దూ తనే చూసుకుంటాడూ అనుకునేవారు! ఇప్పుడు చూడండి, ఆ పార్టీలో ఉండే ప్రతీ ఛోటా మోటా నాయకులూ రోడ్డెక్కారు. నా ఉద్దేశ్యంలో అసలు ఈ అరెస్టు ఓ కుట్ర!I mean to facilitate Mr.Jagan’s long overdue rest…..

16 Responses

  1. As far as I know the Madras IIT grads introduced this word “gulti” in their campus. Those folks later migrated to USA and continued their tradition of calling names. Now once they grew out of their childhood/teen lives they found it nauseating to call themselves as gulti and say that the word is demoralizing. But it is their own invention and no matter what they have to live with it. Since you are not a techie you may not be aware but every techie on road knows about this word. IITs are the centers for great intelligence? My foot

    Like

  2. వీర మాతృభాషాభిమానులైన తమిళులు.. తమ రాష్ట్రంలో సుమారు 40శాతం మంది ఉన్న తెలుగు వాళ్ళని అవమానించడానికి, వాళ్ళు తమ తెలుగును వదిలిపెట్టేసేలా చేయడానికీ పుట్టించిన మాటిది. చిత్తూరు జిల్లా లోనూ విపరీతంగా వినబడుతుందీ పదం.

    Like

  3. ఈ “గొల్టీ” పదం చాలా పాతది. USలో ఉన్న సాఫ్టువేరులు పుట్టక పూర్వంనుండే అరవ వాళ్ళు మనవాళ్ళని ఉద్దేశించి వాడే పదం. మనం వాళ్ళని సాంబారుగాళ్ళని, అరవవాళ్ళని అన్నట్లే.

    Like

  4. Babayya,
    Agree with above that the usage did not originate abroad. It seems to be favored by Indian yuppies, in India and abroad. As far as I know, it has been around at least since the mid 80 s. The word “GULT, in part the reverse spelling of “TELUGU”, in itself seems harmless enough; but have to agree that the term is not very flattering…

    Like

  5. ఈ పదం నాకు పూనేలోనే తెలిసింది 🙂

    Like

  6. when i was studying in chennai,i heard people calling telugu people as gulty.i have asked the meaning of gulty.they said telugu people are brainless and it is a nickname for telugu people.tamilains consider themselves as very clever.telugu people call tamilians as arava vadu.
    the origin of GULTY is tamilnadu.mallu is the nick name for malayalies.

    Like

    • Mallu is short form for Malayali(am). Aravam is another name for Tamil, so there is no derogatory in both of them. But Gulute… is an intentional usage to demean and play pranks against Telugu people. Intention behind is mala fide, so crime 🙂

      Like

  7. గుల్టీ చాల అభ్యంతర కరం గా వుంటుంది అండీ వినడానికి. మా ఆఫీసులో క్రితం వారం ఒక ఢిల్లి అవిడ “tum south indian log” అని మొదలు పెట్టింది. అవిడకి చాల గట్టిగా చెప్పాను Please don’t generalize అని. పక్కనే వున్న తమిళ అమ్మాయి కూడా చెప్పింది it really is irritating అని. ఎంత చెప్పినా అర్ధం కాదు ఎందుకో మరి..ఆంధ్ర, కర్నాటక, తమిళ్ నాడు, కేరళ నాలుగు వేరు అని. ఇక ఆవిడ తో లంచ్ కి వెళ్ళను అని ఒట్టు పెట్టేసుకున్నా ఇంక.

    Like

  8. “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” —svsc అయిపోయిందిగా!!
    తెలుగు వాళ్ళను కొంచెం కొంచెం ఇప్పుడైనా మద్రాసిలని అనడం మానేసారు.
    గులుటి లని అనడం పంటి కింద రాయి లాగే తగులుతుంది.
    ఆంధ్రులని చెప్పుకోవడానికి ఇప్పటి పరిస్థితులలో చాల ఇబ్బందిగా ఉంది.

    Like

  9. సదరు జడ్జి ఎదవ ఒప్పందం జరిగింది 15కోట్లైనా నాకు అందింది 10 మాత్రమే, దీని మీద CBI దర్యాప్తు చేసి తనకు పూర్తి న్యాయం చేయాలని అడుగుతున్నాడట! అసలు గాలి, జగన్లతో పోలిస్తే 10కోట్లు తినడం ఏమంత అన్యాయం జరిగిపోయినది? పెద్దదైన సుప్రీం కోర్టు మాజీ CJ ని చేయని అరెస్టు చిన్న కోర్ట్ జడ్జి పై ఎందుకు? ఇది వివక్షే కాబట్టి వదిలేయాలని కొందరు బ్లాగుల్లో గోచీలు బిగించి వాదించడానికి తెగ బడుతున్నారని వినికిడి.

