బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం


   ఈ ఆదివారం ఏదో కొద్దిసేపు తప్పించి, రోజంతా శ్రీరామచంద్రుడి దర్శనమే ! ప్రొద్దుటే రామదాసు, మధ్యాన్నం అలనాటి “లవకుశ”, రాత్రికి బాపూ రమణల సృష్టి “శ్రీరామరాజ్యం”.
ఒకేరోజున శ్రీరామచంద్రుడి దర్శనం కొంచం ఓవర్ డోస్ అయిందనుకోండి. కానీ లవకుశ, శ్రీరామరాజ్యం ఒకే రోజున చూసిన కారణంగా రెండు సినిమాలకీ comparative study చేయడానికి సాధ్యపడింది. దేని గొప్ప దానిదే అనుకోండి.

   “లవకుశ” : ఈ సినిమా రిలీజ్ అయి వచ్చే ఏటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్ని సార్లైనా చూడ్డానికి బావుంటుంది. కారణం అందులో ఎన్ టి ఆర్ పోషించిన శ్రీరామ పాత్ర, అంజలీదేవి పోషించిన సీత పాత్ర. ఇద్దరికిద్దరే ఆ పాత్రల్లో జీవించారు. వీటికి సాయం ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో ఆ చిత్రం లోని 37 పాటలూ, పద్యాలూ ప్రతీదీ ఓ అఛ్ఛోణి లాటిదే. పంటికింద రాయిలా శ్రీ ఎన్ టి ఆర్ గారి గ్నాపకం, కృతగ్నత వదిలేస్తే మిగిలిన డయలాగ్ డెలివరీ “నభూతో నభవిష్యతి”. ఒక్క చోట — భూదేవి, సీతమ్మ ని తనతో వచ్చేయమని అడిగినప్పుడు, భూదేవి ఎంతో ప్రయత్నిస్తుంది convince చేయడానికి, అయినా సీతమ్మ ఒప్పుకోరు. అప్పుడు భూదేవి చెప్పిన డయలాగ్గు,” అయితే నీ ఖర్మ..” అనడం కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది.అదికూడా, ఏదో మనం మాట్టాడేటట్టుగా ఉంది. వాల్మీకి మహర్షి సీతమ్మవారికి :లోకపావని” అని పేరు పెట్టారు. నాగయ్య గారికి ఘంటసాల వారు కాకుండా, ఆయన్నే పాడమనుంటే ఇంకా బావుండేదేమో.ఆ సినిమాని 26 కేంద్రాల్లో రిలీజు చేస్తే ప్రతీ కేంద్రం లోనూ శతదినోత్సవం చేసికుంది. తెలుగులో కోటి రూపాయలు చేసికున్న మొదటి చిత్రం ట.

   ఇంక శ్రీరామరాజ్యం విషయానికొస్తే, It is out and out a Bapu Ramana classic. ప్రతీ ఫ్రేం లోనూ శ్రీబాపు గారే కనిపిస్తారు. ఆయనమీద తెలుగువారికున్న అభిమానం ఒకటి కారణం అయుండొచ్చు. ఇందులో 16 పాటలున్నాయి.ఇళయరాజా సంగీతం సినిమాకి ఓ హైలైట్. ఇంక డయలాగ్గుల విషయానికొస్తే, శ్రీ ముళ్ళపూడి వారి, stamp ప్రతీ చోటా వినిపిస్తుంది. వచ్చిన అసలు గొడవల్లా ఏమిటంటే, బాలకృష్ణ ని చూసినప్పుడల్లా “సింహా”, “సమరసింహారెడ్డి” గుర్తొస్తాయి. నయనతార పరవాలేదు. బాలకృష్ణ డయలాగ్ డెలివరీ లో అసలు శ్రీరామచంద్రుని తో రిలేట్ చేసే శాంతమూ, ప్రేమ, అభిమానమూ అన్నదే వినిపించలేదు. ఏ ఎస్.పీ చేతో డబ్బింగ్ చేయించేస్తే సరిపోయేది. Latest Technology was fully utilised. ఈ సినిమాలో సీతమ్మవారికి, వాల్మీకి ఆశ్రమంలో “లక్ష్మీ దేవి” అని పేరు పెట్టారు.
మొత్తానికి రోజంతా బాగానే కాలక్షేపం అయింది. నిన్న టివీ లో మాయదారి పాటలు విని బోరుకొట్టేయగా, నెట్ లో వెదికితే ఓ మచ్చుతునక కనిపించింది.

Advertisements

5 Responses

 1. mee punyamaa ani yesudas pakkana nilabadi tyagayyanu ‘vinnanu’!

  Like

 2. oka 30 mts gandharva lokamlo viharinchanu.Thank u so much

  Like

 3. @అమరేంద్రగారూ,

  మీరు పెట్టిన వ్యాఖ్యకి ముందుగా ధన్యవాదాలు. బ్లాగులోకంలోకి సుస్వాగతం.. మధురమైన సంగీతం ఆస్వాదించడానికి మనం అందరం ఎంతో పుణ్యం చేసికున్నాము.నేను చేసిందల్లా, ఇలాటి మచ్చుతునకలని అందరికీ పరిచయం చేయడమే.

  @శశి గారూ,

  మీకు అలాటి ఆనందం కలగచేయడం తో, నా జన్మ ధన్యం అయింది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  Like

 4. బాగుందండీ మీ విశ్లేషణ…

  Like

 5. మాధవీ,

  థాంక్స్..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: