బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కోపం వస్తే ఎవరికంట….


   ఉద్యోగం లో ఉన్నంతకాలం మనకి ఒక previlege ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ళమీద కోపం తెచ్చేసికోడం. ఆ కోపానికి ఓ అర్ధం పర్ధం ఉండేది కాదు. అప్పుడు తెలిసేది కాదు, కారణం, అధికారం. మా జిఎం ఒకరుండేవారు వరంగాం లో, ఆయన దగ్గరకు మా ఫ్రెండు ఒకతను వెళ్ళి సలహా అడిగాడు, ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం మంచిదా, ప్రభుత్వం లో మంచిదా అని. అప్పటికి అంటే పదిహేనేళ్ళు ముందరి మాట, ఈ పేకమిషన్లలో ప్రభుత్వోద్యోగులకి, మరీ అంతంత జీతాలుండని రోజులు. ఆ జిఎం గారిచ్చిన సలహా ఏమిటంటే, Govt job is always good, as it carries lot of power.. అని! నిజమే కదూ, చప్రాసీ దగ్గరనుండి, Chief Excecutive దాకా ప్రతీ వాడికీ పవరే. వామ్మోయ్ గేటు దగ్గర నుంచీ, ప్రతీ వాడూ పోజెట్టేవాడే. ఏదో అందరినీ దాటుకుని, మొత్తానికి “గర్భగుడి” దాకా చేరినా, శ్రీవారి పిఏ గారి చలవుండాలి. దీనితో ఏమయ్యిందంటే, ప్రభుత్వం లో పని చేసి రిటైరయిన ప్రతీవాడికీ ఈ కోపం అనేది అలవాటైపోయింది. ఉద్యోగంలో అయితే పరవా లేదు కానీ, రిటైరయిన తరువాత వీళ్ళ మాటెవడు వింటాడండి బాబూ?

   ఏదో రిటైరయిన కొత్తలో మహ అయితే కట్టుకున్న భార్య వినొచ్చు. ఏదో పోనిద్దూ, అలవాటైన ప్రాణం అని. పాపం ఆయన్ని ఈ వయస్సులో క్షోభ పెట్టడం ఎందుకులే అని.ఈ సంగతి గుర్తించలేక, మన “హీరో” గారు, ఇంకా పేట్రేగిపోతూంటాడు. అయిన దానికీ, కానిదానికీ కోపం తెచ్చేసికోడమే, పేద్ద కారణమేమీ ఉండఖ్ఖర్లేదు. ఏదో ఇంట్లో వాళ్ళమీదైతే ( అదీ limited to wife only..) కోపం తెచ్చుకోవచ్చుగానీ, బయట వాళ్ళ మీద కొపాలూ తాపాలూ తెచ్చికుంటే, కాళ్ళిరక్కొడతారు.

   పసిపిల్లల్లో చూస్తూంటాము, వాళ్ళక్కావలిసినది ఇవ్వకపోతే, కోపం తెచ్చేసికుని, చేతిలో ఏముంటే అది విసిరి కొడుతూంటారు. వాళ్ళకైతే చెల్లుతుంది, ఏదో పెద్దయినతరువాత తమర్ని ఉధ్ధరించేస్తారూ, ఈమాత్రం కోపం ఉంటే పరవాలేదూ, వృధ్ధిలోకి వస్తాడూ అని, ఏదో “నజరందాజ్” చేసేస్తూంటారు, కొంతమంది తల్లితండ్రులు. కానీ ఆ ఇంటిపెద్ద కోపిష్టి అయినవాడైతే, నాలుగు దెబ్బలేస్తాడు. అదికూడా ఓ లిమిటెడ్ పిరీయడ్ దాకానే, ఎప్పుడో వాడు తిరగబడేదాకా! తెలివైన తండ్రులు, బలే పట్టేస్తారులెండి, ఆ threshold ని !కొంతమంది తల్లితండ్రులైతే, వాడి దారిన వాణ్ణేడవనీయండి, వెధవ కోపం వీడూనూ, ప్రతీదానికీ పేచీ పెడితే కుదురుతుందా, అంటూంటారు. కొంత సేపు ఏడిచేసి, ఎవరూ పట్టించుకోడంలేదని తెలిసి, చివరకి ఊరుకుంటాడు. వాళ్ళ కోపాలు తాటాకు మంటల్లాటివి, ఓసారి పేద్ద మంటొచ్చేసి ఆరిపోతాయి. పెద్ద నష్టమేమీ ఉండదు.

    ఈ short tempered ప్రబ్రుధ్ధుల్ని చూస్తూంటాము బయట. ఓ బస్సు టైముకి రాకపోతే కోపం. ఓ ట్రైను టైముకి రాకపోతే కోపం. బస్సులో కూర్చోడానికి సీటు దొరక్కపోతే కోపం.
సొసైటీలో లిఫ్ట్ పనిచేయక, అన్ని మెట్లూ ఎక్కేడప్పడికి కోపం. నీళ్ళు రాకపోతే కోపం. ఒకటేమిటి, ప్రపంచంలో అందరూ కలిసి తనమీద కసి తీర్చుకుంటున్నారేమో అన్నంత కోపం. వీటిల్లో కోపం తెచ్చుకుని చేసేదేమీ లేదు. రైళ్ళెక్కడం మానేస్తామా, బస్సులో వెళ్ళడం మానేస్తామా, మెట్లెక్కి కొంప చేరడం మానేస్తామా, అవసరం వస్తే కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోడం మానేస్తామా, ఏమీ లేదు ఉత్తి జరుగుబాటు రోగం. వాళ్ళనేమీ చేయలేక లోకువగా ఉన్న ఇంటావిడ మీద ఎగరడం.