    అవినీతి అని విచారించడానికి కనీసార్హత 100కోట్లైనా వుండేలా, రాజ్యాంగసవరణ ప్రతిపాదించడానికి పార్టీల కతీతంగా ఏకమయ్యే రోజు ఆసన్నమైందని కొందరు గుర్తు తెలియని 10 జనపథ్ విజిటర్స్ కొందరు చర్చించుకుంటున్నారట.

    Like

  10. ఇంగ్లీషులో తమిళ్ ని tamizh అని రాసుకుని మురిసిపోతుంటారట, అక్షరమాల సరిగ్గా ఎదగని అరవాళ్ళు. gulte అనేది వాళ్ళ ఏడుపుకు, కసికి, సరిగ్గా అక్షరాలను తిరగేయడం కూడా చేతకాని అజ్ఞానానికి మచ్చుతునక. నాకేమీ అనిపించదు, immatured retards అనేస్తాను.
    వినీల గారూ, South Indiansను అలా కాక మరి ఎలా పిలవాలి? మనది దక్షిణమే కదా! అంతగా నార్తీలను గిల్లాలనిపిస్తే ‘పరేఠే జీ’ అనేయండి. 🙂

    Like

  11. Continuing on with this interesting debate…the basis for Arava for Tamil people appears to range from; some of the original inhabitants- the “aruvars” to down right derogatory interpretations. The word “gult” in itself is meaningless! Whether or not it was created by Tamil people, I have seen Telugu people use it to describe themselves 😦 . At best it reflects immaturity ( in high school we used to reverse our names and call each other out by them!) and at worst, a lack of pride in our own language?! That I have been unable to write the above in Telugu is of course my personal shame 😦

    Like

  12. @sunnA,

    నాకూ అలాటి అనుమానమే ఉండేది. మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను….

    @ఫణీంద్రా,

    అరవ్వాళ్ళు ఎంతకైనా తగుదురు. కానీ తెలుగువారైన so called intellectual present day techies కూడా, దీన్ని వాడినప్పుడు బాధేస్తూంటుంది…

    @రొల్టీ,

    మనవాళ్ళు కూడా ఓ కొత్త పదాన్ని సృష్టిస్తే బాగుండేదేమో….

    @అరుణ తల్లీ,

    “have to agree that the term is not very flattering..” మరీ మొహమ్మాట పడ్డట్టున్నావు. నాకైతే ఆ పదం చాలా offensive గా ఉంది…

    @లలిత గారూ,

    నేను 50 ఏళ్ళనుండి ఇక్కడే ఉంటున్నా, ఈ మధ్యన IT boom వచ్చినప్పటినుంచే వింటున్నాను. పైగా అదేదో ఘనకార్యంలా చెప్పుకోడం ఇంకా బాధేస్తోంది….

    @బాలసుబ్రహ్మణ్యం గారూ,

    ” telugu people are brainless….” అలాగని అరవ్వాళ్ళా చెప్పేది?

    @వినీలా,

    మంచి పని చేశారు….

    @మోహన్ గారూ,

    మీరన్నట్టు అంత అందమైన పేరుని ” svsc” లోకి మార్చడం, మనవాళ్ళకే చెల్లింది..ఆంధ్రులమని చెప్పుకోడానికి సిగ్గెందుకండి డాక్టరు గారూ….

    @Snkr,
    ఒక్క విషయం మాత్రం బావుంది– గాలి జనార్ధన రెడ్డి, మొత్తం అందరికీ టోకున 60 కోట్లకి బేరం కుదుర్చుకున్నాట్ట !!

    @అరుణ తల్లీ,

    ” I have seen Telugu people use it to describe themselves…” అదే కదమ్మా వచ్చిన బాధల్లా….

    Like

  13. Very True….. I totally agree with you……

    You should have a look at http://www.gulte.com

    They gave us the name and we are carrying it proudly……. (I don’t know how far the proud part is true)

    Like

  14. WOW 😦 I can’t believe there is a web site of that name about telugu speaking people! I wonder if there is any other group of people which does this?

    Like

  15. @మాధవీ,
    “Very True….. I totally agree with you……” థాంక్స్…

    @అరుణ తల్లీ,

    నెట్ వెదికితే ఇలాటి ప్రబుధ్ధులు కావలిసినంతమంది దొరుకుతారు….

    Like

Leave a comment