    ఒక్కొక్కప్పుడు నాకే అనిపిస్తూంటుంది, ఉత్తిపుణ్యాన్న మా ఇంటావిడ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటానూ అని! పోనీ తనేమైనా తప్పుమాట అన్నదా అంటే అదీ లేదు. “ అన్నన్ని మిస్టరీ షాపింగులు చేసి, ఇంటినిండా అన్నేసి, బ్రాండెడ్ బట్టలు కొంటున్నారే, మరి అస్తమానూ ఆ దిక్కుమాలిన దీక్షా వస్త్రాలు వదలరే, హాయిగా ఆ కొత్త బట్టలేసికోవచ్చు కదండీ, ఎవరికోసం దాచిపెట్టడమూ...” అని. ఇవాళ్టికివాళ, మామిడికాయ ముక్కలు ఉప్పులో పోసి ఎండబెట్టడానికి, టెర్రెస్ తాళం వాచ్ మన్ ని అడిగి తీసికుని ఎండలో పెట్టాము. ఆ తాళం చెవి వాడికి తిరిగిచ్చేయకపోయారా , జేబులో వేసుకెళ్ళడం ఎందుకూ అంది. అంతే కోపం వచ్చేసింది. మరీ చిన్న పిల్లాడిలా చేతిలో ఉన్నది విసిరేయడం కాదనుకోండి, హై పిచ్ లో మాట్టాడడం అన్న మాట. అంత అవసరమంటారా ఇలాటి వెర్రి వేషాలు నాకూ? అసలు గొడవేమిటంటే, మేముండేది నాలుగో అంతస్థులో, ఆ దిక్కుమాలిన లిఫ్ట్, కొన్ని ట్రైన్లు ముంబై CST దాకా కాకుండా, కుర్లా లోనో, దాదర్ లోనో ఆగిపోయినట్టు, రెండో ఫ్లోర్ దాకానే వస్తోంది. ఆ లిఫ్ట్ బాగు పడదూ, చెప్పానుగా మా సొసైటీ లో సీనియర్ సిటిజెన్లు మేమే. మిగిలినవాళ్ళందరికీ మెట్లెక్కడం అంటే ఎంత సంబరమో! నన్ను డబ్బులెఖ్ఖలడిగితే. కోపం, షూస్ పాలిష్ చేయించుకోమంటే కోపం.బట్టలు రోజువిడిచి రోజు మార్చుకోమంటే కోపం, ఒకటేమిటి ఓ కారణం అఖ్ఖర్లేదు. అయినా భరిస్తోంది పాపం! ఎప్పుడో చెప్పేస్తుంది enough is enough అని, వదిలిపోతుంది రోగం! అప్పటిదాకా ఇలా కానిచ్చేయనీయండి.

   ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఏ కారణం లేకుండా, కోపాలు తెచ్చుకునేవాడు, గ్యారెంటీగా ప్రభుత్వోద్యోగే ! ప్రెవేట్ లో వాళ్ళకి పాపం ఇన్నిన్ని అవకాశాలు లేవు. ఏదో అన్నా హజారే గారి లాటివారు ఏ ధర్నాయో, ఉద్యమమో ప్రారంభించినప్పుడు, ఆయన్ని సపోర్టు చేయడం తప్ప …..

Advertisements

6 Responses

 1. మంచి విషయం ఏమిటంటే కాస్త ఆలస్యంగానైనా మీరు గ్రహిస్తారు, నలుగురికి చెప్పి వాళ్ళలోని మార్పుకు దోహదపడతారు….

  ఏదో మా పిన్నిగారు మెతక కాబట్టి సరిపోయింది అదే ఇంకొకరింకొరు అయితేనా ఊహించుకోండి మీ పరిస్థితి…. 🙂

  Like

 2. చాల బాగుంది,
  కానీ అలవాటుగా వచ్చే కోపాన్ని ఎలా
  తగ్గించుకోవాలో , ఉపాయాలు కూడా చెప్పండి.
  నాకు యమర్జెంటుగా కావాలి.
  మోహన్

  Like

 3. kopam gurinchi chala saradaga cheppa andulovunna sanghatanalu andariki anu.bavamoutune vuntaye…meru vrase vidanam chala bavundi

  Like

 4. @ మాధవీ,

  మరీ ” ఏదో మా పిన్నిగారు మెతక కాబట్టి సరిపోయింది” అనఖ్ఖర్లేదు. దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగానే ఉంటాయి…..

  @మోహన్ గారూ,

  మరీ మీకు చెప్పేటంతటివాణ్ణా? డాక్టర్లు, మీకే తెలియాలి…

  @శిజాతా,
  ధన్యవాదాలు.

  Like

 5. nnaku chala kopam undi ani maa AMMA,NANNA….naa meeda govada chestuntaru. suti poti matalatho nannu nindistuntaru….. naa kopanni tagginchukodanaki edina margam cheppandi pls….

  Like

 6. ప్రవీణ్,

  నేనేమైనా కౌన్సెలింగు చేసేవాడినా ఏమిటీ? అయినా మిమ్మల్ని కోప్పడుతున్నది మీ తల్లితండ్రులే కదా ! వాళ్ళకి కావలిసింది మీ బాగే కానీ, హాని కాదు.
  వారు చెప్పేవి సూటిపోటి మాటలనిపిస్తాయి, మీ కోపంలో. మీరు తండ్రి అయిన తరువాత తెలుస్తుంది వారి మాటల్లో ఉన్న విలువ…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: